నాసిరకం భోజనంపై ఆగ్రహించిన ఎస్వీయూ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు
పరిపాలనా భవనం వద్ద నిరసన
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా): ఎస్వీ యూనివర్సిటీ హాస్టళ్లలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని వర్సిటీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ఎస్వీయూ పరిపాలన భవనం వద్ద హాస్టల్ సమస్యలపై పీజీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ హాస్టల్ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు.
బుధవారం రాత్రి పాచిపోయి వాసన వస్తున్న చికెన్ విద్యార్థినులకు వడ్డించారని మండిపడ్డారు. నాసిరకం కూరగాయలతో ప్రతినిత్యం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, వాష్‌రూమ్స్ వంటి మౌలిక సదుపాయాలు సరిగాలేకపోవడంతో విద్యార్థినులు సతమతమవుతున్నారన్నారు. ఒక్కోవిద్యార్థినీ నుంచి నెలకు రూ.3వేలకు పైగా మెస్ బిల్లు వసూలు చేస్తూ రోజూ పప్పునీళ్లే వడ్డిస్తున్నారని ఇన్‌చార్జి రిజిస్ట్రార్ చంద్రయ్యను నిలదీశారు. సమస్యను పరిష్కరిస్తామంటూ రిజిస్ట్రార్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment