Suryakumar Yadav Takes Part First-Net Session Australia Ahead T20 WC - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: సూర్య అడుగు పడింది.. మెరిసేనా!

Published Sun, Oct 9 2022 11:30 AM

Suryakumar Yadav Takes Part First-Net Session  Australia Ahead T20 WC - Sakshi

టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ కనబరుస్తున్నాడు. కొన్నాళ్లుగా చూసుకుంటే ఏ మ్యాచ్‌ ఆడినా సూర్య కనీసం ఫిప్టీ సాధిస్తూ వస్తున్నాడు. టి20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి దూకుడు కనబరుస్తున్నాడు.

కాగా 573 బంతుల్లోనే సూర్య ఈ ఘనత సాధించాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. 604 బంతుల్లో మాక్స్‌వెల్ 1000 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న సూర్యకుమార్‌ జట్టుతో కలిసి టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాడు. అడుగు పెట్టాడో లేదో ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. తాజాగా సూర్యకుమార్‌కు సంబంధించిన ప్రాక్టీస్‌ వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్‌లో పంచుకుంది.

వీడియోలో సూర్యకుమార్‌ మాట్లాడుతూ.. ''టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. అందుకోసం ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాం. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరయ్యాను. గ్రౌండ్‌లో పరిగెత్తాను, నడిచాను.. మొత్తానికి తొలి సెషన్‌ సంతోషంగా గడిచిపోయింది. పిచ్‌పై వికెట్‌ పేస్‌, బౌన్స్‌ ఎలా ఉందన్న దానిపై పరిశీలించాను. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. కానీ టి20 ప్రపంచకప్‌ ఆడబోతున్నామన్న ఉత్సాహం మాత్రం ఊరికే ఉండనీయడం లేదు.

మ్యాచ్‌లు ప్రారంభం అయ్యేవరకు రొటిన్‌ ప్రాక్టీస్‌తో పాటు కొన్ని ప్రక్రియలు చాలా అవసరం. ఆస్ట్రేలియాలో మైదానాలు పెద్దగా ఉంటాయని చాలా మంది అంటున్నారు. దీంతో నా ఆటకు సంబంధించి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పిచ్‌లపై పరుగులు ఎలా చేయాలన్న దానిపై ఒక అవగాహన రావాల్సి ఉంది. ఇది ఆటకు చాలా ముఖ్యం'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: 1938 నుంచి తవ్వకాలు.. ఎట్టకేలకు బయటికి

'ధోని భయ్యాను చాలా మిస్సవుతున్నాం'

Advertisement
Advertisement