టీనగర్: తిరువాన్మియూరులోని ఉమెన్స్ హాస్టల్లో ముగ్గురు మహిళల వద్ద నగల దోపిడీ జరిగింది. మత్తుమందు కలిపిన విబూది ఇచ్చి గుర్తు తెలియని యువతి తన చేతివాటం ప్రదర్శించింది. హాస్టల్ వాచ్‌మన్ సహా నలుగురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరువాన్మియూరు 16వ తూర్పు వీధిలో వర్కిం గ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. ఇక్కడ అనేక మంది మహిళలు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సుమారు 20 ఏళ్ల యువతి ఒకరు హాస్టల్‌కు వచ్చారు. తన పేరు కాం చన అని, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం నిమిత్తం చెన్నైకు వచ్చినట్లు, ఇక్కడ తన కెవ్వరూ తెలియదంటూ పరిచయం చేసుకుంది. బస చేసేందుకు వీలు కల్పించాలని కోరింది. దీంతో నిర్వాహకురాలు యువతికి ఆశ్రయమిచ్చింది. అక్కడి మహిళలందరితో పరిచయం పెంచుకుంది.
శనివారం సాయంత్రం ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పి కాంచన రాత్రి తొమ్మిది గంటలకు హాస్టల్‌కు చేరుకుంది.అక్కడి వాచ్‌మెన్‌కు ఉడకబెట్టిన గుగ్గిళ్లు ఇచ్చింది. తర్వాత లోపలికి వెళ్లి గదిలో ఉన్న మహిళలు వలర్మతి, సోనా, శరణ్యలకు విబూది ఇచ్చి తినమంది. దీంతో మహిళలు ముగ్గురు విబూది కలిపిన నీటిని సేవించారు. దీంతో వారందరూ స్పృహ తప్పారు. వారు ధరించిన నగలను తీసుకుని ఉడారుుంచింది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళలను, వాచ్‌మన్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తిరువాన్మియూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో ఎనిమిది సవర్ల నగలు దోపిడీకి గురైనట్లు తెలిసింది.
ఉమెన్స్ హాస్టల్లో నగల దోపిడీ
Published Mon, Jan 26 2015 3:33 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM
Advertisement