horse
-
గుర్రంపై ఊరేగుతూ ప్రాణాలొదిలిన పెళ్లికొడుకు
ష్యోపూర్(ఎంపీ): పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్న ఓ పెళ్లికొడుకు హఠాన్మరణం అక్కడి వారందరినీ హుతాశులను చేసింది. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్ జిల్లాలో పెళ్లివేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా గుర్రంపై ఊరేగుతూ శుక్రవారం రాత్రి వరుడు విగతజీవిగా మారిన వైనం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూన్స్‌వాడా గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రదీప్ జాట్ పెళ్లివేడుక శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా అక్కడి వేదికవైపు ప్రదీప్ పెళ్లికొడుకు దుస్తుల్లో గుర్రంపై బయల్దేరారు. ఇదే సమయంలో హఠాత్తుగా ముందుకు ఒరిగి అలాగే గుర్రంపై కూలబడిపోయారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ప్రదీప్‌ను జాగ్రత్తగా కిందకు దింపి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణం పోయిందని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్బీ గోయల్ ధృవీకరించారు. గుండెపోటు కారణంగా పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. పెళ్లికొడుకు ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)కి ష్యోపూర్ జిల్లా అధ్యక్షునిగా గతంలో పనిచేశారు. -
ప్రపంచంలో తొలి జన్యుమార్పిడి అశ్వం
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు. అర్జెంటీనాలో ఎన్నో అవార్డ్లు గెల్చుకున్న ఆడ పోలో ప్యూరేఝా అనే గుర్రం నుంచి తీసుకున్న జన్యువులకు కొద్దిపాటి మార్పులు చేసి ఈ కొత్త అశ్వాలను సృష్టించారు. శాస్త్రవేత్తలు క్రిస్పర్–క్యాస్9 విధానాన్ని అవలంభించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తేందుకు ఉపకరించేలా ఫ్యూరేఝా జన్యువుల్లో మార్పులు చేశారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో ఇలా ఐదు అశ్వాలు జన్మించినా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.గుర్రాలపై పరుగెత్తుతూ ఆడే పోలో ఆటలో వినియోగించే అశ్వాల జాతికి చెందిన ఈ పోలో ప్యూరేఝా ఇప్పటికే ‘‘అర్జెంటీనా అసోసియేషన్ ఆఫ్ పోలో హార్స్ బ్రీడర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’’లో చోటు దక్కించుకుంది. ఇది 1998 అర్జెంటీనా ఓపెన్‌లో ఉత్తమ గుర్రంగా అవార్డ్ గెలుపొందింది. మరింత మేలైన జాతి గుర్రాల సృష్టే లక్ష్యంగా అర్జెంటీనాకు చెందిన దిగ్గజ ‘‘కెయిరాన్ ఎస్ఏ’’బయోటెక్నాలజీ సంస్థ ఈ కొత్త గుర్రాలను సృష్టించింది. కెయిరాన్ సంస్థ గతంలోనూ క్లోనింగ్ చేసిన ఘనత సాధించింది. మూలకణాలనూ వినియోగించింది. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి పిండాలనూ సృష్టించింది. -
ఆ గుర్రం పరుగు గంటకు 100 కి.మీ.. రోజూ నెయ్యితో మాలిష్
సోన్ పూర్ : బీహార్‌లో సోన్పూర్ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ జంతు మేళాకు పలు ప్రత్యేకతలు కలిగిన జంతువులను వాటి యజమానులు తీసుకువచ్చారు. వాటిలో ఒకటి అనంత్ సింగ్ అలియాస్ ఛోటే సర్కార్‌కు చెందిన గుర్రం. దీని పేరు డార్లింగ్. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ గుర్రం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ గుర్రం ఎంత వేగంతో పరిగెడుతుంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే దీని ధర వింటే ఒకపట్టాన ఎవరూ నమ్మలేరు.గుర్రపు యజమాని రుడాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ గుర్రం ఏకే 56 సింధీ జాతికి చెందినదనని తెలిపారు. ఇది యజమాని దగ్గర ఎంతో విధేయంగా మెలుగుతుందన్నారు. ఈ జాతికి చెందిన గుర్రాల సగటు ఎత్తు 64 అంగుళాలు. అయితే ‘డార్లింగ్’ ఎత్తు 66 అంగుళాలు. సాధారణ గుర్రాల నిర్వహణకు ప్రతినెలా రూ. 10 వేల వరకూ ఖర్చు అవుతుంది. అయితే ఈ ప్రత్యేక గుర్రం సంరక్షణకు ప్రతినెలా రూ.35 వేలు ఖర్చవుతుంది.ఈ గుర్రాన్ని సంరక్షణలో దాని యజమాని రుడాల్ యాదవ్ ప్రత్యేక మెళకువలను అవలంబిస్తుంటాడు. ఈ గుర్రానికి ప్రతీరోజు ప్రత్యేకమైన నెయ్యితో మాలిష్ చేస్తుంటాడు. ఈ గుర్రం వేగం విషయానికి వస్తే రికార్డులు తీరగరాయాల్సిందే. ఈ గుర్రానికి ఏడాది వయస్సు నుంచే పరుగులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రుడాల్ యాదవ్ తెలిపారు. ఈ గుర్రం సాధారణంగా గంటకు 45 కి.మీ వేగంతో పరిగెడుతుంది. అయితే దీని పూర్తి వేగం గంటకు 100 కి.మీ.నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సింధీ జాతి గుర్రాలు ఓర్పు, చురుకుదనానికి ప్రసిద్ధి చెందాయి. గుర్రపు ప్రేమికులు ఈ జాతి గుర్రాలను అమితంగా ఇష్టపడుతుంటారు. దీని ధర విషయానికొస్తే గుర్రం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏకే 56’ ధర సుమారు రూ.1.11 కోట్లు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
గ్రూమింగ్ అంటే ఇదీ! మీరే చూడండి దీని వయ్యారం!
గుర్రం అంటే రాజసం, పౌరుషం. అందుకే గుర్రాల వాల్ పేపర్‌ను, అందమైన గుర్రం పెయింటింగ్‌లను చాలామంది ఇష్టపడతారు. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, రాజు ఎక్కే రంగుల గుర్రం, రాణి ఎక్కే కీలు గుర్రం, రాకుమారి ఎక్కే రత్నాల గుర్రం. గుర్రపు స్వారీ ఒక ఫ్యాషన్...సాహస క్రీడ. పెంపుడు జంతువుగా గుర్రాని ఎంచుకోవడం కొందరికి హాబీ. మరికొందరి అదొక వృత్తి. వ్యాపారం కూడా. అందుకే గుర్రాలను బలమైన దాణాను అందిస్తారు. అందంగా తయరు చేస్తారు.అంతేకాదుకొన్ని రకాల గుర్రాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటి ద్వారా పోలియో, పక్షవాతం మెదడు, వెన్నెముక సమస్యలు... వినికిడి, భావ వ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడంవంటి వాటికి చికిత్సగా గర్రపు స్వారీని వాడతారట.Before 🐎 After 🦄 pic.twitter.com/9R1jYkoZxI— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 30, 2024గుర్రాలు ఆరోగ్యంగా, సరిగ్గా పనిచేయాలంటే దానికి నిరంతరం, బ్రషింగ్, గ్రూమింగ్ అవసరం అంటున్నారు జంతు సంరక్షణ నిపుణులు. ప్రతీ రోజు గుర్రం శరీరంలోని ప్రతి అణువును అప్యాయంగా తాకుతూ ఉంటే యజమాని, గుర్రం మధ్య బంధం పెరగడమేకాదు ఇది ప్రీవెంటివ్ మెడిసిన్‌లాగా పనిచేస్తుందట. అంటే దాని శరీరంపై మనకు తెలియకుండా ఏమైనా గాయాలు, పుండ్లు లాంటివి వుంటే అర్థమవుతాయి.అలా ఒక గుర్రాన్ని చక్కగా జుట్టు కత్తిరించి, రకరకాల క్రీములతో శుభ్రంగా స్నానం చేయించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వివేషంగా నిలుస్తోంది. మనుషులకేనా తైల మర్దనాలు, అభ్యంగనస్నానాలు.. గుర్రాలకు కూడా అన్నట్టుగా ఉన్న ఈ వీడియో నెటిజనులకు తెగ నచ్చేస్తోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఎక్స్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియో దాదాపు 8.5 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. -
పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!
ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా అవసరమైనది జీవామృతం. దేశీ ఆవుల పేడ, మూత్రం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసే జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తుందన్న భావన ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాజస్థాన్‌కు చెందిన మహిళా రైతు ‘జయ దగ’ అందుకు భిన్నంగా.. గుర్రాల పేడ, మూత్రంతో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. గిర్ ఆవుల విసర్జితాలతోనే కాకుండా.. గుర్రాల విసర్జితాలతో కూడా ఆమె వేర్వేరుగా ద్రవ జీవామృతం తయారు చేసి తమ పొలాల్లో వివిధ పంటల సేంద్రియ సాగులో ఆమె వాడుతున్నారు.అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్ మహేశ్వరి అభివృద్ధి చేసిన ట్యూబ్ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతాన్ని ఈ రెండు రకాలుగా జయ గత 8 నెలలుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఈ జీవామృతంతో తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేపియర్ గడ్డి, మునగ, మామిడి తదితర పంటలను సేంద్రియంగా సాగు చేస్తున్నారు.ఆవుల జీవామృతంతో పోల్చితే గుర్రాల విసర్జితాలతో తయారైన జీవామృతం పంటల సాగులో మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అయితే, గుర్రాల జీవామృతాన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో పంటలకు వాడకూడదని, ఇతర కాలాల్లో ఏ పంటలకైనా వాడొచ్చని ఆమె సూచిస్తున్నారు.గుర్రాల పెంపక క్షేత్రాలు..రాజస్థాన్‌కు చెందిన జయ దగ కుటుంబీకుల ప్రధాన వ్యాపారం గుర్రాల ద్వారా ఔషధాల ఉత్పత్తి. ఇందుకోసం సుమారు 2 వేల వరకు గుర్రాలను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ముత్పూర్, రాజాపూర్ గ్రామాల్లో గల తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆమె పెంచుతున్నారు. పాములు, తేళ్లు కాటు వేసినప్పుడు విరుగుడుగా వాడే ఇంజక్షన్లతో పాటు.. కుక్క కాటు వేసినప్పుడు రేబిస్ సోకకుండా వేసే ఇంజక్షన్లను సైతం పోనిల ద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లను భారత ప్రభుత్వానికి విక్రయించటంతో పాటు.. అనేక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తమ విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు జయ దగ వివరించారు.అహ్మదాబాద్‌కు చెందిన ఆవిష్కర్త మహేశ్ మహేశ్వరి వద్ద నుంచి పొందిన టెక్నాలజీ ద్వారా జయ ట్యూబ్ పద్ధతిలో అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తమ క్షేత్రంలో గత 8 నెలలుగా తయారు చేస్తున్నారు. ట్యూబ్ ద్వారా ప్రత్యేక పద్ధతిలో తయారవుతున్న ఈ అడ్వాన్స్డ్ జీవామృతం తమ పొలాల్లో మంచి ఫలితాలనిచ్చిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆమె క్షేత్రంలో పెరుగుతున్న నేపియర్ గడ్డి, మునగ తోటలు చాలా ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. నేపియర్ గడ్డి, మునగ ఆకు ముక్కలతో పాటు బార్లీ, సోయా, మొక్కజొన్నల మొలకలు, గోధుమ తవుడుతో కూడిన దాణాను కూడా ఆవులు, గుర్రాలకు ఆమె మేపుతున్నారు.50 వేల లీటర్ల ట్యూబ్‌లు రెండు..గుర్రాలు, పోనిలతో పాటు వందలాది గిర్ ఆవుల పోషణ కోసం గత 8 నెలల నుంచి తిమ్మాపూర్ వ్యవసాయ క్షేత్రంలో అనేక ఎకరాల్లో నేపియర్ గడ్డిని, మునుగ ఆకును జయ దగ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకోసం 50,000 లీటర్ల సామర్థ్యం గల ట్యూబ్‌లు రెండిటిని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాని ద్వారా గిర్ ఆవుల పేడ, మూత్రంతో.. రెండో దానిలో గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ట్యూబ్ రోజుకు వెయ్యి లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.అడ్వాన్స్డ్ జీవామృతం 30 రోజుల్లో తయారవుతుంది!సాధారణ జీవామృతం తయారీ ప్రక్రియకు.. ట్యూబ్ ద్వారా అడ్వాన్స్డ్ జీవామృతం తయారీ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంది. ట్యాంకు లేదా డ్రమ్ములో వేసి నీటిలో నాటు ఆవు పేడ, మూత్రం, పప్పులపిండి, బెల్లం, పిడికెడు మంచి మట్టిని కలిపితే.. సాధారణ జీవామృతం 48 గంటల్లో వాడకానికి సిద్ధమవుతుంది. ఇందులో పిప్పి, పీచు, నలకలు అలాగే ఉంటాయి.అయితే, ట్యూబ్‌లో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు కావటానికి 30 రోజులు పడుతుంది. ట్యూబ్‌ను ఏర్పాటు చేసుకొని, ఆ ట్యూబ్ పరిమాణాన్ని బట్టి నిర్ణీత పరిమాణంలో పేడ, మూత్రం, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు తదితరాలను ద్రవ రూపంలోకి మార్చి ట్యూబ్‌లోకి వేస్తూ ఉంటారు. దీనికి తోడు మహేశ్ మహేశ్వరి రూపొందించిన ప్రత్యేక మైక్రోబియల్ కల్చర్‌ను కూడా తగిన మోతాదులో కలిపి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ ట్యూబ్ లోపలికి వేస్తూనే ఉండాలి.30 రోజులు వేసిన తర్వాత నుంచి ప్రతి రోజూ ఎటువంటి పిప్పి, పీచు, నలకలు లేని శుద్ధమైన అడ్వాన్స్డ్ జీవామృతం ట్యూబ్ నుంచి వెలికివస్తుంది. ప్రతి రోజూ ఎంత పరిమాణంలో పేడ తదితరాలను ట్యూబ్‌లో ఒక వైపు నుంచి వేస్తూ ఉంటామో.. ట్యూబ్ వేరే వైపు నుంచి అంతే మోతాదులో అడ్వాన్స్డ్ జీవామృతం బయటకు వస్తుంది. సాధారణ ద్రవ జీవామృతాన్ని 15 రోజుల్లో వాడేయాలి. అయితే, ఈ అడ్వాన్స్డ్ జీవామృతం ఏడాదిన్నర వరకు నిల్వ ఉంటుందని.. అధిక కర్బనం, సూక్ష్మజీవుల జీవవైవిధ్యంతో కూడినదైనందు వల్ల ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం తయారుచేసే ట్యూబ్లుఆర్గానిక్ పురుగుల మందు కూడా..ఆర్గానిక్ పురుగుల మందును కూడా 200 లీటర్ల ట్యూబ్ ద్వారా మహిళా రైతు జయ దగ తయారు చేస్తున్నారు. మహేశ్ మహేశ్వరి నుంచి తెచ్చిన మైక్రోబియల్ కల్చర్ 2 లీటర్లు, 2 కిలోల దేశీ ఆవు పేడ, 10 కిలోల పెరుగుతో చేసిన మజ్జిగ, 40 లీటర్లు దేశీ ఆవు మూత్రం కలిపి ట్యూబ్‌లో పోస్తారు. 30 రోజులు ఇలా పోస్తూనే ఉండాలి. 30 రోజుల తర్వాత ట్యూబ్ నుంచి ఆర్గానిక్ పురుగుమందును తీసుకొని వాడుకోవచ్చు. ఈ పురుగు మందును నేరుగా పంటలపై చల్లకూడదు. 1 లీ. పురుగుమందును 1 లీ. నాటు ఆవు మూత్రం, 1 లీ. పుల్ల మజ్జిగ, 17 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఈ ఆర్గానిక్ పురుగుమందును పిచికారీ చేసిన రోజు జీవామృతం పిచికారీ చేయకూడదని జయ తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం అరెకరానికి ఉచితం!రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తమ క్షేత్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలనుకుంటే.. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఉచితంగా ఇస్తాను. వరి లేదా పత్తి వంటి పంటలకు ఎకరానికి 400 లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతం అవసరం ఉంటుంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడా 200 లీటర్లను రెండు దఫాలుగా ఇస్తాను. గిర్ ఆవుల జీవామృతం లీటరు రూ. 10, గుర్రాల జీవామృతం లీటరు రూ. 15, ఆర్గానిక్ పురుగుల మందు లీటరు రూ. 20కి విక్రయిస్తున్నాం. వీటితో సాగు చేసిన నేపియర్ గడ్డి మేపిన తర్వాత గిర్ ఆవు పాలలో కొవ్వు శాతం 3.4 నుంచి 4.7కు పెరిగింది. ఇతర వివరాలకు డాక్టర్ వెంకటేశ్ (98482 09696)ను సంప్రదించవచ్చు. – జయ దగ, మహిళా రైతు, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా, jsd@vinsbio.inరోజూ వెయ్యి లీటర్లు..50 వేల లీటర్లు పట్టే ట్యూబ్ నుంచి మహిళా రైతు జయ దగ వెయ్యి లీటర్ల జీవామృతం పొందుతున్నారు. అంతే మొత్తంలో లోపలికి పోస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 30 కేజీల ఆవులు లేదా గుర్రాల పేడ, 40 లీ. మూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల పండ్లు, 20 కిలోల కూరగాయలు, 10 కిలోల కలబంద జ్యూస్, 300 లీటర్ల జీవామృతంతో పాటు మిగతా 430 లీటర్ల నీటిని కలిపి ట్యూబ్‌లో పోస్తున్నారు. ఈ రోజు పోసింది నెలరోజుల తర్వాత అడ్వాన్స్డ్ జీవామృతంగా మారి బయటకు వస్తుంది. ఏడాదిన్నర నిల్వ ఉంటుంది..సాధారణ జీవామృతంలో నలకలు పిప్పి ఉంటుంది. అయితే, ట్యూబ్‌లో గాలి తగలకుండా 30 రోజులు మగ్గిన తర్వాత అసలు ఏ నలకలూ, చెత్త లేని జీవామృతం వెలువడుతుంది. ఇందులో కర్బనం 15% వరకు ఉంటుందని, అందువల్ల ఇది సాధారణ జీవామృతం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి చెబుతున్నారు.సాధారణ జీవామృతం 15 రోజుల తర్వాత పనికిరాదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పాలి. అయితే, ట్యూబ్ జీవామృతం కనీసం ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ కలియతిప్పాల్సిన అవసరం లేదు. బ్యారెల్స్‌లో నింపుకొని నిల్వ చేసుకుంటే చాలు. మరో విషయం ఏమిటంటే.. ట్యూబ్‌ని కానీ, దానిలో తయారైన జీవామృతాన్ని గానీ నీడలోనే ఉంచాలన్న నియమం లేకపోవటం మరో విశేషం అని జయ దగ చెబుతున్నారు. ఈ ప్రత్యేకతల వల్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఒక చోట తయారు చేసి, దూర ప్రాంతాలకు కూడా రవాణా చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ట్యూబ్ టెక్నాలజీ వల్ల తమకు గడ్డి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని ఆమె సంతోషిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం-గుర్రాలు మాట వినవు!
ధర్మాచరణకు ప్రధానమైన ప్రతికూల పరిస్థితులు రెండు–అర్థము, కామము. ఇవి ధర్మాచరణకు నిరంతరం పరీక్ష పెడుతుంటాయి. అర్థము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, భోగ సంబంధమైన సమస్త వస్తువుల రాశిని అర్థము అనవచ్చు. తనకు సుఖాన్నిచ్చే మంచం, కుర్చీ, ప్రయాణించే వాహనం ఏదయినా కావచ్చు. కామము అంటే – కోర్కె వేరు, అవసరం వేరు. రెండింటికీ మధ్య సున్నితమైన భేదం ఉంది. అవసరం తీరకపోతే పాపం అడ్డు వస్తున్నదని గుర్తు. దానిని తీసేయగలిగిన శక్తి ఒక్క భగవంతుడికే ఉంది. పాపం పోవడానికి యజ్ఞ యాగాదులు చేస్తారు. సంతానం కోసం అశ్వమేథం.. వంటివి. మనం ఒక కోరిక కోరుకుంటున్నాం. అది అవసరం కూడా. దానికి భగవంతుడిని ఆశ్రయించడం తప్పు కానేకాదు. భగవంతుడు ఏమంటాడంటే... నాలుగు రకాల భక్తులు నన్ను ఎప్పుడూ ఆశ్రయించి ఉంటారు. చాలా ఆర్తి కలిగినవాళ్ళు, అసలు భగవంతుడెవరని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు. మంచి పనులు చేయడానికి ధనసహాయం కోరుకుంటున్న వాళ్ళు. తత్త్వతః పరమాత్మను ఎరుకలోకి తెచ్చుకుని స్తోత్రం చేసేవాళ్ళు. చివరి తరగతి భక్తులగురించి శంకరాచార్యులవారు ఏమంటారంటే... సముద్ర కెరటం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో తత్త్వాన్ని అవగతం చేసుకుని జ్ఞాని భగవంతుడిని స్తోత్రం చేయడం అలా ఉంటుంది–అని. ఎక్కడో కోటానుకోట్లలో ఒక్కరే కారణజన్ములుంటారు. వారికి జన్మతః వైరాగ్యం ఉంటుంది. వారికి అర్థకామముల మీద ఎటువంటి తపనా ఉండదు. ఒకవేళ ఏదయినా మనసులో ఏర్పడినా, ధర్మాన్ని రక్షించడానికి ఇలా చేద్దామన్న ఆలోచనే తప్ప వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ఏకాకిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. దేనినీ కోరుకోడు. అతడు జీవన్ముక్తుడు. కానీ అందరూ ఆ స్థితిలో ఉంటారా !!! ఉండరు. ధర్మానికి పెద్ద పరీక్ష అర్థము. ఒక కోరిక తీర్చుకోవడానికి పరుగులు తీయడం.. చివరకు తీర్చుకుంటాడు. అది తీరి΄ోయింది కనుక మళ్లీ ఆ కోరిక పుట్టదు– అని చెప్పలేం. మామిడిపండు తినాలని ఆరాటపడి, చివరకు అది దొరికి తిన్న తరువాత.. అది అక్కడితో ఆగదు. అదే పండు మళ్ళీ మళ్లీ కావాలనిపించవచ్చు, ఏ పండయినా సరే అని మళ్ళీ పరుగులు మొదలు కావచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే నేతి ΄ాత్ర పట్టుకుని వెళ్ళి అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. ప్రజ్వరిల్లే అగ్ని మీద నెయ్యి చల్లితే, అది ఆరదు, మరింత విజృంభిస్తుంది. కోరికలూ అంతే. అవి ఉపశమించే అవకాశం ఉండదు. మరి అర్థకామములు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. అవి ఉండితీరతాయి. ఎవరికయినా భోగం అనుభవించాలన్న కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవడానికి అవసరమయిన సాధనసంపత్తిని సమకూర్చుకోవాలన్న కోరికా ఉంటుంది. దానికి సనాతన ధర్మం ఒక చక్కటి పరిష్కారం చూపింది. అర్థకామములను ధర్మంతో ముడిపెట్టింది. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన అర్థము.. ఇవి మోక్షానికి కారణమవుతాయి తప్ప బంధాలకు, కోరికలు అపరిమితంగా ప్రజ్వరిల్లడానికి కారణం కావు. అప్పుడు మనిషి జీవితం, కుటుంబ జీవనం, సామాజిక వ్యవస్థ అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. చెలియలికట్ట దాటే సాహసం చేయవు. -
దాదాపు 40 ఏళ్ల తరువాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అలా...
#RepublicDay2024- MurmuHorsebuggy for parade రిపబ్లిక్ డే 2024 వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే.. దాదాపు 40 సంవత్సరాల విరామం తర్వాత, రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రపు బగ్గీ సంప్రదాయం మళ్లీ వచ్చింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ‘సాంప్రదాయ గుర్రపు బగ్గీ’ కర్తవ్య పథానికి చేరుకున్నారు.ప్రెసిడెంట్ ముర్ముతోపాటు ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ ప్రత్యేక వాహనంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకులకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ బగ్గీకి రాష్ట్రపతి అంగరక్షకుడు ఎస్కార్ట్ చేశారు. భారత సైన్యంలోని అత్యంత సీనియర్ రెజిమెంట్ రాష్ట్రపతి అంగరక్షకుడుగా ఉంటారు. అయితే భద్రతా కారణాల రీత్యా 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రిపబ్లిక్ డే కార్యక్రమాలకు అధ్యక్షుడి బగ్గీని ఉపయోగించడం నిలిపివేశారు. అప్పటిక అధ్యక్షులు వారి ప్రయాణానికి లిమోసిన్‌లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు 2014లో, బీటింగ్ రిట్రీట్ వేడుకలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు గుర్రాల బగ్గీని నడిపి ఈ సంప్రదాయాన్నిపునరుద్ధరించిన సంగతి తెలిసిందే. #WATCH | President Droupadi Murmu and French President Emmanuel Macron riding in a special presidential carriage escorted by the President's Bodyguard make their way to Kartavya Path pic.twitter.com/F4hOovJoua — ANI (@ANI) January 26, 2024 కాగా 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నారీశక్తి థీమ్‌కు అనుగుణంగా 26 శకటాలు దేశంలో మహిళా సాధికారతను ప్రదర్శిస్తూ కర్తవ్య పథంలో కవాతు చేశాయి. అగే తొలి సారి మహిళా అధికారుల సారధ్యంలో త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 105 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 IV హెలికాప్టర్లు కర్తవ్య పథంలో హాజరైన ప్రేక్షకులపై పూల వర్షం కురిపించాయి. 100 మంది మహిళా కళాకారులు నారీ శక్తికి ప్రతీకగా వివిధ రకాల తాళ వాయిద్యాలను వాయిస్తూ ‘ఆవాహన్’ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకు గాను దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ అంతటా 70వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. -
గుర్రంపై సవారీ చేసిన ఎమ్మెల్యే
-
గుడుగుడుమనీ గుర్రమెక్కి నేనొత్త పా నేనొత్త పా
ఫుడ్ డెలివరీ బాయ్ అనగానే బైక్ మీద సర్రున దూసుకుపోయే కుర్రాళ్ల దృశ్యమే కళ్లముందు ఉంటుంది. గుర్రం మీద వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే దృశ్యం ఊహకు కూడా అందదు. ట్రక్కు డైవర్ల సమ్మె, పెట్రోల్ బంక్‌ల ముందు ‘నో స్టాక్’లు కనిపిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో హైదరాబాద్‌లో జొమాటో బాయ్ ఒకరు హార్స్ రైడింగ్ చేస్తూ ఫుడ్ డెలివరీ చేశాడు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘దిస్ ఈజ్ అన్బిలీవబుల్... ఇట్స్ జస్ట్ సూపర్బ్’ ‘అలనాటి రవాణా వ్యవ్యస్థను గుర్తుతెస్తోంది. కాలుష్య నివారణకు ఇది తిరుగులేని మార్గం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
పెట్రోల్ తిప్పలు..గుర్రం మీద ఫుడ్ డెలివరీ
-
అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి
హైదరాబాద్:నగరంలో మంగళవారం పెట్రోలు కొరత కారణంగా...ఓ జొమాటో డెలివరీ బాయ్ ఏకంగా గుర్రాన్ని అద్దెకు తీసుకుని ఫుడ్ డెలివరీ చేశాడు. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రోజుమాదిరిగానే జొమాటోలో ఆర్డర్లు స్వీకరించగా..బైకులో పెట్రోల్ అయిపోయింది. బంకులు మూతపడడంతో సమీపంలోని ఓ వ్యక్తి వద్ద రూ.500 అద్దెకు ఓ అశ్వాన్ని తీసుకుని ఆర్డర్లు డెలివరీ చేశాడు. సైదాబాద్‌లోని ఇంపీరియల్ హోటల్లో పార్శిల్ తీసుకుని చంచల్‌గూడలో కస్టమర్‌కు అందించేందుకు వెళ్తుండగా ‘సాక్షి’ ప్రతినిధి పలకరించగా..పై విషయాలు వెల్లడించాడు. #Zomato Agent Delivers Food On Horse after the pumps ran out of petrol#TruckDriversProtest #HitandRunLaw #petrolpump pic.twitter.com/wqbfbAqaUo — rajni singh (@imrajni_singh) January 3, 2024 -
హైదరాబాద్ : గుర్రపు స్వారీ అదరహో.. (ఫొటోలు)
-
అశ్వ వాహనంపై విహరించిన శ్రీమలయప్పస్వామి(ఫొటోలు)
-
గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!
మెగా తనయుడు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జంటగా కనిపించనుంది. ఇకపోతే చిన్నప్పట్నుంచి రామ్ చరణ్‌కు హార్స్ రైడింగ్ ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. అంతే కాకుండా మగధీర చిత్రంలో గుర్రపు స్వారీ అభిమానులను కట్టిపడేసింది. ఆ సీన్స్ అభిమానులను ఇప్పటికీ మర్చిపోలేరు. ఇసుకలో కురుకుపోయిన రామ్ చరణ్‌ను గుర్రం కాపాడే సీన్ ఎమోషనల్‌గా టచ్ చేసింది. (ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు) అయితే గతంలో ఉపయోగించిన మగధీర సినిమాలోని గుర్రం పేరు బాద్షా. అప్పట్లో సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు చెర్రీ. వీలు చిక్కినప్పుడల్లా అలా గుర్రంపై సరదాగా రైడింగ్ చేసేవారు మన గ్లోబల్ స్టార్. మగధీర గుర్రంతో పాటు ఆయన దగ్గర మరిన్నీ హార్సెస్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరో గుర్రాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెర్రీ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 'బ్లేజ్.. మై న్యూ ఫ్రెండ్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసమేనా అన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఫోటో చూస్తుంటే అచ్చం మగధీరలోని గుర్రమే అభిమానులకు గుర్తుకు వస్తోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
41 ఏళ్ల తర్వాత..
అశ్వాలతో ముడిపడి ఉన్న క్రీడ ఈక్వెస్ట్రియన్. అశ్వానికి, రైడర్‌కు మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. అప్పుడే ఫలితం వస్తుంది. లేదంటే తడబాటు తప్పదు. న్యూఢిల్లీలో ఆసియా క్రీడలు 1951లో మొదలుకాగా... ఇదే వేదికపై 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌ను మొదటిసారి ప్రవేశపెట్టారు. నాటి ఆసియా క్రీడల్లో భారత జట్టు మూడు స్వర్ణాలతో అదరగొట్టింది. ఆ తర్వాత భారత జట్టు ఈ క్రీడాంశంలో మళ్లీ పసిడి పతకం సాధించలేకపోయింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చైనా గడ్డపై మళ్లీ భారత అశ్వదళం అద్భుతం సృష్టించింది. విపుల్ హృదయ్ చడ్డా, అనూష్ అగర్వల్లా, దివ్యాకృతి సింగ్, సుదీప్తి హజేలాలతో కూడిన భారత జట్టు డ్రెసాజ్టీమ్ ఈవెంట్లో మొదటిసారి బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించింది. డ్రెసాజ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు చివరిసారి 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం లభించింది. ఈక్వెస్ట్రియన్ క్రీడలో భాగమైన ఈవెంటింగ్, పెగ్గింగ్ ఈవెంట్లలో గతంలో భారత్‌కు పసిడి పతకాలు వచ్చినా డ్రెసాజ్ ఈవెంట్లో స్వర్ణం రావడం ఇదే ప్రథమం. ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో మూడో రోజు మంగళవారం భారత్‌కు మూడు పతకాలు వచ్చాయి. ఈక్వెస్ట్రియన్‌లో స్వర్ణం రాగా.. సెయిలింగ్‌లో ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. షూటింగ్, జూడో క్రీడాంశాల్లో త్రుటిలో కాంస్య పతకాలు చేజారాయి. హాంగ్జౌ: ఎవరూ ఊహించని విధంగా ఈక్వెస్ట్రియన్ క్రీడాంశంలో భారత బృందం మెరిసింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మళ్లీ స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన డ్రెసాజ్ టీమ్ ఈవెంట్లో విపుల్ హృదయ్ చడ్డా, అనూష్ అగర్వల్లా, దివ్యాకృతి సింగ్, సుదీప్తి హజేలాలతో కూడిన భారత జట్టు 209.205 పాయింట్లు సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది. చైనా (204.882 పాయింట్లు) రజతం, హాంకాంగ్ (204.852 పాయింట్లు) కాంస్య పతకం గెల్చుకున్నాయి. ఇంటికి దూరంగా.. ఆసియా క్రీడల చరిత్రలో డ్రెసాజ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. ఈ స్వర్ణ పతకం వెనుక భారత రైడర్ల శ్రమ ఎంతో దాగి ఉంది. విపుల్, అనూష్, దివ్యాకృతి, సుదీప్తి కొన్నేళ్ల క్రితం భారత్ నుంచి యూరోప్‌కు వెళ్లి కుటుంబసభ్యులకు దూరంగా నివసిస్తూ అక్కడే శిక్షణ తీసుకుంటున్నారు. ఆసియా క్రీడల కోసం భారత ఈక్వె్రస్టియన్ సమాఖ్య వీరి కోసం యూరోప్‌లోనే ట్రయల్స్ కూడా నిర్వహించింది. ఈ నలుగురి అశ్వాలను జర్మనీలో ఏడురోజులపాటు క్వారంటైన్లో పెట్టాక ఈనెల 21న చైనాకు తరలించారు. ‘ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడం నమ్మశక్యంగా లేదు. ఇక్కడి దాకా మా అందరి ప్రయాణం ఎంతో కఠినంగా సాగింది. యుక్త వయసులోనే మేమందరం యూరోప్‌కు వచ్చి శిక్షణ తీసుకుంటున్నాం’ అని ఇండోర్‌కు చెందిన 21 ఏళ్ల సుదీప్తి వ్యాఖ్యానించింది. ‘మేమందరం ఒకరినొకరం ఉత్సాహపరుచుకున్నాం. జాతీయ గీతం వినిపిస్తూ, జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే ఆ అనుభూతిని వర్ణించలేం. మా అందరి శ్రమకు తగ్గ ఫలితం స్వర్ణం రూపంలో లభించింది’ అని 2017లో యూరోప్ వెళ్లిన కోల్‌కతాకు చెందిన 23 ఏళ్ల అనూష్ తెలిపాడు. జైపూర్‌కు చెందిన దివ్యాకృతి అజ్మీర్‌లోని విఖ్యాత మాయో గర్ల్స్ స్కూల్లో ఏడో తరగతిలో ఉన్నపుడు హార్స్ రైడింగ్‌పై దృష్టి సారించింది. 2020లో యూరోప్‌కు వెళ్లిన దివ్యాకృతి జర్మనీలో శిక్షణ తీసుకుంది. ముంబైకి చెందిన 25 ఏళ్ల విపుల్ గత పదేళ్లుగా యూరోప్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. లండన్ యూనివర్సిటీ నుంచి అతను బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేశాడు. డ్రెసాజ్ అంటే.. ఈక్వెస్ట్రియన్‌లో ఎండ్యూరన్స్, ఈవెంటింగ్, జంపింగ్, పెగ్గింగ్, డ్రెసాజ్ తదితర ఈవెంట్లు ఉంటాయి. డ్రెసాజ్ అనేది ఫ్రెంచ్ పదం. ఆంగ్లంలో దీని అర్ధం ట్రెయినింగ్. తన అశ్వానికి రైడర్ ఏ విధంగా శిక్షణ ఇచ్చాడో, వీరిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉందో ఈ ఈవెంట్ ద్వారా తెలుస్తుంది. రైడర్ నుంచి వచ్చే సంజ్ఞల ఆధారంగా అశ్వం కనబరిచే పలు కదలికలను జడ్జిలు పరిశీలిస్తారు. అనంతరం సున్నా నుంచి పది మధ్య పాయింట్లు ఇస్తారు. గరిష్టంగా పాయింట్లు సాధించిన జట్టుకు పతకాలు ఖరారవుతాయి. జట్టులో నలుగురు రైడర్లు ఉన్నా.. పతకాలు ఖరారు చేసేందుకు టాప్–3 రైడర్ల పాయింట్లను లెక్కలోకి తీసుకుంటారు. -
గుర్రాలకు బ్రాండెడ్ షూ.. ధర తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండరు
గుర్రాలకు నాడాలు ఉంటాయి కదా! మరి స్నీకర్స్ ఏమిటి అనుకుంటున్నారా? విడ్డూరంగా అనిపించినా, గుర్రాలకూ స్నీకర్స్ అందుబాటులోకి వచ్చేశాయి. దౌడుతీసే గుర్రాలకు నాడాలు బిగించడమే మనకు తెలుసు. ఈ నాడాలు బిగించడం కొంత హింసాత్మకమైన ప్రక్రియ. స్నీకర్స్ వల్ల గుర్రాలకు నాడాల బెడద ఇకపై ఉండదంటున్నారు ప్రముఖ షూ సర్జన్, స్నీకర్స్ కాస్ట్యూమ్ స్పెషలిస్ట్ మార్కస్ ఫ్లాయిడ్. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండెడ్ స్నీకర్స్‌ను పోలి ఉండే స్నీకర్స్‌ను ఆయన గుర్రాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ‘హార్స్ కిక్స్’ పేరుతో ఆన్లైన్ స్టోర్ ప్రారంభించి, దాని ద్వారా వీటిని ఆయన విక్రయిస్తున్నారు. ‘ఎస్పీఎల్వై–350’, ‘న్యూ బ్యాలెన్స్–650’ పేరిట గుర్రాల కోసం ఇటీవల రెండు అందమైన మోడల్స్‌లో కొత్త తరహా స్నీకర్స్‌ను కూడా విడుదల చేశారు. గుర్రాల పాదాల సైజుకు అనుగుణంగా వీటిని ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవచ్చు. వీటి ప్రారంభ ధర లక్ష రూపాయల నుంచి ఉంటుంది. ప్రస్తుతం వీటిలో కొద్ది మోడల్స్ మాత్రమే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని డిజైన్స్, మోడల్స్‌తో పాటు లెగ్జింగ్టన్, కెంచూరీలలో ప్రత్యేక స్టోర్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు మార్కస్ తెలిపారు. (చదవండి: జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!) -
విశాఖ తీరంలో అత్యంత అరుదైన సీ హార్స్
సాక్షి, విశాఖపట్నం: అత్యంత అరుదైన సీ హార్స్ మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయి. విశాఖ తీరంలో అప్పుడప్పుడు ఇవి దర్శనమిస్తున్నాయి. ఇవి రెండు మూడు అంగుళాల సైజులో రొయ్యలను పోలి ఉంటాయి. ఇవి రొయ్యల్లో కలిసిపోతుండడం వల్ల మత్స్యకారులు వీటిని పెద్దగా పట్టించుకోరు. తాజాగా మంగళవారం విశాఖ మత్స్యకారుల వలకు ఇవి దొరికాయి. నగరంలోని ఒక వ్యక్తి సాయంత్రం హార్బర్లో రొయ్యలను కొనుగోలు చేశాడు. ఇంటికి తెచ్చి చూడగా రొయ్యలతో పాటు ఈ సీ హార్స్ కూడా అందులో ఉన్నట్టు కె.విజయ్‌కుమార్ అనే వ్యక్తి గుర్తించారు. దొరికిన సీ హార్స్‌ను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడంతో ఈ విషయం బయట పడింది. కాగా సముద్ర గుర్రంగా పిలిచే ఈ చిన్న చేపలు (సీ హార్స్) ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల, సమశీతోష్ణ జలాల్లో కనిపిస్తాయి. వీటికి వంకర మెడలు, పొడవైన గొంతు, తల, శరీరం నిటారుగా ఉండి తోక వంకరగా ఉంటుంది. ఈ జంతువులకు నోట్లో పళ్లుండవు. పగడపు దిబ్బలు, మడ అడవులు వంటి ప్రాంతాల్లో నివశిస్తాయి. నిట్టనిలువుగా నిలిచి ఈదుతాయి. మగ సముద్రపు గుర్రాలు తమ శరీరం ముందు భాగంలో సంతానాన్ని పొదగడానికి అనువైన ఒక సంచి వంటి అరను కలిగి ఉంటాయి. జతకట్టే సమయంలో ఆడ చేప గుడ్లను ఈ మగ చేప సంచిలోకి విడుస్తుంది. అప్పుడు మగ చేప వాటిని అంతర్గతంగా ఫలదీకరణ చేసి పిల్లలు గుడ్లలో నుంచి బయటకు వచ్చాక వాటిని నీటిలోకి విడుదల చేస్తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి జి.విజయ ‘సాక్షి’కి చెప్పారు. విశాఖ ప్రాంత సముద్ర జలాల్లో సీ హార్స్‌ల ఉనికి అరుదు అని తెలిపారు. -
The island of Hydra: ఇచట కార్లకు ప్రవేశం లేదు!
అక్కడ అడుగు పెడితే కాల స్పృహ కనుమరుగవుతుంది. అసలు కాలమే వెనక్కు వెళ్తుంది. కార్లన్నవి మచ్చుకు కూడా కానరాని కాలం కళ్ల ముందు కనిపిస్తుంది. గుర్రపు బగ్గీలే అక్కడ ప్రధాన ప్రయాణ సాధనాలు. కొండొకచో గాడిదలు, కంచర గాడిదలు బరువులు మోస్తూ కనిపిస్తుంటాయి. కనుచూపు మేరా ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం, దానికి దీటుగా పోటీ పడుతూ పరిశుభ్రత కనువిందు చేస్తాయి. ఎక్కడిదా ప్రాంతం? ఏమా కథ...?! గ్రీస్ దేశంలో అనగనగా అదో ద్వీపం. పేరు హైడ్రా. అక్కడి ఎజియన్ సముద్రంలోని ద్వీపాల్లో ఒకటి. వాటి మాదిరిగానే స్వచ్ఛమైన జలాలకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. కళ్లు చెదిరే అందాలకు, ఆహ్లాదకర వాతావరణానికి, పచ్చదనానికి కాణాచి. కాకపోతే వాటిల్లో దేనికీ లేని ప్రత్యేకత హైడ్రా దీవి సొంతం. ఆ కారణంగానే అది కొన్నేళ్లుగా అంతర్జాతీయ పర్యాటకుల నోళ్లలో తెగ నానుతోంది. అదేమిటంటే... అక్కడ కార్లు తదితర మోటారు వాహనాలు పూర్తిగా నిషేధం. గుర్రాలు, కంచర గాడిదలు మాత్రమే ప్రయాణ, రవాణా సాధనాలు. ఆ మేరకు కఠిన నిబంధనలు ఏర్పాటు చేసుకోవడమే గాక వాటిని తూచా తప్పకుండా పాటిస్తోంది కూడా. అంబులెన్సులు, అగి్నమాపక వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు. హైడ్రా దీవిలో అడుగు పెట్టగానే మనల్ని పలకరించేది గుర్రాలు, కంచర గాడిదలే. స్థానికుల్లో ఎవరిని చూసినా వాటి మీదే చకచకా సాగిపోతూ కనిపిస్తారు. దక్షిణాన అందాలకు ఆలవాలమైన కమీనియ అనే కుగ్రామం మొదలు పశి్చమాన అత్యంత పారదర్శకమూ, పరిశుభ్రమైన సముద్ర జలాలలో అలరారే మండ్రాకి దాకా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ కాలపు దీవి హైడ్రా మనల్ని పాత కాలానికి తీసుకెళ్లి కట్టి పడేస్తుందని అంటారు హారియట్ జర్మన్. స్థానికంగా హార్స్ ట్రెక్కింగ్ కంపెనీ నడుపుతున్న ఆమె 24 ఏళ్ల క్రితం అనుకోకుండా అమ్మతో పాటు అక్కడికి విహార యాత్రకు వచ్చారు. ఆ ప్రాంతం ఎంతగా నచి్చందంటే, అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయారు! తర్వాత పదేళ్ల క్రితం గ్రీస్‌ను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం కారణంగా తనకు ప్రాణప్రదమైన గుర్రం క్లోను అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో హార్స్ ట్రెక్కింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుందామే. ఇప్పుడు గుర్రాల సంఖ్య 12కు పెరిగింది. ‘కార్లు లేవు గనుక ఇక్కడ అందరి జీవితాలూ హడావుడికి దూరంగా, నింపాదిగా గడుస్తుంటాయి‘ అంటూ నవ్వుతారామె. చరిత్రే కారణం హైడ్రా దీవి 18, 19వ శతాబ్దం దాకా ప్రముఖ సముద్ర వర్తక కేంద్రంగా ఓ వెలుగు వెలిగింది. 20వ శతాబ్దంలో మోటార్ వాహనాల శకం రాకతో ఆ వైభవం వెనకపట్టు పట్టింది. ఇరుకు సందులు, రాళ్ల ప్రాంతం కావడంతో హైడ్రాలో మోటార్ వాహనాల రాకపోకలు ఎప్పుడూ కష్టతరంగానే ఉంటూ వచ్చాయి. దాంతో, వాటిని పూర్తిగా నిషేధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన స్థానిక యంత్రాంగానికి పుట్టుకొచ్చింది. అదే ఇప్పుడు ఆ దీవిని ప్రత్యేకంగా నిలిపింది. వీఐపీలకు విశ్రామ స్థలం హైడ్రా దీవి అందచందాలు, కార్ల జాడే లేని ప్రత్యేకత ఎందరెందరో వీఐపీలను ఆకర్షిస్తోంది. అప్పుడెప్పుడో 1950ల్లోనే ప్రముఖ ఇటాలియన్ నటి సోఫియా లారెన్ హైడ్రాలో షూటింగ్ చేసే క్రమంలో ఆ దీవితో ప్రేమలో పడ్డారు. అక్కడే స్థిరపడ్డారు. బ్రైస్ మార్డన్, అలెక్సిస్ వెరోకస్, పనగియోసిస్ టెట్సిస్, జాన్ క్రాక్స్టన్ వంటి ప్రఖ్యాత చిత్రకారుల నుంచి హెన్రీ మిల్లర్ వంటి ప్రముఖ రచయితల దాకా ఎందరెందరో హైడ్రాలో ఆరామ్‌గా జీవిస్తున్నారు. కెనేడియన్ గాయకుడు, పాటల రచయిత లియోనార్డ్ కోహెన్ రాసిన అజరామర గీతం ’బర్డ్ ఆన్ ద వైర్’కు హైడ్రా దీవే స్ఫూర్తి! ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా భూలోక స్వర్గమే అంటారాయన. నేషనల్ డెస్్క, సాక్షి -
చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!
ఈ ఇమేజ్ చూస్తే కేవలం కప్ప మాత్రమే కనిపిస్తోంది కదూ. కానీ సరిగా చూస్తే ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఇది కేవలం మీ ఐక్యూకి మాత్రమే కాదు పరీక్ష. మీరు ఏవిధంగా ఆలోచించగలరు అనేదాన్ని కూడా తెలియజేస్తుంది. ఇలాంటి ఫజిల్స్ మనకు ఎదరయ్యే సమస్యలను ఎలా కూడా చూడాలో తెలుపుతుంది. ఈజీగా ఎలా బయటపడాలో మెదడుకు ఓ ఎక్స్ర్సైజ్లా కూడా ఉంటుంది. అసలు దీనికి మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు ఎలాంటి సంబంధం ఉండదు అనకండి. కొన్ని సమస్యలు మనకు ఓ పట్టాన పరిష్కారం కావు. ఏదో ఒక యాంగిల్ ఆలోచించి ఏ స్టెప్ తీసుకోలేక ఒకింత గందరగోళానకి గురవ్వుతాం. అదే ఒక సమస్యను రెండు లేదా మూడు రకాలుగా ఆలోచించగలిగితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఇక అదంతా సరే! ముందు ఈ ఫోటోలో ఇంకొక చిత్రం కూడా ఉంది ట్రై చేయండి. త్వరగా కనిపెట్టండి. ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు కాస్త ఓపికగా చూడండి ప్లీజ్. ఇక ఆ బొమ్మలో కనిపిస్తున్న మరో ఆకృతి (రివర్స్‌లో చూస్తే) ఏంటంటే.. ఓ గుర్రం ముఖం కనిపిస్తుంది చూడండి. చూసే కన్నుని బట్టి ఆకృతి మారుతుంది. అలాగే మన సమస్యను చూసే విధానం బట్టి మనలోని భ్రమలను భయాలు కూడా దూరం చేసుకోగలుగుతాం. (చదవండి: రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా!) -
వీళ్లు మనుషులేనా! కేదార్నాథ్ యాత్రలో దారుణం.. బలవంతంగా గంజాయి తాగించి..
ఉత్తరాఖండ్‌ను దేవభూమి అంటారు. చార్ధామ్ యాత్ర కోసం వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోకి వెళుతుంటారు. పుణ్యక్షేత్రాల్లో ఈ స్థలానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కేదార్నాథ్ అధ్యాత్మికతతో కాకుండా పలు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు గుర్రానికి బలవంతంగా గంజాయి తాగించేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేదార్నాథ్ యాత్రలో యాత్రికులు ఎక్కువగా గుర్రాలను ఉపయోగిస్తారు. గుర్రపు స్వారీ చేసేవారు, శక్తి లేని వారు కొండపైకి వెళ్లేందుకు గుర్రపు సవారిని ఎంచుకుంటారు. దీంతో గుర్రపు స్వారీ, గుర్రపు నిర్వాహకులు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారిన వీడియోలో.. ఇద్దరు యువకులు గుర్రం నోరు పట్టుకున్నారు. ఒకరు గుర్రం ముక్కు రంధ్రాలను మూసేశారు. మరొక యువకుడు గుర్రానికి గంజాయిని నాసిక రంధ్రం ద్వారా బలవంతంగా తాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గుర్రపు యజమాని గుర్రానికి ఈ విధంగా మత్తు మందు ఇస్తే భక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో యాత్రికుల భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలువురు ఘాటుగా స్పందించారు. వీళ్లు మనుషులేనా.. ఇది అమానుషమైన ఘటనని, జంతువులను ఇంత దారుణంగా హింసించే నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందిస్తూ.. గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వైరల్ వీడియోను మేము చూశాం. వీడియోలోని వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని" చెప్పారు. #Uttrakhand Some people are making a horse smoke weed forcefully at the trek of Kedarnath temple.@uttarakhandcops @DehradunPolice @RudraprayagPol @AshokKumar_IPS should look into this matter and find the culprit behind thispic.twitter.com/yyX1BNMiLk — Himanshi Mehra 🔱 (@manshi_mehra_) June 23, 2023 చదవండి: ఇకపై బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్లు చెకింగ్.. ఎందుకంటే..? -
అది అత్యంత వింత రోడ్డు..రోజుకు 2 గంటలే కనిపించి..
ఇప్పుడున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు హైటెక్ రోడ్లను నిర్మించే పనిలో తలమునకలై ఉన్నాయి. అయితే ఈరోజుకీ కొన్ని రోడ్లు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తున్నారు. కొండ ప్రాంతాలోని రోడ్లు భీతిగొలుపుతుంటాయి.అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది. అది రోజులో కేవలం రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో అదృశ్యం అవుతుంది. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ ఉంది? ఆ రోడ్డు మీదుగా ఎవరు ప్రయాణిస్తుంటారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోడ్డు ఫ్రాన్స్‌లో ఉంది. ఈ రోడ్డు ప్రధాన భూభాగాన్ని నోయిర్ మౌటియర్ ద్వీపంతో కలుపుతుంది. ఈ ప్రాంతం ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్ వద్ద ఉంది. ఈ రోడ్డు 4.5 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. ఈ రోడ్డును ‘పాసేజ్ డూ గోయిస్’ పేరుతో పిలుస్తారు. ఫ్రెంచ్ భాషలో ‘గోయిస్’ అంటే ‘చెప్పులు విడిచి రోడ్డు దాటడం’ అని అర్థం. ఇది రోజులో ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో రోడ్డుకు నలువైపులా నీరే కనిపిస్తుంది. ఈ రోడ్డు తొలిసారిగా 1701లో మ్యాప్‌లో కనిపించింది. ఈ రోడ్డు దాటడం ఎంతో ప్రమాదకరం. రోజులో రెండు గంటలు మాత్రమే ఎంతో పరిశుభ్రంగా కనిపించి, ఆ తరువాత మాయమైపోతుంది. రోడ్డుకు రెండు పక్కల నీటిమట్టం పెరిగిపోతుంది. దీంతో అక్కడి నీటి లోతు 1.3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఏర్పడుతుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ రోడ్డు మీదుగా ప్రయాణించే చాలామంది ప్రతీయేటా మృత్యువు పాలవుతుంటారు. మొదట్లో జనం ఈ ప్రాంతానికి బోట్లలో వచ్చేవారు. తరువాత ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. 1840లో గుర్రాల సాయంతో జనం ఇక్కడికి వచ్చేవారు. 1986 తరువాత ఇక్కడ ప్రత్యేకమైన్ రేసులు నిర్వహిస్తూ వస్తున్నారు. 1999 నుంచి ఫ్రాన్స్ ఈ రోడ్డుపై ‘టూర్ ది ఫ్రాన్స్’ పేరిట సైకిల్ రేసులు నిర్వహిస్తూ వస్తోంది. -
గుర్రం బాబా
-
కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ వేడుకలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయి ఓ గుంపుపైకి దూసుకపోయింది. అయితే ఆ సమయంలో చార్లెస్ 3 వెస్ట్మిన్స్టర్ అబ్బే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి తిరిగి వెళ్లిపోయిన తదుపరి ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ హౌస్‌హోల్డ్‌లోని మౌంటెడ్ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. సమీపంలో ఓ మెటల్ బారీకేడ్ని ఢీ కొట్టి మరీ గుంపుపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తున్న గోల్డస్టేట్ కోచ్‌కు కేవలం గజం దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సైనిక సిబ్బంది గాయాలను ఊహించి సంఘటన స్థలానికి స్ట్రెచర్‌ను తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు భయపడేంతగా ఎవరికి గాయాలు కాలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. During today's coronation of the British King Charles the Third, an agitated horse, which was part of the royal procession, ran into the audience watching the event on the streets of London pic.twitter.com/29RXPOwK2e — Spriter (@Spriter99880) May 6, 2023 (చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి) -
నిదుర ఉండదు.. కుదురుగుండదు.. విడతల వారీగా రోజుకు రెండు గంటలే!
ఇప్పటివరకు ఆఫ్రికన్ బుష్ ఏనుగులు మాత్రమే అతి తక్కువ సమయం నిద్రించే జంతువులుగా గుర్తించబడ్డాయి. తాజాగా.. ఆ జాబితాలో సముద్ర జీవి ‘ఎలిఫెంట్ సీల్’ కూడా చేరిపోయింది. ఆఫ్రికన్ ఏనుగుల మాదిరిగానే ఎలిఫెంట్ సీల్స్ కూడా రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. – సాక్షి, అమరావతి ఏడాదిలో కనీసం ఏడు నెలల పాటు పసిఫిక్ సముద్ర జలాల్లో ప్రయాణించే భారీ క్షీరదాలైన ఎలిఫెంట్ సీల్స్ రోజంతా వేటలోనే నిమగ్నమై ఉంటాయట. గొరిల్లాలు రోజుకు 12 గంటలు, కుక్కలు 10 గంటలు, సింహాలు 20 గంటల వరకు నిద్రిస్తుంటే.. సీల్స్ నిద్ర సమయంలో చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఆడ సీల్స్ తలపై సెన్సార్లు అమర్చి.. ఎలిఫెంట్ సీల్స్ మెదడు, హృదయ స్పందన, కదలికలు, ప్రయాణించే లోతు, నిద్రించే సంకేతాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సెన్సార్లతో కూడిన వాటర్‌ఫ్రూఫ్ సింథటిక్ రబ్బరు టోపీలను ఉత్తర ప్రాంతంలోని ఆడ సీల్స్ తలలపై అమర్చి.. వాటి జీవన స్థితిని శాస్త్రవేత్తలు క్రోడీకరించారు. ఎందుకంటే ఆడ సీల్స్ మాత్రమే ఎక్కువ కాలం సముద్రంలో ప్రయాణిస్తాయి. మగ సీల్స్ ఒడ్డునే ఉంటూ ఆహారాన్ని తింటాయి. ఇవి 4,500 పౌండ్ల వరకు పెద్ద శరీర బరువును కలిగి ఉండటం.. సముద్రంలో ఎక్కువ కాలం మేత వెతకాల్సిన కారణంగా ఈ నిద్ర ప్రవర్తన అభివృద్ధి చేసుకున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మగ ఎలిఫెంట్ సీల్స్కు ఏనుగు మాదిరిగా చిన్న తొండం ఉంటుంది. అందుకే.. వీటిని ఎలిఫెంట్ సీల్స్‌గా పిలుస్తారు. అది కూడా విడతల వారీగానే.. ఇన్ట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ జర్నల్ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎలిఫెంట్ సీల్స్ సముద్ర ఉపరితలం నుంచి సుమారు 377 మీటర్ల లోతు (1,237 అడుగులు)కు వెళ్లి నిద్రిస్తున్నట్టు కనుగొన్నారు. ఇవి ఏకబిగిన కాకుండా 20 నిమిషాల కంటే తక్కువ సేపు ‘క్యాట్నాప్’ (స్వల్పకాలిక) శ్రేణిలో మొత్తంగా 2 గంటలపాటు నిద్రిస్తున్నట్టు అంచనా వేశారు. ఎలిఫెంట్ సీల్స్ పెద్ద మొత్తంలో చేపల్ని వేటాడి తింటాయి. అయితే, ఇవి శత్రు జీవులైన సొర చేపలు, కిల్లర్ వేల్స్ దాడిలో మరణిస్తుంటాయి. ఇవి ఇతర మాంసాహార జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు లోతైన జలాల్లోకి వెళ్లి కొద్ది నిమిషాలపాటు (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్) నిద్ర అనుభవిస్తున్నట్టు నిర్ధారించారు. ఎక్కువసేపు నీటిలోనే.. వాస్తవానికి 10 నుంచి 30 నిమిషాల డైవ్‌లో కొద్దిసేపు మాత్రమే సముద్ర ఉపరితలంలో ఏనుగు సీల్స్ కనిపిస్తాయి. మిగిలిన సమయమంతా జలాల్లోనే ఈదుతూ ఆహార వేటను కొనసాగిస్తాయి. విచిత్రంగా ఈ క్షీరదాలు సంతానోత్పత్తి సమయంలో తీరంలో రోజుకు 10 గంటల సమయం నిద్రపోతాయి. ప్రతి 30 నిమిషాల పాటు సాగే డైవ్‌లో సీల్స్ తలకిందులుగా స్లో–వేవ్ స్లీప్ అని పిలిచే లోతైన నిద్ర దశలోకి వెళ్తున్నాయి. వివిధ జంతువులు నిద్ర సమయం ఇలా.. (రోజుకు గంటల్లో సుమారుగా) గుర్రం 2.9 గాడిద 3.1 ఏనుగు 3.9 జిరాఫీ 4.5 మేక 5.3 కుందేలు 11.4 చింపాంజీ 9.7 కుక్క 10.0 పులి 15.8 ఎలుక, పిల్లి 12.5 ఉడుత 14.9 చిరుత 18.0 సింహం 20 -
Viral Video: పెళ్లి కొడుకుతో పారిపోయిన గుర్రం.. షాక్‌లో బంధుమిత్రులు..
పెళ్లంటే జీవితకాల జ్ఞాపకం.. ఇద్దరు వ్యక్తలు కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు వేదిక. ఇలాంటి గొప్ప రోజును అందంగా మలుచుకునేందుకు నేటి యువత ఆసక్తి చూపుతున్నారు. హల్దీ, మెహందీ ఫంక్షన్, సంగీత్ అంటూ కొత్తకొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. సర్ప్రైజ్లు, సరదాలు, ముఖ్యంగా డ్యాన్స్ కార్యక్రమం లేకుండా అసలు పెళ్లిళ్లే జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక పెళ్లి వేడకలో ఫన్నీ మూమెంట్స్, షాకింగ్, ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో ప్రత్యమవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వరుడికి సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన స్పెషల్ ఎంట్రీతో వధువును సర్ప్రైజ్ చేయాలనుకున్న వరుడి ఆశలు తలకిందులయ్యాయి. అసలేం జరిగిందంటే.. పెళ్లి కోసం అదంగా ముస్తాబైన వరుడు గుర్రంపై ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో బంధువులు టపాసులు పేల్చారు. బాంబులు పేలిన సౌండ్‌కు ఒక్కసారిగా బెదిరిన గుర్రం అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. దీంతో ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి దాని యజమాని వెనకాలే పరుగులు పెట్టాడు. అయితే గుర్రంపై కూర్చున్న వరుడు కూడా అటే వెళ్లడంతో బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు గానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 9.7 లక్షల మంది వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. చదవండి: Viral: ప్రేమకు వేదికైన కళాశాలలోనే పెళ్లి చేసుకున్న జంట View this post on Instagram A post shared by memes comedy (@ghantaa) -
చల్‌చల్ గుర్రం.. 50 ఏళ్లుగా అశ్వాన్నే వాడుతున్న రైతు
సాక్షి, బషీరాబాద్: ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతిఒక్కరూ శరవేగంగా గమ్యం చేరాలని భావిస్తున్నారు. నిమిషాలు, గంటల్లో వెళ్లేలా ఆధునిక వాహనాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఖరీదైనన కార్లు, బైకులు కనిస్తున్నాయి. కానీ బషీరాబాద్ మండలం ఎక్మాయికి చెందిన రైతు అల్లూరు నర్సయ్యగౌడ్ యాభై ఏళ్లుగా అశ్వాన్నే వాహనంగా వాడుతున్నారు. తన 18వ ఏట నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు గుర్రాలపై స్వారీ చేసినట్లు చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా ప్రమాదం లేకుండా, పైసా ఖర్చు లేకుండా ప్రయాణం పూర్తవుతుందని తెలిపాడు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్ప బైకులు, కార్లు, బస్సులు ఎక్కలేదని వివరించాడు. (చదవండి: నాడు నాన్న.. నేడు అమ్మ అనాథైన బాలిక ) -
తన క్రష్ ఏంటో చెప్పిన జడేజా.. షాకైన అభిమానులు
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న జడేజా అక్కడే కోలుకుంటున్నాడు. ఇక జడేజాకు గుర్రాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన జడేజాకు గుర్రపుస్వారీ, కత్తిసాముపై మంచి పట్టు ఉంది. తన ఇంట్లో గుర్రాలను కూడా పెంచుకుంటున్నాడు. తాజాగా ఒక గుర్రంతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన జడేజా.. మై క్రష్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంతకముందు తన గుర్రంపై స్వారీ చేసిన వీడియోతో పాటు మరికొన్ని ఫోటోలు జతపరిచి ఒక డాక్యుమెంట్ రూపంలో విడుదల చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జడేజా పెట్టిన ఫోటోపై టీమిండియా క్రికెటర్లు సహా అభిమానులు ఫన్నీగా స్పందించారు. ఇక జడేజా టి20 ప్రపంచకప్‌కు దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. జడ్డూ స్థానంలో మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌లో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. మూడు టి20లు కలిపి ఎనిమిది వికెట్లు తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. వికెట్ల పరంగానే కాదు ఎకానమీలోనూ(6.30)అదరగొట్టాడు. దీంతో టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు అక్షర్ పటేల్ కీలకం కానున్నాడు. View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) చదవండి: సూర్య అడుగు పడింది.. మెరిసేనా! -
Mur Ghurar Duronto Goti: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!
‘అవును... గుర్రం ఎగరావచ్చు’ అంటారు. ఈ గుర్రం మాత్రం ఎగరడమే కాదు... యంగ్ డైరెక్టర్ మహర్షి కశ్యప్‌ను కూర్చోబెట్టుకొని బెంగళూరు నుంచి జైపుర్ వరకు తిప్పింది. రేపు ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా తీసుకువెళ్లవచ్చు... ఆస్కార్ 2023 బరిలో ‘షార్ట్ ఫిల్మ్ ఫిక్షన్’ విభాగంలో మన దేశం నుంచి అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ది హార్స్ ఫ్రమ్ హెవెన్) ఎంపికైంది. 27 సంవత్సరాల మహర్షి తుహిన్ కశ్యప్ దీని దర్శకుడు. కథ విషయానికి వస్తే... ఒక పెద్దాయన ఎప్పుడూ పగటి కల కంటూ ఉంటాడు. నగరంలో జరిగే గుర్రపు పందేలలో తన గుర్రం కూడా ఉండాలి. ఆ గుర్రం ఎలాంటిదంటే, మెరుపు వేగంతో పరుగులు తీస్తుంది. ఎప్పుడు గుర్రపు పందేలు జరిగినా తానే విజేత. ‘మీ గుర్రానికి ఎంత బాగా శిక్షణ ఇచ్చారు’ అంటూ అందరూ తనను వేనోళ్లా పొగుడుతుంటారు. ‘ఇంతకీ నా గుర్రం ఏదీ?’ అని వెదుకుతాడు ఆ పెద్దాయన. కానీ ఆ గుర్రం ఊహాల్లో తప్ప వాస్తవప్రపంచంలో కనిపించదు. అక్కడ కనిపించేది తన గాడిద మాత్రమే! ‘కలా? నిజమా! అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ గురించి వింటూ, చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్ బరిలో నిలవడం అనేది గర్వంగా ఉంది’ అంటున్నాడు మహర్షి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన మహర్షి స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీశాడు. సర్రియలిజం, డార్క్ హ్యూమర్లతో కూడిన ఈ కథను చెప్పడానికి సంప్రదాయ కళ ‘ఒజపాలి’ని సమర్థవంతంగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరువందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న అస్సామీ కళారూపం ‘ఒజపాలి’లో కళాకారులు ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ పురాణాలలో నుంచి కథలు చెబుతుంటారు. ‘ది హార్స్ ఫ్రమ్ హెవెన్’ను ఎక్కువ భాగం క్యాంపస్‌లో చిత్రీకరించారు. కొంత భాగం కోల్‌కతా శివారులలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్, జైపుర్ ఫిల్మ్‌ఫెస్టివల్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీప్ ఫోకస్ స్టూడెంట్ ఫిల్మ్‌ఫెస్టివల్...మొదలైన ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎస్ఎఫ్ఎఫ్)లో ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్ అందుకొని ఆస్కార్ బరిలోకి దిగబోతుంది. ఫీచర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను ఆస్కార్‌కు పంపాలంటే అది ఆస్కార్ – క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ గెలుచుకోవాలి. మన దేశంలో అలాంటి ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ బీఐఎస్ఎఫ్ఎఫ్. ‘చిత్ర రూపకల్పన అనేది ఎంత క్లిషమైన విషయమో అందులో దిగాక కాని తెలియదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. స్వర్గం నుంచి దిగి వచ్చిన గుర్రం మమ్మల్ని ఎన్నో నగరాలు తిప్పింది. భవిష్యత్‌లో ఎన్ని చోట్లకు తీసుకువెళుతుందో తెలియదు’ అంటున్నాడు మహర్షి. కల్లోల ప్రాంతంలో పుట్టి పెరిగిన మహర్షికి ఎనిమిదవ తరగతిలో డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. చాలామందిలో ఆతరువాత కాలంలో ఆ కోరిక ఆవిరైపోతుంది. కానీ మహర్షి విషయంలో మాత్రం అది ఇంకా బలపడింది. (క్లిక్: హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత) సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టిన రోజు తన కలకు రెక్కలు దొరికినట్లుగా సంతోషపడ్డాడు. మహర్షిలో ఉన్న ప్రశంసనీయమైన ప్రత్యేకత ఏమిటంటే.. నేల విడిచి సాము చేయాలనుకోవడం లేదు. తన నేల మీద నడయాడిన కథలనే చిత్రాల్లోకి తీసుకురావాలకుంటున్నాడు. ఉత్తర, దక్షిణ భారతాలతో పోల్చితే వెండి తెర మీద కనిపించిన ఈశాన్య భారత ప్రాంత కథలు తక్కువ. ఇప్పుడు ఆ లోటు మహర్షి కశ్యప్ రూపంలో తీరబోతుంది. ఆస్కార్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే! (క్లిక్: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్) ప్రాంతీయ చిత్రాలు రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అస్సాం అనేది కొత్త కథలకు కేంద్రం కాబోతుంది. – మహర్షి -
మనసును కదిలించిన వీడియో.. అయ్యో గుర్రానికి ఎంత కష్టం వచ్చింది!
తల్లి ప్రేమ గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలే తన జీవితంగా బతుకుతుంది అమ్మ.. అమ్మ ప్రేమ అనేది కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ కనిపిస్తుంది.. ఇలాంటి ఘటనలు ఇది వరకే ఎన్నో చూసి ఉంటాము. కాగా, ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ గుర్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. తమిళనాడులో కోయంబత్తూరులోని పట్టీశ్వర దేవాలయం సమీపంలోని దర్పణం మండపం, పడితుర ప్రాంతాల్లో 10కి పైగా గుర్రాలు తిరుగుతున్నాయి. ఆ ప్రాంతంలోనే పచ్చి గడ్డి మేస్తూ ఉంటున్నాయి. కాగా, వారం క్రితం ఓ పిల్ల గుర్రం మందలోని నుంచి తప్పిపోయింది. అది తల్లి గుర్రాన్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతమంతా తిరిగింది. ఇదే సందర్భంలో ఓ బస్సుపై ఉన్న గుర్రపు బొమ్మను చూసింది. దీంతో, ఆ బొమ్మే తన తల్లి అనుకుంది. కాసేపు అక్కడే అటు ఇటూ తిరిగింది. ఇంతలో బస్సు స్టార్ట్ కావడంతో తన తల్లి పరిగెత్తుతుందనే భావనతో పిల్ల గుర్రం కూడా బస్సు వెంట పరుగు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, గుర్రాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా కంటతడి పెట్టించింది. వారంతా ఆవేదనకు లోనయ్యారు. குதிரையின் பந்தபாசம்: பேருந்தில் ஒரு குதிரையின் படத்தை பார்த்து பின்னால் ஓடும் குட்டி குதிரை. இடம்- கோயம்புத்தூர் | வீடியோ உதவி: பி.ரஹ்மான்#horse | #Kovai pic.twitter.com/W9m8QXlC0d — Indian Express Tamil (@IeTamil) September 13, 2022 -
ఆఫీసుకు రోజూ ఇలానే వస్తున్నారు..!
ఆఫీసుకు రోజూ ఇలానే వస్తున్నారు..! -
పిల్లల కథ: మంచి పని.. ఈ కిరీటం నీకే!
విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ సమయంలో కిరీటం జారి కిందపడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకెళ్ళిపోయాడు. నక్క, తోడేలు కలసి వస్తూ కిరీటాన్ని చూశాయి. ‘నేను ముందు చూశాను. ఇది నాకు చెందాలి’ అంది నక్క. ‘కాదు.. నేను ముందు చూశాను. నాకే చెందాలి‘ అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి సమస్య విన్న సింహం.. జంతువులన్నింటిని సమావేశపరచింది. విషయాన్ని వివరించింది. ‘కిరీటం అడవిలో దొరికింది కాబట్టి.. ఈ అడవికి రాజునైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని జంతువులన్నిటికీ ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్నిచ్చి గౌరవిస్తాను. అంతవరకూ ఇది నాదగ్గరే ఉంటుంది’ అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్లిపోయాయి. వేట ముగించుకుని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఎక్కడా కనిపించక పోవడంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్లిపోయాడు. సంవత్సర కాలం పూర్తయింది. సింహం జంతువులన్నీటినీ సమావేశపరచింది. ‘మహారాజా! నేను కోతిచేష్టలు, ఆకతాయి పనులు మానుకున్నాను. మంచిగా ఉంటున్నాను’ అంది కోతి. ‘మాంసాహారం మానుకుని చిన్నజంతువులను దయతో చూస్తున్నాను’ అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటనే చెప్పాయి. ‘బురదగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను’ అంది ఏనుగు. ‘నేను నాట్యంతో ఆనందాన్ని పంచాను’ అంది గుర్రం. ‘నేను కొన్నింటికి చెట్లెక్కడం నేర్పాను’ అంది చిరుత. ‘పిల్లజంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను’ అంది పెద్దపులి. ఉలుకు.. పలుకూ లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం ‘నువ్వేం చేశావో చెప్పు?’ అని అడిగింది. ‘మన అడవి గుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక మునితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడకు వేటకు రావడం ఆ రాజుకు అరిష్టమని చెప్పి భయపెట్టి.. మా వైపు రానివ్వకుండా చేయండి అని కోరాను. దానికి ఆ ముని.. ఈ అడవికే కాదు ఏ అడవికీ వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముని వెళ్లి రాజుకు ఏంచెప్పాడో కానీ ఆరోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. మన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. నిండుగా చెట్లుంటే అనేక లాభాలు. అందుకే వందలసంఖ్యలో పండ్లమొక్కలను నాటి పెంచుతున్నాను’ అని చెప్పింది ఎలుగుబంటి. ‘ఇతరుల మేలు కోరడం, మొక్కలను పెంచడాన్ని మించిన మంచి పనులేమున్నాయి! ఈ కిరీటం నీకే’ అని ప్రశంసించింది సింహం. ‘మృగరాజా.. బహుమతి కోసం నేను ఈ పనులు మొదలుపెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. మీ ప్రశంసలు అందుకున్నాను. అది చాలు నాకు’ అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. (క్లిక్: పిల్లల కథ.. ఆనందమాత) -
నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు
భారత్‌లో భారీ వర్షాలతో జలాశయాలన్ని పూర్ణ కుంభంలా ఉంటే యూఎస్, యూకేలో భానుడు భగ భగ మంటున్నాడు. దీంతో అక్కడ పలు చోట్ల రైలు పట్టాలు వేడికి వంకర్లు తిరగడం, అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం వంటి ఘటనలు చోటు చూసుకున్నాయి కూడా. అక్కడ వేడి గాలులకు జంతువులు సైతం తాళ్లేక నీటి కోసం ఆర్రులు చాచుతున్నాయి. తాజాగా న్యూయార్క్ ఒక గుర్రపు బండికి ఉన్న గుర్రం వేడిగాలుకు సొమ్మసిల్లి పడిపోయింది. అసలేం జరిగిందటే... అమెరికాలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఆ ఎండల ధాటికి ఒక గుర్రం సోమ్మసిల్లి పడిపోయింది. ఆ గుర్రం ప్రసిద్ధిగాంచిన గుర్రపు జాతుల్లో ఒకటి. గుర్రపు బండికి ఉన్న గుర్రం రోడ్డు పై వెళ్తు వెళ్తూ... మాన్హాటన్ హెల్స్ కిచెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆ గుర్రానికి నెత్రిపై సుర్ర మంటున్న ఎండ మరోవైపు వేడిగా ఉన్న తారు రోడ్డు, ఈ రెండిటి ధాటికి బండిని లాగలేక పడిపోయింది. దీంతో రహదారిపై ఉన్న జనాలు ఆ గుర్రపు బండిని తోలే వ్యక్తి పై మండిపడ్డారు. పైగా ఆ వ్యక్తి గుర్రం పడిపోవడానికి ముందు బండిని లాగేలా...కొరడాతో గట్టిగా కొట్టాడాని ఆరోపణలు చేశారు. ఒక్క పక్క వేడుగాలులు, దీనికి తోడు అతను కొట్టడంతో ఆ గుర్రం నడవలేక పోయిందంటూ సదరు వ్యక్తిని తిట్టడం మొదలు పెట్టారు. ఈ ఘటనతో న్యూయార్క్ అధికారులు ఆ గుర్రాన్ని నీటితో తడుపుతూ సపర్యలు చేశారు. గుర్రాన్ని సంరక్షించే వ్యక్తి కూడా దాన్ని తిరిగి లేచి నిలబడేందుకు సాయం అందిస్తున్నాడు. కానీ ఆ గుర్రం లేచి నిలబడే స్థితిలో లేదు. జంతు ప్రేమికులు ఈ గుర్రాన్ని రైడ్ చేయడానికి వినయోగించొద్దని అధికారులను కోరారు. వాస్తవానికి ఆ గుర్రానికి నరాల వ్యాధి ఉందని ఇలా పడిపోతుంటుందని న్యూయార్క్ గుర్రాల ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ చెబుతుండటం విశేషం. ప్రస్తుతం గుర్రం పశువైద్య సంరక్షణలో ఉందని, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. BREAKING: This horse COLLAPSED while pulling a carriage in NYC, likely from heat exhaustion, and has been down for over an hour. Horses don’t belong in big cities where they’re put in constant danger because of cars, humans, weather, and more. pic.twitter.com/vXBVRJRjPB — PETA (@peta) August 10, 2022 (చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!) -
స్విగ్గీ బంపర్ ఆఫర్: నెటిజన్ల సెటైర్లు
సాక్షి, ముంబై: ముంబై భారీ వర్షాలలో స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేసిన అంశంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. గుర్రంపై తమ కంపెనీ తరపున ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించాలని అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కోరింది. వైరల్ వీడియోలో తమ డెలివరీ ఏజెంట్‌ను గుర్తించలేక పోయామని అతని ఆచూకీ కనిపెట్టిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామంటూ స్విగ్గీ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ సందడి చేస్తున్నాయి. స్విగ్గీమాన్ ఆన్ ఎ హార్స్ గురించి ఆచూకీ తెలిపిన వ్యక్తికి రూ. 5000 బహుమతి అంటూ స్విగ్గీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎందుకంటే అతని గురించి తెలుసుకోవాలని యావత్ దేశంతో పాటు తామూ కోరుకుంటున్నామని వెల్లడించింది. అంతేకాదు పర్యావరణ అనుకూలమైన డెలివరీ పద్ధతులను అవలంబిస్తామని స్పష్టం చేసింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు లాంటివి తమ డెలివరీ వాహనాల్లో లేవని వివరణ ఇచ్చుకుంది. దీంతో కమెంట్ల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ప్రసారమైన హిందీ టీవీ సీరియల్లోని చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇతని గురించేనా వెతికేది అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘ఏ మ్యాన్ ఆఫ్ డ్రీమ్స్’ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు అసలు గుర్రం మీద డెలివరీ ఓకేనా? కాదా? అనే పోల్ నిర్వహించాలని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. కాగా ఇటీవల ముంబైలో తెల్లటి గుర్రంపై స్విగ్గీ డెలివరీ బ్యాగ్‌తో ఉన్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
వాట్ ఎన్ ఐడియా.. గుర్రంపై ఫుడ్ డెలివరీ.. వైరలవుతోన్న వీడియో
ముంబై: ఇటీవల కాలంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోయాయి. వారానికి నాలుగు సార్లైనా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సరైన సమయంలో డెలివరీ బాయ్స్ ఫుడ్‌ను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. ఎండలు, వానలతో సంబంధం లేకుంటా టైమ్‌కు డెలివరీ అవ్వాల్సిందే. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ యాప్స్‌లో డెలివరీ బాయ్స్ సాధారణంగా బైక్ మీద వస్తుంటారు. కానీ ముంబైలో వర్షాలు ఎక్కువగాపడుతుంటంతో ఓ డెలివరీ బాయ్ వినూత్న ఆలోచన చేశాడు. అతను చేసిన పని తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అతనేం చేశాడంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్డుపై నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ తీసుకెళ్లడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నగరంలో వర్షాలు కురుస్తుండడంతో బైక్‌పై ప్రయాణించేందుకు రోడ్లు వీలుగా లేకపోవడంతో స్విగ్గీ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రమెక్కాడు. వెనక బ్యాగ్ తగిలించుకుని ఆర్డర్లు డెలివరీ చేసేందుకు గుర్రంపై వెళ్తున్నాడు. దీనిని వెనకాల ఉన్న వారు వీడియో తీశారు. జస్ట్ ఏ వైబ్ అనే యూట్యూబ్ చానల్లో ఇది పోస్టు చేయడంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. డెలివరీ ఆలస్యం కాకూడదని భావించిన డెలివరీ బాయ్ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా గుర్రాన్ని ఉపయోగించడం మంచి ఆలోచన.. ఏదో ఒక రోజు మనం వీధుల్లో గుర్రాలపై స్వారీ చేస్తామని ఆశిస్తున్నా.. నా కల నిజమైంది.’ అంటూ స్మైలీ, హార్ట్ ఎమోజీలను పంచుకుంటున్నారు. చదవండి: టీచర్ దండన.. విలవిలలాడిన చిన్నారి -
గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య
-
ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!
కొన్ని రకాల చిత్రాలు అత్యద్భుతంగా ఉంటాయి. పైగా వాటిలో దాగి ఉన్న అసలైన చిత్రాలను మనం తదేకంగా పరికించి చూస్తే గానీ గుర్తిచలేం. అయితే అలా గుర్తించడం కూడా ఒక అందమైన అనుభూతి అనే చెప్పాలి. కొంతమంది కళాకారులు భలే అద్భుతంగా గీస్తారు. అవి చూసినప్పుడు ఒకలా ఉంటుంది. కానీ కాస్త నిశితంగా పరిశీలించి చూస్తే అసలైన కళాఖండం అవగతమవుతుంది. అచ్చం అలానే ఉంటుంది ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం కూడా . (చదవండి: వలసదారుల పడవ బోల్తా: 11 మంది దుర్మరణం) అసలు విషయంలోకెళ్లితే...మంచు పర్వతాల్లో గుర్రాల గుంపు నిలబడి ఉన్న ఒక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మొదటగా మనకు ఆ చిత్రం చూసిన వెంటనే అక్కడ ఐదు గుర్రాలు మాత్రమే ఉన్నాయని అనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఏడు గుర్రాలు ఉంటాయి. మనం ఒక్కసారిగా పరికించి జాగ్రత్తగా చూస్తేగానీ మనకు అవగతమవ్వదు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూసి ఎన్ని గుర్రాలు ఉన్నాయో లెక్కపెట్టండి మరి. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి. (చదవండి: సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!) -
ఆమె సంకల్పానికి సలాం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి..
ముంబై: ఆర్టీసీ సమ్మె కష్టాలు గ్రామీణ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. చిన్న చిన్న గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సమ్మె కారణంగా బస్సులు లేక పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో బీడ్ జిల్లాకు చెందిన మాధవి అనే విద్యార్థిని స్కూల్‌కు వెళ్లేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకుంది. రోజూ గుర్రంపై స్వారీ చేస్తూ స్కూల్‌కు వెళుతోంది. ఉజ్నీలోని సిద్ధేశ్వర్ విద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్న మాధవి గుర్రంపై స్వారీ చేస్తూ పాఠశాలకు వెళుతుండటంతో ఆమె పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కింది. చదవండి: (పతాకానికి పరాభవమా?) కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇదే సమయంలో గత నెల రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో బస్సులు లేక గ్రామీణ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇదిలావుండగా, మాధవి స్వగ్రామం నుంచి పాఠశాలకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజూ పాఠశాలకు బస్సులో వెళ్లే మాధవి ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో తొలుత చాలా ఇబ్బంది పడింది. దీంతో ఎలాగైనా పాఠశాలకు వెళ్ళాలన్న ఆమె సంకల్పానికి ఇంట్లో పెంచుకుంటున్న గుర్రం దారి చూపినట్లయింది. చదవండి: (పెళ్లి వయసు పెంచితే సరిపోతుందా?) వెంటనే గుర్రం మీద బడికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అంతే అప్పటి నుంచి ఆ చిన్నారి ప్రతీరోజు గుర్రం మీదే పాఠశాలకు వెళ్లి వస్తోంది. గుర్రం స్వారీ చేయడమే కాకుండా, దానికి జీను వేయడం, ముక్కుతాడు కట్టడం లాంటి పనులు కూడా మాధవినే చేసుకుంటుంది. ఎలాగైన బడికి వెళ్లాలన్న మాధవి తపన చూసిన పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అధికారులు ఆమెను అభినందించారు. -
గుర్రపు బండిపై వరుడి ఊరేగింపు.. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో..
గాంధీనగర్: సాధారణంగా వివాహాలంటే పెళ్లి ఊరేగింపులు, బరాత్‌లు, సందడి డీజేలు సహజం. ఎందుకుంటే జీవితంలో మనం జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలలో పెళ్లి కూడా ఒకటి. అందుకే ఆ వేడుక ఎప్పటకీ గుర్తుండిపోవాలని ఇలాంటి హంగామాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే అలాంటి పెళ్లి రోజే అనుకోకుండా ఓ విషాదకర ఘటన గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకుంది. తన పెళ్లి రోజు ఆనందం ఎప్పటికీ గుర్తుండి పోవాలనుకున్న ఆ వరుడికి చేదు జ్ఞాపకంగా మారింది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే? ఓ వరుడి గుర్రపు బండిలో పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఊరేగింపు అంటే తెలిసిందే.. ధూంధాంగా డాన్స్‌లు, డీజే, ఒకటే సందడి సందడిగా ఉంటుంది. వీటితో పాటు కొందరు బాణసంచాలు పేలుస్తూ ముందుకు కదులుతున్నారు. అయితే కొన్ని బాణాసంచాలు వరుడి గుర్రపు బండిలో కూడా ఉండడంతో అంతలో ఓ టపాకాయి అనుకోకుండా వెళ్లి వరుడి బండిలో పడింది. దీంతో అందులో ఉన్న టపాకాయిలు ఒక్కసారి పేలడంతో ఆ బండి మంటలో మొదలయ్యి, క్షణాల వ్యవధిలో బండి మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రమాదం నుంచి వరుడితో పాటు అందులో ఉన్న చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే బండి నుంచి గుర్రాలను సైతం విడదీసి, నీటిని చల్లి మంటలను ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. A horse carriage caught fire during a wedding procession in #Gujarat's Panchmahal. The groom had a narrow escape but no one was injured in the incident. pic.twitter.com/vsryXvWYFD — India.com (@indiacom) December 15, 2021 చదవండి: వేల కిలోమీటర్ల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్! -
బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి
బాలీవుడ్ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిని కొట్టిపారేసింది. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల అతనితో దిగిన ఫోటో బయటకు రావడంతో ఈ అమ్మడు చుట్టూ ఉచ్చు బిగిసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ శ్రీలంక బ్యూటీపై మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందట. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పౌల్‌తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం.ప్రస్తుతం ఈ బహుమతుల ఇష్యూ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
ప్రపంచంలోనే ఖరీదైన పెంపుడు జంతువులు ఇవే
జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. కొందరు శునకాల్ని, మరి కొందరు మార్జాలాలను, ఇంకొందరు పక్షులను.. ఇలా రకరకాల ప్రాణులను తమ ఇండ్లలో పెంచుకుంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. వాటి కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధ పడతారు. ప్రపంచంలోనే ఖరీదైన కొన్ని పెంపుడు జంతువులను ఇక్కడ చూద్దాం.. – ఏపీ సెంట్రల్ డెస్క్ గ్రీన్ మంకీ – థ్రోగ్బ్రెడ్ రేస్ హార్స్.. రూ.117 కోట్లు అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుగా అమెరికాకు చెందిన మగ రేసు గుర్రం గ్రీన్ మంకీ నిలుస్తుంది. తొలి రేసులోనే అత్యంత వేగంగా పరుగుపెట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక మైలు దూరాన్ని కేవలం 10 సెకండ్లలోనే అధిగమించింది. కాబట్టి దీనికి అంత రేటు. దీని వీర్యం కూడా ఖరీదైనది కావడంతో ఈక్వెస్ట్రియన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. అందువల్ల దీనిని పోటీ పడి కొన్నారు. సర్ లాన్స్‌లాట్ ఎన్కోర్ – లాబ్రడార్..117 కోట్లు లాబ్రడార్ శునకానికి అంత ఖరీదు ఎందుకు అనిపించవచ్చు. అయితే ఇదొక అద్భుతమైన కుక్క. అందుకే దీనికి అంత రేటు. ఏంటా అద్భుతం అంటే.. ఇది పూర్తిగా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోనే విజయవంతంగా జన్మించిన శునకం. అందువల్లే దీనికి అంత రేటు అన్నమాట. మిస్ మిసీ – ఆవు రూ. 8.82 కోట్లు ఆవు ఇంత ఖరీదా... అని మనం నోరెళ్లబెట్టవచ్చు. అయినా.. ఈ హోలిస్టీన్ ఆవు ప్రత్యేకతలు అలాంటివి మరి. ఆవుల పోటీల్లో పలు అవార్డులు పొందడంతో దీనికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అంతేగాక సాధారణ ఆవుల కంటే కనీసం 50 శాతం ఎక్కువగా పాలిస్తుంది. రెడ్ ప్యూర్ బ్రీడ్ టిబెటిన్ మాస్టిఫ్... 4.28 కోట్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జాతి శునకం ఇది. ఈ జాతి అత్యంత అరుదైనది కావడంతోనే దీనికి ఆ రేటు. ముందు నుంచి చూస్తే అచ్చం సింహం ఆకారంలో ఉంటుంది. మనుషులతో స్నేహ పూర్వకంగా మెలుగుతాయి. ఇప్పుడు వీటిని ఇతర శునకాలతో క్రాస్ బ్రీడ్ చేస్తున్నారు. ఒరిజినల్ బ్రీడ్ మాత్రం అత్యంత ఖరీదైనదే. తెల్ల సింహం కూన రూ. 1.03 కోట్లు ఈ తెల్ల సింహం పిల్లలను చూస్తే భలే ముద్దొస్తున్నాయి కదా! వీటిని పెంచుకుందామని అనుకుంటే మాత్రం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్క కూనను విడిగా అమ్మరు కాబట్టి.. రెండు కూనలను కొన్నాల్సి వస్తుంది. అంటే రూ. 2.06 కోట్లు పెట్టాల్సిందే. సింహాల్లో అత్యంత అరుదైన రంగు కాబట్టి వీటికి ఆ రేటు. కొన్ని దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. అరేబియన్ గుర్రం రూ. 70 లక్షలు గుర్రాల్లో అరేబియన్ జాతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. చింపాంజీ రూ. 44.14 లక్షలు మనుషుల తర్వాత తెలివైన జీవులుగా చింపాంజీలకు పేరుంది. ఈ తెలివైన జీవులు మనుషులకు బాగా మచ్చిక అవుతాయి. యజమానులతో ఆటలు ఆడతాయి. నవ్విస్తాయి. కవ్విస్తాయి. వీటిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి బొనోబో, రెండోది సాధారణ చింపాజీ. చాలా దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. అయితే వీటి రోజు వారీ ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లావెండర్ అల్బినో బాల్ పైథాన్ రూ. 30 లక్షలు పామును పెంచుకోవడం అంటే అయ్యబాబాయ్ అంటాం. అలాంటిది ఓ కొండచిలువ (పైథాన్)ను పెంచుకోవడమా.. అని అనిపిస్తుంది. కొంతమందికి పాముల్ని పెంచడం కూడా ఓ హాబీ. లావెండర్ అల్బినో బాల్ పైథాన్ ఆఫ్రికా ఖండానికి చెందిన చిన్న సైజు కొండచిలువ. ఈ కొండచిలువ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే పెంచుకుంటారు. సవానా పిల్లి రూ. 15 లక్షలు సాధారణ పెంపుడు పిల్లికి, ఆఫ్రికా సెర్వల్ జాతి పిల్లికి పుట్టినది ఈ పిల్లి. సాధారణ పెంపుడు పిల్లి కన్నా కొంచెం ఎత్తుగా, నాజూగ్గా ఉంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతాయి. సరదాగా ఉంటాయి. ఇతర పిల్లుల్లా కాకుండా నీటిలో ఆడుకోవడం అంటే వీటికి భలే సరదా. ఎవరూ తోడు లేకపోయినా స్వతంత్రంగా ఆడుకోవడం ఈ పెంపుడు పిల్లులకు అలవాటు. గుర్రాల్లో అరేబియన్ జాతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. హ్యాసింత్ మకావ్ రూ. 10 లక్షలు రామచిలుక జాతుల్లో ఇదో పెద్ద జాతి. నీలం రంగుతో భలే చూడ ముచ్చటగా ఉంటుంది. దీనిని కొనడమే కాదు.. పెంచడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఈ తెలివైన పక్షులకు మంచి నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉంటుంది. దీనికి సౌకర్యవంతమైన గూడు ఏర్పాటు చేయాలి. ఖర్చును తట్టుకుంటే ఇదో మంచి పెంపుడు పక్షిలా ఉంటుంది. సులువుగా దీనికి తర్ఫీదు ఇవ్వవచ్చు. యజమానులతో చాలా ప్రేమగా ఉంటుంది. -
ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై ఎఫ్ఐఆర్ నమోదు
FIR against Mani Ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్’ చిత్రీకరణలో ఓ గుర్రం చనిపోవడంతో పెటా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో గుర్రం యజమాని, మణిరత్నంలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెలలో హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమా షూటింగ్ జరుగింది. యుద్ధం సీన్ కోసం ఏకధాటిగా షూటింగ్ చేయడంతో డీహైడ్రేషన్ కారణంగా ఓ గుర్రం చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పెటా ప్రతినిథులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మణిరత్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమానిపై పిసిఎ చట్టం 1960, సెక్షన్ 11 మరియు భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల "పోన్నియన్ సెల్వన్" కథ ఆధారంగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి వంటి స్టార్ కాస్టింగ్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చదవండి : సినిమా షూటింగ్లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్.. -
సినిమా షూటింగ్లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి
సాక్షి, హైదరాబాద్: యుద్ధం సీన్‌ను భారీగా తీయాలన్న అత్యాశ ఓ గుర్రం ప్రాణం తీసేసింది. సినిమా షూటింగ్లో జంతువులను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నా.. నిర్వాహకుల నిర్లక్ష్యం ఆ మూగజీవి ప్రాణాన్ని తీసింది. అయితే, గుర్రం చనిపోతే కేసు అవుతుందన్న భయమో... లేక గుర్రమే కదా అన్న నిర్లక్ష్యమోగానీ... గుట్టుచప్పుడు కాకుండా గుర్రాన్ని పూడ్చేసి చేతులు దులుపుకున్నారు సినిమా నిర్వాహకులు. కానీ, షూటింగ్లో పాల్గొన్న వారిచ్చిన సమాచారంతో పెటా ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో యుద్ధం సీన్ కోసం 40–50 గుర్రాలను వినియోగించారు. హైదరాబాద్‌కే చెందిన ఓ గుర్రాల యజమాని దగ్గరి నుంచి గుర్రాలను తెప్పించుకున్న నిర్వాహకులు వాటితో ఏకధాటిగా షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ సమూహంలోని ఓ గుర్రం షూటింగ్ జరుగుతుండగానే డీహైడ్రేషన్ కారణంగా గత నెల 11న చనిపోయింది. చనిపోయిన గుర్రాన్ని సినిమా నిర్వాహకులు గుంత తీసి పూడ్చేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. ఆనోటా ఈనోటా గుర్రం మృత్యువాత పడ్డ విషయం పెటా ప్రతినిధులకు తెలిసింది. దీంతో గత నెల 18న అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చారు. పెటా పిటిషన్ ఆధారంగా చిత్ర నిర్మాత, గుర్రం యజమానిపై కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నారు. స్థానిక పశువైద్యుడి సహకారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చనిపోయిన గుర్రానికి పోస్టుమార్టం నిర్వహించారు. చదవండి: Sidharth Shukla: బిగ్‌బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం -
గుర్రంలా సకిలించినందుకు జైలుశిక్ష
డోలు.. డోలు కొట్టుకుంటే మధ్యలో ఉన్న మద్దెలను వాయించినట్లు... రష్యాలోని ఓ భార్యభర్తల గొడవ, వీధి ప్రజల నిద్రను మాయం చేసింది. అది కూడా సుమారు రెండున్నర సంవత్సరాల పాటు. కారణం, రోజూ వారి గొడవలు వినలేక కాదు, గుర్రం సకిలింతలు వినలేక. భార్యభర్తల గొడవల మధ్యలో గుర్రం సకిలింతలు ఏంటని ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ భార్యభర్తలు గొడవపడి, విడిపోయి మూడు సంవత్సరాలు అవుతోంది. కానీ, అతను మాత్రం భార్య తనని వదిలేసి వెళ్లడాన్ని జీర్ణించుకోలేపోయాడు. ఆ అవమానం, బాధ తట్టుకోలేక కుమిలిపోయాడు. చివరకు మతిస్థిమితం కోల్పోయి, ఓ సైకోలా తయారయ్యాడు. ఎంతలా అంటే కేవలం వీధి ప్రజల నిద్ర చెడగొట్టడానికి వేల రూపాయలు ఖర్చు చేసి, ఓ పెద్ద సౌండ్ సిస్టమ్, స్పీకర్స్ కొన్నాడు. ఇక రోజూ వాటిని ఉపయోగించి, ప్రతిరోజూ గుర్రంలా సకిలిస్తూ, ఆ శబ్దాలతో హోరెత్తించేవాడు. అలా సుమారు రెండన్నర సంవత్సరాల పాటు కొనసాగించాడు. అతని బాధ చూడలేక కొంతమంది, అతన్ని మానసికవైద్యశాలలో చేర్పించాలని కూడా చూశారు. ఎటువంటి లాభం లేకపోయింది. దీంతో విసుగు చెందిన వీధి ప్రజలు ఎంతోమంది అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించారు. కోర్టు అతడికి మూడున్నర సంవత్సరాల జైలుశిక్ష విధించింది. -
మనిషికి మచ్చికైన గుర్రాల గురించి ఈ విషయాలు తెలుసా?
మనుషులకు మచ్చికైన జంతువుల్లో గుర్రాలది ప్రత్యేక స్థానం. పూర్వం వేగ వంతమైన రవాణాకు, యుద్ధాల్లో రథాలను నడిపించేందుకు వీటిని వినియోగించేవారు. చాలా యూరప్ దేశాల్లో గుర్రాలను వ్యవసాయ పనులకు కూడా వినియోగిస్తారు. లండన్ వీధుల్లో ఇప్పటికీ గుర్రపు బగ్గీలు తిరుగుతూనే ఉంటాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్రపు పందేలకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. యంత్రాల శక్తిని కూడా హార్స్ పవర్లో కొలవడం మనకు అలవాటు. అలాంటి హయముల్లో ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు పొందిన ‘బిగ్ జేక్ ’ ఇటీవల అమెరికాలోని విస్కాన్సిన్లో కన్నుమూసింది. బెల్జియన్ జాతికి చెందిన ఈ అశ్వం.. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 1,136 కిలోల బరువుతో ప్రపంచంలోనే ఎత్తయినదిగా 2010లో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పెద్దవైన గుర్రం జాతులు, వాటి వివరాలు ఇక్కడ చూద్దాం. – ఏపీ సెంట్రల్ డెస్క్ 1. ఇది బ్రిటీష్ బ్రీడ్ చాలా శక్తిమంతమైనది. అశ్వాల్లోనే పెద్ద జాతిగా పేరొందింది. వీటి సరాసరి ఎత్తు 6 అడుగులు ఉంటుంది. ఇవి 900 నుంచి 1,100 కేజీల వరకు బరువు ఉంటాయి. ప్రపంచంలో ఎత్తయిన అశ్వంగా ఈ జాతికి చెందిన ‘మమ్మోత్’ గతంలో రికార్డు నెలకొల్పింది. అది 7.1 అడుగుల ఎత్తుతో 1,500 బరువు ఉండేది. 2. క్లైడెస్‌డేల్ స్కాంట్లాండ్‌కు చెందిన బ్రీడ్. ఈ జాతి తురగాల సగటు ఎత్తు 6 అడుగులు ఉంటుంది. సుమారు 820 నుంచి 910 కేజీల వరకూ బరువు పెరుగుతాయి. అరుదుగా ఒక్కో గుర్రం 1,000 కేజీల బరువు వరకూ పెరుగుతుంది. బ్రిటీష్ రాయల్ అశ్వికదళంలో ఇవి ఎక్కువగా సేవలు అందిస్తాయి. జాతీయ ప్రాముఖ్య దినాలు, ఇతర సందర్భాల్లో జరిగే పరేడ్లలో ఇవి పాల్గొంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్‌తో పాటు 56 కిలోల బరువుండే మ్యూజికల్ డ్రమ్స్‌ను మోస్తూ ఇవి పరేడ్‌లో పాల్గొంటాయి. 3. పెర్చెరాన్ పశ్చిమ ఫ్రాన్స్‌లోని హ్యుస్నే నది, పర్వత సానువులు దీని జన్మస్థానం. ఇది నివసిస్తున్న దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా దీని ఎత్తు, బరువు మారుతూ ఉంటాయి. ఫ్రాన్స్‌లో ఇది సుమారు 5.10 అడుగుల నుంచి 6.01 అడుగుల ఎత్తు, 500 నుంచి 1,200 కిలోల బరువు వరకూ ఉంటుంది. అమెరికాలో 6.3 అడుగులు, 1,200 కిలోల వరకూ కూడా పెరుగుతాయి. బ్రిటన్‌లో సుమారు 5.5 అడుగుల ఎత్తు, 810 కిలోల బరువు ఉంటాయి. 4. బెల్జియన్ దీనియన్ బెల్జియన్తో పాటు బ్రబంట్ హార్స్, బెల్జియన్ హెవీ హార్స్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇటీవల మరణించిన బిగ్ జేక్ కూడా ఇదే జాతికి చెందినది. దీని జన్మస్థానం ప్రస్తుత బెల్జియంలోని బ్రబంట్ ప్రాంతం. వీటి సగటు ఎత్తు 5.7 అడుగులు ఉంటుంది. 900 కిలోలకు పైగా బరువు పెరుగుతాయి. ఈ జాతిలో ఇప్పటి వరకూ అతి పెద్ద హయముగా పేరొందిన బ్రూక్లిన్ సుప్రీమ్ 1,451 కేజీల బరువుండేది. 6.5 అడుగుల ఎత్తు ఉండేది. ఇది చాలా కాలం క్రితం కన్నుమూసింది. 5. డచ్ డ్రాఫ్ట్ నెదర్లాండ్స్‌కు చెందిన జాతి ఇది. కోల్డ్ బ్లడెడ్ తరహా అశ్వం. ఇది చాలా అందంగా ఉంటుంది. దీని కదలికలు చూడ చక్కగా ఉంటాయి. అణకువగా మసలుతుంది. దీనికి నిలకడ శక్తి ఎక్కువ. దీని సగటు ఎత్తు 5.10 అడుగులు ఉంటుంది. బరువు సగటును 750 కిలోల వరకూ పెరుగుతుంది. వీటిలోని ఆడ గుర్రాలు ఎత్తు, బరువు తక్కువగా ఉంటాయి. 6. అమెరికన్ క్రీమ్ పేరుకు తగ్గట్టే ఇది అమెరికాకు చెందిన గుర్రం. దీనిని అమెరికన్ వైట్ హార్స్ అని కూడా పిలుస్తారు. గతంలో అమెరికా ఉన్నత శ్రేణి వర్గాలు, అధికారులు ప్రయాణించే బగ్గీలకు వీటిని వినియోగించేవారు. వీటి సగటు ఎత్తు 5.5 అడుగులు ఉంటుంది. బరువు 820 కిలోల వరకూ పెరుగుతుంది. వీటిల్లోని ఆడవి కాస్త చిన్నవిగా ఉంటాయి. 7. రష్యన్ హెవీ డ్రాఫ్ట్ దీనిని సోవియట్ డ్రాఫ్ట్ హార్స్ అని కూడా పిలుస్తారు. ఈ జాతి బెల్జియం నుంచి రష్యాకు వచ్చింది. వీటి సగటు ఎత్తు 5.3 అడుగులుగా ఉంటుంది. బరువు 850 కేజీల వరకూ పెరుగుతుంది. వీటిలోని ఆడ వాటి బరువు, ఎత్తు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఈ పెద్దదిగా గుర్తింపు పొందిన తురగం 1,000 కేజీల బరువు పెరిగింది. 8. సఫోల్క్ ఇది కూడా బ్రిటీష్‌కు చెందిన బ్రీడే. దీనిని సఫోల్క్ పంచ్, సఫోల్క్ సోరెల్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా బలమైనది. శక్తిమంతమైనది. పెద్దగా కనిపిస్తుంది. కఠినమైన శ్రమ చేయడంలో ప్రసిద్ధి పొందింది. దీని సగటు ఎత్తు 5.10 అడుగులు ఉంటుంది. బరువు 900 నుంచి 1000 కేజీలు ఉంటుంది. 9. ఫజోర్డ్ నార్వేలోని పశ్చిమ పర్వత సానువులు దీని జన్మస్థానం. శక్తిమంతమైనదే కాకుండా చురుకైనదిగా దీనికి పేరుంది. ఇది పెరిగే ప్రాంతాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి దీని ఎత్తు, బరువుల్లో మార్పు ఎక్కువగా ఉంటుంది. దీని సగటు ఎత్తు 5.5 అడుగులు కాగా, 500 కిలోల వరకూ బరువు పెరుగుతుంది. 10. డోల్ ఇది కూడా నార్వేకు చెందిన అశ్వమే. దీనిని డోల్హెస్ట్ అని కూడా పిలుస్తారు. దీని హృదయం, ఉదర భాగం విశాలంగా ఉంటుంది. ఫజోర్డ్ కన్నా వీటి తోకలు కాస్త చిన్నగా ఉంటాయి. దీని సగటు ఎత్తు 5.2 అడుగులు ఉంటుంది. 530 నుంచి 600 కిలోల వరకూ బరువు పెరుగుతుంది. -
ప్రపంచంలోనే ఎత్తైన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైయిన ‘గిన్నిస్’కు ఎక్కిన బెల్జియన్ జాతి గుర్రం బిగ్ జాక్ ఇకలేదు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాలలో మృతి చెందింది. ప్రస్తుతం బిగ్ జాక్ వయసు 20 ఏళ్లు. కాగా, రెండు వారాల క్రితం ఆ గుర్రం మరణించిందని దాని యజమాని జెర్రీ గిల్బర్ట్ భార్య వలీషియా గిల్బర్ట్ వెల్లడించారు. ఇక బిగ్ జాక్ 6.10 అడుగులు ఎత్తు (2.1 మీటర్లు) ఉండేది. దాని బరువు 1,136 కిలోలు (2,500 పౌండ్లు). దీంతో బతికున్న వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైయిన గుర్రంగా బిగ్ జాక్ గిన్నిస్ బుక్ రికార్డ్స్ల్లోకి ఎక్కింది. కాగా, నబ్రాస్కాలో పుట్టిన బిగ్ జాక్ పుట్టినప్పుడు దాని బరువు 109 కిలోల (240 పౌండ్లు). సాధారణంగా బెల్జియన్ జాతి గుర్రాలు 100 నుంచి 140 పౌండ్ల (45 నుంచి 65 కిలోల) బరువుతో పుడుతాయని, కానీ తన గుర్రం అసాధారణంగా 100 పౌండ్ల అధిక బరువుతో పుట్టిందని జెర్రీ గిల్బర్ట్ తెలిపారు. అంతేకాకుండా బిగ్ జాక్ జ్ఞాపకంగా ఇంతకాలం అది నివసించిన స్టాల్‌ను ఖాళీగా ఉంచుతామని జెర్రీ గిల్బర్ట్ చెప్పారు. స్టాల్ బయట ఒక ఫలకం ఏర్పాటు చేసి దానిపై బిగ్ జాక్ పేరుతోపాటు బొమ్మ వేయిస్తామని అన్నారు. -
ధోని కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా.. వైరల్ వీడియో
రాంచీ: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు తెలియని వారుండరు. ఆయన మన భారత్ టీంకు గతంలో కెప్టెన్‌గా ఉన్నారు. అతని వికెట్ కీపింగ్ స్టెయిల్స్, హెయిర్ స్టెయిల్ను ఎంతో మంది కుర్రకారు కాపీ కొడుతూ ఉంటారు. అయితే, ఆయనకు పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఏ మాత్రం తీరిక దొరికినా వాటితోనే సమయం గడపటానికి ఇష్టపడతారు. అయితే, తాజాగా, ఆయన భార్య సాక్షి సింగ్ ఇన్‌స్టాలో పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆయన ఒక కొత్త గుర్రాన్ని ఇంట్లో తెచ్చుకున్నారు. దాన్ని కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. దానికి ‘చేతక్’ అని పేరుకూడా పెట్టారు. అయితే, గుర్రం ధోని ఇంట్లో పార్క్‌లో పడుకుని ఉంది. దాన్ని మచ్చిక చేసుకునే క్రమంలో చెతక్ను ప్రేమగా నిమురుతూ, పాంపరింగ్ చేయటం మొదలు పేట్టాడు. చెతక్ కూడా ధోని చేస్తున్న మసాజ్‌కు ఏమాత్రం కదలకుండా హాయిగా పడుకుంది. అయితే , ఈ గుర్రంతో పాటు , ఇప్పటికే మరికొన్ని కుక్కలు కూడా ధోని ఇంట్లో ఉన్నాయి. కాగా, సాక్షిసింగ్ తనింట్లో ఏ కొత్త జంతువును తీసుకొచ్చినా దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియోను బాలీవుడ్ నటి బిపాషా బసు, మాజీ మిన్ ఇండియా అలంక్రిత సహయ్ కూడా వీక్షించారు. అయితే, దీన్నిచూసిన నెటిజన్లు ‘వీకెండ్లో కొత్త అతిథితో సరదాగా గడుపుతున్నారు’ , ‘ ‘మూగజీవాల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
‘వావ్.. నేను ఇంత అందంగా ఉంటానా’
చిన్న పిల్లల వీడియోలు కానీ, జంతువుల వీడియోలు కానీ చూస్తే.. వెంటనే పెదాల మీదకు ఆటోమెటిగ్గా నవ్వొస్తుంది. చిన్నారులు, జంతువుల చిలిపి చేష్టలు చూస్తే ఎంత ఒత్తిడి అయినా సరే ఎగిరిపోవాల్సిందే. ఇక చిన్న పిల్లల్ని, జంతువులను అద్దం ముందు నిలబెట్టినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మరింత ఫన్నిగా ఉంటాయి. పిల్లలకు తొలిసారి అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూపిస్తే.. ఆశ్చర్యంతో రకరకాల హావభావాలు వెల్లడిస్తారు. అదే జంతువులను తొలిసారి అద్దం ముందు నిలబెడితే.. అవి మిర్రర్లో తమ ప్రతిబింబం చూసుకుని దడుసుకుంటాయి. వేరే ఏదో జీవి తన ముందుకు వచ్చింది అనుకుని పారిపోతాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ గుర్రం తొలిసారి అద్దాన్ని చూస్తుంది. ఇక దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఉలిక్కిపడుతుంది. కాస్త పక్కకు జరిగి మళ్లీ అద్దంలో చూసుకుంటుంది.. ఇదేంటి ఇక్కడ మరేవరో ఉన్నారు అనే భయం.. సందేహంతో మరో సారి అద్దంలో చెక్ చేసుకుంటుంది. ఇలా రెండు మూడు సార్లు అద్దంలో తన ముఖం చూసుకున్న గుర్రం.. చివరకు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు గుర్రం ఏమాలోచించి ఉంటుందో ఊహించి మరి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘వావ్ నేను ఇంత అందంగా ఉంటానా’’.. ‘‘అద్దంలో కనిపిస్తుంది నేనేనా..కాస్త మస్కరా పెట్టుకోవాలి’’.. ‘‘అద్దంలో ఉన్నది అందంగా ఉందా.. లేక నేను అందంగా ఉన్నానా’’ అని గుర్రం ఆలోచించి ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: అద్దం విలువ ఏడున్నర లక్షలా..!? -
Reindeer: దుప్పి పాలు రుచి చూస్తారా!
పాలు అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది అవులు, గేదెలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేకపాలు, గొర్రె పాలు కూడా తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాల కోసం దుప్పి (రైన్డీర్)ని పెంచుతారన్న విషయం మీకు తెలుసా? స్కాండినేవియా ప్రాంతంలో ఈ రైన్డీర్ పాలు వినియోగిస్తారు. అతి తక్కువ పరిమాణంలో లభించే ఈ పాలను పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఈ పాలలో 20 శాతం కొవ్వు 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఒక్కో రైన్డీర్ రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏఏ జంతువుల పాలు వినియోగిస్తారో చూద్దాం.. ఒంటె (సోమాలియా, కెన్యా) ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాడి జంతువు ఒంటె. ఇవి సుమారు వారం రోజుల పాటు నీరు తాగకుండా జీవించగలవు. సోమాలియా, కెన్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఒంటె పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఒంటెలు రోజుకు 5 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు చిక్కగానూ, రుచిలో కాస్త ఉప్పగానూ ఉంటాయి. గేదె (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం పాడి గేదెలు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పరిమాణంలో 80 శాతానికిపైగా గేదె పాలు ఈ రెండు దేశాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. గేదెలు ఆవుల కన్నా ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. భారత్‌లో గుజరాత్‌లోని సూరత్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గేదె పాలతో తయారుచేసే ‘సూర్తి పనీర్’ అనే మృదువైన జున్ను (చీజ్)కు విశేషమైన గుర్తింపుఉంది. సాహివాల్ (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో ప్రధానంగా కనిపించే మరో పాడి ఆవు సాహివాల్. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సాహివాల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందిన దేశవాళీ ఆవు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దేశీ జాతి ఆవులు కనిపిస్తాయి. వీటిలో రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది. పాలలో వెన్న 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. గుర్రం (మంగోలియా) గుర్రాలను ఎందుకు వినియోగిస్తారో అందరికీ తెలుసు. కానీ గుర్రం పాల గురించి చాలా మందికి తెలీదు. మంగోలియాలో గుర్రాలను వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తికి వాడుతున్నారు. ఇక్కడ గుర్రపు పాలను 24 నుంచి 48 గంటలపాటు పులియబెట్టి, చిలకడం ద్వారా కౌమిస్ (లేదా ఐరాగ్) అనే పానీయాన్ని తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పానీయంలో 2 శాతం ఆల్కహాల్ ఉండటం విశేషం. యాక్ (జడల బర్రె) / (టిబెట్) యాక్ (జడల బర్రె) హిమాలయ ప్రాంతానికి చెందిన పాడి జంతువు. వీటి నుండి పాలతోపాటు ఉన్ని, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. చలికాలంలో కంటే వేసవిలో ఎక్కువ పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఆవు పాలతో పోల్చితే జడల బర్రె పాలలో కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి పాలతో వెన్న, వివిధ రకాల చీజ్‌లను తయారు చేస్తారు. మేక (ఫ్రాన్స్) ఫ్రాన్స్‌లో మేక పాలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ మేక పాలను రకరకాల చీజ్ల తయారీలో ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల మేక పాలను చర్మ సంరక్షణకు, సౌందర్య సాధనాల (కాస్మొటిక్స్) తయారీకి వినియోగిస్తున్నారు. మేక పాలలో కంటి చూపుకు మేలు చేసే ఎ–విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. రైన్డీర్ (పలవల దుప్పి)/ (ఫిన్‌ల్యాండ్) రైన్డీర్ పాలు చాలా అరుదుగా లభిస్తాయి. స్కాండినేవియా భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైన్డీర్లు సంచరిస్తున్నాయి. ఇవి రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాలలో 20 శాతం కొవ్వు పదార్థం ఉండటంతో చిక్కదనంతో పాటు రుచిగా ఉంటాయి. ఫిన్‌ల్యాండ్‌లో రైన్డీర్ పాలను ‘లేపజువస్టో’ అనే జున్ను తయారీకి వాడతారు. గొర్రె (గ్రీస్) గొర్రె పాలకు గ్రీస్ ప్రసిద్ధి చెందింది. ఆవు పాలతో పోల్చితే గొర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. అందువల్ల ఇవి చీజ్ తయారీకి అత్యుత్తమైనవి. గ్రీస్‌లో గొర్రె పాలతో ఎన్నో వెరైటీల చీజ్‌లను తయారు చేస్తున్నప్పటికీ ‘ఫెటా చీజ్’ అనే వెరైటీని ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడతారు. గొర్రె పాలలో అధికంగా ఉండే కాల్షియం మన దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూస్ (రష్యా, స్వీడన్) ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా లభిస్తున్న మూస్ పాలను రష్యా, స్వీడన్ దేశాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మూస్ రోజుకు 1 నుండి 6 లీటర్ల పాలను ఇస్తుంది. మూస్ పాలతో తయారయ్యే చీజ్ (మూస్ చీజ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూస్ చీజ్‌ను తయారు చేస్తున్న ఏకైక కేంద్రం (మూస్ హౌస్) స్వీడన్‌లోని బ్జుర్హోమ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మూడు వెరైటీలతో మూస్ చీజ్‌లను తయారు చేస్తున్నారు. గాడిద పాలు గాడిద పాలు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కలిగిఉన్నట్లు ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఈజిప్టు రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు. -
గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే..
పాట్నా : ఓ గుర్రం పుట్టిన రోజు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించాడు దాని యజమాని. రుచికరమైన పేద్ద కేకుతో.. నోరూరించే విందు భోజనంతో లక్షలు ఖర్చుపెట్టి మరీ చేశాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సహర్షా జిల్లాలోని పాంచ్‌వతిచౌక్‌కు చెందిన రజ్నీష్ కుమార్ అలియాస్ గోలు యాదవ్‌కు చేతక్ అనే తెల్ల గుర్రం ఉంది. దాన్ని చిన్నప్పటినుంచి కన్న బిడ్డలాగా పెంచుతున్నాడు. ఇంట్లో వాళ్లు దాన్ని ఇంటి సభ్యుడిలాగే చూసేవారు. అదో జంతువు అని అంటే ఒప్పుకునేవారు కాదు. తన పుట్టినరోజు వేడుకలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వని గోలు యాదవ్.. చేతక్ పుట్టిన రోజును ఓ పండుగలా జరిపేవాడు. కేక్ కట్ చేస్తున్న గోలు యాదవ్ ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే పెద్ద ఎత్తున జరిపాడు. చేతక్‌కు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించాడు. తనే దగ్గరుండి ఓ పెద్ద కేకు కట్ చేశాడు. ఊరందరికీ వెజ్, నాన్ వెజ్ భోజనాలు పెట్టించాడు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు. ప్రస్తుతం చేతక్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై గోలు యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ నేను నా బిడ్డలాగా చేతక్‌ని పెంచాను. నా పిల్లలకంటే ఎక్కువ ప్రేమ దానికి పంచాను’’ అని అన్నాడు. చదవండి : వైరల్ : నీ టైం బాగుంది ఇంపాల -
గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళుతున్న కుక్కపిల్ల
కాన్బెరా: రెండు భిన్న జాతులకు చెందిన జంతువులు స్నేహం చేయలేవనేది కొంతమంది అభిప్రాయం. కానీ ఇటీవల కోతి-కుక్క, పిల్లి-కుక్క, కోతి-పిల్లులు స్నేహంగా ఉంటున్న సంఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ గుర్రం, కుక్కపిల్ల కలిసి వాకింగ్‌కు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఫాంలో గుర్రాలను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి పెంపుడు కుక్కపిల్ల ఒడిన్, పది నెలల గుర్రం పిల్ల మోజోతో స్నేహంగా ఉంటోందట. అవి రెండు కలిసి రోజూ ఫాంలో వాకింగ్‌కు వెళ్లడం, కలిసి ఆడుకోవడం చేస్తాయట. (చదవండి: ఆధార్ కార్డులో పెళ్లి భోజనాల జాబితా..) ఈ నేపథ్యంలో ఓ రోజు అవి కలిసి వాకింగ్ చేస్తుండగా ఆ యజమాని వీడియో తీసి సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఆ కుక్కపిల్ల గుర్రం తాడును నోటితో పట్టుకుని లాక్కెళుతూ ముందుకు నడుస్తోంది. ఆ గుర్రం రానన్నట్లు ఆగిపోతుంటే రమ్మని పిలుస్తున్నట్లు కుక్క పిల్ల సైగ చేస్తున్న ఈ దృశ్యం ప్రతి ఒక్కిరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతూ తమ స్పందనను తెలుపుతున్నారు. ‘వావ్ ఈ రెండు చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో’, ‘ఈ కుక్క ఆ గుర్రాన్ని వాకింగ్ తీసుకెళుతోందేమో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: రిహన్నా ట్వీట్.. గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారంటే?) -
బైక్, వ్యాన్ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!
సాధారణంగా ఈ కామర్స్ నుంచి వచ్చే డెలివరీలు బైక్‌లపై తీసుకొచ్చి కస్టమర్లకు అందిస్తారు ఏజెంట్లు. ఒక వేళ ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువు పెద్దదైతే వ్యాన్‌లో తీసుకొస్తారు. ఇది అందరు ఏజెంట్లు చేసే పనే. అయితే తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన ఓ కశ్మిర్ ఏజెంట్ మాత్రం వెరైటీగా ఆర్డర్లు డెలివరీ చేసి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశాడు. బైక్, వ్యాన్ కాకుండా గుర్రంపై వెళ్లి పార్సిల్ అందజేశాడు. శీతాకాలం కారణంగా జమ్ముకశ్మీర్‌లో మంచు విపరీతంగా కురుస్తుంది. రహదాలన్నీ మంచుతో కప్పబడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కస్టమర్లకు సమయానికి పార్సిల్‌ని అందించాలని భావించిన ఓ అమేజాన్ ఏజెంట్‌కు ఓ చక్కటి ఉపాయం వచ్చింది. రహదారులపై వాహనాలు నడిచేందుకు ఇబ్బందిగా ఉండడంతో గుర్రంపై స్వారీ చేస్తూ... కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు. ఫొటో జర్నలిస్ట్ ఉమర్ గనీ ఈ వీడియోను తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. అమేజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తెలివిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. కాగా, తనకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టమని అందుకే ఇలా గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేస్తున్నానని సదరు ఏజెంట్ చెబుతున్నాడు. అలాగే కొందరు అత్యవసరాల కోసం ఆర్డర్లు చేస్తారని, వారికి ఇబ్బంది కలగకుండా ఈ మార్గంలో వెళ్లి సమయానికి వారికి ఆర్డర్లను అందిస్తున్నానని చెప్పారు. Amazon delivery innovation 🐎#Srinagar #Kashmir #snow pic.twitter.com/oeGIBajeQN — Umar Ganie (@UmarGanie1) January 12, 2021 -
హార్స్ రేస్‌లో కిందపడి జాకీ మృతి
సాక్షి, హైదరాబాద్/చాదర్‌ఘాట్: మలక్‌పేట్‌లోని హైదరాబాద్ రేస్ క్లబ్లో (హెచ్ఆర్సీ) మరో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఉస్మాన్‌సాగర్ ప్లేట్ డివిజన్–2 రేసులో పాల్గొన్న రాజస్తాన్‌కు చెందిన జాకీ జితేందర్ సింగ్ (25) గోల్డెన్ టేబుల్ అనే గుర్రం పైనుంచి పడి ప్రాణం విడిచాడు. హెచ్ఆర్సీలో జరిగే వివిధ రేసుల్లో ఇక్కడి గుర్రాలు స్వారీ చేయడం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి జాకీలు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల క్రితం జితేందర్ సింగ్ నగరానికి చేరుకున్నారు. క్లబ్ ప్రాంగణంలో ఉన్న హెచ్ఆర్సీ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. ఈ రేసులో మొత్తం పది మంది పాల్గొన్నారు. మూడో స్థానంలో జితేందర్ సింగ్ ఉన్నారు. రేసు మొదలైన కాసేపటికే గుర్రం 50 కి.మీ. వేగం అందుకుంది. ఎమైందో కానీ ఒక్కసారిగా గుర్రంతో పాటు జితేందర్ సింగ్ పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే గుర్రం కాలు ఆయన ఛాతీ భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన హెచ్ఆర్సీ వర్గాలు ఆయన్ను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాయి. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. దీనిపై చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన సీసీ కెమెరా ఫీడ్‌ను సేకరించిన పోలీసులు విశ్లేషిస్తున్నారు. చదవండి: (చేయని నేరానికి బలైపోతున్నా..) గతంలోనూ ముగ్గురు: ►2005 నవంబర్ 28న మెదక్ ప్లేట్ డివిజన్–1 రేసులో ‘గ్రీకువీరుడు’అనే గుర్రం పైనుంచి పడి హైదరాబాద్‌కు చెందిన జాకీ మధుకుమార్ చనిపోయాడు. ►2012 అక్టోబర్ 19న ఎలైజ్ జోన్ ప్లేట్ చేజింగ్‌లో ‘ట్రిపుల్ ఎయిట్’అనే గుర్రం పైనుంచి పడి పుణేకు చెందిన లక్ష్మణ్ అనే జాకీ మరణించాడు. ►2014 ఏప్రిల్ 17న ఎలైట్ జోన్ రేసులో మూడు గుర్రాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడంతో జాకీలతో సహా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే పుణేకు చెందిన జాకీ శ్యామలరావు చనిపోయాడు. -
లాక్డౌన్ తో ఓ రైతు వినూత్న ఆలోచన
-
నిజంగానే గడ్డి తిన్న సల్మాన్
-
నిజంగానే గడ్డి తిన్న సల్మాన్
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ గడ్డి తిన్నాడు. వినడానికి వింతగా ఉన్నా, నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. వివరాల్లోకి వెళితే.. మేనల్లుడు నిర్వాన్ ఖాన్‌తో కలిసి సల్మాన్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. తీరా లాక్డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఫామ్ హౌస్‌లోనే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అక్కడ అతనికి గుర్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన సరదాగా గుర్రం దగ్గరకు వెళ్లాడు. దానికి గడ్డి తినిపించడానికి ముందు అతను నోటిలో వేసుకుని నమిలాడు. తర్వాత దాని నోటికాడికి అందించి తినిపించాడు. ఇది చూసిన హీరో మేనల్లుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ "బ్రేక్‌ఫాస్ట్ విత్ మై లవ్" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి తుంటరి పనులు చేయడం సల్మాన్‌కు అలవాటేనని చెప్పుకొస్తున్నారు. చూడటానికి ఎంత క్యూట్‌గా ఉందోనని ఆయన అభిమాని కామెంట్ చేశాడు. కాగా కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న 25 వేలమందికి సల్మాన్ ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలి విడతలో వారందరి ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ చేశారు. (సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ మృతి) -
గుర్రాలెక్కిన పెళ్లి కూతుళ్లు..
-
గుర్రాలెక్కిన పెళ్లి కూతుళ్లు..
భోపాల్ : సాధారణంగా పెళ్లి వేడుకల్లో వరుడు గురాన్ని స్వారీ చేస్తూ కనిపిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా ఇద్దరు పెళ్లి కూతుళ్లను గుర్రాలపై ఊరేగించారు. ఖండ్వకు చెందిన ఇద్దరు అక్కాచెల్లలు సాక్షి, సృష్టిల పెళ్లిలు జనవరి 22న జరిగాయి. అయితే వారి సంప్రాదాయం ప్రకారం అక్కాచెల్లలు ఇద్దరు.. గుర్రాలపై బయలుదేరి పెళ్లి కుమారుల ఇళ్లకు చేరుకున్నారు. అలాగే భారీ బరాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెళ్లి కూతుళ్ల తండ్రి మాట్లాడుతూ.. సమాజంలో అబ్బాయిలతోపాటుగా అమ్మాయిలకు కూడా సమాన గౌరవం ఇవ్వాలన్నారు. పాటిదార్ కమ్యూనిటీలో పెళ్లి కూతుళ్లు గుర్రాలపై వెళ్లడమనే సంప్రాదాయం చాలా కాలంగా కొనసాగుతుందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భేటీ బచావో భేటీ పడావో’ కార్యక్రమా ముందుకు తీసుకెళ్లేలా తాము ఈ సంప్రాదాయాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి వర్గం ఈ సంప్రాదాయాన్ని పాటించి.. కూతుళ్లకు గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
వైరల్ : ఈ గుర్రం టీ తాగందే పని మొదలుపెట్టదు!
లండన్ : సాధారణంగా మనలో చాలా మంది పొద్దునే కాఫీ లేదా టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే మనుషుల్లాగే లండన్‌లో ఒక గుర్రం కూడా పొద్దునే కప్పు టీ తాగకుండా ఏ పని ప్రారంభించదట. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు యూకే పోలీసులు. తాజాగా గుర్రం టీ తాగుతున్న వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాలు.. జాక్ అనే గుర్రం లండన్‌లోని మెర్సీసైడ్ పోలీసుల వద్ద 15 ఏళ్లుగా ఉంటుంది. వారు చేసే ఆపరేషన్లలో ఇది చాలా చురుకుగా పాల్గొనేది. మొదట్లో జాక్ ట్రైనర్ లిండ్సే గేవన్ ఉదయం పూట నిద్ర లేపడానికి టీ ఇచ్చేవాడు. జాక్ క్రమంగా దానికి అలవాటు పడిపోవడంతో టీ తాగందే ఏ పని ప్రారంభించకపోవడం చేసేది. దీంతో మెర్సీసైడ్ పోలీసులు దానికోసం ఒక పెద్ద మగ్ను తయారు చేసి ప్రతీరోజు ఉదయం రెండు షుగర్ క్రిస్టల్స్ బాల్స్‌ను వేసి టీని అందిస్తున్నారు. అంతేగాక రాత్రి పూట కూడా టీ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని లేకపోతే అది నిద్రపోదని తెలిపారు. తాజాగా జాక్ టీ తాగుతున్న వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతూనే కామెంట్లు పెడుతున్నారు. ' ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఈరోజు మా దినచర్యను ఈ వీడియోతో ప్రారంభించాం' అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం జాక్ తన దినచర్యను టీ తాగకుండా ప్రారంభించకపోవడం ఫన్నీగా ఉందని అభిప్రాయపడుతున్నారు. -
గుర్రంపై క్రూరత్వం.. ట్రక్కుకు కట్టి
సాధారణంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. అది వేగంగా పరిగెత్తితే ఆనందపడుతాం. కొంతమంది జంతు ప్రేమికులు గుర్రాలను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటారు. కానీ ఓ జంట ఇందుకు పూర్తిభిన్నంగా గుర్రం మీద తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. వారు వెళ్లే ట్రక్కు వాహనానికి వెనుకభాగంలో బలవంతంగా కట్టేసి.. కారును వేగంగా నడుపుతూ తీసుకువెళ్లారు. ఆ మూగ జీవి ఎంత అరిచినా పట్టించుకోలేదు. అదీ కాక ఆ రహదారి పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొలరోడోకి చెందిన ఓ జంట ఈ దారుణ ఘటనకు పాల్పడింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు తీవ్రంగా కామెంట్ల ద్వారా విమర్శిస్తున్నారు. గ్రాండ్లేక్ వద్ద ఆ గుర్రం కిందపడిపోయినట్టు వీడియోలో తెలుస్తోంది. జాన్, అంబర్ సాల్డేట్ దంపతులు గుర్రంపై క్రూరత్వానికి పాల్పడినట్లు గ్రాండ్ కౌంటీ జిల్లా న్యాయవాది ఓ ప్రకటనలో తెలిపారు. గుర్రాన్ని వారి నుంచి తీసుకున్నామని అది ఇప్పుడు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. జంతువులు, చిన్న పిల్లలకు సంబంధించిన కేసులు చాలా సున్నితమైనవి అంటూ దర్యాప్తు కొంత సమయం పడుతుందని గ్రాండ్ కౌంటీ షెరీఫ్ బ్రెట్ ష్రోట్లిన్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆ జంట ఇంత మంది ఆ గుర్రం గురించి ఎందుకు బాధపడ్డారో తమకు ఇప్పుడు అర్థం అయిందని.. తాము తప్పు చేశామని ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఆ జంట జనవరిలో కోర్టుకు హాజరుకానున్నారు. -
సేవకుడి తప్పు
ఖలీఫా ఉమర్ (రజి) కు చేపలంటే ఎంతో ఇష్టం. చేపలు తినాలన్న కోరికను తన సేవకుడి ముందుంచేవారు. సేవకుడు చేపలు తెస్తానని బయల్దేరితే మాత్రం ‘‘చేపలకోసం ఎనిమిది మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తుంది’’ అని చెప్పి వారించేవారు. కానీ ఆరోజు సేవకుడు మాత్రం ఈ రోజెలాగైనా ఖలీఫాకు చేపలు వండి పెట్టాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. ఖలీఫా నమాజుకు వెళ్లడం చూసి రాజ్యంలోని మేలుజాతి గుర్రాన్ని ఒక్క దౌడు తీయించాడు. ఎనిమిది మైళ్ల దూరం ప్రయాణించి ఆరోజు చేపల గంపను తీసుకుని వచ్చాడు సేవకుడు. ఎనిమిది మైళ్ల దూరం వెళ్లి చేపలు తెచ్చాననే విషయం ఖలీఫాకు తెలిస్తే తన పని అయిపోయినట్లేననే భయంతో అనుమానం రాకుండా అశ్వానికి స్నానాల శాలలో స్నానం చేయించాడు. గుర్రం సేదతీరేందుకు నీడన కట్టేశాడు. సాయంత్రం ఖలీఫా ఉమర్ ఇంటికొచ్చాక సంతోషంతో చేపల గంపను ఆయన ముందుంచాడు. ‘‘కాసేపట్లో రుచికరమైన చేపల కూరను మీముందుంచుతాను’’ అని ఎంతో ఆతృతతో చెప్పాడు. ఈ మాటలు విన్న ఖలీఫా వెంటనే గుర్రం దగ్గరకెళ్లి తన చేయిని గుర్రంపై నిమిరారు. కాళ్లకు మర్దన చేశారు. ఆ తరువాత గుర్రం చెవులను పరిశీలనగా చూశారు. గుర్రం చెవుల కింద చెమటలు పట్టి ఉన్నాయి. ‘‘గుర్రాన్ని చక్కగా స్నానం చేయించావు బావుంది కానీ గుర్రం చెవుల వెనుక పట్టిన చెమటను తుడవడం మర్చిపోయావు’’ అని సేవకుడిని సున్నితంగా మందలిస్తూ చెప్పారు. ఆ మరుక్షణమే ఖలీఫా ఉమర్ (రజి) తన మోకాళ్లను నేలపై ఆనించి తన సేవకుడితో ‘‘ప్రళయం రోజున ‘ఓ అల్లాహ్ ఉమర్ చేపలు తినే కోరికను తీర్చుకునేందుకు నోరులేని నన్ను పదహారు మైళ్లు పరుగెత్తించాడు’ అని ఈ గుర్రం అల్లాహ్ కు ఫిర్యాదు చేస్తే నేనేం సమాధానం చెప్పుకోవాలి’’ అని సేవకుడిని నిలదీశారు. ‘‘మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకింత దుఖం కలగలేదు. ఈ రోజు నా దుఃఖానికి అంతులేకుండా పోయిందం’’టూ వెక్కి వెక్కి ఏడ్చారు. సేవకుడు చేసిన తప్పుకు దండించకుండా ఆ తప్పును తానే చేసినట్లు పశ్చాత్తాపం చెందారు. సేవకుడితో ‘‘గుర్రానికి ఈరోజు ఎక్కువ మేత పెట్టు. తెచ్చిన ఈ చేపల గంపను తీసుకెళ్లి పేద కుటుంబానికి ఇచ్చి ఉమర్ (రజి)కి క్షమాభిక్ష పెట్టమని అల్లాహ్‌ను వేడుకోమని చెప్పు’’ అని చెప్పారు. ఖలీఫా ఉమర్ (రజి) దైవభక్తికి, దైవ భీతికి మచ్చుతునక ఈ సంఘటన. – ముహమ్మద్ ముజాహిద్ -
అంధుడికి ఆసరాగా తొలిసారి ఓ గుర్రం!
లండన్: సాధారణంగా పశ్చిమ దేశాల్లోని అంధులు తమ రోజువారీ కార్యక్రమాల్లో సహాయానికి శిక్షణ పొందిన శునకాలను వినియోగిస్తారు. కానీ, బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఓ అంధుడు తొలిసారి తన సహాయకారిగా శునకానికి బదులు ఓ గుర్రాన్ని వినియోగించనున్నాడు. మహమ్మద్ సలీమ్ పటేల్(24) బ్లాక్బర్న్ పట్టణంలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. రెటీనాస్ పిగ్మెంటొసా అనే కంటి సమస్య కారణంగా ఆయన చూపు కోల్పోయాడు. అతడికి చిన్నప్పటి నుంచి కుక్కలంటే మహా భయం. దీంతో ఆయన కుక్కలను సహాయకారిగా ఎంచుకునేందుకు సంకోచిస్తున్న సమయంలో పొట్టిరకం గుర్రం అతడి మదిలో మెదిలింది. ఆ గుర్రానికి (డిగ్బీ) వచ్చే ఏడాది మే నెలలో రెండేళ్లు నిండుతాయని, అనంతరం అది రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకుని తన దగ్గరికి వస్తుందని పటేల్ పేర్కొన్నారు. కుక్కలతో పోలిస్తే డిగ్బీతో ఎన్నో లాభాలున్నాయంటున్నాడు పటేల్. డిగ్బీ జీవిత కాలం ఎక్కువని, తనకు నలభై దాటాక కూడా అది సాయం చేస్తుందన్నాడు. శునకాలు కేవలం 8 ఏళ్లు పనిచేసి రిటైర్ అవుతాయని, అవి చీకటిలో చూడలేవని పేర్కొన్నాడు. -
గుర్రపు డెక్కతో సేంద్రియ ఎరువు!
సరస్సులు, చెరువులు, సాగు నీటి కాలువల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగే గుర్రపు డెక్కతో చక్కని సేంద్రియ ఎరువు తయారు చేసే పద్ధతిని హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక సంస్థ(ఐ.ఐ.సి.టి.) శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ టెక్నాలజీతో తొట్టతొలిగా హైదరాబాద్‌లోని కాప్రా చెరువులో నుంచి తొలగించిన గుర్రపు డెక్క మొక్కలతో సేంద్రియ ఎరువును తయారు చేయడంలో ఖాన్ ఎనర్జీ సంస్థ సఫలీకృతమైంది. గుర్రపు డెక్క మొక్క మురుగు నీటిలో నుంచి విషపూరిత పదార్థాలను గ్రహిస్తుంది. అయితే, ఇది చెరువు మొత్తాన్నీ ఆక్రమించెయ్యడం వల్ల నీటి నాణ్యతకు, జలచరాల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారింది. ఈ నేపధ్యంలో ఈ సమస్యాత్మక మొక్కలను పునర్వినియోగించడంపై ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు రెండేళ్ల పాటు జరిపిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. నీటిలోని విషపూరిత పదార్థాలను గుర్రపుడెక్క మొక్క తన వేర్లలోనే నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి, ఈ వేర్లతో తయారు చేసిన సేంద్రియ ఎరువు కేవలం పూల మొక్కలకు వాడుకోవాలి. అదేవిధంగా, గుర్రపు డెక్క మొక్కల కాండం, ఆకులతో తయారు చేసే సేంద్రియ ఎరువును అధికాదాయాన్నిచ్చే కూరగాయలు, ఉద్యాన పంటలకు వాడుకోవచ్చని ఖాన్ ఎనర్జీ సంస్థ ప్రతినిధి కె. లక్ష్మీనారాయణ(93923 75756) ‘సాక్షి’కి తెలిపారు. గుర్రపు డెక్క మొక్కల కాండం, ఆకులను సేకరించి ముక్కలు చేసి.. ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు తయారు చేసిన బాక్టీరియల్ కల్చర్, పేడ కలిపి 45 రోజులు నిల్వ ఉంచితే ఎరువుగా మారుతుంది. భారతీయ ఎరువుల సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సేంద్రియ ఎరువులో సాధారణ వర్మీకంపోస్టులో కన్నా అనేక రెట్లు ఎక్కువగా పోషకాలున్నాయని ఆయన తెలిపారు. ఫాస్ఫేటు తప్ప ఇతర పోషకాలన్నీ ఉన్నాయన్నారు. పది కిలోలు వర్మీ కంపోస్టుకు బదులు ఈ ఎరువును కిలో వాడితే సరిపోతుందని, సేంద్రియ కర్బనం పుష్కలంగా ఉందన్నారు. దుర్వాసన ఉండదని, తయారైన ఎరువు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందన్నారు. కిలో ఎరువు తయారీకి రూ. 18 వరకు ఖర్చయిందని, కిలో రూ. 25 చొప్పున విక్రయించనున్నామని తెలిపారు. బస్తాల్లోకి నింపే ముందు ఆరబెట్టిన కంపోస్టు –కంచికట్ల శ్రీనివాస్, సాక్షి, ఉప్పల్ -
ట్రాఫిక్‌కు తాళ లేక..గుర్రంపై విధులకు ఇలా!
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్‌కు విసిగిపోయి గుర్రంపైనే కార్యాలయానికి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూపేశ్. మత్తికేరిలో నివాసముంటున్న ఆయన రోజూ ఇంటి నుంచి కార్యాలయానికి రానుపోను సుమారు పది కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. ఇందుకు ఆరు గంటలు పడుతోంది. దీంతో తన చివరి పనిదినమైన శుక్రవారం కాస్త భిన్నంగా ఆలోచించి ఇలా గుర్రంపైనే ఆఫీసుకు చేరుకున్నాడు. స్టార్టప్ స్థాపించాలనుకుంటున్న రూపేశ్ ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. -
అతిధి
ఇద్దరు వ్యక్తులు కొండెక్కి రావడం గమనించాడు టీచర్ దారూ. ఒకడు గుర్రం మీదా, మరొకడు నడిచి వస్తున్నారు. మంచులో ప్రయాణం కష్టమే. అతికష్టం మీద ఒక్కొక్క అడుగేస్తూ రొప్పుతూ నెమ్మదిగా కదులుతున్నారు. వాళ్లిక్కడికి చేరటానికి కనీసం మరో అరగంటైనా పడుతుంది. ఎముకలు కొరికేస్తున్న చలి. స్వెట్టర్ కోసం వెనక గదిలోకెళ్లాడు.ఎనిమిది నెలల తర్వాత వర్షానికి కూడా తెరిపివ్వకుండా అక్టోబర్‌లో మంచు కురిసింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ఇరవైమంది పిల్లలు రావటం లేదు. ఆ బిల్డింగ్‌లోని ఒక్క గదిని మాత్రమే హీట్ చేశాడు దారూ. కొండవైపు కిటికీ ఉన్న క్లాస్‌రూం బాగా చల్లగానే ఉంది.తిరిగివచ్చి చూస్తే వాళ్లు కనిపించలేదు. అంటే కొండ శిఖరానికి దిగువన ఉన్నారన్నమాట. మసక చీకటిగా ఉంది. మిట్ట మధ్యాహ్నమైనా నల్లటి మేఘాలింకా తొలగిపోలేదు.మంచు, చలిగాలితో శరీరం గడ్డకట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ తాడ్జిడ్ నుంచి వచ్చిన డెలివరీ ట్రక్కు తనకు రెండు రోజుల రేషన్ దినుసులు సరఫరా చేసిపోయింది. స్కూలుకొచ్చిన పేదపిల్లల కుటుంబాలకు పంచటానికి గోధుమ బస్తాలు ఒక గదిలో పేర్చి ఉన్నాయి. ఏ ఉపద్రవం సంభవించినా నష్టపోయేది పేదలే. వచ్చిన వాళ్లందరికీ రోజూ ధాన్యం పంచాడు. గత మూడు రోజుల స్టాకు నిల్వ ఉంది. మంచు కాస్త తెరిపిచ్చింది గనక, తమ కోటా ఇవ్వమని ఈరోజు ఎవరో వస్తారు, మళ్లీ కోతల దాకా ఇదే ధాన్యంతో సరిపెట్టుకోవాలి. ఫ్రాన్సు నుంచి ఓడలు వస్తూనే ఉన్నాయి. ఆకలి చావులు ఉండకపోవచ్చు. కానీ పేదల మొహాల్లోని దైన్యాన్ని మరచిపోవడం కష్టం. ఇంతటి దుర్భర దారిద్య్రం మధ్య తను స్కూల్లో ఇంచుమించు సుఖంగా బతికినట్లే. సన్యాసి లాగ ఒంటరి జీవితం అయితేనేం.. శుభ్రమైన ఇల్లు. దారూ ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి.స్కూలు డాబా పైకెక్కి చూశాడు. ఆ ఇద్దరూ సమీపిస్తున్నారు. గుర్రం మీదున్న వాడు పోలీస్ కానిస్టేబుల్ బాల్డచ్చి. తాడుతో బంధించి ఒక అరబ్బువాణ్ణి లాక్కొస్తున్నాడు. దగ్గ్గరగా వచ్చేశారు.‘‘మూడు కిలోమీటర్లు రావడానికి గంటపట్టింది’’ అంటూ అరిచాడు బాల్డచ్చి.‘‘లోపలకి వచ్చి ఒళ్లు కాచుకోండి’’ అంటూ ఆహ్వానించాడు దారూ. కళ్లెం తీసుకుని గుర్రాన్ని వెనక కట్టేసి వచ్చి, ‘‘క్లాస్‌రూం కూడా హీట్ చేస్తాను ఇక్కడే కూర్చుందాం’’ అన్నాడు దారూ.బాల్డచ్చి చేతికి కట్టుకున్న తాడు విప్పి అరబ్బును తాత్కాలికంగా బంధ విముక్తుణ్ణి చేశాడు. ‘‘పక్కగదిలోకెళ్లు. నీకోసం పుదీనా టీ చేస్తాను’’ అన్నాడు దారూ. దారూ టీ తెచ్చేసరికే, బాల్డచ్చి పిల్లల డెస్కు మీదా, అరబ్బూ అతడి కాళ్ల దగ్గర కూర్చుని ఉన్నారు. అతడి చేతికున్న కట్లుచూస్తూ ‘‘కాసేపు విప్పొచ్చేమో!’’ అన్నాడు దారూ సందేహంగా. ‘‘ఆ.. ఇప్పుడేమీ భయం లేదు. ప్రయాణంలో మాత్రమే చేతులు కట్టెయ్యాలి’’ అన్నాడు బాల్డచ్చి. టీ గ్లాసు పక్కన పెట్టి దారూ కట్లు విప్పగానే మొదట రెండు చేతులూ రుద్దుకుని, టీ గ్లాసు పెదాలకు ఆనించుకున్నాడు అరబ్బు.‘‘ఇంతకూ ఎక్కడికి ప్రయాణం?’’ దారు అడిగాడు. ‘‘ఇక్కడికే’’ అన్నాడు బాల్డచ్చి. ‘‘స్కూలుకొచ్చే పిల్లలు మీలాగా కూడా ఉంటారన్నమాట. ఇంతకూ రాత్రి ఇక్కడే గడుపుతారా ఏమిటి?’’ అంటూ నవ్వాడు దారూ.‘‘లేదు. నేను కాసేపట్లో ఎల్ అమీర్ వెళ్లి పోతాను. ఈ అరబ్బును మీరు టింగిట్ వద్ద అప్పజెప్పాలి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి అధికారులు అక్కడికి వస్తారు’’. దారూకు ఈ కేసేమిటో అర్థం కాలేదు – ‘‘నాకేం సంబంధం?’’.‘‘నన్నేం చెయ్యమంటారు? అది పైనుంచి వచ్చిన ఆర్డర్’’ – ‘‘నేను టీచర్ని’’.‘అయితే ఏంటి? యుద్ధకాలంలో అందరూ అన్ని పనులూ చెయ్యాలి. నాకు వచ్చిన ఆర్డర్స్ గురించి చెప్పాను. శాంతిభద్రతల పరిస్థితులు మారుతున్నాయి. తిరుగుబాటు జరిగే అవకాశముందని సంకేతాలు వచ్చాయి..’’ఇదంతా నమ్మలేనట్టుగా చూశాడు దారూ.‘‘తొందర పడకు. అన్నీ నెమ్మదిగా అర్థం చేసుకో. గస్తీ తిరగటానికి ఎల్ అమీర్ వద్దకు డజను మందిమి మాత్రమే ఉన్నాం. నేను త్వరగా వెళ్లాలి. వీణ్ని నీకప్పజెప్పి వెంటనే తిరిగి రావాలని ఆర్డర్స్. అసలు ఇక్కడికెందుకు తెచ్చాననుకుంటున్నారు? ఊళ్లో కాస్త ఉద్రిక్తంగా ఉంది. బందీని విడిచిపెట్టాలని గోల చేస్తున్నారు. ఇక్కణ్నించి టింగిట్ ఇరవై కిలోమీటర్లే గదా. మీ వంటి వస్తాదు ఆ మాత్రం నడవలేడూ!’’.పెరట్లో గుర్రం సకిలించింది. కిటికీలోంచి చూశాడు దారూ. కాస్త వెలుగొచ్చింది. తర్వలో మంచు కరుగుతుంది. ‘‘ఏం చేశాడతడు? ఫ్రెంచివచ్చా?’’ ‘‘ఒక్క ముక్క కూడా రాదు. నెల రోజులుగా వీడికోసం గాలించాం. మిత్రులూ, బంధువులూ దాచిపెట్టారు. తన కజిన్‌ను చంపాడు’’‘‘ఇతడు మనకు శత్రువా?’’‘‘కాకపోవచ్చు. కానీ ఏమో ఎలా చెప్పగలం?’’‘‘ఎందుకు చంపాడు?’’‘‘కుటుంబ కలహం. ఒకడు మరొకడికి ధాన్యం బాకీ ఉన్నాడట. అసలు విషయమేమిటో స్పష్టంగా తెలియదు. గొర్రెల్ని కొక్కానికి వేళ్లాడదీస్తామే, దాంతో చంపాడు’’బాల్డచ్చి వైపు భయంగా చూశాడు అరబ్బు. దారూ అసహ్యంగా తలాడించాడు. ‘‘వెళ్లొస్తాను మరి’’ అంటూ బాల్డచ్చి లేచి, తాడు తీసుకుని అరబ్బువైపు నడిచాడు.‘‘ఎందుకది?’’‘‘మీ ఇష్టం. దగ్గిర రివాల్వరుందా?’’‘‘ఏదో ఒకటుందిలే’’– ‘‘ఎక్కడ?’’‘‘ట్రంకులో’’– ‘‘తీసి దగ్గిర పెట్టుకోవాలి’’‘‘భయపడాల్సిందేముంది?’’‘‘తిరుగుబాటే గనక జరిగితే ఎవరూ ఎవర్నీ రక్షించలేరు. ఆత్మరక్షణ ఒక్కటే మార్గం’’‘‘ఈ ఇల్లు కొండ మీదుందిగదా, వాళ్లు రావటం నాకు కనిపిస్తుందిలే’’ – ‘‘అది ఆత్మవిశ్వాసం కాదు. అతి నమ్మకం. నా దగ్గర రెండు రివాల్వర్లున్నాయి. ఒకటి తీసుకోండి’’ అన్నాడు బాల్డచ్చి. నల్లటి పెయింట్‌తో టేబుల్ మీద నిగనిగా మెరిసింది రివాల్వర్. ‘‘బాల్డచ్చీ, నా మాట విను. ఇతణ్ని చూస్తే నాకు అసహ్యమే. కానీ నా చేతుల్తో మళ్లీ పోలీసులకు మాత్రం అప్పగించను. యుద్ధం వస్తుందంటావా? అవసరమైతే నేనూ పోరాడుతాను. కానీ మనుషుల్ని పోలీసులకు పట్టివ్వడం పిరికిపంద లక్షణం’’‘‘నువ్వో మూర్ఖుడివి. మనుషుల్ని అదుపులో ఉంచటమే నేరమనుకుంటావు. కొందర్ని బంధించక తప్పదు. అందుకు మనం సిగ్గు పడాల్సిందేం లేదు’’‘‘నేను ఇతణ్ని ఎవరికీ అప్పగించే ప్రసక్తి లేదు’’‘‘దిసీజ్ ఏన్ ఆర్డర్. రిపీట్ చెయ్యమంటావా?’’‘‘నేను నీకు చెప్పిందాన్ని వాళ్లకు రిపీట్ చెయ్యి. మళ్లీ చెబుతున్నాను. ఇతణ్నెవరికీ అప్పగించను’’‘‘ఓకే, నేనెవరికీ ఏం చెప్పను. ఇతణ్ని నీకు హేండోపర్ చేశాను. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఆ తర్వాత నీ ఇష్టం’’‘‘అక్కర్లేదు. నువ్వు నాకప్పగించావని అవసరమైనప్పుడు వాంగ్మూలమిస్తాను. సరేనా?’’‘‘నీ నిజాయితీ గురించి సందేహం లేదు. కానీ సంతకం చెయ్యక తప్పదు. దటీజ్ ది రూల్’’ ‘‘ఇలా ఇవ్వు’’. దారూ సంతకం పెట్టిన రసీదు మడిచి జేబులో పెట్టుకున్నాడు బాల్డచ్చి. అరబ్బు వైపు చూసి గుమ్మం దాటాడు బాల్డచ్చి. ముందుకు వెళ్లినవాడు కాస్తా, సడెన్‌గా వెనక్కు వచ్చి, కిటికీలోంచి చూసి వెళ్లాడు. మంచులో అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు. గుర్రమెక్కి, కళ్లెం పట్టుకుని మరోసారి లోపలికి తొంగిచూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా కొండదిగి అదృశ్యమయ్యాడు.మంచం మీద పడుకుని, నిశ్శబ్దాన్ని వింటూ ఆలోచించాడు దారూ. యుద్ధం తర్వాత తానిక్కడికొచ్చిన కొత్తలో ఈ నిశ్శబ్దాన్ని భరించలేక గిలగిలా కొట్టుకున్న రోజులెన్నో! కొండ దిగువన, చిన్న గ్రామంలో ఏదైనా ఉద్యోగం కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. మైదానానికీ, కొండ ప్రాంతానికీ ఉన్న సరిహద్దు అయింది. ఎటు చూసినా రాళ్లూ రప్పలు తప్ప మనుషుల జాడే లేదు. అక్కడక్కడా నాగటిచాళ్లు కనిపించాయి. కానీ, ఆ దున్నినవాళ్లు పంటలకోసం కాక, ఇల్లు కట్టడానికి అవసరమైన రాళ్ల కోసమే ఇంత కష్టపడినట్టుంది. ఇళ్లలో జనపదాలు వెలిశాయి. ఎక్కడినుండో మనుషులు గుంపులు గుంపులుగా వచ్చారు. సంసారాలు చేశారు. పిల్లల్ని కన్నారు. ఒకర్నొకరు చంపుకున్నారు. వేలాది మైళ్లు వ్యాపించిన ఈ ఏడాదిలో అందరూ ఇసుక రేణువుల్లాంటివారే. తనైనా తన అదుపులో ఉన్న ఈ అతిథైనా! కానీ.. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడిన మనుషులు మరోచోట బతకగలరా? లేచి కూర్చున్నాడు దారూ. పక్కగదిలో ఏ కదలికా లేదు. ఇదే అదనుగా అతడు పారిపోతే తన సమస్య తీరుతుంది. తొంగి చూశాడు. అక్కడే పడుకున్నాడు అరబ్బు. ‘‘ఇటురా, ఆకలిగా ఉందా?’’ అంటూ పిలిచాడు దారూ.ఆ ఆహ్వానం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా గబుక్కున లేచాడు అరబ్బు. టేబుల్ మీద ఇద్దరికోసం పళ్లాలు అమర్చి పిండిలో నూనె కలిపి, రొట్టె చేసి, గ్యాస్ స్టవ్ వెలిగించాడు దారూ. జున్ను, గుడ్లు, ఖర్జూరాలు, పాలూ తెచ్చాడు. అరబ్బు ఇదంతా ఆసక్తిగా గమనించాడు. ఆమ్లెట్ వేసి, తన అతిథిని ‘రా’ అంటూ ఆహ్వానించాడు. మర్యాదగా ఉంటుందనుకున్నాడేమో, రివాల్వర్ తీసి డ్రాయర్లో పెట్టాడు – ‘‘తిను’’.‘‘మీరూ తినండి’’ అన్నాడు అరబ్బు.‘‘తర్వాత’’. భయంగా, అనుమానంగా చూస్తూ, ‘‘కేసు విచారించే జడ్జ్ మీరేనా?’’ అడిగాడు అరబ్బు. ‘‘లేదు. రేపటిదాకా నిన్నిక్కడ ఉంచుకోవాలి. అంతే’’.ఒక ఫోల్డింగ్ కాట్ వేసి, దానిమీద రెండు బ్లాంకెట్లు పరిచాడు దారూ. పడుకుంటే, అతడికి కాపలా కాయడం తప్ప యింక చెయ్యాల్సిందేమీ లేదు. ‘‘ఎందుకు చంపావు?’’ అనడిగాడు దారూ.అరబ్బు ఉలిక్కిపడ్డాడు. ‘‘అతడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటాడి చంపక తప్పలేదు. నన్నేంచేస్తారు?’’‘‘భయపడుతున్నావా?’’అరబ్బు మాట్లాడలేదు.‘‘చేసిన పనికి విచారిస్తున్నావా?’’అరబిక్‌లోనే అడిగినా ఆ మాట అర్థం కానట్టుగా చూశాడు.‘‘ఇక్కడ పడుకో’’కాసేపాగి, ‘‘రేపు నా కోసం పోలీసులొస్తారా?’’ అని అడిగాడు అరబ్బు.‘‘తెలియదు’’‘‘నా వెంట మీరు కూడా వస్తారా?’’‘‘ఎందుకు?’’‘‘రండి’’∙∙ అర్ధరాత్రి దాటింది. దారూకు నిద్రపట్టలేదు. అరబ్బు పక్కకు ఒదిగి పడుకున్నాడు. నిలకడగా ఉన్న ఊపిరిని బట్టి అతడు నిద్రపోతున్నాడని తెలిసింది. దారూకు కొత్తగా ఉంది. ఏడాదిగా ఈ గదిలో తను ఒంటరిగా పడుకున్నాడు. ఈనాడు ఒక అనుకోని అతిథి తోడుగా ఉన్నాడు. తనూ ఇక్కడివాడే. అంటే తమిద్దరూ సోదరుల్లాంటి వాళ్లు. కానీ... సౌభ్రాతృత్వ భావనకది సమయం కాదు. అరబ్బు కదిలాడు. ఊపిరి బిగపట్టాడు దారూ. నిశ్శబ్దంగా లేచాడు. తలుపుతీసి అడుగులో అడుగు వేసుకుంటూ నిద్రలో నడుస్తున్నట్లు బయటికెళ్లాడు అరబ్బు. ‘పారిపోతున్నట్టున్నాడు. పీడ వదిలింది’ అనుకున్నాడు దారూ. పెరట్లో నీళ్ల చప్పుడు వినిపించింది. మరి కాసేపటికి ఖైదీ లోపలికి వచ్చి మంచం మీద వాలాడు.కలకూ, వాస్తవానికీ తేడా తెలియని స్థితిలో ఉన్నాడు దారూ. మెలకువ వచ్చేసరికి తెల్లవారింది. అరబ్బు గాఢ నిద్రలో ఉన్నాడు. నోరు తెరుచుకుని ఉంది. కాఫీ తాగే టైమైంది. నెమ్మదిగా అతిథిని తట్టి లేపాడు. ఉలిక్కి పడినట్లుగా లేచాడు అరబ్బు.‘‘భయపడకు. లే’’.కేకు తిని, కాఫీ తాగారిద్దరూ. కుళాయి దగ్గర కాళ్లూ, చేతులూ కడుక్కున్నాడు అరబ్బు. ఆ తర్వాత బ్లాంకెట్లు తీసి, మంచం మడిచి గోడకు పెట్టాడు. ఎండలో మంచు మెరుస్తోంది. డాబాపైకెక్కి ఎడారిని పరిశీలించి చూశాడు దారూ. బాల్డచ్చికి కోపం వచ్చినట్టే ఉంది అనుకున్నాడు. అరబ్బు దగ్గుతున్నాడు. ఎంత ఆలోచించినా, తన ఖైదీ అంత మూర్ఖమైన నేరం ఎందుకు చేశాడో అంతుబట్టలేదు దారూకు. పైగా, అవకాశమిచ్చినా పారిపోడేం?కింద షెడ్డులో వంగి, వేళ్లతో పళ్లు తోముకుంటున్నాడు అరబ్బు. కిందికి దిగివచ్చి అతడు డ్రెస్సు వేసుకునే దాకా నిరీక్షించాడు దారూ. కాసిని రస్కులు, ఖర్జూరాలు, చక్కెర ఓ పాకెట్లో వేసుకుని తన అతిథిని తీసుకుని ‘పద’ అంటూ ముందుకు కదిలాడు.గంటసేపు నడిచి ఓ సున్నపురాయి పక్కన కూర్చున్నారిద్దరూ.ఎండ చిటపటలాడుతోంది. కరిగిన మంచు ఇట్టే ఆవిరైపోతోంది. కింద నేల రాయిలాగ గట్టిపడింది. కనుచూపుమేరలో మరో మనిషి జాడలేదు. ఒంటరిపక్షి ఆకాశంలో అరుస్తూ వలయాలు తిరిగింది. స్వచ్ఛమైన గాలిని గుండెలనిండా పీల్చుకున్నాడు దారూ. ఎంత అలవాటైనా, ఎడారిలో నడవడం ప్రతిసారీ ఒక వింత అనుభవమే. దక్షిణంగా మరో గంట నడిచారు.దూరంగా రాళ్లు గుట్టలు కనిపించాయి. వెంట తెచ్చిన ఖర్జూరాలు, బ్రెడ్డు, చక్కెర ప్యాకెట్టు ఇచ్చి ‘‘ఇంద, ఈ వెయ్యి ఫ్రాకులు కూడా తీసుకో, ఇలా నేరుగా రెండు గంటలు నడిస్తే టింగిట్ వస్తుంది. అక్కడ పోలీసులు నీ కోసం నిరీక్షిస్తున్నారు. వెళ్లు’’ అంటూ తన అతిథికి వీడ్కోలు చెప్పాడు దారూ. తిరిగి స్కూలు వైపు నడిచాడు దారూ. అరబ్బు కదలకుండా అక్కడే నిల్చున్నాడు. దిగులుగా తనవైపు చూస్తున్నాడు. గొంతులో ఏదో అడ్డు పడినట్లున్నది. మరోసారి వెనుతిరిగి చూశాడు. అరబ్బు కనిపించలేదు.నెమ్మదిగా కొండ ఎక్కి మరోసారి ఎడారినంతా గాలించి చూశాడు. దూరంగా కనిపించాడు అరబ్బు.దారూకు గుండె బరువెక్కింది. క్లాసురూంలో బోర్డు ముందర తలొంచుకుని నిల్చున్నాడు.ఫ్రెంచి నదులు మెలికలు తిరిగుతూ పరిగెత్తుతున్నాయి.అయితే అతను తిరిగి వచ్చేలోగా... ‘‘మా సోదరుణ్ని శత్రువులకు అప్పచెప్పావు. నిన్ను వదిలిపెట్టం’’ అంటూ బోర్డు మీద రాశారెవరో.ఇది తన మాతృభూమి. ఇక్కడే పుట్టిపెరిగిన తను ఇప్పుడు ఏకాకి. ఫ్రెంచి మూలం : ఆల్బర్ట్ కామూ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
పెట్రో షాక్‌తో బైక్ అమ్మి గుర్రం కొన్నాడు..
సాక్షి, ముంబయి : పెట్రోల్ ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతుంటే స్ధానిక పన్నులు అధికంగా వడ్డిస్తున్న మహారాష్ట్రలో పెట్రోల్ ధరలు మరింత భారమయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పెట్రోల్ బంకుల్లో తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ఇక పెట్రో భారాలను భరించలేని ఓ వ్యక్తి ఏకంగా బైక్‌ను అమ్మేసి గుర్రాన్ని కొనుగోలు చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. ముంబయికి 100 కిమీ దూరంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన పాలు విక్రయించే పాండురంగ్ తన బైక్‌ను రూ 22,000కు అమ్మేసి రూ 25,000కు గుర్రాన్ని కొనుగోలు చేశారు. ప్రతిరోజూ ఉదయం పాలు పోసేందుకు ఏడు కిలోమీటర్లు తిరిగే పాండురంగ్ పెట్రోల్ ధర రూ 80 దాటడంతో పెట్రోల్ కొనేందుకే అతనికి రోజుకు రూ 200 వెచ్చించాల్సి వస్తోంది. తన తండ్రి కూడా ఇదే వృత్తిలో ఉండేవాడని, అప్పట్లో ఏడు కిలోమీటర్లు కాలినడకనే తిరుగుతూ పాలు పోసేవారని చెప్పుకొచ్చాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ వృత్తిని తాను చేపట్టానని, వేగంగా పాలు సరఫరా చేసేందుకు బైక్‌ను వాడుతున్నానని చెప్పాడు. పెట్రోల్ ధరలను భరించలేకే తాను బైక్‌ను రూ 22,000కు అమ్మేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను గుర్రంపైనే ఇంటింటికీ తిరుగుతూ పాలు పోస్తున్నానని, బైక్‌తో పోలిస్తే గుర్రానికి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉందని, దీని బాగోగులు చూసేందుకు వారానికి కేవలం రూ 50 ఖర్చు చేస్తున్నానని చెప్పాడు. భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిని పోషించాల్సిన పాండురంగ్ గుర్రంపై పాలుపోస్తుండటంతో పెట్రోల్‌పై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గింది. పెట్రోల్ పంపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుడా పోయిందని చెబుతున్నాడు. ముంబయిలో లీటర్ పెట్రోల్ దేశంలోనే అత్యధికంగా రూ 85.29కు చేరింది. -
గుర్రమెక్కావా? అయితే చచ్చావే..
ఒకప్పుడు.. వాళ్లు వీధుల్లో నడిస్తే మట్టి మలినమవుతుందన్నారు.. అడుగులను చెరిపేసేందుకు వెనక తాటాకులు కట్టుకోమన్నారు.. ఉమ్మి నేలపైపడ్డా అరిష్టమేనని మూతికి ముంత తగిలించి తిరగమన్నారు.. వారి మేనిని సోకే గాలిని మళ్లించలేమనుకున్నారేమో.. ఊరుఊరునే తూర్పుకి తరలించేశారు.. కాలం మారిందని.. ఇప్పుడా పరిస్థితి లేదనుకుంటున్నారేమో.. దళితులపై దాష్టీకానికి తాజా తార్కాణం గుజరాత్లో వెలుగు చూసింది.. గుర్రమెక్కాడని.. పట్టుమని పాతికేళ్లయినా నిండని యువకుడిని పొట్టన బెట్టుకున్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని తంబి ఓ కుగ్రామం.. అక్కడ నివసించే ప్రదీప్ రాథోడ్ అనే యువకుడు.. చాలా ముచ్చటపడి.. తండ్రి చెవినిల్లు కట్టి మరీ ఓ గుర్రాన్ని కొనుక్కున్నాడు. అప్పుడప్పుడూ గుర్రమెక్కి సవారీకి వెళ్లడమూ ప్రదీప్‌కు ఇష్టమైన పని. ఇది కాస్తా.. అక్కడి రాజ్‌పూత్‌లకు కంటగింపుగా మారింది. అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గుర్రం దిగు, లేదా నీ కడుపులో బల్లేలు దిగుతాయన్నారు. ఆ ఊళ్లో వాళ్లే కాదు పక్క ఊళ్లలోని వాళ్లు కూడా బెదిరింపులకు దిగారు. నువ్వు గుర్రం ఊసెత్తొద్దని.. అయినా వింటేనా? నా గుర్రం.. నా ఇష్టం అన్నాడు ప్రదీప్. షేడెడ్ జీన్స్ వేసుకుని, కాలుమీద కాలేసుకుని, గుర్రం మీద దర్జాగా రాజులా కూర్చొని ఫొటోకి ఫోజు కూడా ఇచ్చాడు ఆత్మగౌరవం కలిగిన ఆ కుర్రాడు. అంతే అగ్రవర్ణాలకి కడుపులో కాలింది. ఒక రోజు.. ఠీవీగా ప్రదీప్‌ని ఎక్కించుకుని వెళ్లిన గుర్రం ఒంటరిగా తిరిగొచ్చింది. రాథోడ్ తండ్రి గుండెలు గుభేలుమన్నాయి. యజమాని ప్రదీప్ రాథోడ్‌ని చంపేశారు. ఈ ఘటన గత నెలాఖరున జరిగింది. ప్రదీప్ ఒక్కడే కాదు సుమా! గుజరాత్లో ఇలాంటి చావులు కొత్తకాదు. అమ్మాయిలపై అకృత్యాలు అంతకన్నా కొత్తకాదు. అక్కడ భూస్వాములైన క్షత్రియులు చెప్పిందే శాసనం. కాదూ కూడదంటే రాథోడ్లాగే తలెగరేసిన వారి తలలు తెగనరికేస్తారు. కేసులేవీ ఠాణాలకు ఎక్కనూ ఎక్కవు. ఇది అన్యాయమని ఎవరైనే ప్రశ్నిస్తే ‘అబ్బే ఆ కుర్రాడంత మంచోడేం కాదు. గతంలో ఎప్పుడో ఓ అమ్మాయి ముందు పిల్లిమొగ్గలు వేసిన ‘దుష్ట చరిత్ర’కూడా ఉంద’ని కాకమ్మ కబుర్లు చెప్పే ఘటికులు అక్కడి ఖాకీలు. -
ఆ మచ్చికంతా నీడలోనే
అదొక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఓ ధనికుడు. అతను ఖరీదైన ఓ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. ధనికుడు ఆ గుర్రాన్ని తనకున్న పచ్చికమైదానానికి తీసుకురమ్మని పనివాళ్ళను ఆదేశించాడు.ఆ తర్వాత ఆ పనివాళ్ళల్లో ఒకరిని వంతులవారీ దాని మీద ఎక్కి స్వారీ చేయమని చెప్పేవాడు.అయితే ఎవరు తన ముందుకు వచ్చినా ఆ గుర్రం తన ముందరి కాళ్ళను పైకెత్తి వారిని బెదరగొట్టి తరిమేసేది.ఎవరికీ లొంగేది కాదు.కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. ఆ పల్లెటూరుకి ఓ సూఫీ జ్ఞాని వచ్చాడు.ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న ధనికుడు ఆ జ్ఞానిని దర్శించుకున్నాడు. తాను కొన్న ఖరీదైన గుర్రం గురించి చెప్పాడు. అది మాట వినడం లేదని, మచ్చిక చేసుకునే మార్గం తెలియడం లేదని వాపోయాడు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో చెప్పవలసిందిగా కోరాడుధనికుడు చెప్పిన మాటలన్నీ విన్న సూఫీ జ్ఞాని సరేనని ఆ ధనికుడి ఇంటికి మరుసటి రోజు ఉదయమే వెళ్ళాడు.సూఫీ జ్ఞాని దగ్గరకు ఆ గుర్రాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. అది మేలుజాతి గుర్రమనీ, ఒక్కసారి మచ్చికవుతే చాలు అది సులువుగా దగ్గరవుతుందని, దాని తెలివితేటలు అపారమనీ జ్ఞానికి అర్థమైపోయింది. జ్ఞాని సమక్షంలో ఓ నౌకరు ఆ గుర్రం మీద ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఆ గుర్రం అతనిని అది ఎప్పటిలాగే ముందర కాళ్ళతో బెదిరించి తరిమేసింది.అది గమనించిన జ్ఞానికి ఓ ఆలోచన వచ్చింది.దాన్ని తూర్పు ముఖంగా చూస్తున్నట్టు నిలబెట్టమన్నారు జ్ఞాని.అలా నిలబెట్టిన తర్వాత ఓ నౌకరుని దాని మీదకు ఎక్కి కూర్చోమన్నారు. ఆ విధంగా చేసినప్పుడు ఆ గుర్రం ఏ మాత్రం తిరగబడలేదు. చక్కగా సహకరించింది.తన మీదకు ఎవరినీ ఎక్కించుకోవడానికి సహకరించని ఆ గుర్రం ఉదయం వేళల్లో తనకు వెనుకవైపు నుంచి వచ్చే సూర్యకిరణాలతో తన నీడా, తనపై ఎక్కడానికి ప్రయత్నించే వ్యక్తి నీడా భారీగా కనిపించడం వల్ల అది తెగ భయపడిపోయేది. ఈ విషయాన్ని గ్రహించిన జ్ఞాని తూర్పుముఖంగా దాన్ని నిలబెట్టమని చెప్పారు. ఇలా చేయడం వల్ల దాని నీడ దానికి వెనకాతలే పడడంతో దానికి మునుపటి భయం పోయింది. ఎవరు తన దగ్గరకు వచ్చినా ఏ మాత్రం తిరుగుబాటు చేయక అన్ని విధాలా సహకరించింది.ధనికుడికి ఆ గుర్రం మీద స్వారీ చేయాలన్న కోరికా తీరింది. జ్ఞానికి ధన్యవాదాలు తెలిపాడు. సమస్యెలా పరిష్కరించారని ధనికుడు అడగగా అంతా నీడలోనే ఉందని చెప్పి ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు. – యామిజాల జగదీశ్ -
కిరసనాయిలు కంపు
పంజాబీ మూలం : అమృతాప్రీతం అనువాదం: సుంకర కోటేశ్వరరావు బైట ఆడగుర్రం సకిలించింది. ఆ సకిలింతను గుర్తించిన గువేరి ఇంట్లోంచి పరుగున బైటికి వచ్చింది. ఆ గుర్రం తన పుట్టినింటి గ్రామం నుంచి వచ్చింది. ఆమె తన తలను దాని మెడపైన.. అది తన పుట్టింటి గుమ్మం అయినట్లు ఆనించింది.గువేరి తల్లిదండ్రులు చంబా గ్రామంలో ఉంటారు. ఎల్తైన కొండ ప్రాంతాన వున్న తన భర్త ఊరికి అది కొద్ది మైళ్ల దూరంలో ఉంది. అక్కడికెళ్లే రాస్తా వంపులు తిరిగి కొండ దిగువకు జారుతున్నట్లు దిగుడుగా ఉంటుంది. ఈ గుట్ట ప్రాంతం నుంచి చూస్తే సుదూరంగా ఆ రాస్తా అడుగున చంబా గ్రామం పడి వున్నట్లుగా కనిపిస్తుంది. గువేరికి ఎప్పుడైనా తన పుట్టింటిపైన మనసు మళ్లినప్పుడు తన భర్త మానెక్ని వెంటబెట్టుకుని ఈ గుట్ట ప్రాంతానికి వచ్చి ఎండ వెలుతురులో మినుకు మినుకుమంటూ కనిపించే చంబా గ్రామ ఇళ్లను చూసి తన మనసు నిండా గర్వాన్ని, వెలుగుని నింపుకుని యింటికి తిరిగి వెళ్తుంది. సంవత్సరానికొకసారి పంటలు ఇళ్లకు చేరిన తర్వాత కొద్దిరోజులు తల్లిదండ్రులతో గడపడానికి గువేరీని అనుమతించేవారు. ఆమెను చంబాకు తీసుకురావడానికి వాళ్లొక మనిషిని పంపుతారు. చంబా గ్రామం బైటి ప్రాంతాల కుర్రాళ్లను పెళ్లాడిన ఆమె స్నేహితురాళ్లిద్దరు కూడా అదే సమయంలో చంబాలోని తన ఇళ్లకు వస్తారు. వీళ్ల వార్షిక సమావేశాల కొరకు ఈ ఆడపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతిదినం ఎన్నెన్నోగంటలు వాళ్లవాళ్ల అనుభూతులు, సంతోషాలు, విచారాలూ మాట్లాడుకుంటూ గడుపుతారు. వాళ్లు కలిసి వీధులన్నీ తిరుగుతారు. ఆ సమయంలో అక్కడ పంటకోతల పండుగ జరుగుతుంది.అందుకొరకు ఆ ఆడపిల్లలు కొత్తబట్టలను సిద్ధం చేసుకుంటారు. తమమేలి ముసుగు వోణీలకు రంగులద్దించి గంజిపెట్టుకుని తళుకులీనేలా చేసుకుంటారు. చేతుల నిండుగా రంగురంగుల గాజులు వేయించుకుని, చెవులకు కొత్త జూకాలను ధరిస్తారు. గువేరి ఎప్పుడూ పంట కోతలకాలం ఎప్పుడా అని దినాలు లెక్కించుకునేది. ఆకురాలు కాలపు పవనాలు రుతుమేఘాల నుండి ఆకాశాన్ని విముక్తి పరచగానే ఆమె చంబాలోని తమ ఇంటికి దాపున ఉన్నట్లే చిరుభావన పొందేది. ఆమె తన దినచర్య.. పశువులకు మేతపెట్టడం, భర్త తల్లిదండ్రులకు వంట సిద్ధం చేయడం ఆ తర్వాత ఒకచోట చేరబడి పుట్టింటి నుండి తనకొరకు ఎన్ని దినాలకు మనిషి వస్తాడా.. అని లెక్కవేస్తూ ఉండటం...ఇప్పుడు తన వార్షిక సందర్శన సమయం వచ్చింది. గుర్రాన్ని ఆమె సంతోషంగా విశ్వాసంతో స్పర్శించింది. గుర్రంతో వచ్చిన తన పుట్టింటి సేవకుడు నాటూను మన్నన చేసింది. తర్వాతి రోజు ఊరు వెళ్లడానిగ్గాను అంతా సిద్ధం చేసింది. గువేరీలో పొంగుతున్న సంతోషాన్ని మాటలలో చెప్పటం కుదరదు. భావప్రకాశమానమైన ఆమె ముఖం చూస్తే చాలు.ఆమె భర్త మానెక్ కళ్లు మూసుకుని హుక్కా పీలుస్తున్నాడు. ‘‘చంబా ఉత్సవం రోజుకు నువ్వొస్తావుగదూ.. రావూ? కనీసం ఆ ఒక్క దినమైనా నువ్వువచ్చెయ్’’ బ్రతిమిలాడుతూ అడిగిందామె. మానెక్ సమాధానం చెప్పలేదు.‘‘సమాధానం చెప్పవేంది?’’ కొద్దిపాటి ధైర్యం తెచ్చుకుని పదునుగా అడిగింది...‘‘నీకొక విషయం చెప్పనా?’’ మళ్లీ అంది.‘‘నువ్వేం చెప్తావో నాకు తెలుసులే...’’ ‘సంవత్సరానికొక్కసారేగదా నేను నా పుట్టింటికి వెళ్లేది’ అని. అవును, క్రితం నిన్నెప్పుడూ ఆపలేదుగదా!’’‘‘మరి, ఈ ఏడాదెందుకని ఆపాలనుకుంటున్నావు?’’ గట్టిగా నిలదీసింది.‘‘ఈ ఒక్క సంవత్సరం...’’ బ్రతిమాలుతున్నట్లు అన్నాడు.‘‘మీ అమ్మగారి అభ్యంతరమేమీలేదు. మరి నువ్వెందుకు అడ్డుకుంటున్నావు?’’ గువేరీ చిన్న పిల్లలా మంకుపట్టుతో అడిగింది.‘‘మా అమ్మ...’’ మానెక్ పూర్తిగా చెప్పలేక ఆగాడు.బహుకాలం ఎదురుచూసిన ఆ ఉదయం... పొద్దుపొడవకముందే పెందలకడే తయారయింది. తనకు సంతానం లేకపోవడం ఒక సౌలభ్యమైంది. ఉంటే వాళ్లను తనతో వెంటబెట్టుకునేనా వెళ్లాలి. లేదంటే తన భర్త తల్లిదండ్రుల వద్దనన్నా వదలాలి. నాటూ మానెక్ తల్లిదండ్రుల వద్ద సెలవు పుచ్చుకుని గుర్రంపై జీనువేసి సిద్ధం చేశాడు. వాళ్లు ఆమె తలను స్పర్శించి దీవించారు.‘‘నేను నీతో కొంత దూరం వస్తాను’’ అన్నాడు మానెక్. గువేరి అందుకు సంతోషించింది. ఆమె తన దుపట్టా చాటున అతని పిల్లన గ్రోవిని దాచింది. ఖజియార్ గ్రామం తర్వాత రాస్తా నిట్టనిలువుగా చంబావైపు కిందికి దిగుతుంది. గువేరి అక్కడ తను దాచితెచ్చిన మురళిని బైటికి తీసి మానెక్ చేతికిచ్చింది. అతనిచేతిని తన చేతిలోకి తీసుకుంటూ ‘‘ఇప్పుడు వాయించు మురళిని’’ అంటూ అడిగింది. కానీ మానెక్ ఆలోచనలనే కోల్పోయి ఆమె కోర్కెను లక్ష్యపెట్టలేదు.‘‘నువ్వెందుకని మురళిని వాయించవు?’’ మంచిగా ఒప్పించాలనే ధోరణిలో అడిగింది. మానెక్ ఆమెవంక దీనంగా చూస్తూ మురళిని తన పెదవులకు చేర్చి ఒక చిత్రమైన వేదనామయ దుఃఖస్వరాన్ని వినిపించాడు. ఇక వాయించలేనన్నట్లు దానిని తిరిగి ఆమెకు ఇస్తూ ‘‘గువేరీ! నువ్వు వెళ్లొద్దు. నేను నిన్ను మళ్లీ అడుగుతున్నా ఈసారికి నువ్వు వెళ్లొద్దు.’’ అర్థిస్తూ అడిగాడు.‘‘ఎందుకని?’’ అడిగిందామె. తిరిగి అంది... ‘‘చూడూ.. నువ్వు ఉత్సవం రోజుకు అక్కడకు వచ్చెయ్. మనిద్దరం కలిసి వచ్చేద్దాం. నేను నీకు మాటిస్తున్నా. నేనక్కడనే ఆగిపోను.’’మానెక్ మళ్లీ అడగలేదామెను. వాళ్లు దారిపక్కన ఆగారు. జంటకు ఏకాంతం కల్పించాలని నాటూ గుర్రాన్ని కొద్ది అడుగుల దూరం అవతలికి తీసుకెళ్లాడు.మానెక్ మనసులో ఏవో కదలికలు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున తనూ తన మిత్రులు చంబాలో జరిగే పంటకోతల ఉత్సవానికని ఇదే రాస్తాపై ఇటువైపు వచ్చారు. ఆ ఉత్సవంలోనే మానెక్ తొలిసారి గువేరీని చూశాడు. ఇద్దరూ ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత మానెక్ గువేరీని ఒంటరిగా కలవడానికి వచ్చేవాడు. అతనామె చేతిని అందిపుచ్చుకొని ‘‘బాగా పొలుపోసుకుని ఇంకా పక్వానికి రాని మొక్కజొన్న కండెలా ఉన్నావు.’’ అని అనడం ఇంకా గుర్తే. సమాధానంగా ఆమె ‘కోతకురాని కండెలకోసం పశువులు ఎగబడతాయి. మనుషులు వాటిని కాల్చుకుని తినడానికి ఇష్టపడతారు’ చివుక్కున చేతిని విడిపించుకుంటూ అంది. ‘నన్ను ఇష్టపడితే నా చేయిపట్టడానికి వెళ్లి మా నాన్ననడుగు’ అని కూడా చెప్పింది.పెళ్లికి ముందు పెళ్లి కొడుకు తరపు పెద్దలు వచ్చి కన్యాశుల్కం నిశ్చయపరచుకోవటం సంప్రదాయం. గువేరి తండ్రి కన్యాశుల్కం ఎంత కోరబోతాడోననే జంకుతో మానెక్ నరాల కంపనతో ఉన్నాడు. కానీ ఆమె తండ్రి ఉన్నవాడు, పట్టణ ప్రాంతాలలో మసలిన వాడూ అవటం వలన ఆయన తన కుమార్తెకు డబ్బు పుచ్చుకోకూడదని ఒట్టుపెట్టుకుని ఉన్నాడు. అయితే ఆమెనో మంచి కుటుంబంలోని యోగ్యుడైన యువకునికి ఇవ్వాలనుకున్నాడు. మానెక్లోని లక్షణాలకు సమాధానపడి నిర్ణయించుకున్నాడు. వెనువెంటనే గువేరీ మానెక్ల వివాహం జరిగింది. గువేరి తన చేతితో అతని భుజాన్ని తట్టడంతో మానెక్ పాత జ్ఞాపకాల నుండి బైటకివచ్చాడు. ‘‘ఏమిటి అంతటి దీర్ఘాలోచనలు?’’ భర్తను ఆటపట్టించాలని అడిగింది. అతని నుండి సమాధానం లేదు.అసహనంతో గుర్రం చేసిన సకిలింతతో ప్రయాణం గుర్తుకు వచ్చి గువేరి లేచింది. మౌనంగా ఉన్న అతన్ని చూస్తూ ‘‘ఇక్కడికి రెండు మైళ్లదూరంలో గందెనపూల అడివి ఉందట నీకు తెలుసా? ఎవరైనా ఆ అడివిగుండా నడిస్తే వాళ్లకి చెముడు ప్రాప్తిస్తుందట’’ అంది.‘‘అవును.’’‘‘నాకనిపిస్తుంది. నువ్వెప్పుడో ఆ అడివిగుండా నడిచివుంటావేమోనని.. నేనేదడిగినా నువ్వు వినిపించుకోవడంలేదు మరి.’’‘‘నిజమే గువేరీ! నువ్వేం చెప్పినా నేను వినలేకపోతున్నాను’’ ఒక దీర్ఘనిట్టూర్పువిడిచి సమాధానంగా అన్నాడు మానెక్.ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కానీ, ఒకరికొకరు అర్థంకావడం లేదు. ‘‘సరే ఇకనేను బయల్దేర్తాను. ఇంటికి వెళ్లు. చాలాదూరం వచ్చావు’’ సౌమ్యంగా అంది గువేరి.‘‘నువ్వింత దూరమూ నడిచావు. ఇక గుర్రం ఎక్కడం మంచిది.’’‘‘ఇదిగో... నీ మురళి, తీసుకో...!’’‘‘దాన్ని నీతోనే పట్టుకెళ్లు’’‘‘మరి ఉత్సవం నాడు వచ్చి దాన్ని వాయిస్తావా?’’ చిరునవ్వుతో అడిగింది. ఆమె కళ్లలో వెలుగులు. చంబావైపు కదిలింది. మానెక్ ఇంటికి తిరిగివెళ్లాడు.ఇంట్లోకి ప్రవేశిస్తూనే నిస్పృహతో మంచంపైన కూలబడ్డాడు.‘‘చాలాసేపు నడిచినట్లున్నావు. పూర్తిగా చంబా వరకూ వెళ్లావా?’’ పెద్ద కంఠంతో అడిగింది తల్లి.‘‘పూర్తిగా కాదులే, గుట్టపై వరకూ మాత్రం వెళ్లా’’ మానెక్ స్వరం బరువుగా ఉంది. ‘‘ముసలమ్మలా అలా కాకి మూలుగుడెందుకు? మగవాడిలా ఉండు’’ క్రూరంగా ఉంది తల్లి.‘‘నువ్వూ ఆడదానివి. ఒక మార్పునాశించే వాళ్లలాగా నువ్వెందుకని ఏడవవు?’’ అంటూ ఒక గట్టి ఎదురు సమాధానం చెబ్దామనుకున్నాడు మానెక్, కానీ మూగగా ఉండిపోయాడు. తల్లి పట్ల, సంప్రదాయంపట్ల విధేయత కలిగిన మానెక్ శరీరం నూతన యువతిపట్ల ప్రతిస్పందించింది. కానీ, అంతర్గతంగా అతని ఆత్మ చచ్చిపోయింది. ఒక పొద్దుటి పూట మానెక్ పొగతాగుతూ కూర్చుని ఉన్న సమయంలో తన పాతమిత్రుడొకరు అటుగా పోతూండటం గమనించి కేకేశాడు.‘‘ఏయ్ భవానీ! పొద్దున్నే ఇంత పెందరాళే ఎక్కడికి వెళ్తున్నావు?’’భవానీ ఆగాడు. అతని భుజాన చిన్న మూటవుంది. ‘‘అంత విశేషంగా ఎక్కడికీ లేదులే!’’ తప్పించుకునే ధోరణిలో బదులిచ్చాడు.‘‘సరే, ఏదోపని మీద ఎక్కడికో వెళ్తున్నావులే కానీ, పొగతాగుతావా?’’ కేకేసి అడిగాడు మానెక్.భవానీ వచ్చి పక్కనే కూర్చున్నాడు. ‘‘నేను చంబా ఉత్సవానికి వెళ్తున్నా’’ చివరికి చెప్పాడు.భవానీ కబురు మానెక్ గుండెలో ముల్లులా గుచ్చుకుంది. ‘‘ఉత్సవం ఈరోజేనా?’’ అడిగాడు.‘‘ప్రతి సంవత్సరం ఇదే రోజున గదా?’’ భవానీ పొడిగా సమాధానం ఇచ్చాడు. ‘‘ఏడేళ్ల క్రితం మనమంతా ఒకటిగా కలిసి వెళ్లి పాల్గొన్నాంగదా! నీకు గుర్తులేదా?’’ భవానీ ఆపైన ఏమీ అనలేదు. కానీ తననతనేమైనా తప్పు పడతాడేమోననే ఆలోచన కలిగి కించపడ్డాడు. భవానీ తన మూటనందుకున్నాడు. ఆ మూటలోంచి అతని పిల్లనగ్రోవి పైకి కనిపిస్తోంది. మానెక్ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు భవానీ. అతను కనిపించినంత దూరం మానెక్ ఆ మురళిపైననే చూపును నిలిపాడు.తర్వాతి రోజు పొద్దువాలిన వేళ మానెక్ పొలంలో వుండగా తిరిగివస్తున్న భవానీని గమనించి బుద్ధిపూర్వకంగా ముఖం వేరేవైపుకు తిప్పుకున్నాడు మానెక్. భవానీతో మాట్లాడ్డానికిగానీ, ఉత్సవం విషయాలు తెలుసుకోవడానికి గానీ అతనికి ఇష్టంలేదు. అయితే భవానీ చుట్టూ తిరిగి, నేరుగా అతని వద్దకే వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. వెలిగిఆరిపోయిన మసిబొగ్గులా విషాదంగా ఉంది అతని ముఖం.‘‘గువేరి చనిపోయింది’’ అన్నాడు. అతని స్వరం సాధారణంగానే ఉంది.‘‘ఏ....మి...టీ..?’’‘‘నీ రెండో పెళ్లి గురించి వినగానే ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించేసుకుంది.’’మానెక్ వేదనతో మూగబోయాడు. తన శరీరమే కాలిపోతున్న అనుభూతితో అలాగే చూస్తూ ఉండిపోయాడు. రోజులు చెల్లిపోతున్నాయి. మానెక్ పొలాలవైపు వెళ్లడానికి అలవడ్డాడు. భోజనం ఎవరైనా పెట్టినప్పుడు తింటాడు. జీవంలేని వాడిలా తయారయ్యాడు. ముఖంలో ఏ భావాలు లేవు. కళ్లలో వెలుగులు లేవు.అతని రెండవ భార్య ‘‘నేనాయన భార్యగాలేను, ఎవరో దారినపోయే దాన్ని తెచ్చిపెట్టుకున్నట్లుంది’’ అంటూ మొరపెట్టుకునేది. అయితే త్వరలోనే ఆమె గర్భవతైంది. తన కోడల్ని చూసుకుని మానెక్ తల్లి ఎంతో సంతోషపడిపోయింది. ఈ విషయం మానెక్తో చెప్పింది. అతను అయోమయంగా చూశాడు. అతని చూపులలో జీవంలేదు.అతని తల్లి కోడలితో కొద్దిరోజులు భర్త పరిస్థితిని భరించమని ధైర్యం చెప్పింది. బిడ్డపుట్టిన తర్వాత అతని ఒడిలో పెడితే తానే మారతాడని ఆమె భరోసాగా అనేది. మానెక్ భార్య మగబిడ్డను కన్నది. మానెక్ తల్లి ఉప్పొంగిపోతూ బిడ్డకు స్నానం చేయించి మంచి బట్టలువేసి ఎత్తుకెళ్లి మానెక్ ఒడిలో ఉంచింది.ఒడిలోని బిడ్డవైపు తేరిపారజూశాడు. చాలాసేపు అలాగే రెప్పవేయకుండా చూశాడు. ఎప్పటిలానే అతని ముఖంలోని ఏ భావాలూ లేవుగానీ, హఠాత్తుగా వెలుగులు ఇంకిన అతని కళ్లు భీతితో పెద్దవయ్యాయి. ఒక్కసారిగా భయంతో పెద్దగా కేకపెట్టాడు.మానసిక అస్థిరతతో స్మృతిని కోల్పోయిన వాడిలా ‘‘వీణ్ని తీసుకెళ్లిపో! కిరసనాయిలు కంపుగొడుతున్నాడు. తీసుకెళ్లిపో వీణ్ని!’’ అంటూ కేకలు పెట్టాడు. -
రథమెక్కిన పెళ్లి కూతురు...!
జైపూర్: సాధారణంగా వివాహాల్లో పెళ్లి కొడుకు గుర్రం లేదా గుర్రపు బగ్గీపై ఊరేగుతాడు. అందుకు పూర్తి విరుద్ధంగా రాజస్తాన్‌లోని ఝుంఝునూ జిల్లా చిరావా పట్టణంలో పెళ్లి ‘బారాత్’ (ఊరేగింపు)ను తలపాగాతో గుర్రపు బండిపై కూర్చున్న పెళ్లికూతురు ముందుకు నడిపింది. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎందులోనూ తక్కువకాదని తెలిపేందుకే ఈ బారాత్‌ను సాధనంగా ఎంచుకున్నట్లు పెళ్లి కుమార్తె గార్గీ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా జైపూర్ చుట్టుపక్కలా 150 కి.మీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు ఆమె వెల్లడించారు. -
పాత స్నేహితుడితో చరణ్ వీకెండ్
-
చివరి రోజుల్లో.. మరచిపోలేని సర్ ప్రైజ్
బ్రాంటన్ (యూకే) : వారసత్వంగా వచ్చిన గుర్రాల పెంపకం అంటే యూకేలోని బ్రాంటన్కు చెందిన పాట్రిక్ సాండర్స్(87)కి మక్కువ ఎక్కువ. తన జీవన విధానంలోనే గుర్రాలు కూడా ఓ భాగంగా అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా గుర్రాల స్వారీని ఎంతో మందికి నేర్పించాడు. అయితే జీవిత చరమాంక దశలో నార్త్ దేవాన్ హాస్పయిస్ కేర్(మరణానికి అంచున ఉన్న రోగులను అక్కున చేర్చుకుని సేవలందించే సంస్థ)లో చేరాడు. అక్కడ ఉన్నన్ని రోజులు నర్సులకు తనకు గుర్రాలపై ఉన్న ఇష్టం గురించి, వాటికి ఆహారాన్ని అందించడం దగ్గరనుంచి స్వారీ చేయడం వరకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. దీంతో అక్కడి సిబ్బంది పాట్రిక్కి అతని చివరి రోజుల్లో మరచిపోలేని సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ గుర్రపుశాలను సంప్రదించి విక్టర్ అనే గుర్రాన్ని పాట్రిక్ కలిసేలా ఏర్పాట్లు చేశారు. గుర్రాన్ని తీసుకువచ్చిన రోజు పాట్రిక్ ఆరోగ్యం పూర్తిగా క్షిణించి, బెడ్ పై నుంచి కూడా అడుగు కిందపెట్టలేక పోయాడు. దీంతో అక్కడి స్టాఫ్ ఎలాగైనా పాట్రిక్కి చివరి రోజుల్లో అతని కోరిక నెరవేర్చాలని ఏకంగా బెడ్నే బయటకు తీసుకు వచ్చారు. 'గుర్రాలపై పాట్రిక్‌కు ఉన్న ప్రేమ ఆయన మాటల్లో చాలా స్పష్టంగా తెలిసేది. అతని జీవితంలో గుర్రాల పాత్ర చాలా ఎక్కువ. అతని కోసం గుర్రాన్ని తీసుకువచ్చినప్పుడు పాట్రిక్ కళ్లల్లో కనిపించిన ఆనందాన్ని ఎప్పటికీ మరచిపోలేను. రోగుల జీవితంలో మరిన్ని రోజులనైతే కలపలేము, కానీ జీవిత చరమాంక దశలో మిగిలిన రోజులను ఆనందంతో నింపడానికి మా వంతు ప్రయత్నిస్తాము' అని కేర్‌లో పని చేస్తున్న నర్స్ కాథీ వతిహామ్ పేర్కొన్నారు. పాట్రిక్ బెడ్పైనుంచే గుర్రాన్ని చూసి పట్టలేని సంతోషంతో సేపులు, క్యారెట్, పోలో మింట్లను తన చేతులతో ప్రేమగా తినిపించాడు. ఇది జరిగిన మూడు రోజులకే పాట్రిక్ మృతి చెందాడు. 'గుర్రాలతో మా కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మా తండ్రి దగ్గరికి గుర్రాన్ని తీసుకువస్తున్నారని తెలిసినప్పడు, బాల్కనీలో నుంచి గుర్రాన్ని చూపిస్తారేమోనని అనుకున్నా. కానీ, మా నాన్న చివరి రోజుల్లో అంత దగ్గర నుంచి గుర్రానికి ఆహారం పెట్టించడం నేను ఎప్పటికీ మరచిపోలేను. హాస్పయిస్ కేర్ సభ్యులు మా నాన్నకి అంత మంచి అనుభూతులని అందిస్తారని అనుకోలేదు. మా నాన్న చివరి రోజుల్లో ఆయనకు ఎంతో ఇష్టమైన గుర్రాన్ని తీసుకువచ్చి ఎనలేని ఆనందాన్నిచ్చారు. ఆరోజు మా తండ్రికి ఎంతో స్పెషల్' అని పాట్రిక్ కూతురు జేన్ అన్నారు. -
కారులోకి దూసుకొచ్చిన అశ్వం
జైపూర్: సాధారణంగా రోడ్డు ప్రమాదాలు కార్లు, ఆటోలు, బస్సుల వంటివి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నప్పుడో, లేదా అవి మనుషులపైకి వచ్చినప్పుడో జరుగుతుంటాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో మాత్రం ఓ వింత రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్రం రోడ్డుపై వెళ్తున్న కారు అద్దం పగులగొట్టుకుని అందులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుర్రంతోపాటు కారు డ్రైవర్‌కూ గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం రోడ్డుపై వెళ్తుండగా ఆ గుర్రానికి ఏమైందో ఏమోగానీ ఉన్నట్టుండి ఎదురుగా వస్తున్న కారుపైకి దూకింది. ఓ వైపు ఎండ వేడిమి, మరోవైపు రోడ్డుపై వాహనాలు చేసే శబ్దాల వల్ల గుర్రానికి చిర్రెత్తుకొచ్చి కారులోకి దూకి ఉంటుందని భావిస్తున్నారు. అశ్వం కారులోనే ఇరుక్కుపోగా స్థానికులు, అటవీశాఖ అధికారులు కలిసి దానిని రక్షించారు. -
అశ్వంపై అర్ధనారీశ్వరుడు
శ్రీకాళహస్తి: కొత్త పెళ్లికొడుకైన శ్రీకాళహస్తీశ్వరస్వామి మంగళవారం రాత్రి అశ్వవాహనంపై పట్టణంలో విహారించారు. నూతన వధువైన జ్ఞానప్రసూనాంబ సింహ వాహనంపై భకు్తలకు దర్శనమిచ్చారు. కైలాసగిరి ప్రదక్షిణ సందర్భం గా ఉదయం వెళ్లిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూరు్తలు తిరిగి సాయంత్రానికి పట్టణ పొలి మేర్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భకు్తలు పెద్ద ఎతు్తన ఎదురెళ్లి వారికి స్వాగతం పలి కారు. అనంతరం స్వామివారు అశ్వవాహనం పై అధిరోహించారు. ఇక అమ్మవారు సింహవాహనంపై ఆశీనులయా్యరు. శివనామస్మరణలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతుల్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, సభ్యులు, శాఫ్ చైర్మన్ పీఆర్ మోహన్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
ఆడికారు ధర కంటే ఈ గుర్రమే ఎక్కువ
బైకులు, కార్లు, విమానాలు వచ్చాక నేటి ఆధునిక సాంకేతికయుగంలో గుర్రాల వాడకం క్రమంగా తగ్గిపోయి ఉండొచ్చు కానీ హరియాణలోని ఓ స్వచ్ఛమైన మేలి జాతి గుర్రం ‘సుల్తాన్’ ఆడి కారు కంటే అధిక ధర పలికింది. ఈ గుర్రం కోసం కొందరు ఏకంగా 51 లక్షల రూపాయలు ఇస్తామని యజమాని గుర్వీందర్ సింగ్‌కు ఆఫర్ చేశారు. సుల్తాన్‌ను సొంత కొడుకులా భావించే యజమాని ఈ ఆఫర్‌ను తిరస్కరించాడు. 41 లక్షల రూపాయలు పెడితే ఆడి ఏ 4 కారు వస్తుంది. అయితే ఆడి కారు కంటే గుర్రమే తనకు ప్రాణమని గుర్వీందర్ చెబుతున్నాడు. హరియాణాలోని కర్నల్ జిల్లాలో డబ్రీ అనే గ్రామంలో నుక్రా జాతికి చెందిన ఈ తెల్లటి గుర్రం అందర్నీ ఆకర్షిస్తోంది. పానిపట్‌లో జరిగిన ఆల్ ఇండియా చాంపియన్ పోటీల్లో ఈ గుర్రం విజేతగా నిలిచింది. 2012లో కూడా జాతీయ చాంపియన్‌గా నిలిచింది. కర్నల్ జిల్లా సహా ఎక్కడ గుర్రపు పందేలు జరిగినా సుల్తాన్‌దే విజయం. 15 చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచింది. సుల్తాన్ చూసి డబ్రీ గ్రామస్తులు గర్వంగా భావిస్తున్నారు. ఈ గుర్రం సంరక్షణ బాధ్యతలు చూడటానికి గుర్వీందర్ ఓ వ్యక్తిని నియమించాడు.ఈ గుర్రం కోసం ప్రతి నెలా లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సుల్తాన్ సాధారణ ఆహారంతో పాటు రోజుకు ఐదు లీటర్ల ఆవు పాలు, 100 గ్రాముల నెయి తీసుకుంటుంది. అంతర్జాతీయ పోటీల్లో సుల్తాన్ పాల్గొనేందుకు గుర్వీందర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. -
ఇకపై శునకాలు, గుర్రాలకు సైనిక పతకాలు!
న్యూఢిల్లీ: సైనికులకు శౌర్య పతకాలు ఇచ్చినట్టే తొలిసారిగా కుక్కలు , గుర్రాలకు కూడా పతకాలు ఇవ్వనున్నారు. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) తన 55వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని గుర్రాలకు ‘యానిమల్ ట్రాన్స్పోర్ట్’, కుక్కలకు ‘కే9 (కెనైన్)’ అనే పతకాలను ప్రవేశపెడుతోంది. ‘థండర్ బోల్ట్’ అనే గుర్రం, ‘సోఫియా’ అనే కుక్క ఈ తొలి అవార్డులను నోయిడాలో అందుకోనున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణంలో సైన్యంతోపాటు ఉండి, ఇవి ఎనలేని సేవలను అందించాయి. వీటికోసం పతకాలను ఐటీబీపీయే ప్రత్యేకంగా రూపొందించి, ముద్రించింది. -
తొందరపాటు
పురానీతి కశ్యపప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ అత్యంత పొడవుగా, బలమైన దేహం కలిగిన వెయ్యిమంది పుత్రులను, తేజోవంతమైన శరీరంతో అత్యంత చురుకయిన ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంటారు. దాంతో కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కొంతకాలానికి కద్రువకు ఆదిశేషుడు, కర్కోటకుడు, వాసుకి మొదలైన పొడవాటి శరీరం గల వెయ్యిసర్పాలు పుడతాయి. వినత కు మాత్రం ఇంకా పుట్టరు. దాంతో తొందరపడి ఒక అండాన్ని పగులకొడుతుంది. ఆ అండం నుంచి కాళ్లులేకుండా, మొండెం మాత్రమే ఉన్న తేజోరూపుడు పుడతాడు. అతడు పుడుతూనే ‘‘నువ్వు సవతిని చూసి కుళ్లుపడి, గుడ్డును పగలగొట్టి నా అవిటి జన్మకు కారకురాలైనావు కాబట్టి నీ సవతికే దాసీగా ఉంటావు’’ అని శపిస్తాడు. తన తప్పిదానికి కుమిలిపోతున్న తల్లితో బాధపడకు. ‘‘కనీసం రెండో అండాన్నైనా జాగ్రత్తగా ఉంచు. అందులోనుంచి జన్మించినవాడు నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు’’ అని చెప్పి, సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి సారథిగా వెళ్లిపోతాడు. అతడే మాతలి. సూర్యుని రథసారథి. అయితే తొడలు లేవు కాబట్టి అనూరుడుగానే సుపరిచితుడయ్యాడు. ఇది ఇట్లా ఉండగా వినత, కద్రువలు ఒక రోజు సముద్రతీరానికి విహారానికి వెళ్తారు. వారికి అక్కడ ఇంద్రుని రథాన్ని లాగే ఉచ్ఛైశ్రవం అనే గుర్రం కనిపిస్తుంది. దాన్ని చూపిస్తూ కద్రువ వినతతో ‘‘చూడు, ఆ గుర్రం ఎంతో తెల్లగా ఉంది కానీ, దాని తోక మాత్రం నల్లగా ఉంది’’ అంటుంది. ఆపాదమస్తకం గుర్రం తెల్లగా ఉండటాన్ని చూసిన వినత ‘‘లేదక్కా, గుర్రం తోక కూడా పాలలా తెల్లగానే ఉంది కదా’’ అంటుంది. ఆ విషయంలో ఇద్దరి మధ్యా వాదులాట జరుగుతుంది. ఆ పూట ఇక చీకటి పడింది కాబట్టి, మరునాడు వచ్చి, ఆ గుర్రాన్ని చూసి, దాని తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను. నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని పందెం వేస్తుంది కద్రువ. అందుకు అంగీకరిస్తుంది వినత. ఆ రాత్రి కద్రువ తన కుమారులను పిలిచి, మీలో ఎవరైనా వెళ్లి ఉచ్ఛైశ్రవం తోకకు చుట్టుకుని, దానిని నల్లగా కనిపించేట్లు చేయండి అని అడుగుతుంది. అందుకు కర్కోటకుడనే నాగు తప్ప మిగిలిన ఎవరూ అంగీకరించరు. దాంతో కోపగించిన కద్రువ తల్లిమాట వినలేదు కాబట్టి మీరందరూ పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి చస్తారని శపిస్తుంది. కర్కోటకుడు వెళ్లి గుర్రం తోకను చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తాడు. పందెం ప్రకారం వినత కద్రువకు దాస్యం చేస్తుంటుంది. కొంతకాలానికి రెండవ అండం పగిలి, అందులోనుంచి అత్యంత పరాక్రమవంతుడైన గరుడుడు పుడతాడు. అతణ్ణి చూసిన కద్రువ ‘‘నువ్వు నాకు దాసీవి కాబట్టి నీకుమారుడు కూడా మాకు దాసుడే’’ అవుతావు అని చెప్పి, అతని చేత చాకిరీ చేయించుకుంటుంది. కద్రువ కుమారులైన సర్పాలను తన వీపుమీద ఎక్కించుకుని రోజూ వినువీధికి వ్యాహ్యాళికి తీసుకెళ్లడం గరుత్మంతుడి విధుల్లో ఒకటి. ఓ రోజున అలా గరుడుడు సూర్యమండలం దాకా వెళ్లడంతో సర్పాలన్నీ నల్లగా మాడిపోతాయి. దాంతో కోపించిన పెద్దమ్మ గరుత్మంతుణ్ణి తిడుతుంది. మనస్తాపానికి గురైన గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విడిపించాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు తల్లీకొడుకులు బాగా ఆలోచించుకుని అసాధ్యమైన కార్యం కాబట్టి దేవలోకం నుంచి అమృతం తెచ్చిపెట్టమని అడుగుతారు. గరుత్మంతుడు ఎట్లాగో కష్టపడి అమృతాన్ని తీసుకొచ్చి తల్లిని దాస్య విముక్తురాలిని చేసి, తానూ దాస్యం నుంచి బయటపడతాడు. అయితే అమృతం తాగితే నాగులకు అమరత్వం సిద్ధిస్తుందన్న భయంతో ఇంద్రుడు ఆ అమృతాన్ని వాటికి దక్కకుండా చేయడం వేరే కథ. గరుత్మంతుడి వేగానికి ముచ్చటపడిన విష్ణుమూర్తి అతణ్ణి తన వాహనంగా స్వీకరిస్తాడు. వినత కుమారుడు కాబట్టి అతడే వైనతేయుడుగా కూడా ప్రఖ్యాతి చెందుతాడు. ఇక్కడ మనం గ్రహించలసినదేమంటే మత్సరం అంటే కుళ్లుబోతుతనం, తొందరపాటు తనం వల్లే కదా, వినత, ఆమె కుమారుడు అంత కష్టపడవలసి వచ్చింది! అందుకే ఆ రెండు అవలక్షణాలనూ వదిలిపెట్టాలని చెబుతారు పెద్దలు. - డి.వి.ఆర్. -
రోడ్డు ప్రమాదంలో గుర్రం మృతి
గుండ్రాంపల్లి(చిట్యాల) చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్రం మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలమూరు జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెలతో పాటు గుర్రంతో హైదరాబాద్ వైపునకు వెళుతున్నారు. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ శివారులోకి రాగానే జాతీయ రహదారిని దాటే క్రమంలో గుర్రాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్రం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. -
గాడిద పని గుర్రానికి...
సామాన్యంగా సంచార జీవులు తమ సామాగ్రిని గాడిదపై వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే మహబూబ్‌నగర్‌కు చెందిన గొర్రెల కాపర్లు శనివారం తమ సామగ్రిని గుర్రంపై వేసి తీసుకు వెళ్తూ ములుగు–జాకారం మధ్య సాక్షి కెమెరాకంటికి చిక్కారు. గొర్రెల మందలతో వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో.. సరుకు రవాణాతో పాటు పనులపై వెళ్లేందుకు తమకు కూడా ఉపయోగపడుతాయని గుర్రాలను పెంచుకుంటున్నట్లు కాపరులు ఈ సందర్భంగా తెలిపారు. -
పెళ్లి బారాత్‌లో విషాదం
గుర్రం దాడి చేయడంతో యువకుడి మృతి హైదరాబాద్: పెళ్లి బారాత్‌లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు గుర్రపు బగ్గీకి ఉన్న ఓ గుర్రం మర్ఫా (డప్పు) కొడుతున్న.. ఓ యువకుడిని తన్నడంతో అతడు కింద పడి వుృతి చెందాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాతనగరం బోయిగూడ కమాన్ ఘోడెవాడికి చెందిన మదార్ హుస్సేన్ (18) శుభకార్యాలలో మర్ఫా కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి గోల్కొండ ఫ్రన్ కాటేజ్‌కు చెందిన యూనుస్ అనే యువకుడి పెళ్లికి మదార్ హుస్సేన్ తన బృందంతో మర్ఫా కొట్టడానికి వచ్చాడు. రాత్రి 10 గంటలకు పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా బగ్గీ లాగుతున్న ఓ ఆడగుర్రం పక్కనే మర్ఫా కొడుతున్న మదార్ హుస్సేన్‌ను వెనుక కాలితో ఛాతీపై తన్నింది. దీంతో అతడు విలవిలలాడుతూ కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అతనిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు. -
న్యూ బేబీకి వెల్ కమ్: జడేజా
రాజ్‌కోట్: గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన కుటుంబంలోకి ఓ కొత్త బేబీని ఆహ్వానించాడు. గత నెలలోనే పెళ్లి చేసుకున్నాడు కదా.. అప్పుడే కొత్త కొత్తగా ఈ బేబీ ఏంటని సందేహ పడుతున్నారా?. అయితే పూర్తి వివరాలిలా ఉన్నాయి.. గత నెల 17న స్థానిక వ్యాపారి కూతురు రీవా సోలంకిని జడేజా వివాహమాడాడు. అంతేనా.. పెళ్లిలో కాల్పులతో అతని వివాహవేడుక సంచలనం అయిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో జడేజా తల్వార్ తిప్పుతూ హల్చల్ చేశాడు. అతడి తల్వార్ డాన్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ గా మారిపోయింది. ఇంట్లోకి కొత్త బేబీ వచ్చిందంటూ పోస్ట్ పెట్టి తాజాగా మరోసారి జడేజా వార్తల్లోకెక్కాడు. జంతు ప్రేమికుడైన రవీంద్ర జడేజా తనకు ఇష్టమైన ఓ గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. న్యూ బేబీకి ఫాం హౌస్ వెల్ కమ్ అంటూ గుర్రంపై ఇష్టాన్ని చాటుకున్నాడు. ఆ గుర్రానికి 'జంకీ' అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. జంకీకి పుట్టిన గుర్రానికి 'వారి' అని పిలుచుకుంటున్నాడు. ఆ గుర్రాలతో ఫొటోలు దిగిన వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో జడేజా పోస్ట్ చేశాడు. ఐపీఎల్ మ్యాచులతో బిజీగా ఉండటం వల్ల 'వారి'తో కలిసి ఫొటో దిగడానికి కాస్త ఎదురుచూడాల్సి వచ్చిందని, ఎట్టకేలకు ఫొటో దిగాను అని తన పోస్ట్ లో జడేజా రాసుకొచ్చాడు.