అర్జెంటీనా లోని మెండోజా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఓ లారీ ఢీకొనడంతో 11 మంది మరణించారు, మరో 20 మంది వరకు గాయపడ్డారు.
అర్జెంటీనా లోని మెండోజా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఓ లారీ ఢీకొనడంతో 11 మంది మరణించారు, మరో 20 మంది వరకు గాయపడ్డారు. బస్సులో ఆ సమయానికి 28 మంది ప్రయాణిస్తున్నారు. అది కార్బోడా నుంచి మెండోజాకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ దాన్ని ఢీకొంది. దాంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.
ఆ రెండు వాహనాలూ పూర్తిగా కాలిపోయాయని, అసలు వాటిలో మరణించిన వారి మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టే పరిస్థితిలో లేవని గాబ్రియేలా సోసా అనే పాత్రికేయురాలు తెలిపింది. క్షతగాత్రులలో ఇద్దరు పిల్లలతో పాటు కొంతమంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మెండోజా లోని ఆస్పత్రులకు తరలించారు.