కొత్త మలుపు! | Attempted sexual assault on Female students | Sakshi
Sakshi News home page

కొత్త మలుపు!

Published Tue, Sep 9 2014 3:53 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

కొత్త మలుపు! - Sakshi

కొత్త మలుపు!

- విద్యార్థినులపై లైంగిక దాడికి యత్నం
- విచారణలో వెలుగు చూసిన కొత్త కోణం
- ప్రిన్సిపాల్  భర్తపై ఆరోపణలు..
 నెల్లిమర్ల : నెల్లిమర్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో ఈ నెల 4న జరిగిన విద్యార్థినులపై లైంగిక దాడి యత్నం కథ కొత్త మలుపు తిరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తి ప్రిన్సిపాల్ భర్తేనని విద్యార్థినులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగంతకుడెవరు? అన్న దానిపై కథ అడ్డం తిరిగింది. సంఘటనకు సంబంధించి పత్రికల్లో ఆలస్యంగా సోమవారం పలు కథనా లు ప్రచురితమవ్వగా స్పందించిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, సాంఘిక సంక్షేమ సొసైటీ జోనల్ అధికారిణి జీవీ శేషుకుమారి కళాశాలలో విచారణ నిర్వహించారు.

కళాశాల సిబ్బంది, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడారు. ఇందులో విద్యార్థినులు ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను వివరించారు. కళాశాల డార్మిటరీలోకి ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి చొరబడిన ఆగంతకుడు తమపై లైంగిక దాడికి పాల్పడగా తాము ప్రతిఘటించామని దాంతో బ్లేడుతో గాయపరిచాడని వెల్లడించారు. ఆ సమయంలో ఆగంతకుడు పూర్తిగా దుస్తులు లేకుండా ఉన్నట్టు చెప్పారు. తమ పక్కన చేరి వికృత చేష్టలకు ప్రయత్నించగా ప్రతిఘటించ డంతో బ్లేడుతో గాయపరచడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని, తెలిస్తే మీ జీవితాలే నాశనమవుతాయని హెచ్చరించినట్టు కన్నీరుమున్నీరై చెప్పారు.

ఇదే సమయంలో పక్క గదిలో నిద్రిస్తున్న విద్యార్థినులకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో ఆగంతకుడు పారిపోయినట్టు తెలిపారు. తాము కేకలు వేసినా వార్డెన్‌గానీ, ఉపాధ్యాయులుగానీ డార్మిటరీలోకి రాలేదని చెప్పారు. ఆగంతకుడు పారిపోయిన తరువాత వాచ్‌మేన్, వార్డెన్ వచ్చారని తెలిపారు. ఆ రాత్రంతా భయంతో మేల్కొనే ఉన్నామని చెప్పారు. చీకట్లో ఆగంతకుడిని గుర్తించలేకపోయూమన్నారు. ఇదే విషయమై స్పందించిన జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి కలెక్టర్‌కు ఈ విషయూలన్నీ నివేదిస్తానని విలేకరుల వద్ద వెల్లడించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతానని చెప్పారు. విచారణలో ఎంపీపీ సువ్వాడ వనజాక్షి కూడా పాల్గొన్నారు.
 
ప్రిన్సిపాల్ భర్తపై అనుమానం
కళాశాల డార్మిటరీలోకి చొరబడిన ఆగంతకుడు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి భర్త సుబ్బారావేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడున్న క్వార్టర్‌లోనే ప్రిన్సిపాల్‌తో కలిసి ఉంటున్నారు. అంతేగాకుండా విద్యార్థినులు చెప్పిన దాన్ని బట్టిచూస్తే ఆయనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది సహకరించారని చెబుతున్నారు.
 
ఫిర్యాదు ఎందుకు చేయలేదు..
సంఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. సదరు వ్యక్తి ప్రిన్సిపాల్‌కు కావాల్సిన వ్యక్తి అరుునందువల్లే విషయూన్ని కప్పిపుచ్చేందుకు దాచి పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఆదివారం ఉదయం ఎవరో ఓ వ్యక్తి కళాశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా సంఘటనను పక్కదారి పట్టించేందుకేనన్న విమర్శలు వస్తున్నాయి.  

విద్యార్థి, మహిళా సంఘాల ఆందోళన
కళాశాలలో జరిగిన సంఘటనపై ఐద్వా మహిళా సంఘం ప్రతినిధులు ఇందిర, రమణమ్మ, లక్ష్మి, సుజాత తదితరులు సోమవారం కళాశాలకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్, వాచ్‌మేన్, వార్డెన్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో సంఘ నేతలకు, ప్రిన్సిపాల్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ కూతురైన వార్డెన్ కూడా సంఘ నేతలపై విరుచుకుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు సైతం కళాశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. సంఘటనకు కారణమైన ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్‌మేన్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ భర్తను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.
 
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : మృణాళిని
నెల్లిమర్ల : నెల్లిమర్ల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఈ నెల నాలుగో తేదీన చోటు చేసుకున్న సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఆమె సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కళాశాలకు విచ్చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉమామేహశ్వరిని సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాత్రి ఎన్ని గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నదీ, పిల్లలు ఎక్కడ నిద్రపోతున్నదీ తదితర వివరాలు అడిగారు.  రాత్రివేళ డార్మిటరీ మెయిన్ గేటు ఎందుకు తెరిచి ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సంఘటనకు ప్రత్యక్ష సాక్షులైన విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. సంఘటన జరిగిన తీరును మంత్రికి విద్యార్థినులు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు.
 
బాధ్యులైన వారిపై తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యుడు ఎస్. బాలరాజు కూడా రాత్రి 8 గంటల ప్రాంతంలో కళాశాలను సందర్శించారు. జరిగిన సంఘటనపై విద్యార్థినులను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, డీఈఓ కృష్ణారావు తదితరులు కూడా సోమవారం రాత్రి కళాశాలకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement