Ravindra Jadeja Poses With His "Crush" In Hilarious Insta Post - Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: తన క్రష్‌ ఏంటో చెప్పిన జడేజా.. షాకైన అభిమానులు

Published Sun, Oct 9 2022 1:18 PM | Last Updated on Sun, Oct 9 2022 2:50 PM

Ravindra Jadeja Poses With His "Crush" In Hilarious Insta Post - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న జడేజా అక్కడే కోలుకుంటున్నాడు. ఇక జడేజాకు గుర్రాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్‌పుత్‌ కుటుంబానికి చెందిన జడేజాకు గుర్రపుస్వారీ, కత్తిసాముపై మంచి పట్టు ఉంది. తన ఇంట్లో గుర్రాలను కూడా పెంచుకుంటున్నాడు.

తాజాగా ఒక గుర్రంతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసిన జడేజా.. మై క్రష్‌ అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇంతకముందు తన గుర్రంపై స్వారీ చేసిన వీడియోతో పాటు మరికొన్ని ఫోటోలు జతపరిచి ఒక డాక్యుమెంట్‌ రూపంలో విడుదల చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జడేజా పెట్టిన ఫోటోపై టీమిండియా క్రికెటర్లు సహా అభిమానులు ఫన్నీగా స్పందించారు. 

ఇక జడేజా టి20 ప్రపంచకప్‌కు దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. జడ్డూ స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌లో అక్షర్‌ పటేల్‌ అదరగొట్టాడు. మూడు టి20లు కలిపి ఎనిమిది వికెట్లు తీసిన అక్షర్‌ పటేల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెలుచుకున్నాడు. వికెట్ల పరంగానే కాదు ఎకానమీలోనూ(6.30)అదరగొట్టాడు. దీంతో టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు అక్షర్‌ పటేల్‌ కీలకం కానున్నాడు.

చదవండి: సూర్య అడుగు పడింది.. మెరిసేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement