
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ విషయమై ఇటీవలే హెడ్‌లైన్స్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదన్న కారణంతో యూట్యూబర్ సప్నా గిల్, ఆమె స్నేహితులు కలిసి పృథ్వీ పై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పృథ్వీ షా ఫిర్యాదు మేరకు సప్నా గిల్, ఆమె స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చిన సప్నా గిల్ పృథ్వీ షా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది. పృథ్వీ షానే ముందు గొడవకు దిగాడని.. అకారణంగా తమపై దాడి చేశాడంటూ పేర్కొంది. ఇప్పటికి వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా గొడవ తర్వాత బయటకు రాని పృథ్వీ షా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. ఆ పోస్టు చూస్తే అతన్ని ఎవరో వాడుకుని వదిలేసినట్లుగా అనిపిస్తుంది. పృథ్వీ పెట్టిన పోస్ట్ ఎలా ఉందంటే.. ''కొంతమంది మనల్ని ప్రేమిస్తారు.. కానీ ఆ ప్రేమ మన అవసరం ఉండేవరకే. ఒకసారి అది ముగిసిపోయాకా వారికి మనపై ఉన్న విధేయత కూడా ముగుస్తుంది. అవసరాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారంటూ'' ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అయితే పృథ్వీ షా పెట్టిన పోస్టు అభిమానులను కన్ఫూజన్‌కు గురయ్యేలా చేసింది. పృథ్వీ ఆ పోస్టును కెరీర్ పరంగా పెట్టాడా.. లేక ఎవరితోనైనా లవ్‌లో బ్రేకప్ అవ్వడం వల్ల పెట్టాడా అనేది అర్థం కాలేదు. కొంతకాలంగా నిధి తపాడియాతో పృథ్వీ షా రిలేషిన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వారిద్దరు విడిపోయి ఉంటారని అందుకే పృథ్వీ షా ఆ పోస్టు పెట్టాడని కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం.. లేదు పృథ్వీ షా ఇన్‌డైరెక్ట్‌గా బీసీసీఐని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. ఏది ఏమైనా మంచి టాలెంట్ ఉండి కూడా జట్టులోకి రాలేకపోతున్న పృథ్వీ షాను చూస్తుంటే బాధ కలుగుతుందని కొంతమంది బాధపడ్డారు.
నిజానికి పృథ్వీ చాలా కాలం క్రితమే టీమిండియాలోకి వచ్చాడు. ఆరంభంలో తన దూకుడైన ఇన్నింగ్స్‌లతో కీలక క్రికెటర్‌గా మారుతాడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం.. నిషేధిత పదార్థాల వినియోగం కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. కానీ ఇటీవలే రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబరిచిన పృథ్వీ తిరిగి టీమిండియాకు ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో 363 పరుగులు, రంజీ ట్రోఫీలో 39 పరుగులు సాధించాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనప్పటికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. టీమిండియా తుది జట్టులో తనకు స్థానం లభించకపోవడంతోనే ఈ పోస్ట్ చేశాడని.. ఇప్పటికైనా అతన్ని టీమిండియా తరపున ఆడించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న పృథ్వీ షా త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలవనున్నాడు.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 9, 2023
చదవండి: మ్యాచ్ మధ్యలో చాక్లెట్ తిన్న కోహ్లి! స్లిప్‌లో అది అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment