female students
-
సీఎంఆర్ కాలేజీపై మహిళా కమిషన్ సీరియస్
మేడ్చల్ రూరల్: మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాలలో విద్యార్థినులు గురువారం కూడా ఆందోళన కొనసాగించారు. కళాశాల క్యాంటీన్లో పనిచేసే యువకులు బుధవారం గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో మొబైల్ ఫోన్లు ఉంచి విద్యార్థినుల వీడియోలను చిత్రీకరించే ప్రయత్నం చేసిన విషయం తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థినులు బుధవారం మధ్యాహ్నం నుంచి ఆందోళన చేపట్టారు.విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు హాస్టల్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలపటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్.. కళాశాలకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ కార్యదర్శి పద్మజ రమణ కళాశాలలో గురువారం విచారణ జరిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను కూడా కమిషన్ ఆదేశించింది. యాజమాన్యం నిర్లక్ష్యం హాస్టల్ బాత్రూంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థినులు హాస్ట ల్ వార్డెన్ ప్రీతిరెడ్డికి తెలిపారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన వార్డెన్.. తమనే తప్పుపడుతూ దురుసుగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు. వీడియోలు తీయటానికి ప్రయత్నించింది హాస్టల్ మెస్‌లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులే అని తెలుపగా.. మీరే మగవారిని చూసి అలా ప్రవర్తిస్తున్నారని వార్డెన్ దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం బయటకు చెప్తే మీ వీడియోలు కూడా బయటకు వెళ్తాయని వార్డెన్ అనటంతో ఆగ్రహించిన విద్యార్థినులు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. పరిస్థితి విషమించటంతో వార్డెన్ బుధవారం అర్ధరాత్రే అక్కడి నుండి దొడ్డిదారిన వెళ్లిపోయింది. పోలీసుల అదుపులో వార్డెన్ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మెస్‌లో పనిచేసే ఐదుగురితోపాటు హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి, మెస్ ఇన్చార్జి సెల్వంను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విషయంలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కనిపించిందని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హాస్టల్ బాత్రూంల సమీపంలోనే మెస్‌లో పనిచేసే 12 మంది కార్మికులకు గదులు కేటాయించడమే ఈ ఘటనకు కారణమని చెప్పారు. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న 12 మొబైల్ ఫోన్లలో అభ్యంతరకరమైన ఎలాంటి వీడియోలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. డిలీట్ చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఫోన్లను ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని జేఎన్టీయూ ఆదేశించింది. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులతో సీఎంఆర్ గ్రూప్స్ కార్యదర్శి గోపాల్‌రెడ్డి చర్చలు జరిపారు. హాస్టల్ పరిసరాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. -
దారుణం.. కాలేజ్ హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు
మేడ్చల్‌లోని సీఎమ్ఆర్ఐటీ కాలేజ్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు పెట్టి విధ్యార్ధినులను బెదిరించినట్టు సమాచారం. ఈ నేపద్యంలో బాధిత విధ్యార్ధినులు హాస్టల్లో వీడియోలు తీశారని ఆగ్రహం చెందారు. నిందితుల దగ్గర దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు సమాచారం. సదరు వీడియోలతో విధ్యార్ధినులను బ్లాక్మెయిల్ చేస్తునట్టు విధ్యార్ధినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా వంటచేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్న విధ్యార్ధినులు. విధ్యార్ధినులకు న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ధర్నాకు దిగింది. విధ్యార్ధినులను బ్లాక్మెయిల్ చేస్తున్న సీఎమ్ఆర్ఐటీ కాలేజ్ యాజమాన్యంపై చర్యలకు ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ఫుడ్ పాయిజన్‌తో గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
ఘట్కేసర్: ఫుడ్ పాయిజన్‌తో మైనారిటీ గురుకులానికి చెందిన విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నాగారంలోని మైనారిటీ గురుకులంలో 450 మంది విద్యార్థినులు ఉన్నారు. గురువారం ఉదయం అల్పాహారం బోండా, మధ్యాహ్నం చికెన్‌తో భోజనం చేశారు. తిరిగి సాయంత్రం అల్పాహారంలో బొప్పాయి తిన్నట్టు విద్యార్థినులు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత కొంతమంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వికారంగా అనిపించడంతో ప్రిన్సిపాల్ స్వప్నకు తెలి పారు. ఆమె ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి విద్యార్థినులను వెంటనే తీసుకెళ్లారు. 33 మంది విద్యార్థినులను పరీక్షించి 9 మందిని అడ్మిట్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లగా వార్డెన్, ఇతర సిబ్బందితో కలిసి దుర్భాషలాడింది. ఆస్పత్రికి మీరెందుకు వచ్చారంటూ ఫొటోలు తీ యకుండా అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ స్వప్న ను వివరణ కోరగా కడుపునొప్పి ఉందంటే విద్యార్థినులను ముందస్తుగా ఆస్పత్రికి తీసు కొచ్చామన్నారు. డాక్టర్ యాదయ్యను వివ రణ కోరగా 33 మందిని పరీక్షించామని అందులో 9 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నామన్నారు. ఫుడ్ పాయిజన్‌తోనే ఇలా అయ్యిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
మహిళా యూనివర్సిటీలో కుక్కల దాడి
సుల్తాన్‌బజార్: కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపు 20 కుక్కలు రోజూ స్వైర విహారం చేస్తుంటాయి. ఆదివారం రాత్రి కళాశాల హాస్టల్ వైపు వెళ్తున్న డిగ్రీ విద్యార్థులనులు అంకిత, ప్రవీణలపై కుక్కలు ఒక్కసారిగా దాడిచేసి కరిచాయి. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కలు దాడి చేయడంతో పరిగెత్తిన ఓ విద్యారి్థని చెవికమ్మ తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. మరో విద్యారి్థనికి ముఖంపై గాయాలు కావడంతో యూనివర్సిటీ నిర్వాహకులు వారిని బర్కత్‌పురాలోని సీసీ షరాఫ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల అధికారులపై మండిపడ్డారు. యూనివర్సిటీలో కుక్కలతో పాటు పాములు సైతం పెద్ద సంఖ్యలో తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్ మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే వర్సిటీలో కుక్కల నియంత్రణపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై విచారణ
జి.మాడుగుల: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అసెంబ్లీకి సమయానికి రాలేదని ఇంటర్ సెకండియర్‌కు చెందిన 18 మంది విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. డీఈవో బ్రహ్మాజీరావు, కేజీబీవీ జీసీడీవో కె.సూర్యకుమారి సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జీఎం కొత్తూరులోని కేజీబీవీకి వచ్చి విద్యార్థినులను విచారించారు. కార్తీక పౌర్ణమి కావడంతో శుక్రవారం పూజలకు వెళ్లి అసెంబ్లీకి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రత్యేక అధికారి(ఎస్వో) సాయిప్రసన్న తమను కొట్టి.. జత్తు కత్తిరించారని విద్యార్థినులు వాపోయారు. దేవుని మొక్కు ఉందని చెప్పినా వినలేదని చెప్పారు. ఎస్వో ప్రవర్తనపై విద్యార్థినుల నుంచి అధికారులు లిఖితపూర్వకంగా వివరాలను నమోదు చేసుకున్నారు. ఎస్వో సాయిప్రసన్న మాట్లాడుతూ.. క్రమశిక్షణలో భాగంగా విద్యార్థినుల జుత్తు కత్తిరించానని.. చేసింది తప్పేనని.. తనను క్షమించాలని కోరింది. చిన్నచిన్న తప్పులకు ఇంత దారుణంగా దండిస్తారా? అంటూ ఎస్వో సాయిప్రసన్నపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో బ్రహ్మాజీరావు మాట్లాడుతూ.. నివేదికను ఉన్నతాధికారులకు అందించి.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదికను తమకు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు, సభ్యుడు గొండు సీతారాం చెప్పారు. నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.ఎస్వోను బ్లాక్మెయిల్ చేసిన టీడీపీ నేతఈ ఘటన బయటకు రాకుండా చూసుకుంటానని.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇచ్చేందుకు రూ.లక్ష కావాలంటూ వంజంగిపాటుకి చెందిన టీడీపీ నేత లకే రామకృష్ణ ఎస్వోను బ్లాక్మెయిల్ చేశాడు. తమ పేర్లు వాడినందుకు రామకృష్ణపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొందరు ఉపాధ్యాయుల వికృత చేష్టలు, బిక్కుబిక్కుమంటున్న అమ్మాయిలు
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు. వెలుగులోకి రానివెన్నో.. బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావడం తక్కువే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్‌తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ జెడ్పీ హైసూ్కల్లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు. కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది. -
139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల
జగిత్యాల రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 77 మంది విద్యార్థులున్నారు. వీరిలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థుల్లో 36 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. వాటి స్థానంలో ఉపాధి హామీ కింద పాఠశాలకు ఒకటి చొప్పున రెండు మూత్రశాలల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతుండగానే జిల్లా అధికారులు నిధులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి రెండు పాఠశాలల్లో ఉన్న మొత్తం 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల గతి అయ్యింది. బహిర్భూమికి విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలకు టీసీలు ఇస్తే పాఠశాల ఎలా నడిపేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
కలుషిత ఆహారంతో 79 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుíÙత ఆహారం కారణంగా 79 మంది గిరిజన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కోడి గుడ్డు, రసంతో భోజనం తిన్న కొద్ది సేపటికే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వీరిలో 61 మందిని హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న సౌజన్య, 6వ తరగతి చదువుతున్న ఎస్.దీవెన, 8వ తరగతి చదువుతున్న జెస్సీల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆశ్రమ పాఠశాలలో మొత్తం 520 మంది గిరిజన విద్యార్థినులు ఉన్నారు. ప్రాంతీయ ఆస్పత్రిలో 61 మంది వైద్యసేవలు పొందుతుండగా, జామిగుడ ఆశ్రమ పాఠశాలలోనే మిగిలిన విద్యార్థినులకు కిల్లోగుడ పీహెచ్సీ వైద్య బృందం వైద్యసేవలు అందిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులకు అందిస్తున్న వైద్యసేవలను సమీక్షించారు. -
ఎలుకలు కరిచి ఐదుగురు విద్యార్థినులకు గాయాలు
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి బీఆర్ అంబేడ్కర్ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో మంగళవారం ఐదుగురు ఇంటర్ విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. గాయపడిన విద్యార్థినులకు నరసన్నపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. వివరాల్లోకి వెళితే... రెసిడెన్షియల్ కళాశాల భవనంలోని డారి్మటరీలో ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని రోహిణి, ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు స్రవంతి, హారిక, బాలామణి, సౌజన్య ఉండగా రెండు పెద్ద ఎలుకలు ఒకేసారి వచ్చి దాడి చేశాయి. ఐదుగురు విద్యార్థినుల కాళ్లను కరిచాయి. దీంతో వారు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే విద్యార్థినులను నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎలాంటి ప్రమాదం లేదని ఏఆర్వీ(యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్) చేస్తే సరిపోతుందని అక్కడి వైద్యులు వెల్లడించారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రెసిడెన్షియల్ కళాశాలల జిల్లా సమన్వయకర్త బాలాజీ నాయక్ వెంటనే కళాశాలకు చేరుకున్నారు. ఎలుకల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కృష్ణతారను ఆదేశించారు. -
విద్యార్థినుల జీవితాలతో ఆటలా?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా): ఎస్వీ యూనివర్సిటీ హాస్టళ్లలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని వర్సిటీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ఎస్వీయూ పరిపాలన భవనం వద్ద హాస్టల్ సమస్యలపై పీజీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ హాస్టల్ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు.బుధవారం రాత్రి పాచిపోయి వాసన వస్తున్న చికెన్ విద్యార్థినులకు వడ్డించారని మండిపడ్డారు. నాసిరకం కూరగాయలతో ప్రతినిత్యం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, వాష్‌రూమ్స్ వంటి మౌలిక సదుపాయాలు సరిగాలేకపోవడంతో విద్యార్థినులు సతమతమవుతున్నారన్నారు. ఒక్కోవిద్యార్థినీ నుంచి నెలకు రూ.3వేలకు పైగా మెస్ బిల్లు వసూలు చేస్తూ రోజూ పప్పునీళ్లే వడ్డిస్తున్నారని ఇన్చార్జి రిజిస్ట్రార్ చంద్రయ్యను నిలదీశారు. సమస్యను పరిష్కరిస్తామంటూ రిజిస్ట్రార్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. -
కేజీబీవీ విద్యార్థినులకు బంకర్ బెడ్లు
సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో మెరుగైన సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్మిడియెట్ వరకు చదువుతున్న 98,560 మంది విద్యార్థినులకు మంచాలు అందించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విద్యార్థినులకు అన్ని రకాలుగా అనువుగా ఉండేలా స్టోరేజీ బాక్స్‌తో ఉండే రెండు లేదా మూండంచెల బంకర్ బెడ్లను అందించాలన్నారు. వీటిని డిసెంబర్ నెలాఖరుకు ఆయా పాఠశాలలకు అందించాలని యోచిస్తున్నారు. దీంతో 98,560 మంది విద్యార్థినులకు మేలు కలగనుంది. కేజీబీవీలకు గత టీడీపీ ప్రభుత్వం 2018లో మందపాటి బొంతలను మాత్రమే ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థినులకు అందుతున్న వసతులపై సమగ్ర శిక్ష, కేజీబీవీ అధికారులు ఆరా తీశారు. ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ డిసెంబర్‌లోగా మంచాలు అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే కేజీబీవీల్లో చదువుతున్న బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి, అవసరమైనవారికి మాత్రలు అందజేసింది. ఆ పరీక్షల రిపోర్టును రికార్డు చేసేందుకు ‘హెచ్‌బీ పర్సంటేజ్’ కార్డులను సైతం ఆయా స్కూళ్లకు అందించింది. చదువుకునేందుకు కూడా ఉపయోగపడేలా.. ఏపీలో 2004–05 విద్యా సంవత్సరంలో కేజీబీవీలను అందుబాటులోకి తెచ్చారు. తొలుత 6 నుంచి 8వ తరగతి వరకు ప్రారంభించారు. అనంతరం ఇంటర్మిడియెట్ వరకు పెంచారు. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో 98,560 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరికి గత ప్రభుత్వం బొంతలు మాత్రమే అందించడంతో నేలపై పడుకోవాలి్సన దుస్థితి తలెత్తింది. పేదింటి ఆడపిల్లలు చదువుకునే విద్యాలయాల్లో వారికి మంచాలు అందించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థినులు పడుకునేలా, వాటిపై కూర్చుని చదువుకునేందుకు అనువైన ఎత్తు ఉండేలా బంకర్ బెడ్లను తయారు చేయిస్తున్నారు. ఒకదానిపై ఒకటి ఉండి ఇనుముతో చేసిన బంకర్ బెడ్లు అడుగున విద్యార్థినుల పుస్తకాలు, ఇతర సామగ్రి దాచుకునేందుకు వీలుగా స్టోరేజీ బాక్స్‌లను సైతం బిగించనున్నారు. -
కలకలం రేపిన విద్యార్థినుల అదృశ్యం
ఒడిశా: స్థానిక కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ గ్రూప్ ఎంపీహెచ్‌డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు శనివారం రాత్రి అదృశ్యం కావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఆచూకీ కనుగొనడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందడంతో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నిమ్మక ప్రేమ్‌కుమార్, సూపరెంటెండెంట్ రంగాచారి, డిప్యూటీఈవో విజయకుమారి, జీసీడీవో రోజారమణి, ఎంఈవో–2 సూర్యచంద్రరావులు వెంటనే కేజీబీవీని ఆదివారం సందర్శించి సుదీర్ఘ విచారణ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అదృశ్యమైన విద్యార్థినుల్లో ఒకరికి జన్మదినం కావడంతో వారి బంధువులు శనివారం ఉదయం కేక్, స్వీట్లు తెచ్చి ఇచ్చేసి వెళ్లిపోయారు. శనివారం రాత్రి బర్త్‌డే జరుపుకుని రోల్‌కాల్ వరకు ఉన్న విద్యార్థినులు వాష్‌రూమ్‌కు వెళ్తామని చెప్పి పాఠశాల నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం వారిద్దరూ పాఠశాలలో లేకపోవడంతో ప్రిన్సిపాల్ రూప అధికారులకు సమాచారమిచ్చారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వీరఘట్టం ఎస్సై వెంకటరమణ, స్థానిక ఏఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టి విద్యార్థినుల ఆచూకీ కనుగొన్నారు. వారిద్దరూ కేజీబీవీ సమీపంలో ఉన్న ఒక అమ్మాయి ఇంటివద్ద ఉన్నారు. దీంతో వారిని పోలీసులు తీసుకువచ్చి విద్యాశాఖాధికారులు, కేజీబీవీ సిబ్బంది సమక్షంలో పేరెంట్స్‌కు అప్పగించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థినుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీలు అంటే క్రమశిక్షణకు నిలయాలని ఇటువంటి విద్యాసంస్థలో ఎవ్వరికీ చెప్పకుండా విద్యార్థినులు బయటకు వెళ్లారంటే సిబ్బంది బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. -
లోదుస్తులు విప్పమన్నారు.. నీట్ విద్యార్థినుల ఆవేదన! ఎలా పరీక్ష రాసేది?
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష జరిగిన ప్రతిసారి నేషనల్ టెస్డింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈసారి కూడా పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. తమ బ్రా స్టాప్‌లు చెక్ చేశారని, లో దుస్తులు కూడా విప్పమన్నారని పలువురు అమ్మాయిలు వాపోయారు. పరీక్షకు ముందు సున్నిత విషయాల్లో తమను ఇలా ఇబ్బంది పెడితే ఎగ్జామ్ ప్రశాంతంగా ఎలా రాస్తామని ప్రశ్నిస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల దుస్తులను విప్పించి తిప్పి వేసుకోమని సిబ్బంది చెప్పారని పరీక్షకు హాజరైన స్టూడెంట్ తెలిపింది. అలాగే మరికొంత మందిని జీన్స్ ప్యాంట్లు ధరించవద్దని చెబితే వారు వెళ్లి తమ తల్లుల లెగ్గింగ్స్‌ను మార్చుకుని వచ్చారని పేర్కొంది. మరికొందరేమో సమీప దుకాణాల్లోకి వెళ్లి అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుగోలు చేసి పరీక్ష కేంద్రానికి తిరిగి వచ్చారని వివరించింది. ఎన్టీఏ నిబంధనలకు అనుగుణమైన దుస్తుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పింది. దీంతో ఈ రూల్స్‌పై తల్లిదండ్రులతో పాటు ఇతరుల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు విద్యార్థులను ఇలా మానసికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని ఓ డాక్టర్ జంట అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులను ఇలా ట్రీట్ చేయడమేంటని మండిపడింది. అవసరమైతే నిబంధనలు మార్చి వారికి వస్త్రధారణలో ఉపశమనం కల్పించాలని సూచించింది. కాగా.. బెంగాల్‌లోని హెచ్ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్లో కొందరు విద్యార్థులు లోదుస్తుల్లోనే పరీక్ష రాశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రిన్సిపల్ మాత్రం వీటిని ఖండించారు. అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పారు. కొంతమంది విద్యార్థులు డ్రస్ కోడ్ పాటించకపోతే మార్చుకొని రావాలని సూచించినట్లు వివరించారు. అయితే నిబంధనలపై సరిగ్గా అవగాహన లేని వారిని సిబ్బందిగా పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తల్లిదండ్రులు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
అఫ్గాన్‌లో విద్యార్థినుల నిరసన గళం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఉన్నతవిద్యాసంస్థల్లో మహిళా విద్యార్థులపై నిషేధం విధించి, మహిళా విద్యను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న తాలిబన్ ప్రభుత్వానికి విద్యార్థినుల నుంచి నిరసనలు మరింత పెరిగాయి. దయలేని తాలిబాన్లను ఎదిరించి వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయాల విద్యార్థినులు తమ గొంతుకను గట్టిగా వినిపిస్తున్నారు. శనివారం హెరాత్ నగరంలోని రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం ఎదుట ఆందోళన చేసేందుకు దాదాపు 150 మంది వర్సిటీ విద్యార్థినులు బయల్దేరారు. ‘విద్య మా హక్కు’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లను చేతబూనిన వారిని తరిమికొట్టేందుకు తాలిబన్ భద్రతా బలగాలు వాటర్ కేనన్లు వినియోగించారు. రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలతో విద్యార్థినులను కొట్టారు. అయినాసరే నిరసనర్యాలీని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థినులు ప్రయత్నించారు. సంబంధించిన వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ విడుదలచేసింది. ‘తారిఖీ పార్క్ నుంచి నిరసన ర్యాలీ మొదలుపెట్టాం. అయితే, నగరంలో ప్రతీ వీధిలో సాయుధ తాలిబన్లు మమ్మల్ని అడ్డుకున్నారు. కొట్టారు. మాపై దాడి దారుణం’ అని మరియం అనే విద్యార్థిని ఆగ్రహంగా మాట్లాడారు. అయితే, ఈ నిరసన ర్యాలీపై రాష్ట్ర గవర్నర్ హమీదుల్లా ముతావకిల్ భిన్నంగా మాట్లాడారు. ‘ఓ నలుగురైదుగురు అమ్మాయిలు వచ్చి ఏదో ఫిల్మ్ షూట్ చేసి వెళ్లిపోయారు. వారికి ఎలాంటి అజెండా లేదు’ అని అన్నారు. వర్సిటీల్లో మహిళా విద్యపై నిషేధం విధించడంతో తాలిబాన్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, జీ–7 కూటమి దేశాలు తాలిబన్ సర్కార్‌ను తీవ్రంగా తప్పుబట్టాయి. అఫ్గాన్ విద్యార్థినులకు మద్దతుగా పాక్‌లోని క్వెట్టా సిటీలో కొందరు అఫ్గాన్ శరణార్థి విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉద్యోగినులను తీసేయండి స్వచ్ఛంద సంస్థలకు తాలిబన్ల అల్టిమేటం మహిళలను చదువులకు దూరం చేసేందుకు కంకణం కట్టుకున్న అఫ్గాన్ తాలిబన్ పాలకులు తాజాగా మహిళలకు శరాఘాతం వంటి మరో చర్యకు పూనుకున్నారు. అఫ్గానిస్తాన్‌లోని విదేశీ, దేశీయ ప్రభుత్వేతర సంస్థలు మహిళా ఉద్యోగాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ఆర్థిక మంత్రి మహ్మద్ హనీఫ్ పేర్కొన్నారు. వీటిని పాటించని ఎన్జీవోల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ప్రవేశించరాదనే ఆంక్షలు ఇప్పటికే ఉన్నాయి. -
హెడ్ మాస్టర్ బాగోతం.. హాస్టల్ విద్యార్థినులను ప్రత్యేక క్లాస్‌ల పేరుతో పిలిచి..
యశవంతపుర(కర్ణాటక): హాస్టల్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ముఖ్యోపాధ్యాయుడికి హాసన జిల్లా అరకలగూడు పోలీసులు బేడీలు వేశారు. అరకులగూడు వసతి పాఠశాలలో 35 మంది విద్యార్థినులు వసతి పొందుతుండగా ముఖ్యోపాధ్యాయుడు శివకుమార్ ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థినులను పిలిపించి లైంగికంగా వేధించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ప్రిన్సిపాల్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈయన మొత్తం 15 మందిని లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ‘మీ కుమారుడు మా స్కూల్లో అవసరం లేదు.. ఇంటికి తీసుకుపోండి’ -
Viral Video: బుర్ఖా ధరించని విద్యార్థులపై తాలిబన్ అధికారుల దాడి
కాబూల్: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచక పాలన రోజురోజుకీ మితిమీరిపోతుంది. గతేడాది దేశాన్ని తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చదువులు, ఉద్యోగాలకు అనుమతి నిరాకరిస్తూ మహిళలను ఆంక్షల చట్రంలో బంధిస్తున్నారు. మహిళల స్వేచ్చ, భావవ్యక్తీకరణ, వస్త్రధారణ ఇలా ప్రతి దానిపై నిషేధం విధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి బాలికలు పాఠశాలకు రాకుండా నిషేధించారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం అయ్యేలా వారిని అణిచివేతకు గురిచేస్తున్నారు. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టిన మహిళలకు హిజాబ్(బుర్భా) ధరించడం తప్పనిసరి చేసింది తాలిబన్ ప్రభుత్వం. ఆఖరికి విద్యాసంస్థలకు కూడా ఇలాగే రావాలని ఆదేశించింది. అయితే అక్కడి మహిళలు తాలిబన్ల నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బుర్భా పూర్తిగా ధరించకుండా వచ్చినందుకు అధికారులు యూనివర్సిటీ లోపలికి అనుమతివ్వలేదు. దీంతో చదవుకోవడం మా హక్కు అంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అయితే నిరసన చేస్తున్న మహిళా విద్యార్థులపై తాలిబన్ అధికారులు దాడి చేశారు. దీంతో విద్యార్థులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. Taliban beat female students Even though the girls are wearing hijabs, why are they not allowed to enter the university? The #Taliban want to close the universities for #Female students. Today the the Taliban didn’t allow female students to enter university. #Badakhshan pic.twitter.com/xXmZ8eDolH — Panjshir_Province (@PanjshirProvin1) October 30, 2022 యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులను కొడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తి తాలిబాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినవారుగా తెలిసింది. ఈ సంఘటన ఆదివారం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని బదక్షన్ విశ్వవిద్యాలయం గేట్ బయట జరిగింది. అయితే వీరంతా ముఖం కనిపించకుండా బుర్భా కప్పుకోకపోవడంతో అధికారులు యూనివర్సిటీలోకి అనుమతించలేదని తెలుస్తోంది. -
ఆకతాయిల ఆటకట్టు.. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లు
ఆకివీడు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత కోసం.. వారికి భరోసా కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తోంది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడినప్పుడూ ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేయకుండా ఈ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తున్నాయి. చదవండి: ఆయిల్ ఫామ్ సాగుతో డబ్బులే డబ్బులు.. పెట్టుబడులు పోగా ఎకరానికి లాభం ఎంతంటే? ప్రతీ పాఠశాల వద్ద ఇలాంటి బాక్సులు ఏర్పాటు చేయాలి. అలాగే బాలికలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయించారు. ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో ముట్టుకున్నా, తాకినా వెంటనే తల్లిదండ్రులకు గాని, పెద్దలకు తెలియజేయాలంటూ ఫ్లెక్సీలో సూచించారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులపై చర్యలు పాఠశాల వద్ద ఉన్న ఫిర్యాదుల బాక్సులో రాత పూర్వకంగా విద్యార్థినులు సమాచారాన్ని తెలియజేయాలి. ఈ బాక్సుల్లోని ఫిర్యాదులను ఎప్పటికప్పుడూ ఎంఈవో పరిష్కరిస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాక్సుల్లో ఫిర్యాదులను పరిశీలించి ఎంఈవోకు సమాచారమిస్తారు. ఎంఈవో ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 418 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 63,638 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. క్తొతగా ప్రారంభించిన 16 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లోని విద్యార్థినులతో పాటు 36 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,420 మంది, ప్రైవేటు విద్యా సంస్థల్లో సుమారు 22,570 మంది విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. వీరికి అభయం కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ప్లెక్సీలు, బోర్డుల ఏర్పాటు బాలికలు, విద్యార్థినులకు రక్షణగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం పలు ఉచిత కాల్ సెంటర్ నెంబర్లు అందుబాటులో ఉంచింది. వేధింపులకు గురైనా, శరీరంపై చేయి వేసినా చైల్డ్ లైన్ నెంబరు 1098, పోలీస్ 100, దిశ హెల్ఫ్‌లైన్ నెంబర్ 112, ఉమెన్ హెల్ప్‌లైన్ 181కు ఫిర్యాదు చేయవచ్చు. దురుసుగా ప్రవర్తించినా, అసభ్యకరంగా మాట్లాడినా ఆ సమయంలో విద్యార్థునులు ఏం చేయాలో అవగాహన కలి్పస్తూ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. రక్షణ చర్యలు భేష్ బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయి. పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సు వల్ల ఈవ్ టీజింగ్ తగ్గుతుంది. బాలికలు నిర్భయంగా పాఠశాలకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు. – ఎన్.సిరి సన్నిత్య, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు వేధింపులకు అడ్డుకట్ట విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పిస్తున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. మహిళలు, బాలికలకు పూర్తి రక్షణకల్పించి వారి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫిర్యాదుల బాక్సులు, హెల్ప్లైన్ల ఏర్పాటుతో వేధింపులకు అడ్డుకట్ట పడుతుంది. – ఎండీ.బషీరా, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు పాఠశాలల్లో ఫిర్యాదు బాక్సులు బాలికా సంరక్షణ పథకం ద్వారా బాలికలు, విద్యార్థినులకు పూర్తి రక్షణ ఏర్పడుతుంది. ప్రతీ పాఠశాలలో ఫిర్యాదుల బాక్సు, హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచుతున్నాం. లైంగిక వేధింపులకు గురి చేసే వారికి శిక్ష పడేలా ఇవి దోహదపడతాయి. విద్యార్థినుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – డీ.వెంకట రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
పొలం బడిలో పంట పాఠాలు
వీళ్లంతా విద్యార్థినులు. కొందరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారు. మరి కొందరు ఉద్యోగస్తుల, వ్యాపారుల కుటుంబాల పిల్లలు. అందరి లాగా ఇంటర్ , ఎంసెట్ అయ్యాక.. కార్పొరేట్ ఉద్యోగాలను, ఇంజనీరింగ్, మెడికల్ వంటి ఏ ఇతర కోర్సులనూ వారు ఎంచుకోలేదు. దేశంలో అందరికి అన్నం పెట్టే రైతులకు తోడుగా, చేదోడుగా ఉండాలనుకుని వ్యవసాయ విద్యలో చేరారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి దాదాపు నలభై మంది ఇటీవల నెల్లూరు జిల్లాకు వచ్చి, గ్రామాలలోనే బస చేస్తూ క్షేత్ర స్థాయిలో రైతన్నలతో కలిసి పని చేశారు. చదివిన పాఠాలను పొలం పనుల్లోకి అప్లయ్ చేశారు. రైతుల అనుభవాలను పాఠంగా నేర్చుకున్నారు. ఇలా ఆరు నెలల పాటు పొలం బాట పట్టి వెళ్లిన విద్యార్థినులపై ఉత్సాహంపై ప్రత్యేక కథనం. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికత. ఆధునిక వి«ధానాలు, వంగడాలు, నీటి వినియోగం, సస్య రక్షణ లాంటి అంశాలలో రైతులకు అవగాహనæ కల్పించేందుకు వివిధ శాఖలు ఎంతోకాలంగా కృషి చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. వాతావరణానికి అనుగుణంగా పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పురుగు మందుల వినియోగం లాంటి అంశాలలో అవసరమైన మేర పరిజ్ఞానం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ సేద్యంలో తాము కూడా తోడుగా ఉండేందుకు వ్యవసాయ విద్యార్థినులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. వ్యవసాయంలో డిగ్రీ చేస్తున్న విద్యార్థినులు తమ కోర్సులో భాగంగా ఆరు నెలల పాటు పల్లెటూళ్లో ఉంటూ.. రైతులతో మమేకమై వారి పొలాలలో పంటను వేయడం దగ్గర నుంచి దిగుబడి వరకూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు చెందిన బీఎస్సీ (అగ్రి) విద్యార్థినులు పొలం పనులు చేపడుతున్నారు. వ్యవసాయ కోర్సులో భాగంగా ఇటీవలే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన విద్యార్థినులు జిల్లాలోని వివిధ మండలాలకు వచ్చి రైతులతో కలిసి మెలిసి వ్యవసాయదారులుగా మారారు. ఆయా గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించారు. పంట కోసం నార్లు వేశారు. అనంతరం పంట ఎదుగుదలను ప్రత్యక్షంగా çపరిశీలించారు. రైతులకు సలహాలు ఇవ్వడంతో పాటు మార్గదర్శనం చేసేందుకు ఎంతో సహకారం అందిస్తున్నారు. వీరికి డాట్ సెంటర్, వ్యవసాయ పరిశోధన, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు తమ వంతు తోడ్పాటును ఇస్తున్నారు. రైతులు కూడా వీరితో కలిసి మెలిసి ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఆయా గ్రామాల్లోనే నివాసం ఉంటూ.. ఉదయం వేళల్లో పొలం పనులు.. సాయంత్రం గ్రామస్తులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను వివరిస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. పట్టణాలలో పుట్టినా పల్లెటూరి వాతావరణంలో ఉంటూ రైతు బిడ్డల్లా పనిచేస్తున్న వీరిని గ్రామంలోని యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందని గ్రామస్తులు కూడా అంటున్నారు. ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాం మా నాన్న టీచర్. కాని ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం. నాన్నకు ఇంట్రెస్ట్ అని నేను ఈ రంగంలోకి వచ్చాను. ఆరు నెలలు అక్కడ ఉండి, వ్యవసాయంలో మెళకువలను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాం. ప్రధానంగా ఆర్గానిక్ ఫుడ్‌పై ఫీల్డ్ రీసెర్చ్ చేశాం. – డి. తేజస్విని, గోరంట్ల, అనంతపురం జిల్లా ఎన్నో విషయాలు తెలిశాయి పల్లెల్లో ఉండి పరిశీలించడం వల్ల క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించగలిగాం. రైతులతో మమేకం కావడం వల్ల వ్యవసాయంలో కొత్త పద్ధతులను తెలుసుకోగలిగాం. – పి. మన్విత, పోరుమామిళ్ల, కడప జిల్లా సంతోషంగా అనిపించింది మొదటి నుంచి మాది వ్యవసాయ కుటుంబం. నాన్న కూడా వ్యవసాయం చేస్తున్నారు. నగరంలో విద్యను అభ్యసించినా... వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఇందులో ఉన్నంత సంతోషం మరెక్కడా ఉండదని అనిపించింది. – కె. అనసూయ, హిందూపురం, అనంతపురం జిల్లా పొలమే పెద్ద పుస్తకం మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, కాని నాకు రైతన్నలా పనిచేయాలని, వ్యవసాయంలో కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి. పుస్తకాలలో చదివే దానికి , ప్రాక్టికల్‌గా చేసే దానికి చాలా తేడా ఉంది. పొలంలో ప్రత్యక్షంగా పరిశీలించి పంటల సాగుబడి తెలుసుకోవడం ఎంతో బాగుంది. – కె దివ్య, నంద్యాల, కర్నూలు జిల్లా -
కుటుంబం కళ్లెదుటే.. యువతుల గల్లంతు
సాక్షి, చిలప్చేడ్ : మెదక్ జిల్లా చిలప్‌చేడ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వనభోజనాల కోసం స్థానికంగా ఉన్న శ్రీ చాముండేశ్వరి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలసి రోహిణి (18), శ్రీవిద్య(17) వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికి మంజీరా నదిలోకి దిగారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు ఒక్కసారిగా విడుదలవ్వడంతో నదిలో నీటి ప్రవాహం ఉధృతమైంది. దీంతో కుటుంబసభ్యులు చూస్తుండగానే శ్రీవిద్య, రోహిణిలు నదిలో కొట్టుకుపోయారు. విహారయాత్రకు వస్తే విషాదం మిగిలిందని యువతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం!
నిత్యం లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన - ఈ హెచ్.ఎం. మాకొద్దు.. విధుల నుంచి తొలగించండి - జిల్లా విద్యాధికారికి 50 మంది విద్యార్థినుల ఫిర్యాదు హాలియా (నాగార్జునసాగర్): ‘‘ఈ సారు మాకొద్దు.. ఆయన పెట్టే లైంగిక వేధింపులు భరించలేక మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది’’అంటూ 50 మంది విద్యార్థినులు హెచ్ఎంపై మంగళవారం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. నిత్యం తమపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని మొర పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండా కృష్ణమూర్తి కొంత కాలంగా తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని 8,9 తరగతులకు చెందిన విద్యార్థినులు ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడి వ్యవహారశైలితో తమకు జీవితంపై విరక్తి కలుగుతుందని, మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారి తరి రాములును వారంతా ఒక్కసారిగా చుట్టుముట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు. హెచ్ఎం తీరుపై కంటతడి పెట్టారు. సదరు ప్రదానోపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు కష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, విద్యార్థినులు సదరు ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారని, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు మండల విద్యాధికారి రాములు చెప్పారు. ప్రధానోపాధ్యాయుడు వివరణ :ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తిని వివరణ కోరగా.. పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఐక్యత కొరవడిందని, దీంతో తనపై కావాలనే నిందలు వేయిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థినులకు క్రమశిక్షణ పాటించాలని చెప్పడంతో తనపై కక్షగట్టారని ఆయన వివరించారు. -
విద్యార్థినులపై వివక్షేం లేదు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: విద్యార్థినులపట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ)లో వైఫై సౌకర్యాన్ని విద్యార్థినులకు ఇవ్వడం లేదని, ఇతర ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘నేను బీహెచ్‌యూ నుంచి సమాచారం సేకరించాను. ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల పట్ల ఎలాంటి వివక్ష ఉన్నట్లు నాకు అనిపించలేదు’ అని అన్నారు. అబ్బాయిలతో సమానంగా విద్యార్థినులకు వైఫై సౌకర్యం అందించకపోవడంతోపాటు హాస్టల్లో మాంసాహారం తినేందుకు అనుమతివ్వడం లేదని, మెస్‌లోకి షార్ట్స్ వేసుకొని వెళ్లనివ్వడం లేదని 10గంటల తర్వాత ఫోన్లు చేసుకోనివ్వడం లేదని ఆయా పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓమంత్రి అడిగిన ప్రశ్నకు ఆయన జవదేకర్ పై విధంగా సమాధానం ఇచ్చారు. -
ఈ మాస్టారు మంచోడు కాడు..
నర్సాపూర్ రూరల్: ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వెలుగులోకి వచ్చింది. 6, 7 తరగతి చదువుకునే విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ మూడు రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు గ్రామస్తులతో కలసి హెచ్ఎంను నిలదీశారు. ఆగ్రహానికి లోనైన కొందరు నిందితుడిపై దాడికి యత్నించగా..గ్రామ పెద్దలు హెచ్ఎంను గదిలో ఉంచి తాళం వేశారు. విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని గ్రామస్తుల సమక్షంలో విచారణ చేసి నిందితుడిని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. ఈ విషయమై హెచ్ఎం విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. హెచ్ఎం తీరుని నిరసిస్తూ గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. -
విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన!
కురవి(వరంగల్): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా కురవి మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలోని భౌతికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు వికాస్ గత కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థినులు ఈ విషయాన్ని బయటపెట్టాలని భావించారు. శుక్రవారం నాడు బాధితులు స్కూల్ ఎదుట తల్లిదండ్రులతో కలసి ఆందోళన చేయడంతో అసలు విషయం బయటపడింది. విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల ఆందోళనతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. -
అమ్మాయిలు 10.. అబ్బాయిలు 8..!
న్యూయార్క్: కాలేజీలో చదువుకుంటున్న అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారట. రోజుకు సరాసరిన అమ్మాయిలు 10 గంటల పాటు సెల్‌ఫోన్ వాడితే.. అబ్బాయిలు 8 గంటలు ఉపయోగిస్తున్నారు. అమెరికాలో ఓ యూనివర్సిటీ బృందం చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. టెక్సాస్‌లోని బేలర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స రాబర్ట్స్ బృందం కాలేజీ విద్యార్థులు సెల్ఫోన్ల వాడుక అంశంపై పరిశోధన చేశారు. రాబర్ట్స్ బృందం ఆన్లైన్ ద్వారా ఈ సర్వే చేసింది. సెల్ఫోన్లకు బానిసలయ్యామని 60 శాతం మంది విద్యార్థులు అంగీకరించారని చెప్పారు. సెల్ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. సెల్ఫోన్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్‌తో ఎక్కువ సమయం గడుపుతుంటారని తెలిపారు. అబ్బాయిలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం సెల్ఫోన్లు వాడుతారని, అమ్మాయిలు సామాజిక విషయాల కోసం ఉపయోగిస్తారని రాబర్ట్స్ వెల్లడించారు. -
స్పీకర్ వస్తున్నారని విద్యార్థినులతో మొరం పోయించిన స్పెషల్ ఆఫీసర్
శాయంపేట: కస్తూర్బా పాఠశాల ప్రారంభానికి స్పీకర్ వస్తున్నారన్న సమాచారం స్పెషలాఫీసర్ శనివారం విద్యార్థులతో మొరం పోయించారు. పాఠశాల ఆవరణను చదును చేయించారు. వరంగల్ జిల్లాలో శాయంపేటలోని కస్తూర్బా పాఠశాల లోపల, బయటి ఆవరణ వర్షపునీటితో మడుగులా తయారైంది. అయితే, భవనం ప్రారంభించేందుకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వస్తున్నారని తెలుసుకొన్న స్పెషల్ ఆఫీసర్ తన సొంత ఖర్చులతో సుమారు 40 ట్రాక్టర్ ట్రిప్పుల మొరం పోయించారు. లెవలింగ్ చేయించారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరారు. -
కీచక ప్రిన్సిపాల్!
కీసర: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ వివేకం కోల్పోయాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కీసర మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంకిరెడ్డిపల్లిలో కేఆర్కే డీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ సాంబారెడ్డి కొంతకాలంగా విద్యార్థినులతో వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థినులను తన కార్యాలయంలోకి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించసాగాడు. వారి సెల్ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వికృతానందం పొందుతున్నాడు. విషయం ఎవరికైనా చెబితే హాజరుశాతం లేదని ఫెయిల్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ విషయం విద్యార్థులు కళాశాల డెరైక్టర్ రాధాకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేఆర్కే డీఎడ్ కళాశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. ఆరోపణలు అవాస్తవం విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండటంతో ప్రిన్సిపాల్ కఠినంగా వ్యవహరించారని, ఇది మింగుపడని విద్యార్థులు అనవసరమైన అభాండాలు వేస్తున్నారని కేఆర్కే డీఎడ్ కళాశాల చైర్మన్ రాధాకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. విద్యార్థుల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు. -
ఇద్దరి విద్యార్థినుల అదృశ్యం
దుబ్బాక : డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు అదృశ్యమైన బుధవారం ఫిర్యాదులు అందినట్లు ఎస్ఐ హరిప్రసాద్ చెప్పారు. మండల పరిధిలోని రామక్కపేట గ్రామానికి చెందిన మోత్కు దుర్గయ్య కుమార్తె నీలిమ(19) ఎస్వీవీ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7న కళాశాలకు ఇంటి నుంచి వెళ్లిన నీలిమ ఇంత వరకు ఇంటికి రాలేదు. నీలిమ కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా మండల పరిధిలోని గోసాన్‌పల్లి గ్రామానికి చెందిన అక్క అంజిరెడ్డి కుమార్తె అక్క సంధ్య (17) ఎస్వీవీ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. జనవరి 17న కళాశాలకు ఇంటి నుంచి వెళ్లిన సంధ్య ఇంత వరకు ఇంటికి రాలేదు. బం ధువులు, స్నేహితల వద్ద సంధ్య కోసం ఆరా తీసినా ఫలి తం లేకుండా పోయింది. ఇరువురి విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థుల సమాచారం తెలిసిన వాళ్లు 94906 17063, 94906 17021, 94906 17009కు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. -
హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థత
* పులిహోర తినడంతో 16 మందికి కడుపునొప్పి * ఆస్పత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది మైలవరం : హాస్టల్లో వండిన పులిహోర తిన్న విద్యార్థినులు 16 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక గిరిజన సంక్షేమ వసతి గృహానికి చెందిన దాదాపు 40 మంది విద్యార్థినులు రాజాపేటలోని ఎంపీపీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థినులకు సోమవారం ఉదయం హాస్టల్లో మెనూ ప్రకారం పులిహోర చేసి వడ్డించారు. అదే పులిహోరను వారి టిఫిన్ బాక్సుల్లో కూడా పెట్టి పాఠశాలకు పంపించారు. మధ్యాహ్నం పాఠశాలలో పులిహోర తిన్న విద్యార్థినులు కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే వారిని స్థానిక ప్రభుతాస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యాధికారులు సహనం, ప్రతాప్‌లు సిబ్బందితో కలిసి వారికి చికిత్స అందించారు. పులిహోర సరిగా ఉడక్కపోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. పాఠశాలలో మరికొంతమంది విద్యార్థినులు పులిహోర తినకుండా పారవేసినట్లు తోటి విద్యార్థినులు వివరించారు. ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న విద్యార్థినులను ఎంపీడీవో వై.హరిహరనాథ్, ఎంపీపీ బి.లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు దొండపాటి రాము, ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ రహీం తదితరులు పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి హాస్టల్ వెల్ఫేర్ అధికారిణి ఈ ఘటన గురించి తెలిసినా స్పందించకపోవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అవసరం లేదు... అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థినుల్లో ఇద్దరికి చికిత్స పంపించామని, మరో 14 మందిని తమ పరిశీలనలో ఉంచామని ఎస్పీహెచ్ఓ డాక్టర్ రవి తెలిపారు. ఉడకని అన్నంతో పులిహోర తయారు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుందని చెప్పారు. విద్యార్థినుల ఆరోగ్యం విషయంలో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
విద్యార్థినులు ఇక్కడొద్దు.. వాళ్లు ఆకర్షిస్తారు!
-
విద్యార్థినులు ఇక్కడొద్దు.. వాళ్లు ఆకర్షిస్తారు!
ప్రఖ్యాతి చెందిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని లైబ్రరీలో విద్యార్థినుల ప్రవేశాన్ని నిషేధించారు. అక్కడున్న మౌలానా ఆజాద్ లైబ్రరీలోకి తమనూ అనుమతించాలంటూ విద్యార్థినులు చేసిన డిమాండును వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జమీరుద్దీన్ షా నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. వాళ్లను లోపలకు అనుమతిస్తే ఇప్పటివరకు వచ్చే కుర్రాళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది వస్తారని ఆయన అన్నారు. అయితే.. వీసీ నిర్ణయం దురదృష్టకరమని ఐద్వా ప్రధానకార్యదర్శి జగ్మతి సంగ్వాన్ అన్నారు. ఇలాంటి ప్రకటనలు ఇచ్చే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమీరుద్దీన్ షా ప్రకటనను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ బర్ఖా శుక్లా కూడా తీవ్రంగా విమర్శించారు. యూనివర్సిటీ ఆలోచనా విధానాన్ని ఈ ప్రకటన నిరూపిస్తోందని విమర్శించారు. అమ్మాయిలను లైబ్రరీలోకి అనుమతిస్తే ఎక్కువ మంది అబ్బాయిలు ఆకర్షితులవుతారని చెప్పడం వాళ్ల ఆలోచనల్లో తప్పును చూపిస్తోందన్నారు. అవసరమైతే మరింతమందిని అనుమతించేందుకు లైబ్రరీని విస్తరించాలి తప్ప.. మహిళలను ఇలా అణిచేయడం సరికాదన్నారు. -
కొత్త మలుపు!
- విద్యార్థినులపై లైంగిక దాడికి యత్నం - విచారణలో వెలుగు చూసిన కొత్త కోణం - ప్రిన్సిపాల్ భర్తపై ఆరోపణలు.. నెల్లిమర్ల : నెల్లిమర్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో ఈ నెల 4న జరిగిన విద్యార్థినులపై లైంగిక దాడి యత్నం కథ కొత్త మలుపు తిరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తి ప్రిన్సిపాల్ భర్తేనని విద్యార్థినులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగంతకుడెవరు? అన్న దానిపై కథ అడ్డం తిరిగింది. సంఘటనకు సంబంధించి పత్రికల్లో ఆలస్యంగా సోమవారం పలు కథనా లు ప్రచురితమవ్వగా స్పందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, సాంఘిక సంక్షేమ సొసైటీ జోనల్ అధికారిణి జీవీ శేషుకుమారి కళాశాలలో విచారణ నిర్వహించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడారు. ఇందులో విద్యార్థినులు ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను వివరించారు. కళాశాల డార్మిటరీలోకి ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి చొరబడిన ఆగంతకుడు తమపై లైంగిక దాడికి పాల్పడగా తాము ప్రతిఘటించామని దాంతో బ్లేడుతో గాయపరిచాడని వెల్లడించారు. ఆ సమయంలో ఆగంతకుడు పూర్తిగా దుస్తులు లేకుండా ఉన్నట్టు చెప్పారు. తమ పక్కన చేరి వికృత చేష్టలకు ప్రయత్నించగా ప్రతిఘటించ డంతో బ్లేడుతో గాయపరచడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని, తెలిస్తే మీ జీవితాలే నాశనమవుతాయని హెచ్చరించినట్టు కన్నీరుమున్నీరై చెప్పారు. ఇదే సమయంలో పక్క గదిలో నిద్రిస్తున్న విద్యార్థినులకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో ఆగంతకుడు పారిపోయినట్టు తెలిపారు. తాము కేకలు వేసినా వార్డెన్‌గానీ, ఉపాధ్యాయులుగానీ డార్మిటరీలోకి రాలేదని చెప్పారు. ఆగంతకుడు పారిపోయిన తరువాత వాచ్‌మేన్, వార్డెన్ వచ్చారని తెలిపారు. ఆ రాత్రంతా భయంతో మేల్కొనే ఉన్నామని చెప్పారు. చీకట్లో ఆగంతకుడిని గుర్తించలేకపోయూమన్నారు. ఇదే విషయమై స్పందించిన జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి కలెక్టర్‌కు ఈ విషయూలన్నీ నివేదిస్తానని విలేకరుల వద్ద వెల్లడించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతానని చెప్పారు. విచారణలో ఎంపీపీ సువ్వాడ వనజాక్షి కూడా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ భర్తపై అనుమానం కళాశాల డార్మిటరీలోకి చొరబడిన ఆగంతకుడు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి భర్త సుబ్బారావేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడున్న క్వార్టర్‌లోనే ప్రిన్సిపాల్‌తో కలిసి ఉంటున్నారు. అంతేగాకుండా విద్యార్థినులు చెప్పిన దాన్ని బట్టిచూస్తే ఆయనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది సహకరించారని చెబుతున్నారు. ఫిర్యాదు ఎందుకు చేయలేదు.. సంఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. సదరు వ్యక్తి ప్రిన్సిపాల్‌కు కావాల్సిన వ్యక్తి అరుునందువల్లే విషయూన్ని కప్పిపుచ్చేందుకు దాచి పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఆదివారం ఉదయం ఎవరో ఓ వ్యక్తి కళాశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా సంఘటనను పక్కదారి పట్టించేందుకేనన్న విమర్శలు వస్తున్నాయి. విద్యార్థి, మహిళా సంఘాల ఆందోళన కళాశాలలో జరిగిన సంఘటనపై ఐద్వా మహిళా సంఘం ప్రతినిధులు ఇందిర, రమణమ్మ, లక్ష్మి, సుజాత తదితరులు సోమవారం కళాశాలకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్, వాచ్‌మేన్, వార్డెన్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో సంఘ నేతలకు, ప్రిన్సిపాల్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ కూతురైన వార్డెన్ కూడా సంఘ నేతలపై విరుచుకుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు సైతం కళాశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. సంఘటనకు కారణమైన ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్‌మేన్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ భర్తను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : మృణాళిని నెల్లిమర్ల : నెల్లిమర్ల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఈ నెల నాలుగో తేదీన చోటు చేసుకున్న సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఆమె సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కళాశాలకు విచ్చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉమామేహశ్వరిని సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి ఎన్ని గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నదీ, పిల్లలు ఎక్కడ నిద్రపోతున్నదీ తదితర వివరాలు అడిగారు. రాత్రివేళ డార్మిటరీ మెయిన్ గేటు ఎందుకు తెరిచి ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సంఘటనకు ప్రత్యక్ష సాక్షులైన విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. సంఘటన జరిగిన తీరును మంత్రికి విద్యార్థినులు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు. బాధ్యులైన వారిపై తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యుడు ఎస్. బాలరాజు కూడా రాత్రి 8 గంటల ప్రాంతంలో కళాశాలను సందర్శించారు. జరిగిన సంఘటనపై విద్యార్థినులను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, డీఈఓ కృష్ణారావు తదితరులు కూడా సోమవారం రాత్రి కళాశాలకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. -
మహిళా కూలీలకు రక్షణేది?
లింగాల: ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్టచేతబట్టుకొని హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వలసవెళ్లిన మహిళా కూలీలకు రక్షణ లేకుండాపోయింది. పనిప్రదేశంలో వారు అఘాయిత్యాలకు గురవుతున్నారు. గుంపుమేస్త్రీల లాభాపేక్షకు వారు బలవుతున్నారు. వెలుగుచూసినవి కొన్నే అయినా బయటికి తెలియని ఎన్నో దారుణాలు ఉన్నాయి. తాజాగా లింగాల మండలానికి చెందిన ఓ గిరిజన మహిళ(21)పై హైదరాబాద్‌లో దుండగులు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడడం సంచలనం రేకెత్తించింది. తన భర్తతో కలిసి ఉపాధి కోసం నగరానికి వె ళ్లింది. పనికి వెళ్తున్న ఆమెను హైదరాబాద్- వరంగల్ హైవేకు సమీపంలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి నారపల్లిని ఆనుకొని ఉన్న అటవీప్రాంతానికి తీసుకెళ్లి ఐదుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. తనపై జరిగిన దారుణాన్ని భర్త, మరిది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2013 ఆగస్టు 3న మండల పరిధిలోని కొత్తచెర్వుతండాకు చెందిన ఓ గిరిజన వివాహిత మహిళ సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురంలో ఇంటి వద్ద ఉండగానే అత్యాచారానికి గురైంది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటన మరువకముందే సోమవారం రాత్రి లింగాలకు చెందిన ఓ వివాహిత సామూహిక అత్యాచానికి గురికావడం ఈ ప్రాంతంలోని వలసకూలీలను భయాందోళనకు గురిచేసింది. మం డలం నుంచి జీవనోపాధికి వందల కుటుంబాలు హైదరాబాద్‌కు వెళ్తున్నా యి. పనిచేసే చోట ప్రమాదాలకు గురవడం, అత్యాచారాలకు బలవుతుండడం వలసకూలీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దుండగులను శిక్షించాలి అచ్చంపేట టౌన్: లింగాలకు చెందిన గిరిజన మహిళా వలసకూలీపై హైదరాబాద్‌లో దారుణానికి ఒడిగట్టిన దుండగులను శిక్షించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీ జీవీపీ జిల్లా ఇన్చార్జి విజయరామరాజు మాట్లాడుతూ..దుండగులను గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు, మహిళలపై అరాచకాలు జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీస్ పికెట్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శ్రీనునాయక్, గౌస్, గౌతం, రాధాకృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌ను నిరోధిద్దామిలా
నాగపూర్ : రోజురోజుకూ మహిళలు, విద్యార్థినులపై దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. కళాశాలల్లో ర్యాగింగ్భూతం వెంటాడుతోంది. యువత పెడతోవన పడుతోంది. సభ్యసమాజం తలదించుకొనేలా వికృత చేష్టలతో మహిళలను కించపర్చే పాశ్చాత్య సంస్కృతిని ఒంటబట్టించుకున్న కొందరు యువకులు చదువులమ్మ ఒడిని భ్రష్టుపట్టిస్తున్నారు. విషసంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈ సంస్కృతికి బీజం స్కూలు, కాలేజీల్లోనే పడుతోంది. చదువుకోవడానికి కొత్తగా వచ్చే వారిని సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధించడం మామూలైంది. అమానుషమైన ర్యాగింగ్ రక్కసిని తరిమి వేయడానికి జిల్లా న్యాయ సేవా అథారిటీ (డీఎల్ఎస్ఏ) నడుం బిగించింది. యువతను గాడిలో పెట్టేందుకు ర్యాగింగ్ నిరోధించడానికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. కళాశాలలను వేదికగా చేసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నగరంలోని వైద్యకళాశాల, ఇంజినీరింగ్ కళాశాలలో విజయవంతంగా పూర్తి చేసింది. అదేవిధంగా ఎన్‌కేపీ సాల్వ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రిసెర్సీ సెంటర్లోని సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులకు, విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని సీనియర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలపై డీఎల్ఎస్ఏ అవగాహన కల్పించింది. జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని, ర్యాగింగ్‌లాంటి వికృత చేష్టలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని ర్యాగింగ్ నిర్మూలన రూపకర్త డీఎల్ఎస్ఏ సెక్రటరీ కిషోర్ జైస్వాల్ అన్నారు. జూనియర్ విద్యార్థులు ‘సర్’ లేదా మేడమ్ అని పిలువాలని సూచించడం కూడా నేరమేనని చెప్పారు. పకడ్బందీ చర్యలు సెషన్స్‌కోర్టు సివిల్ జడ్జి జైస్వాల్ మాట్లాడుతూ ‘2009లో కాంగ్రా(హెచ్‌పీ)లోని రాజేంద్రప్రసాద్ మెడికల్ కాలేజీలో అమన్ అనే మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలైందని, ఈ చర్యతో దేశం దిగ్భ్రాంతికి గురైందని చెప్పారు. అప్పటి నుంచి ప్రభుత్వం ర్యాగింగ్ నిరోధానికి పక్బడందీ చర్యలు చేపట్టి అమలు చేస్తోందని వివరించారు. ర్యాగింగ్ విషసంస్కృతిని అరికట్టేందుకు తప్పుచేసిన వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా విచారణకు అర్హులేనని పేర్కొన్నారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. నేరపూరితమైన చర్యను ఉపేక్షించొద్దు మాజీ ప్రభుత్వ ప్లీడర్, న్యాయవాది, డీఎల్ఎస్ఏ టీం మెంబర్ సత్యనాథన్ మహరాష్ట్ర ర్యాగింగ్ నిరోధక చట్టం-1999 గురించి వివరించారు. ర్యాగింగ్ పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. ర్యాగింగ్ పాల్పడడం నేరపూరితమైన చర్య అని, రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 10,000 విధించే అధికారం చట్టం కల్పించిందని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలకు వచ్చే కొత్త విద్యార్థులను ర్యాగింగ్ ద్వారా సీనియర్ విద్యార్థులు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది సరైన చర్య కాదని అన్నారు. మెడికల్ కాలేజీల్లోనే ర్యాగింగ్ తీవ్రంగా ఉంటుందన్నారు. సీనియర్ల చేతిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాధితులు ఫిర్యాదు చేయాలని, ఈ మేరకు నేరం చేసినవారిపై కఠిచర్యలు తీసుకొనే అవకాశం చట్టం కల్పించిందని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో సెప్టెంబర్‌లో చట్టంపై అవగాహన కల్పించడానికి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. జాతీయ హెల్ప్‌లైన్ : విద్యార్థుల మనోభావాల, ఆత్మగౌరవాన్ని ర్యాగింగ్ తీవ్ర విఘాతం కల్గిస్తోందని, దీన్ని నిరోధించడానికి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. జాతీయ ర్యాగింగ్ వ్యతిరేక హెల్ప్‌లైన్‌ను కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. -
ఆకర్షించి.. అగాధంలోకి నెట్టి...
విద్యార్థినుల నీలిచిత్రాలు తీసిన ముఠా అరెస్టు తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త ధైర్యంగా పోలీసుల వద్దకు రండి వాళ్లంతా ఇంటర్ చదివే విద్యార్థినులు. తెలిసీ తెలియని వయస్సులో మోసగాళ్ల ‘ఆకర్షణ’లో పడ్డారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన సమయంలో అగాధంలో చిక్కుకున్నారు. ఆ విష ‘వలయం’ నుంచి బయటకు రాలేక విలవిల్లాడారు. ఎట్టకేలకు ఓ బాధితురాలు ధైర్యం చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు నీలిచిత్రాల ముఠా సభ్యులను కటకటాల్లోకి నెట్టారు. విజయవాడ సిటీ : నగరం మెట్రో సంస్కృతి వైపు శరవేగంగా అడుగులు వేస్తూనే..ప్రమాదకర సంకేతాలు(డేంజర్ సిగ్నల్స్) పంపుతోంది. మెట్రో కల్చర్‌ను అవకాశంగా తీసుకుని కాలేజీ విద్యార్థినులను ఆకర్షించి వలలో వేసుకుని నీలి చిత్రాలు తీసి..ఆపై బ్లాక్ మెయిలింగ్ చేసి సొమ్ము చేసుకునే ముఠాలు తయారయ్యాయి. ఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. ఏడాదిన్నర కాలంగా ఏడుగురు సభ్యుల ముఠా 10మందికి పైగా ఇంటర్ చదివే కాలేజీ విద్యార్థినులను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసి..బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టు గుర్తించామని నగర పోలీసు కమిషనర్ ఎ.బి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం డీసీపీ(శాంతి భద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలు వెల్లడించారు. కానూరుకు చెందిన నిమ్మకూరి సాయిరాం అలియాస్ రాంచరణ్(పాత నేరస్తుడు), కృష్ణలంకకు చెందిన పరశపు దీపక్, గాంధీనగర్‌కు చెందిన పసుమతి అభిలాష్, నున్నకు చెందిన షేక్ మున్నా, మరో ఇద్దరు, ఓ మైనరు కలిసి ఈ అనైతిక చర్యలకు ఒడిగట్టినట్టు తెలిపారు. వీరు విద్యార్థినులను మభ్యపెట్టి తీసిన నీలిచిత్రాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ ఇళ్లల్లో, గదుల్లో రహస్యంగా అమర్చిన కెమెరాలతోనూ, సెల్పోన్ల ద్వారా నీలి చిత్రాలు తీసినట్టు పోలీసులు గుర్తించారు. కొందరికి మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉండగా నీలి చిత్రాలు తీశారన్నారు. వీరు నీలి చిత్రాలు తీస్తున్న విషయం విద్యార్థినులకు తెలియదని, కొందరికి తెలిసినా బయటకు తెలిస్తే పరువుపోతుందని చెప్పుకోలేదన్నారు. నేరస్తులందరికీ అక్కా చెల్లెళ్లు ఉండటం విశేషమని పోలీసు కమిషనర్ చెప్పారు. ధైర్యంగా ముందుకు రండి... ఇంకా ఇలాంటి ముఠాలు ఉండొచ్చని పోలీసు కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు రావాలని, సున్నిత అంశం కాబట్టి బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయమని ఆయన అన్నారు. ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందులుంటే నమ్మకమైన తెలిసిన వ్యక్తుల ద్వారా తగిన ఆధారాలు పోలీసులకు అందజేసినా సరిపోతుందన్నారు. కఠిన చర్యలు... విద్యార్థులు చదువుకోవడమే లక్ష్యంగా కళాశాలలకు వెళ్లాలని, అంతే తప్ప ఈవ్‌టీజింగ్ వంటి చర్యలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఇప్పటికే పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. తల్లిదండ్రులూ జాగ్రత్త కాలేజీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ సూచించారు. వీరి చేతిలో మోసపోయిన వారిని పరిశీలిస్తే తల్లిదండ్రులు, సమాజం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్టు వెల్లడవుతోందన్నారు. మోసపోయిన వారిలో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారేనని, చిన్నపాటి బైకుపై తిరగడం..హోటల్స్‌కు వెళ్లడం వంటి చిన్నపాటి కోరికలకు వీరు లొంగిపోయారన్నారు. ఆ తర్వాత నిందితులు డబ్బులు కావాలంటే వంటిపై ఉన్న గొలుసులు, చెవి రింగులు కూడా ఇచ్చారన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రశంసలు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రహస్య విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు టీమును పోలీసు కమిషనర్ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీలు నక్కా సూర్యచంద్రరావు, కె.లావణ్యలక్ష్మీ, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
మెరుపు తీగలు (సెయింట్ ఆన్స్)
-
చికిత్స ‘అత్యవసరం’...
జీజీహెచ్ దుస్థితి = క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల కొరత = పనిచేయని వాల్ సెక్షన్స్ ఆపరేటర్స్ = అరకొర మందులతో ఇబ్బందులు కొన ఊపిరితో వచ్చిన వారి ప్రాణాలు నిలపాల్సిన ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్సా విభాగానికే సుస్తీ చేసింది. అవసరమైన మందులు, సిబ్బంది కొరత.. రాత్రి వేళల్లో పనిచేయని సీటీస్కాన్.. అందుబాటులో లేని 24 గంటల లేబరేటరీలతో సకాలంలో చికిత్స అందించలేక చేతులెత్తేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తొలుత ఇక్కడకు వచ్చిన ప్రమాద బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. విజయవాడ, న్యూస్‌లైన్ : జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి నిత్యం వందలాదిమంది రోగులు అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. అయితే ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో చికిత్స అందించలేక పోతున్నారు. ఇటీవల గుడ్లవల్లేరు మండలం అంగలూరు మోడల్హాస్టల్ విద్యార్థినులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురికాగా, వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. వారికి అత్యవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో అర్ధరాత్రి వేళ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పటికయితే కొన్నారు కానీ, సాధారణ రోగులు వస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదానికి గురికాగా, ఏలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు రిఫర్ చేశారు. అర్ధరాత్రి వేళ వచ్చిన యువకుడిని పరీక్షించిన వైద్యులు తలకు సీటీ తీయాలని చెప్పారు. అయితే రాత్రివేళల్లో లేబరేటరీ అందుబాటులో లేకపోవడంతో గుంటూరు ఆస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో రూ.రెండువేలు వెచ్చించి అంబులెన్స్‌లో గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఇలాంటి సంఘటనలు ఇక్కడ నిత్యకృత్యం. అందుబాటులోకి రాని వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. పేరుకు పెద్దాస్పత్రే అయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉదయం వేళల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రోగి ఆస్పత్రికి వస్తే వారికి అత్యవసరంగా అవసరమైన నిర్ధారణ పరీక్షలన్నీ వందలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు ల్యాబుల్లో చేయించాల్సిందే. గాయాలతో వచ్చిన వారికి చికిత్స చేయాలని, అత్యవసర ఆపరేషన్లు నిర్వహించాలన్నా హెచ్ఐవీ, హెపటైటీస్ బీ వంటి పరీక్షలు ఖచ్చితంగా చేయాల్సి ఉంది. అయితే 24 గంటల లేబరేటరీల సేవలు అందుబాటులోకి రాకపోవడంతో రోగులు వేలాది రూపాయలను కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సి వస్తుంది. సీఎంవోల కొరత ...డీఎంఈ ఆదేశాలు భేఖాతర్... అత్యవసర చికిత్స విభాగంలో కనీసం 10 మందికి పైగా వైద్యులుండాలి . కానీ వారిలో సగం మంది కూడా లేకపోడంతో మూడు నెలలుగా వైద్యులకు సెలవులు ఇవ్వడం లేదు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు తరచూ కోర్టులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో మరీ ఇబ్బందిగా ఉంటుంది. సీఎంవోల కొరత విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యూ సూర్యకుమారి రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల దృష్టికి తీసుకెళ్లడంతో సిద్ధార్థ వైద్య కళాశాలలో ట్యూటర్లుగా ఉన్న ఏడుగురిని సీఎంవోలుగా డెప్యూట్ చేయాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశాలొచ్చాయి. కానీ వారిలో ఇద్దరిని అప్పటికే డెప్యూట్చేయగా, మిగిలిన ఐదుగురిని ప్రిన్సిపాల్ డెప్యూట్ చేయక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఆచరణకు నోచెకోక పోవడంపై పలువురు వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిలో ఒకరికి పదోన్నతి లభించి రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు.అప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. -
పట్టువదలం..పోరు విడవం
= ఉద్యమ విస్తరణ = రంగంలోకి కొత్త జేఏసీలు = తాజాగా ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఏర్పాటు = ఎక్సైజ్ లో మొదలైన సహాయ నిరాకరణ = విజయవాడ వీధుల్లో నినదించిన విద్యార్థినులు సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త పుంతలు తొక్కుతూ ప్రజల్లో సమైక్య స్ఫూర్తి నింపుతోంది. మొన్నటికిమొన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తమ ఉద్యోగులతో కలుపుకొని జేఏసీ ఏర్పాటుచేశారు. అదేరోజు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా జేఏసీగా ఏర్పడ్డారు. వారు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేసి రంగంలోకి దిగారు. తాజాగా శుక్రవారం మరో జేఏసీ రంగంలోకి వచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులతో ఆ జేఏసీ విజయవాడలో పురుడుపోసుకుంది. సుమారు కోటిమంది వరకు విద్యార్థులు వారి నాయకత్వంలో ఉన్నారు. ఈ నెల 19 నుంచి విద్యార్థులు, అధ్యాపకులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఉద్యమం శుక్రవారం కూడా ఉధృతంగా సాగింది. ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సహాయ నిరాకర ణ ఉద్యమం ప్రారంభమైంది. ఎక్కడికక్కడ సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేపట్టారు. అనేకచోట్ల అధికారులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించారు. కొన్నిచోట్ల ధర్నాలు చేశారు. విజయవాడలో విద్యార్థి జేఏసీ నాయకుడు దేవినేని అవినాష్ నాయకత్వంలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు జేఏసీ నాయకులు నిత్యావసర సరకులు అందజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కొండపల్లిలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ రిక్షా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ రిక్షాలతో వలయం ఏర్పాటుచేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 66వ రోజుకు చేరుకున్నాయి. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 59వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు పట్టణ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రిలే దీక్షలు చే పట్టారు. కలిదిండిలో భాస్కరరావుపేట గ్రామస్తులు రిలే దీక్షలు చేశారు. మండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 11 మంది మాజీ సర్పంచ్‌లు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో మండల సమైక్యాంధ్ర పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. గుడివాడలో ఎన్జీవోల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రులో విద్యార్థులు మానవహారం నిర్వహించి ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే డీవైదాస్ కార్యాలయం వద్దకు వెళ్లి విభజనకు వ్యతిరేకంగా ప్రసంగించాలని ఆయన్ని కోరారు. పెనుగంచిప్రోలులో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో విశ్రాంత ఉద్యోగులు కూర్చున్నారు. వత్సవాయిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 45వ రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో దివిసీమలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 63వ రోజుకు చేరాయి. న్యాయవాదుల ఆధ్వర్యంలో చైతన్యయాత్ర... అవనిగడ్డ కోర్టుకు చెందిన న్యాయవాదులు సమైక్యాంధ్ర చైతన్యయాత్రను చల్లపల్లి మండలంలో నిర్వహించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 51వ రోజుకు చేరాయి. చేనేత కార్మికులు దీక్షా శిబిరం వద్ద నూలు వడుకుతూ నిరసన దీక్షలు చేశారు. మోపిదేవిలో బొబ్బర్లంక దళితవాడకు చెందిన రైతులు దీక్ష చేపట్టారు. ఘంటసాల, నాగాయలంక, కోడూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు 10వ రోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసుసెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహించారు. తిరువూరులో జేఏసీ నాయకులు స్థానిక శాసనసభ్యురాలు దిరిశం పద్మజ్యోతి నివాసం వద్ద ధర్నా చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 65వ రోజుకు చేరాయి. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 46వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు.