![Argentine biotech firm breeds gene-edited polo super ponies](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/UUJJJ.jpg.webp?itok=rfYmr2Co)
అర్జెంటీనాలో సృష్టి
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు. అర్జెంటీనాలో ఎన్నో అవార్డ్‌లు గెల్చుకున్న ఆడ పోలో ప్యూరేఝా అనే గుర్రం నుంచి తీసుకున్న జన్యువులకు కొద్దిపాటి మార్పులు చేసి ఈ కొత్త అశ్వాలను సృష్టించారు. శాస్త్రవేత్తలు క్రిస్పర్–క్యాస్9 విధానాన్ని అవలంభించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తేందుకు ఉపకరించేలా ఫ్యూరేఝా జన్యువుల్లో మార్పులు చేశారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో ఇలా ఐదు అశ్వాలు జన్మించినా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గుర్రాలపై పరుగెత్తుతూ ఆడే పోలో ఆటలో వినియోగించే అశ్వాల జాతికి చెందిన ఈ పోలో ప్యూరేఝా ఇప్పటికే ‘‘అర్జెంటీనా అసోసియేషన్ ఆఫ్ పోలో హార్స్ బ్రీడర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’’లో చోటు దక్కించుకుంది. ఇది 1998 అర్జెంటీనా ఓపెన్‌లో ఉత్తమ గుర్రంగా అవార్డ్ గెలుపొందింది. మరింత మేలైన జాతి గుర్రాల సృష్టే లక్ష్యంగా అర్జెంటీనాకు చెందిన దిగ్గజ ‘‘కెయిరాన్ ఎస్‌ఏ’’బయోటెక్నాలజీ సంస్థ ఈ కొత్త గుర్రాలను సృష్టించింది. కెయిరాన్ సంస్థ గతంలోనూ క్లోనింగ్ చేసిన ఘనత సాధించింది. మూలకణాలనూ వినియోగించింది. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి పిండాలనూ సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment