
ఇకపై శునకాలు, గుర్రాలకు సైనిక పతకాలు!
న్యూఢిల్లీ: సైనికులకు శౌర్య పతకాలు ఇచ్చినట్టే తొలిసారిగా కుక్కలు , గుర్రాలకు కూడా పతకాలు ఇవ్వనున్నారు. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) తన 55వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని గుర్రాలకు ‘యానిమల్ ట్రాన్స్‌పోర్ట్’, కుక్కలకు ‘కే9 (కెనైన్)’ అనే పతకాలను ప్రవేశపెడుతోంది. ‘థండర్ బోల్ట్’ అనే గుర్రం, ‘సోఫియా’ అనే కుక్క ఈ తొలి అవార్డులను నోయిడాలో అందుకోనున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణంలో సైన్యంతోపాటు ఉండి, ఇవి ఎనలేని సేవలను అందించాయి. వీటికోసం పతకాలను ఐటీబీపీయే ప్రత్యేకంగా రూపొందించి, ముద్రించింది.