Up Bus Rams Into Truck Amid Dense Fog On Agra Lucknow Expressway, 3 Killed - Sakshi
Sakshi News home page

రోడ్డును కమ్మేసిన పొగమంచు.. ట్రక్కు-బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం

Published Mon, Jan 9 2023 8:45 PM | Last Updated on Tue, Jan 10 2023 10:38 AM

Up Bus Rams Into Truck Amid Dense Fog Agra Lucknow Expressway - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది.

బస్సు గుజరాత్‌ నుంచి నేపాల్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వేకువజామున రోడ్డును పొగమంచు కమ్మేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు  అక్కడికక్కడే మరణించారని, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు.
చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement