truck bus collision
-
Mexico: బస్సు, ట్రక్కు ఢీ.. 19 మంది మృతి
మెక్సికో: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 19 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించారు. lవివరాల ప్రకారం.. ఉత్తర మెక్సికోలోని సినలోవాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల 19 మంది మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని జాతీయ రహదారిపై సరుకులను రవాణా చేసే ట్రక్కు, బస్సు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరగిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 🚨 No es un choque sino un intento de rebase, posible causa del accidente en la maxipista, en #Elota Lee la nota completa 🔗 https://t.co/kyhrySHYci#Accidente #Vialidad #LDNoticias #Carretera #Sinaloa pic.twitter.com/R75emSD0Gp — Línea Directa Portal (@linea_directa) January 31, 2024 -
రోడ్డును కమ్మేసిన పొగమంచు.. ట్రక్కు-బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది. బస్సు గుజరాత్ నుంచి నేపాల్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వేకువజామున రోడ్డును పొగమంచు కమ్మేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించారని, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
రోడ్డు ప్రమాదంలో 28 మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్ : జమ్మూ- పంజాబ్ జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. పంజాబ్ నుంచి వస్తోన్న బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో తిరగబడింది. ఈ సంఘటన సాంబ జిల్లాలో జత్వాల్ గ్రామం వద్ద జరిగింది. గాయపడిన వారందిరినీ చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొంతమందిని ప్రత్యేక చికిత్స నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు- లారీ ఢీ: 11 మంది మృతి
అర్జెంటీనా లోని మెండోజా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఓ లారీ ఢీకొనడంతో 11 మంది మరణించారు, మరో 20 మంది వరకు గాయపడ్డారు. బస్సులో ఆ సమయానికి 28 మంది ప్రయాణిస్తున్నారు. అది కార్బోడా నుంచి మెండోజాకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ దాన్ని ఢీకొంది. దాంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ రెండు వాహనాలూ పూర్తిగా కాలిపోయాయని, అసలు వాటిలో మరణించిన వారి మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టే పరిస్థితిలో లేవని గాబ్రియేలా సోసా అనే పాత్రికేయురాలు తెలిపింది. క్షతగాత్రులలో ఇద్దరు పిల్లలతో పాటు కొంతమంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మెండోజా లోని ఆస్పత్రులకు తరలించారు.