women hostel
-
విద్యార్థినుల జీవితాలతో ఆటలా?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా): ఎస్వీ యూనివర్సిటీ హాస్టళ్లలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని వర్సిటీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ఎస్వీయూ పరిపాలన భవనం వద్ద హాస్టల్ సమస్యలపై పీజీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ హాస్టల్ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు.బుధవారం రాత్రి పాచిపోయి వాసన వస్తున్న చికెన్ విద్యార్థినులకు వడ్డించారని మండిపడ్డారు. నాసిరకం కూరగాయలతో ప్రతినిత్యం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, వాష్‌రూమ్స్ వంటి మౌలిక సదుపాయాలు సరిగాలేకపోవడంతో విద్యార్థినులు సతమతమవుతున్నారన్నారు. ఒక్కోవిద్యార్థినీ నుంచి నెలకు రూ.3వేలకు పైగా మెస్ బిల్లు వసూలు చేస్తూ రోజూ పప్పునీళ్లే వడ్డిస్తున్నారని ఇన్చార్జి రిజిస్ట్రార్ చంద్రయ్యను నిలదీశారు. సమస్యను పరిష్కరిస్తామంటూ రిజిస్ట్రార్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. -
లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం
బెంగుళూరు: మైసూరులోని లేడీస్ హాస్టల్లో 23 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మైసూరులోని లేడీస్ హాస్టల్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో గాయపరిచాడు. బాధితురాలి సహచరులు తిరిగి హాస్టల్‌కి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఓ మత అధ్యయన కేంద్రంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడు ఒకరికొకరు తెలిసిన వారేనని పోలీసులు వెల్లడించారు. చదవండి: పోలీసులమంటూ బురిడీ: పక్కా స్కెచ్.. రూ.50 లక్షలు దోపిడీ కాగా లా అండ్ ఆర్డర్ డీసీపీ ప్రదీప్ గుంటి ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసు అధికారులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. బాధితురాలు, ఆమె స్నేహితులు, హాస్టల్లోని సహచరుల చెప్పిన వివరాలను రికార్డ్ చేశారు. కాగా మొదట గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే పోలీసులు ఆమెను ప్రశ్నించిన తర్వాత నిందితుడు తెలిసిన వ్యక్తిగా తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆగస్టు 24 న లలితాద్రిపుర ప్రాంతానికి సమీపంలో చాముండి కొండ దిగువన మైసూరు శివార్లలో మరో గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: మూణ్నెళ్ల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే -
లేడీస్ హాస్టళ్లలో ఒంటరిగా ఉన్న యువతులపై..
బెంగళూరు: మూడేళ్ల క్రితం అత్యాచారం కేసులో అరెస్టయిన శివరామ రెడ్డి అనే నిందితుడు.. జైలు నుంచి విడుదలయ్యాక మరో ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన శివరామ రెడ్డి 15 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నాడు. 2014లో రేప్ కేసులో అరెస్టయి.. 2015లో జైలు నుంచి విడులయ్యాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. బెంగళూరులో ఒంటరిగా మహిళలను, ముఖ్యంగా మహిళల హాస్టళ్లను లక్ష్యంగా చేసుకునేవాడు. ఈ నెల 2న కత్తితో బెదిరించి హాస్టల్లో తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని 23 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు రోజుల తర్వాత మరో హాస్టల్లో ఉంటున్న మరో యువతి తనపై లైంగికదాడి చేసి, వస్తువులు దోచుకెళ్లాడని ఫిర్యాదు చేసింది. బాధిత మహిళలు చెప్పిన సమాచారాన్ని బట్టి పోలీసులు నిందితుడ్ని శివరామిరెడ్డిగా గుర్తించారు. పోలీసులు అతని పాత ఫోటో చూపించగా, బాధిత యువతులు గుర్తించారు. పోలీసులు పక్కా సమాచారంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా కత్తితో దాడి చేయడంతో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు అతని కాలికి కాల్చి అదుపులోకి తీసుకున్నారు. 2013-14లో అతను పలువురు మహిళలను లైంగికంగా వేధించినట్టు నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే ఏడాదికే జైలు నుంచి బయటకు వచ్చిన శివరామి రెడ్డి మళ్లీ నేరాలబాట పట్టాడు. మొత్తం అతనిపై 16 కేసులు ఉన్నాయి. -
ఉమెన్స్ హాస్టల్లో నగల దోపిడీ
టీనగర్: తిరువాన్మియూరులోని ఉమెన్స్ హాస్టల్లో ముగ్గురు మహిళల వద్ద నగల దోపిడీ జరిగింది. మత్తుమందు కలిపిన విబూది ఇచ్చి గుర్తు తెలియని యువతి తన చేతివాటం ప్రదర్శించింది. హాస్టల్ వాచ్‌మన్ సహా నలుగురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరువాన్మియూరు 16వ తూర్పు వీధిలో వర్కిం గ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. ఇక్కడ అనేక మంది మహిళలు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సుమారు 20 ఏళ్ల యువతి ఒకరు హాస్టల్‌కు వచ్చారు. తన పేరు కాం చన అని, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం నిమిత్తం చెన్నైకు వచ్చినట్లు, ఇక్కడ తన కెవ్వరూ తెలియదంటూ పరిచయం చేసుకుంది. బస చేసేందుకు వీలు కల్పించాలని కోరింది. దీంతో నిర్వాహకురాలు యువతికి ఆశ్రయమిచ్చింది. అక్కడి మహిళలందరితో పరిచయం పెంచుకుంది. శనివారం సాయంత్రం ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పి కాంచన రాత్రి తొమ్మిది గంటలకు హాస్టల్‌కు చేరుకుంది.అక్కడి వాచ్‌మెన్‌కు ఉడకబెట్టిన గుగ్గిళ్లు ఇచ్చింది. తర్వాత లోపలికి వెళ్లి గదిలో ఉన్న మహిళలు వలర్మతి, సోనా, శరణ్యలకు విబూది ఇచ్చి తినమంది. దీంతో మహిళలు ముగ్గురు విబూది కలిపిన నీటిని సేవించారు. దీంతో వారందరూ స్పృహ తప్పారు. వారు ధరించిన నగలను తీసుకుని ఉడారుుంచింది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళలను, వాచ్‌మన్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తిరువాన్మియూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో ఎనిమిది సవర్ల నగలు దోపిడీకి గురైనట్లు తెలిసింది.