ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
సుల్తాన్‌బజార్: కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపు 20 కుక్కలు రోజూ స్వైర విహారం చేస్తుంటాయి. ఆదివారం రాత్రి కళాశాల హాస్టల్ వైపు వెళ్తున్న డిగ్రీ విద్యార్థులనులు అంకిత, ప్రవీణలపై కుక్కలు ఒక్కసారిగా దాడిచేసి కరిచాయి.
దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కలు దాడి చేయడంతో పరిగెత్తిన ఓ విద్యారి్థని చెవికమ్మ తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. మరో విద్యారి్థనికి ముఖంపై గాయాలు కావడంతో యూనివర్సిటీ నిర్వాహకులు వారిని బర్కత్‌పురాలోని సీసీ షరాఫ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల అధికారులపై మండిపడ్డారు.
యూనివర్సిటీలో కుక్కలతో పాటు పాములు సైతం పెద్ద సంఖ్యలో తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్ మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే వర్సిటీలో కుక్కల నియంత్రణపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment