Jewellery Case
-
బురఖాతో సొంత ఇంటిలోనే చోరీ!
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ విచిత్ర దొంగతనం వెలుగు చూసింది. ఓ కుమార్తె తన తల్లికి చెందిన లక్షల నగదు, నగలు చోరీ చేసింది. వాటితో సహా అక్కడి నుంచి ఉడాయించింది. అయితే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన జిల్లా పోలీసుల యాంటీ బర్గ్లరీ సెల్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారక డీసీపీ అంకిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి 30న ఉత్తమ్ నగర్‌లోని సేవక్ పార్క్‌లో నివసిస్తున్న కమలేష్ అనే మహిళ తన ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష రూపాయలతో పాటు విలువైన బంగారం, వెండి నగలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. నేరం చేయడానికి ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని ద్వారక జిల్లా యాంటీ బర్గ్లరీ సెల్ దర్యాప్తులో తేలింది. మెయిన్ డోర్ తాళం, అల్మారా పగలగొట్టి కూడా ఉండకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన బృందం నల్ల బురఖా ధరించిన ఓ మహిళ అనుమానాస్పదంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అనంతరం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మరెవరో కాదు పోలీసులకు ఈ చోరీపై ఫిర్యాదు చేసిన మహిళ పెద్ద కుమార్తె శ్వేత(31). తన తల్లి తన చెల్లెలిపై అమితమైన శ్రద్ధ వహిస్తుండటంతో శ్వేతలో అసూయ, ద్వేషం కలిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికితోడు ఆమె తిరిగి చెల్లించాల్సిన అప్పులు కూడా చాలానే ఉండటంతో సొంత ఇంటిలోనే చోరీకి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 30న శ్వేత తల్లి కమలేష్ ఇంటికి తాళం వేసి, కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లింది. ఇంతలోనే బయటి నుంచి బురఖాతో వచ్చిన శ్వేత తన దగ్గరున్న డూప్లికేట్ తాళంతో ఇంటి గేటు తీసి, లోనికి ప్రవేశించి తల్లి గదిలోని నగలు, నగదు చోరీ చేసింది. ఆ నగలను శ్వేత ఒక దుకాణంలో విక్రయించిందని పోలీసులు గుర్తించారు. ఆ నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మీనా జ్యువెలర్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
-
ఆభరణాల మోసం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
తిరువనంతపురం : ఆభరణాల పెట్టుబడి మోసం కేసులో ఐయుఎంఎల్ ఎమ్మెల్యే ఎంసి కమరుద్దీన్‌ను శనివారం కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. కాగా కమరుద్దీన్ కాసర్గోడ్ జిల్లాలోని మంజేశ్వర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కమరుద్దీన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఫ్యాషన్ గోల్డ్ జ్యువెల్లరీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ చాలామందిని ప్రభావితం చేసినట్లుగా తేలింది. కమరుద్దీన్‌పై ఉన్న నమ్మకంతో వందలాది మంది ఫ్యాషన్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారు. అయితే గత జూలైలో వ్యాపారంలో ఆర్థికంగా నష్టంరావడంతో ఫ్యాషన్ గోల్డ్ బోర్డు తిప్పేసింది. కాగా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి కనీసం తమ వాటా కూడా రాలేదు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఎమ్మెల్యే కమరుద్దీన్‌తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కాగా కమరుద్దీన్‌పై 115 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదులపై దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దీనిలో భాగంగానే సెక్షన్ 420 కింద కమరుద్దీన్ అరెస్ట్ చేసిన సిట్ బృందం శనివారం దాదాపు 5గంటల పాటు విచారణ చేసింది. కాగా అరెస్టు తరువాత వైద్య పరీక్షల నిమిత్తం కమరుద్దీన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మీడియాతో మాట్లాడిన ఆయన తన అరెస్ట్ రాజకీయంగా ప్రేరేపించబడిందని అన్నారు. -
వృద్ధురాలి హత్య కేసులో వీడని మిస్టరీ
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: నగల కోసం వృద్ధురాలి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. రాజమహేంద్రవరం, నారాయణపురం ఎఫ్‌సీఐ గోడౌన్స్ పక్కవీధి, సైక్లోన్ కాలనీలో నివసిస్తున్న దేవాదుల శ్యామల(60) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ సంఘటనలో నిందితులు రక్త సంబంధీకులేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒంటరిగా నివసిస్తున్న శ్యామల ఒంటిపై బంగారు నగలు ఉండడం గమనించిన రక్త సంబంధీకులు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం ఆమెను హత్య చేసి నగలు చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలికి వరుసకు కుమారుడయ్యే ఇన్నీసుపేటకు చెందిన దేవాదుల నాగేశ్వరరావు అనే వ్యక్తిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు మృతురాలికి బావ గారి కుమారుడు. ఇతడికి వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో చెడు వ్యసనాలకు బానిసైన నాగేశ్వరరావు అప్పుల పాలయ్యాడు. దీనితో పనిలేక జులాయిగా తిరుగుతూ ఉంటాడని, ఈ సంఘటనలో ఇతడి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు అదే కుటుంబంలో మృతురాలు ఒంటరిగా ఉంటుందని తెలిసిన రక్త సంబంధీకులెవరికైనా ఈ సంఘటనతో సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో బయటవారి వేలి ముద్రలు లభించలేదు. ఎక్కువగా కుటుంబ సభ్యులవి లభించాయి. ఈ నేపథ్యంలో తెలిసిన వారే ఈ హత్యకు కారణమై ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి వద్ద కొన్ని నగలు మాత్రమే చోరీకి గురై, మిగిలిన నగలు ఒంటిపై ఉండడం బట్టి చూస్తే చోరీలకు పాల్పడే వ్యక్తులు కాదని భావిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పెద్ద కుమారుడు రంగ కుమార్ (విజిలెన్స్ శాఖలో అసిస్టెంట్ జియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.)తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యంగా ఉన్న మృతురాలు, అంతలోనే మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్థిక అవసరాలు తీర్చుకొనేందుకు ఎవరైనా హత్య చేశారా! లేక వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందితే కుటుంబ సభ్యులు బంగారం చోరీ చేశారా? అనేది పోస్టు మార్టం రిపోర్టులో, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు ఎవరైనా వస్తే కిటికీలో నుంచే సమాధానం చెబుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా పరిచయం ఉన్న వారు వస్తే ఇంటి తలుపులు తీస్తుందని, అప్పటి వరకూ ఇంట్లో తలుపులు వేసుకొని ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హత్య జరగడానికి ముందు వృద్ధురాలికి తెలిసిన వారే వచ్చి ఉంటారని, దీంతో ఇంటి తలుపులు తీసి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో నగల కోసం వృద్ధురాలిని హత్య చేసి, నగలతో పరారై ఉంటారని భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
స్వామివారికి ఇచ్చిన నగలు ఏమయ్యాయి?
-
అందుకే ప్రభుత్వం దిగి వచ్చింది: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో రోజా మాట్లాడారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని.. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్లైన్లో ఉంచాలని, గతంలో ఆన్లైన్లో ఉంచుతామని చెప్పిన జేఈఓ శ్రీనివాస రాజు ఇప్పటివరకు వాటిని పెట్టలేదని వివరించారు. తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయనగరంలో గిరిజన గర్భిణీ మహిళ 12 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి బిడ్డను పోగొట్టుకుంది.. కనీస వైద్య సదుపాయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు అంటే చంద్రబాబుకు పట్టదు.. అందుకే గిరిజన మంత్రిని కూడా నియమించలేదని వెల్లడించారు. -
రుణం పేరుతో మహిళలకు టోకరా
గుంటూరు : బాపట్ల బ్యాంకు ఉద్యోగినంటూ బ్యాంకులో కొద్ది సేపు హడావుడి చేసి ఇద్దరు మహిళల వద్ద ఆరు సవర్ల బంగారు ఆభరణాలతో ఓ నిందితుడు ఉడాయించిన ఘటన బాపట్లలో గురువారం తీవ్ర సంచలనం రేకేత్తించింది. బ్యాంకులో హడవుడి చేసిన నిందితుడు మహిళల ఇంటికి వెళ్లి అక్కడ వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు తీసి సంతకాలు పెట్టించి మరీ బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. బాధిత మహిళలు కె.మరియమ్మ, అలిదిరాణి తెలిపిన వివరాలు మేరకు కొత్తకంకటపాలెంకు చెందిన కె.మరియమ్మ, అలిదిరాణి చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్టేట్‌బ్యాంకులో ముద్రరుణాలు ఇస్తున్నారని తెలుసుకుని గురువారం ఉదయం బ్యాంకుకు వచ్చి అక్కడ పీబీడీ మేనేజర్‌ను కలిశారు. బ్యాంకు ఇప్పుడు రుణాలు ఇవ్వటం లేదని అతను చెప్పటంతో వెనుదిరిగేందుకు యత్నించిన మహిళలను గమనించిన 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న యువకుడు ఓ ఐడీ కార్డుతో వారిని పలకరించాడు. ముద్రరుణాలు కాకుండా మీకు ఒక్కొక్కరికి రూ.3.50లక్షలు వచ్చేవిధంగా వ్యాపారానికి సంబంధించిన రుణాలు ఇప్పిస్తానంటూ చెప్పాడు. మహిళలు ఇంటి వద్ద వారు చేస్తున్న చిరువ్యాపారాలను చూపించాలంటూ నిందితుడు కోరటంతో సరేనన్నారు. వెంటనే బ్యాంకు కిందకు దిగి అప్పటికే అక్కడ ఉన్న ఆటోలో కొత్తకంకటపాలెంకు బయలుదేరారు. ఇంటి వద్ద ఉన్న బొంకును ఫోటోలు తీయటంతోపాటు వారితో బ్యాంకు రుణాలకు సంబంధించిన పత్రాలుగా చెప్పి సంతకాలు చేయించుకున్నాడు. మళ్లీ అదే ఆటోలో తిరిగి బ్యాంకుకు వచ్చి రుణాలు తీసుకోవాలంటూ ముందు బ్యాంకులో ఏదో ఒక రుణం తీసుకోవాలని, బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకోవాలని నమ్మబలికాడు. సరేనని వారి వద్ద ఉన్న గొలుసులు, బంగారు గాజులు అతడికి ఇచ్చారు. అతను తూకం వేయించుకుని వస్తానంటూ చెప్పి ఇలోపు ఫోటోలు దిగి రావాల్సిందిగా చెప్పారు. మహిళలు ఫొటోలు దిగి వెళ్లి విచారించగా అతను కనిపించకుండా ఉడాయించారు. ఆటో డ్రైవర్‌పై కూడా అనుమానాలు.. మహిళలు వారి వ్యాపారాలు చూపించాలని చెప్పి కిందకు దిగిరాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఆటోలో మహిళలతోపాటు నిందితుడు ఎక్కాడు. అయితే ఆటో డ్రైవర్ కూడా సార్ మంచోడమ్మ అంటూ చెప్పటం...మీకు లోన్ వెంటనే ఇప్పిస్తాడంటూ చెప్పటంతో అతడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును పట్టణ ఎస్ఐ అనిల్‌రెడ్డి నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్టేట్‌బ్యాంకులోని సీసీ కెమెరాలలో నిందితుడు గురించి ఆరా తీశారు. నిందితుడినికి సంబంధించిన చిత్రాలు కూడా దొరికినట్లు సమాచారం. అయితే స్టేట్‌బ్యాంకు ఉద్యోగులు, సెక్యూర్టీ విభాగం ఏమి చేస్తున్నారనేది ఖాతాదారులలో చర్చానీయాంశమైంది. అసలు బయట వ్యక్తి వద్ద ఐడీ కార్డు ఎందుకు ఉంది. ఐడీ బ్యాంకుదా? కాదా ఎవరికి సంబంధించిందనే కోణంలో విచారణ చేపట్టారు. -
జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన నటి..?
‘బిగ్ బాస్ 11’ మాజీ కంటెస్టెంట్ హీనా ఖాన్ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ‘బిగ్ బాస్ హౌస్’లో ‘మిస్ రైట్’గా పిలుచుకునే హీనా ఖాన్ గురించి ఇప్పుడు ఒక తప్పుడు వార్త న్యూస్ చానళ్లలో ప్రచారం అవుతుందంట. ఒక బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్, ప్రకటన షూటింగ్ అనంతరం బంగారు ఆభరణాలను కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుందంట. ఇందుకు గాను సదరు కంపెనీ హీనా ఖాన్‌కు లీగల్ నోటీసులు కూడా పంపారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయం గురించి హీనాను అడగ్గా ఆమె దీన్ని ఖండించారు. అనంతరం తన ట్విటర్లో ‘లీగల్ నోటీస్‌లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్‌కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ’ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ‘నా శత్రువులు నన్ను క్షమించాలి. మీ ఈ ఉపాయం పని చేయలేదు. మరి కాస్తా కొత్తగా ట్రై చెయ్యండి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని తెలిపారు. కానీ న్యూస్ చానల్ వారు మాత్రం హీనా ఖాన్ అడ్రస్‌తో ఉన్న లీగల్ నోటీసులను ప్రచారం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా హీనా ఖాన్ మ్యూజిక్ వీడియో ‘భసూది’ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ మ్యూజిక్ వీడియోను ఇప్పటికే 8 లక్షల మంది వీక్షించారు. -
ఓల్డ్ ఈజ్ గోల్డ్..
వడ్డాణం, బంగారు జడ... ఓస్ ఇవి తెలుసు కదా అంటారా? మరి కంకణాలు, కంటెలు..ఈ పేర్లెక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? కానీ కాసుల మాలలు, గుట్ట పూసలు? బాబోయ్ ఇవెక్కడి పేర్లు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరింకా ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’కి దూరంగానే ఉన్నారన్న మాట. ఆనాటి ఆభరణాలు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి.మరోవైపు బరువైనా పరవాలేదంటూ సిటీ మహిళలు పాతకాలం జ్యువెలరీకి పచ్చజెండా ఊపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో : ‘ఏమిటలా ఒంటినిండా ఆభరణాలు దిగేసుకున్నావ్? గుళ్లో అమ్మవారిలా?’ అంటూ ఆభరణ ప్రియులైన మహిళల్ని ఆటపట్టించే రోజులు గతించనున్నాయి. నడుముకి వడ్డాణాలు, బంగారపు పూల జడలు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్‌లు తదితర ఒకప్పటి ఫ్యాషన్లే కావచ్చు. కానీ ఇవే ఇప్పుడు ట్రెండ్. పాతే వింత అంటున్న ఆధునికులు... మోటుగా ఉంటాయంటూ తీసిపారేసిన నగల్నే మోజుగా ఆదరిస్తున్నారు. అంతేకాదు... మరింతగా వెనక్కెళ్లి శోధించి, మరీ పురాతన ఆభరణ శైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, అవ్వల కాలం నాటి స్టైల్స్‌కు ప్రాణం పోస్తున్నారు. కాసుల గలగల.. కాసుల పేర్లంటూ ఆనాటి ఆభరణం మరోసారి కొత్తగా సవ్వడి చేస్తోంది. ఆధునిక మహిళల మెడలో గలగలమంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీకాసుల మాలలు ఇప్పుడు ట్రెండీ. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగో మాలలని పిలుస్తున్నారు. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల కనీసం 30–300 గ్రాముల బరువు ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. కొత్తవాటి ‘కంటె’ మిన్న.. ఒకప్పటి సంప్రదాయ ఆభరణమైన కంటెలు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. వీటిని రాజుల కాలంలో ధరించేవారట. ఇటీవల మహానటి సినిమాలో కీర్తి సురేష్ «సైతం ధరించింది. కాళ్ల పట్టీల టైప్‌లో ఉండే వీటిని మెడలో ధరిస్తారు. ఇది చూడ్డానికి థిక్‌గా ఒక రాడ్లా ఉంటుంది. దీనికే పెండెంట్స్,పెరల్ డ్రాప్స్ జోడించడం, స్టోన్స్‌తో కార్వింగ్ చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నారు. రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వీటి ధరలు ఉంటున్నాయి. గుట్టలు గుట్టలుగా... అలనాటి తెలంగాణ సంప్రదాయ ఆభరణం గుట్ట పూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. వీటిని షేప్‌లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించొచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వివిధ ధరల్లో లభిస్తున్నాయి. కంకణం కట్టుకుంటున్నారు.. మోచేతి అందాన్ని పెంచే గాజులకు ముందుగా బంగారు కంకణం ధరించడమనేది చాలా పాతకాలం నాటి ఆభరణాల శైలి. అయితే ఆధునికులు కూడా దీన్ని అనుసరిస్తున్నారు. రెండు చేతులకూ గాజులతో పాటు ఒక్కో కంకణం తొడుగుతున్నారు. ఇవి చూసేందుకు లావుగా ఉంటాయి. ఒక్కోటి 30 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉంటాయి. ధర రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. వేడుకల్లో తప్పనిసరి... మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. ఓల్డ్ ట్రెండ్స్‌ని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాతకాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవే. అయితే గతంలో ఉన్నత స్థాయి వాళ్లు మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మిడిల్‌క్లాస్ కూడా వీటినే ఎంచుకుంటున్నారు. – శ్వేతారెడ్డి, డిజైనర్, హియా–లాస్య జ్యువెలర్స్ -
గిన్నిస్ బుక్ రికార్డులో ఉంగరం
-
భారీ మోసం.. జ్యువెలరీ షాపు ఎండీ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మీనా జ్యువెలరీ ఎండీ భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నగల దుకాణం ఎండీ ఉమేష్ జత్వాని ఎల్లారెడ్డిగూడాలోని ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ వద్ద రూ. 6 కోట్లు చిట్టీల రూపంలో తీసుకున్నారు. అతను చిట్టీ వాయిదాలు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో చిట్ ఫండ్ వారికి అనుమానం వచ్చింది. అంతేకాక ఆ ఎండీ అకౌంట్ క్లోజ్ చేసిన చెక్కులు ఇచ్చి మోసం చేశాడని చిట్ ఫండ్ కంపెనీ చైర్మన్ హనుమంతరావు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బంజరాహిల్స్‌లోని మీనా జ్యువెలరీ ఎండీ ఉమేష్ జత్వాని, అతని కొడుకు కరణ్ జత్వానిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
6,690 వజ్రాల ‘గిన్నిస్’ ఉంగరం
సూరత్ : గుజరాత్‌లోని సూరత్ వజ్రాల రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. సూరత్‌కు చెందిన ఆభరణాలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. అంతేకాక ఉంగరంలో మొత్తం 6,690 వజ్రాలను తయారీదారులు పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. విశాల్ అగర్వాల్, ఖుష్బూ అగర్వాల్‌లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్‌తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు ప్రకారం.. ఉంగరం విలువ రూ. 28 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ చేతి ఉంగరంపై దాదాపు 48 తామర పువ్వు రేకులు ఉన్నాయి. ఆ రేకులలో మొత్తం వజ్రాలను సెట్ చేశారు. ఈ లోటస్ డైమండ్ రింగ్ దాదాపు 58 గ్రాముల బరువు ఉందట. దీన్ని తయారు చేయటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఉంగరం తయారీదారులు మాట్లాడుతూ.. ప్రజలలో నీటి పొదుపుపై అవగాహన తేవడానికి ఈ రింగ్‌ను రూపొందిచమన్నారు. ఈ లోటస్ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాక ఈ రింగ్‌పై నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఉంగరం తయారీ వీడియోను గిన్నిస్ బుక్ తన ఫేస్బుక్లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొద్ది సమయంలో లక్షల మంది ఈ వీడియోను చూశారు. ‘ఈ ఉంగరం పెట్టుకున్న వారు భద్రతా కోసం చుట్టూ మనుషులను పెట్టుకోవాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ‘ఎందుకు డబ్బు వృద్ధా’ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఉంగరం తయారీ వీడియో చూసిన ఓ నెటిజన్ ‘వావ్ అమెజింగ్ వర్క్’ అని ప్రశంసలు కురిపించాడు. -
శ్రీవారి నగలపై హైకోర్టుకు సీఎం లేఖ!
-
ఫేస్బుక్ ప్రేమ కోసం..
చిత్తూరు, పాకాల: తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులను పక్కదారి పట్టించాలని యత్నించిన ఓ వివాహిత, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామలింగమయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. పాకాల గాంధీనగర్‌కు చెందిన స్వాతిప్రియ మే 11న రైల్వే కాలనీలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారంచల్లి 176 గ్రాముల బంగారు నగలు దోచుకెళ్లారని ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తు న్న పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు విచారణలో వెల్ల్లడయ్యాయి. వివాహిత స్వాతిప్రియకు ఫేస్బుక్లో తూర్పు గోదావరి జిల్లా కరప మండలం నడకుడూరుకు చెందిన పవన్‌కుమార్ అలియాస్ (అఖిల్)(25)తో పరిచయం ఏర్ప డి ప్రేమకు దారి తీసింది. దీంతో ఇరువురు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని పథకం ప్రకారం ఆమె వద్దనున్న నగలను పవన్‌కుమార్‌ని నేండ్రగుంట వద్దకు రమ్మని అతనికి అందజేసింది. తరువాత రైల్వే కాలనీకి చేరుకుని గుర్తు తెలియని వ్యక్తులు తన వద్ద నుంచి నగలు లాక్కెళ్లారని గగ్గోలు పెట్టింది. అయితే విచారణలో అసలు విషయం తెలియడంతో ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పవన్ కుమార్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. -
తిరుమల: అరగంటలో ఆభరణాల పరిశీలన!
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి పలువురు భక్తులు సమర్పించిన వెలకట్టలేని ఆభరణాలు మాయమైనట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించిన టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం వీటిని పరిశీలించారు. అయితే అసలు ఏడుకొండలవాడికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయనే వివరాలను తెలుసుకోకుండానే ఈ కార్యక్రమాన్ని ఆగమేఘాలపై అరగంటలో ముగించడం గమనార్హం. పాలకమండలి సభ్యులు మంగళవారం తిరుమలలో మరోసారి భేటీ కానున్నారు. రిజిస్టర్లో 1200కిపైగా ఆభరణాలు శ్రీవారికి భక్తులు సమర్పించిన అపురూపమైన పలు ఆభరణాలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తామంటూ సోమవారం ఆలయంలోకి వెళ్లిన టీటీడీ పాలకమండలి సభ్యులు మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారి తిరువాభరణ రిజిస్టర్లో 1200కిపైగా ఆభరణాలున్నాయి. కనీసం రిజిస్టర్లో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో కూడా తెలుసుకోకుండానే సభ్యులు పరిశీలన పూర్తి చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలైనవేనా...? తిరువాభరణ రిజిస్టర్లో నమోదు చేసిన ప్రకారం ఆభరణాలు అన్నీ ఉన్నాయా? వజ్రాలు, విలువైన రాళ్లతో పొదిగిన ఆభరణాలెన్ని? అవన్నీ అసలైన ఆభరణాలేనా? అనేది తేలాల్సి ఉంది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో ప్రధానమైనది డైమండ్ అదృశ్యం. శ్రీవారి హారంలో వజ్రం ఉండేదని, తరువాత దాన్ని మాయం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని రాములవారి ఆలయంలో అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణం బయట పడటం గతంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆభరణాలు అసలైనవేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తెరదించాలంటే తూతూమంత్రంగా కాకుండా ప్రతి ఆభరణంపై నిశితంగా పరిశీలన జరగాలి. ఆభరణాలపై సభ్యుల సంతృప్తి శ్రీవారి ఆభరణాలన్నీ పక్కాగా ఉన్నాయని పరిశీలన అనంతరం పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అయితే రిజిస్టర్ ప్రకారం అన్నిటినీ పరిశీలించటం సాధ్యం కాలేదని చెప్పారు. మచ్చుకు కొన్ని ఆభరణాలను మాత్రమే పరిశీలించామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని, ఇటీవల మరింత పటిష్టం చేశారని చెప్పారు. నాలుగో, ఐదో ఉన్నాయి.. శ్రీవారికి ఆరు బంగారు కిరీటాలు, ఆరు వజ్ర కిరీటాలతో పాటు చిన్న చిన్న ఆభరణాలు అధికంగా ఉన్నాయని బోర్డు సభ్యుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. అయితే బోర్డు సభ్యులు మాత్రం నాలుగో, ఐదో కిరీటాలు ఉన్నాయని... చిన్నవి, పెద్దవి చాలా ఉన్నాయని చెప్పటంపై దేవస్థానం అధికారులు విస్తుపోతున్నారు. చిన్న చిన్న ఆభరణాల సంగతి ఎలా ఉన్నా కనీసం శ్రీవారికి కిరీటాలు ఎన్ని ఉన్నాయో కూడా బోర్డు సభ్యులు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదని దేవస్థాన సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
విషాదం: కొడుకు ఎదుటే తండ్రి కాల్చివేత
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పట్టపగలే దోపిడీ చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు ఆభరణాలను దోచుకోవడంతో పాటు అక్కడే ఉన్న షాప్ యజమాని హేమంత్ కౌశల్‌ను కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ఆదర్శనగర్‌లో మంగళవారం జరిగింది. అయితే, ఈ ఘటనలో దొంగతనానికి, తండ్రి చావుకు కొడుకు ప్రత్యక్ష సాక్షిగా నిలవడం విషాదకరం. కౌశల్ కొడుకు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు దుండగులు హెల్మెట్ ధరించి షాప్‌లోకి చొరబడ్డారు. హెల్మెట్ తీయాలని దుకాణంలో పనిచేసే అశోక్ కుమార్ వారిని కోరగా.. తుపాకితో దుండగులు అతన్ని బెదిరించారు. మీ యజమానిని పిలవమని ఆదేశించారు. అశోక్ పిలుపుతో అక్కడే మరో గదిలో ఉన్న నాన్న అక్కడికి వచ్చారు. షాప్‌లో ఉన్న బంగారమంతా ఇవ్వాలనీ, లేదంటే నీ కొడుకును చంపేస్తామని దుండగులు నాన్నను బెదిరించార’ని ఎనిమిదో తరగతి చదువుతున్న కౌశల్ కొడుకు చెప్పుకొచ్చాడు. ‘వాళ్ల బెదిరింపులకు భయపడిన నాన్న.. బంగారం తీసుకుపొండి, నా కొడుకును మాత్రం ఏం చేయొద్దని వేడుకున్నాడు. దొంగలు ఉన్నదంతా దోచుకుని పరారవుతున్న క్రమంలో నాన్న వాళ్ల కాళ్లపై పడి.. నా కొడుకు భవిష్యత్ కోసం కొంచెం బంగారం మిగిల్చి వెళ్లాలని వేడుకున్నాడు. దాంతో ఒకడు నాన్నను సోఫాలో పడేసి కాలితో తన్నాడు. మరొకడు తుపాకితో నాన్నపై పలుమార్లు కాల్పులు జరిపాడ’ని తండ్రిని గుర్తు చేసుకుని కౌశల్ కొడుకు భోరున విలపించాడు. మరోవైపు ఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా దోపిడీ ముఠాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి సమాచారం లభించలేదు. కాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామనీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల్ని పట్టుకుటామని పోలీసు కమిషనర్ అస్లాం ఖాన్ తెలిపారు. -
ప్లాటినంపై యువత మోజు
కొరుక్కుపేట: ప్లాటినం నగలపై యువతకు మోజు పెరగుతుందని, దీంతో ప్లాటినం అమ్మకాలు పెరుగున్నాయని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) మేనేజింగ్ డైరెక్టర్ వైశాలి బెనర్జీ అన్నారు. సోమవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆమె మట్లాడారు. ప్లాటినం జ్యువెలరీ బిజినెస్ రివీవ్– 2017 ఇటీవల చేపట్టామన్నారు. అందులో ఇండిపెండెంట్ ప్లాటినం మార్కెట్ నిపుణులు, ఇండస్ట్రీ అనలిస్ట్ సంయుక్తంగా భారత్‌లో కన్సూమర్ రీటైల్ సేల్స్ గ్రోత్‌పై సర్వే నివేదికను అందించారన్నారు. భారత్‌లో ప్లాటినం మార్కెట్ గ్రోత్ పటిష్టంగా ఉందన్నారు. రీటైల్ సేల్స్ 21 శాతం ఏటా పెరుగుతున్నాయన్నారు. ఫ్యాబ్రికేషన్ డిమాండ్ గ్రోత్ ఏడాది ఏడాదికి 34 శాతం పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రసుత్తం ప్యాషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో యువత సైతం ప్లాటినం జ్యువెలరీపై మోజు పెరుగుతుందన్నారు. బ్రైడల్ మార్కెట్ సైతం చైనా, జపాన్, యూఎస్‌తోపాటు భారత్‌లో పెరుగుతుందన్నారు. -
శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
తిరుమల శ్రీవారికి చెందిన వేల కోట్ల విలువజేసే ఆభరణాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చెన్నై మీడియా సమావేశంలో అప్పటి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు స్వామివారి ఆభరణాలపై సందేహాలను వ్యక్తం చేసినప్పటి నుంచీ భక్తుల్లో అనుమానాలు మరింత పెరిగాయి. శ్రీకృష్ణదేవరాయల ఆభరణాలను ప్రత్యక్షంగా చూసి వాటిపై కొద్దోగొప్పో అవగాహన ఉన్న రమణ దీక్షితులు వంటి ప్రముఖ వ్యక్తే సందేహాలను వెలిబుచ్చడం చర్చకు దారి తీసింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన వేల కోట్ల ఖరీదుజేసే బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాల భద్రతపై టీటీడీ వర్గాలు నోరు మెదపడం లేదు. మూడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు, మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. దీంతో రాయల వారి నగలపై స్పష్టమైన వివరణ ఇవ్వడంలో టీటీడీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత మంగళవారం చెన్నైలో అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీలో వంశపారంపర్యంగా వస్తున్న అర్చక వారసత్వాన్ని రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధ«మని రమణ దీక్షితులు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారి బంగారు ఆభరణాల భద్రతను ప్రశ్నించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో స్వామి వారికి అందజేసిన వేల కోట్ల విలువజేసే ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి... ఎంత మేరకు భద్రంగా ఉన్నాయని టీటీడీ అధికారులను నిలదీశారు. ఆభరణాల లెక్కలను బహిరంగపరిచి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని రమణ దీక్షితులు టీటీడీ వర్గాలను కోరారు. కొత్తగా స్వామి వారికి కా నుకల రూపంలో అందిన ఆభరణాలను మాత్రమే ఉత్సవాల సమయంలో అలంకరిస్తున్నారనీ, పాత నగలను బయటకు తీయడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవలనే టీటీడీకి చెందిన రూ.1000 కోట్ల నగదును అధికారులు ఓ ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో భద్రతను ప్రశ్నిస్తూ శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో డిపాజిట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. సరైన సమాధానం చెప్పలేక టీటీడీ అధికారులు సతమతమయ్యారు. ఈ నెల 16న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సదరు డిపాజిట్ల పర్యవేక్షణ కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ సుధాకర్‌యాదవ్ వెల్లడించారు. ఒకవైపు డిపాజిట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రీవారి విలువైన ఆభరణాలపై సందేహాలు వెల్లువెత్తడం టీటీడీ వర్గాలను కుదిపేస్తోంది. కచ్చితమైన సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలే పరిస్థితి నెలకొంది. అయితే కొత్తగా విధుల్లో చేరిన నూతన ప్రధాన అర్చకులు మాత్రం ఆభరణాలకు చెందిన రికార్డులన్నీ ఉన్నాయని బదులిచ్చారు. లోగుట్టు పెరుమాళ్ల కెరుక.... 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలు తిరుమలాదేవి, చిన్నమదేవితో కలిసి 7 సార్లు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. అప్పట్లో రాయలవారు దర్శనానికి వచ్చిన ప్రతిసారీ విలువైన బంగారు, వజ్ర, నవరత్నాలతో కూడిన వజ్ర కిరీటాలు, భుజకీర్తులు, కంఠహారాలు, స్వర్ణ ఖడ్గాలను స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించారు. 1513 ఫిబ్రవరి 10వ తేదీ తొలిసారి సందర్శించినపుడు నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అందజేశారు. అదే సంవత్సరం మే 2వ తేదీ రెండోసారి రాయల వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అప్పట్లో మరో కిరీటం, పతకాలు, హారాలు, వెండి హారతి పళ్లాలు అందజేశారు. ఆ తరువాత పుత్రసంతానం కలిగాక భార్య తిరుమలాదేవితో కలిసి వచ్చి (1518 అక్టోబర్ 16) తిరుమల వెంకన్నను దర్శించి బంగారు పీతాంబరాలు, నవరత్నాలను సమర్పించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మహంతుల కాలంలో కొన్నింటిని కరగబెట్టి కొత్త ఆభరణాలు చేయించే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. ఆ తరువాత 1996 వరకూ కొన్ని ఆభరణాలను అడపా దడపా స్వామి వారికి అలంకరిస్తూ వచ్చారు. ఆ తరువాత కొత్త ఆభరణాలు వచ్చి చేరుతుండటంతో పాత వాటి జోలికెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో అసలు రాయల వారి ఆభరణాల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా టీటీడీ వర్గాలు భక్తుల సందేహాలకు సరైన సమాధానం చెప్పి భక్తుల్లో నమ్మకాన్ని, భరోసాను పెంచాల్సిన అవసరం ఉంది. అధికారులు సమాధానం చెప్పాలి శ్రీవారికి ఉన్న వేల కోట్ల విలువైన ఆభరణాలపై భక్తుల్లో అనుమానాలు తీవ్రతరంకాక ముందే టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. ఏఏ ఆభరణాలు ఎక్కడ, ఏ రకమైన భద్రతలో ఉన్నాయో వివరిం చాలి. సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకులై, ఆగమ సలహాదారులుగా వ్యహరించిన రమణ దీక్షితుల వంటి పెద్దలు సందేహాలను వ్యక్తం చేయడం చూస్తే ఏదో జరుగుతోందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్పీఎస్ కన్వీనర్, తిరుపతి ఆభరణాల నిర్వహణ లోపభూయిష్టం స్వామి వారి ఆభరణాల నిర్వహణ బాధ్యతలు సరిగా లేవు. అంతా లోపభూయిష్టంగా ఉంది. కోట్ల విలువైన ఆభరణాలపై కనీస జబాబుదారీతనం లేకుండా పోయింది. ఆభరణాలను భక్తుల సందర్శన కోసం ఉంచడం శ్రేయస్కరం. – పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేథావుల ఫోరం -
అన్న బాటలోనే చెల్లెలు
హైదరాబాద్, నాగోలు: స్నేహితురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఓ యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో యువకుడిని మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. హయత్‌నగర్ ఆర్టీసీకాలనీకి చెందిన ఆరాధనరెడ్డి అనే విద్యార్థిని. రామంతాపూర్ ఇందిరానగర్‌కు చెందిన ఉమేష్ (19) స్నేహితులు. ఆరాధన రెడ్డి సోదరుడు అమర్ రాజ్‌కుమార్‌రెడ్డి అలియాస్ డోల మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతనిపై పీడీయాక్ట్ నమోదు చేయగా ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతని సోదరి ఆరాధనరెడ్డి అన్న చోరీ చేసిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి నగదు రూపంలోకి మార్చేది. అమర్ రాజ్‌కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె ఉమేష్‌తో కలిసి చోరీలకు పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈ నెల 9న ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌లో ఉంటున్న తన స్నేహితురాలైన భావిక ఇంటికి వెళ్లింది. ఉమేష్ బయటే ఉండగా ఆరాధనరెడ్డి భావికను మాటల్లో పెట్టి ఇంట్లో ఉన్న 17 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు భావిక ఇంట్లో దొరికిన రాజ్‌కుమార్‌రెడ్డి ఫోటో ఆధారంగా ఆరాధనరెడ్డి, ఉమేష్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తుతో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రాచకొండ క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, మీర్‌పేట సీఐ మన్మోహన్, డీఐ మధుసూదన్, ఏడీఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతి కళ్లలో కారం చల్లి నగలు దోపిడీ
చిత్తూర్, పాకాల: మండల కేంద్రమైన పాకాలలో శుక్రవారం మధ్యాహ్నం దుండగులు యువతి కళ్లలో కారం చల్లి నగలు దోపిడీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక గాంధీనగర్‌కు చెందిన దిలీప్ చక్రవర్తి భార్య స్వాతిప్రియ ద్విచక్ర వాహనంలో రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న కోదండరామాలయానికి వెళ్లింది. పూజలు చేసుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండగులు ఆమెను అడ్డగించి కళ్లలో కారం చల్లారు. ఆమె ఒంటిపై ఉన్న 208 గ్రాముల బంగారు నగలను లాక్కుని ఉడాయించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడ తనను అడ్డగించిన ఇద్దరితోపాటు మరో ఆరుగురు తెలియని వ్యక్తులు ఉన్నారని పేర్కొంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. -
తనిఖీలతో నీట్ విద్యార్థులకు ఇబ్బందులు
-
బంగారం చోరీ ఘటనలో మరొకరు బలి
తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి గ్రామంలో వివాహం రోజు జరిగిన చోరీ ఘటనలో మరొకరు బలయ్యారు. ఈ నెల 19న శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు రాందేవ్‌రెడ్డి వివాహ వేడుక తర్వాత వారి బంధువులకు చెందిన సుమారు 24 తులాల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, శ్రీనివాస్‌రెడ్డిని వారి బంధువులను విచారించారు. దీంతో అవమానానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవసాయ పొలంలో ఈ నెల 20న రాత్రి ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున చోరీకి గురైన నగలు స్థానిక స్కూల్ సమీపంలో రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఇదే ఘటనకు సంబంధించి అనూహ్యంగా హైదరాబాద్ లోని రాజేందర్‌నగర్‌లో నివాసముంటున్న మృతుడు శ్రీనివాస్‌రెడ్డి అన్న మన్యపురెడ్డి కుమారుడు సురేశ్‌రెడ్డి (26) ఈ నెల 21న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు సురేశ్‌రెడ్డి సోదరి కల్పనవి కావడం, అతడు ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతుడికి తల్లి యాదమ్మ, సోదరుడు ఉన్నారు. కొడుకు పెళ్లికి వచ్చిన బంధువుల నగలు చోరీ -
కొడుకు పెళ్లికి వచ్చిన బంధువుల నగలు చోరీ
సాక్షి, నాగర్‌కర్నూల్: అది పెళ్లయిన ఇళ్లు.. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా వెళ్లలేదు.. పచ్చని తోరణాలు తొలగించలేదు... అంతలోనే పెళ్లికొడుకు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం కోడుపర్తి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శ్రీనివాస్‌రెడ్డి(45) పెద్దకుమారుడు రాందేవ్‌రెడ్డికి ఈనెల 19న గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్హాల్లో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి కోడుపర్తికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులతో సహా వచ్చారు. రాత్రి ఉక్కపోతగా ఉండటంతో భోజనాల తర్వాత బంధువుల వద్ద ఉన్న బంగారు నగలను సూట్‌కేసులో భద్రపర్చి అంతా కలసి మేడపై నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారేసరికి సూట్‌కేసులోని సుమారు 24 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన శ్రీనివాస్‌రెడ్డి తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో సహా పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. ఇది బయటి దొంగల పనికాదని, బంధువుల్లో ఎవరో దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి బంధువులందరినీ వేర్వేరుగా ప్రశ్నించడంతో పాటు నిజం తేలకుంటే అందరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తామని హెచ్చరించారు. మనస్తాపంతో... ఇంట్లో శుక్రవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరగాల్సి ఉండగా పోలీసుల విచారణతో శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పెళ్లికి వచ్చిన బంధువులలో ఎవరిని తప్పు పట్టాలో, పోలీసులు ఎవరిని అవమానం పాలుచేస్తారో తెలియక మదనపడ్డారు. ఒకవేళ ఆభరణాలు దొరకకపోతే బంధువులకు తానే ఇవ్వాల్సి వస్తుందన్న ఆవేదనతో ఆయన శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లి పెళ్లికొడుకు రాందేవ్‌రెడ్డికి ఫోన్ చేసి అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని, గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ చెప్పి ఉరి వేసుకున్నాడు. కాగా, అంతకుముందు చోరీ అయిన బంగారు ఆభరణాలను దొంగలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని రోడ్డుపై పడేసి వెళ్లారు. కొందరు చేసిన పనికి తాము కుటుంబ పెద్దదిక్కును కోల్పోయామని శ్రీనివాస్‌రెడ్డి భార్య పద్మ, కొడుకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాందేవ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బంగారం పోయిందన్న అవమానంతోనే శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇందులో పోలీసుల ఒత్తిడి ఏమీ లేదని ఎస్ఐ పేర్కొన్నారు. -
రూ.32వేలను దాటేసిన బంగారం
-
రూ.32వేలను దాటేసిన బంగారం
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ మెరుపులు పసిడిని అపుడే భారీగానే తాకాయి. కొనుగోలు దారుల ఉత్సాహంతో బంగారం ధర మళ్లీ చుక్కలను తాకింది. అటు గ్లోబల్ సంకేతాలు, ఇటు దేశీయంగా నగల వ్యాపారస్థుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.32వేల మార్కును టచ్ చేసింది. గురువారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.32,150కి చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి భారీగా కూడా కొనుగోళ్లు పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ .24,900 వద్ద ఉంది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం స్వల్ప వెనుకంజలో ఉంది. ఇక మరో విలువైన మెటల వెండికూడా ఇదే బాటలో ధర కూడా తిరిగి రూ.40వేల మార్కుకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.240 పెరిగి రూ.40వేలకు చేరింది. అంతర్జాతీయంగానూ పసిడి ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.02శాతం పెరిగి 132.80డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.60శాతం పెరిగి 16.65డాలర్లుగా ఉంది. మరోవైపు ఫ్యూచర్స్‌మార్కెట్ లో మాత్రం పసిడి స్వల్ప వెనుకంజలో ఉంది. కాగా ఏప్రిల్ 18న అక్షయ తృతీయ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు స్థానిక ఆభరణాల తయారీదారులు భారీ ఆఫర్ల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన
భువనేశ్వర్ : ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. నగల భాండాగార నిర్మాణాన్ని పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో 34 ఏళ్ల తర్వాత బుధవారం అధికారులు ఆలయ రత్న భాండాగార తలుపులు తెరిచారు. అయితే ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దని న్యాయస్థానం సూచనలు చేసింది. 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందం నగల భాండాగారం పరిశీలన చేపట్టింది. కాగా చివరిసారిగా 1984వ సంవత్సరంలో రత్న భాండాగారం పరిశీలన నిర్వహించారు. ఇది అత్యంత గోప్య ప్రక్రియ. శ్రీ మందిరం సత్వ లిపి ప్రకారం ఈ ప్రక్రియ ఆద్యంతాలు నిర్వహిస్తారు. పరిశీలనలో భాగంగా రత్న భాండాగారం లోపలి గోడలు, పై–కప్పు ఇతరేతర నిర్మిత కట్టడాల స్థితిగతుల్ని నిపుణులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని శ్రీ మందిరం దేవస్థానం ప్రధాన పాలన అధికారి ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. రత్న భాండాగారం పరిశీలన వ్యవధిలో భక్తులకు దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారు. పరిశీలన ముగియడంతో బృందం సభ్యులు సమగ్ర నివేదిక తక్షణమే సమర్పించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 36 నియోగుల సమావేశం తీర్మానం మేరకు ఈ బృందంలో పూరీ గజపతి మహా రాజా ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు ప్రతినిధి, భండార్ మేకప్, పట్టజోషి మహాపాత్రో, దెవులొ కొరొణొ, తొడొవు కొరొణొ సేవాయత్ వర్గాల ప్రతినిధులతో భారతీయ పురావస్తు శాఖ ఇద్దరు ప్రతినిధులు, కోర్ కమిటీ నుంచి ఇద్దరు ప్రతినిధుల్ని సభ్యులుగా ఎంపిక చేశారు. వీరందరికీ మూడు అంచెల్లో తనిఖీలు నిర్వహించి రత్న భాండాగారం లోనికి అనుమతిస్తారు. తొలుత మజొణా మండపం ఆవరణలో తనిఖీ చేస్తారు. రెండోసారి బెహొరొణొ ద్వారం ముంగిట తనిఖీలు చేసిన తర్వాత రత్న భాండాగారం ప్రాంగణంలో భండార్ మేకప్ సేవాయత్ ప్రముఖులు తనిఖీ చేసిన మేరకు లోనికి ప్రవేశించేందుకు అనుమతిస్తారని వివరించారు. రత్న భాండాగారంలో గోప్యమైన విషయాలు, వివరాలు, అంశాల్ని బహిరంగంగా చర్చించడం వంటి చర్యలకు పాల్పడకుండా స్థానిక లోకనాథుని దేవస్థానంలో పరిశీలన బృందం సభ్యులు అంతా ప్రమాణం చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. గజపతి మహారాజా రావలిసిందే జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన బృందంలో పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందేనని జగన్నాథ సేవాయత్ సమ్మేళన్ స్పష్టం చేసింది. తరతరాల ఆలయ సంప్రదాయాల ప్రకారం పూరీ గజపతి మహా రాజా జగన్నాథుని తొలి సేవకుడు. జగన్నాథ ఆలయ అధికారిక మండలి శాశ్వత అధ్యక్షునిగా ఆయన కొనసాగుతున్నారు. ఆయన ప్రతినిధిని సభ్యునిగా రత్న భాండాగారం పరిశీలనకు ప్రేరేపించడం విచారకరం. పూరీ గజపతి మహారాజా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్నాథ సేవాయత్ సమ్మేళన్ తెలిపింది. ఆలయ పాలక మండలి, సేవా యత్, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో నిర్వహించిన త్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఎటువంటి ప్రతిపాదన లేనట్లు సమ్మేళన్ ప్రముఖుడు కాశీనాథ్ ఖుంటియా తెలిపారు. ఈ సమావేశానికి హాజరు అయిన పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ఈ నేపథ్యంలో ఎటువంటి అభ్యంతరాల్ని ప్రస్తావించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు బదులుగా ప్రతినిధిని ఖరారు చేసి రత్న భాండాగారం పరిశీలన బృందం ఖరారు చేయడంపట్ల జగన్నాథ సేవా యత్ సమ్మేళన్ సందేహం వ్యక్తం చేస్తోంది. -
కొలిక్కిరాని క్యాషియర్ వ్యవహారం
పోరుమామిళ్ల :పోరుమామిళ్ల స్టేట్‌బ్యాంక్‌లో బుధవారం కోటిరూపాయలకు పైగా డబ్బు, నగలు తీసుకుని పరారయిన మార్తాల గురుమోహన్‌రెడ్డి కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గురువారం బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి చెప్పిన రూ. 91.49 లక్షల నగదు, 24 మంది ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారు మాత్రమేనా? ఇంకా అధికంగా పోయిందా? అన్న విషయం స్పష్టం కాలేదు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా బ్యాంకుకు సెలవు అయినా సిబ్బంది రికారŠుడ్స, లాకర్లు, ఇతర అంశాల పరిశీలన చేస్తున్నారు. రీజినల్ మేనేజర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడప నుంచి వచ్చిన సిబ్బంది బ్యాంకులో తనిఖీలు చేపట్టారు. ఖాతాదారుల ఆందోళన బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులో తాము పెట్టిన డబ్బుకు, బంగారుకు భద్రత లేకపోవడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయనాయకులు రుణాల రూపంలో కోట్లు తీసుకుని ఎగవేత ద్వారా బ్యాంకులను ముంచుతుండగా, ఇప్పుడు ఏకంగా బ్యాంకు సిబ్బందే దోచుకోవడం అందరినీ కలవరపెడుతోందని ఖాతాదారులు వాపోయారు. ఇద్దరు మైనారిటీ మహిళలు తమ బంగారు ఉందా? లేదా? అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. పోయిన డబ్బు బ్యాంకు అధికారులు ఖాతాదారులకు చెల్లించినా, తమ ఆభరణాల విషయంలో ఏమి చేస్తారన్న ప్రశ్న వచ్చింది. ఒకరిద్దరు ఖాతాదారులు తమకు ఇచ్చిన రశీదులో బ్యాంక్ సీల్ ఉందని, క్యాషియర్ సంతకం చేయలేదని తెలిపారు. మోసం చేసే ఉద్దేశ్యంతోనే గురుమోహన్‌రెడ్డి సంతకం చేయలేదని భావిస్తున్నామన్నారు. ఎవ్వరికీ నష్టం జరగదు,భయం వద్దు: ఆర్ఎం బ్యాంకులో క్యాషియర్ చేసిన నిర్వాహకంపై విచారణ జరుగుతోందని, అతను ఎక్కడికీ తప్పించుకుపోలేడని ఆర్ఎం శ్రీనివాసులు చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టం బ్యాంకుకేగానీ, ఖాతాదారులకు జరగదన్నారు. అందరి డబ్బుకు, బంగారుకు బ్యాంకు జవాబుదారీగా ఉంటుందన్నారు. -
నటుడు ప్రశాంత్ మొదటి భార్య ఇంట్లో..
తిరువొత్తియూరు: చెన్నై, టీనగర్లో సినీ నటుడు ప్రశాంత్ మొదటి భార్య ఇంట్లో 170 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. చెన్నై టీ.నగర్ సౌత్ పార్కు రోడ్డులో సినీ నటుడు ప్రశాంత్ మొదటి భార్య గృహలక్ష్మి ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈమె అడయారులో నివాసం ఉంటున్నారు. వారం వారం ఇక్కడికి వచ్చి బస చేసి వెళుతుంటారు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి కిటికీలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా 170 సవర్ల నగలు, రూ.10వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది.దీనిపై ఫిర్యాదు అందుకున్న మాంబలం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. దొంగలకు దేహశుద్ధి: తాంబరం పడప్పై నీలమంగళంకు చెందిన శ్రీనివాసులు ఆడిటర్. శ్రీనివాసన్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇతని ఇంట్లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఇది చూసిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో పట్టుబడిన వారు షోలింగనల్లూరుకు చెందిన రమేష్, ఆనంద్ అని తెలిసింది. దొంగను పట్టించిన ఇంజినీర్ చెన్నై కన్నగినగర్ కారపాక్కం భారతీయార్ వీధికి చెందిన అబుదాగిరి (23) ఇంజినీర్. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పక్క వీధిలో ఉన్న హోటల్‌కు వెళ్లాడు. తరువాత 1.30 గంటల సమయంలో ఇంటికి రాగా ఆసమయంలో ఇంట్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే బయట తలుపులకు తాళం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని చోరీకి ప్రయత్నిస్తున్న మణికంఠన్ (26), కార్తికేయన్ (27)లను అరెస్టు చేశారు. -
వెయ్యికోట్లకు ముంచేసిన కనిష్క్ జ్యువెలరీ
సాక్షి, చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వరుస కుంభకోణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటుచేసుకున్న మరో జ్యువెలరీ వ్యాపారం స్కాం వార్తల కెక్కింది. వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన చెన్నైకు చెందిన కనిష్క్ గోల్డ్ జ్యుయలరీ ప్రమోటర్లు విదేశాలకు చెక్కేసారు. దీంతో రాత్రికి రాత్రే దుకాణాలు మూసివేయడం, రికార్డులను మాయం చేయడం తదితర ఆరోపణలతో ఎస్బీఐ సీబీఐని ఆశ్రయించింది. ప్రస్తుతం నిందితులు మారిషస్‌కు పారిపోయివుంటారని బ్యాంకు భావిస్తోంది. రూ. 824 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించి కనిష్క్ జ్యువెలరీ యజమాని, డైరెక్టర్లు భూపేష్ కుమార్ జైన్, అతని భార్య నీతా జైన్‌పై ఎస్బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. మొత్తం 14 బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో కనిష్క్ గోల్డ్ జ్యుయలరీ రుణాలను పొందింది. ఈ మొత్తం విలువ వెయ్యి కోట్లకు పైమాటే నని అంచనా. మరోవైపు గత ఏడాది నవంబరులో రుణఎగవేతదారుడుగా కనిష్క్ గోల్డ్ సంస్థను బ్యాంకులు ప్రకటించాయి. ఇది ఇలా ఉంటే 2017 సెప్టెంబరులో కనిష్క్ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్ కుమార్ జైన్‌ను రూ. 20 కోట్ల ఎక్సైజ్ పన్ను మోసం కేసులో అరెస్టు అయ్యాడు. బెయిల్ మీద విడుదలైన భూపేష్ అప్పటినుంచి భార్యతో సహా పరారీలో ఉన్నాడు. కాగా చెన్నైలోనే కాకుండా హైదరాబాద్, కొచ్చిన్, ముంబైలలో కూడా కనిష్క్ జువెలరీ తన షాపులను విస్తరించింది. -
కి‘లేడీ’లు
బద్వేలు అర్బన్: మహిళలను ఏమార్చి చాకచక్యంగా చోరీలకు పాల్పడే ఇద్దరు మహిళలను గురువారం బద్వేలు పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.50 లక్షలు విలువ చేసే 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.ఇందుకు సంబంధించి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్వేలు సీఐ రెడ్డప్ప నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 న అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం గ్రామానికి చెందిన అయ్యవారమ్మ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం తన బ్యాగులోని పర్సును తీసి డబ్బులు చెల్లించే క్రమంలో...అందులో నగలు ఉన్నట్లు గుర్తించిన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గోగోల దానమ్మ, ఆత్మకూరు టౌన్ మేదర వీధికి చెందిన ఇరగాదిన్ల సరోజమ్మ లు అయ్యవారమ్మను అనుసరించారు. బస్టాండ్ సమీపంలోని పూల అంగళ్ల వద్ద పూలు కొనుగోలు చేసే సమయంలో ఆ ఇద్దరు మహిళలు తమ పైటను కట్టెల బ్యాగు పై వేసి ఎవరికీ అనుమానం రాకుండా అందులోని నగలతో ఉడాయించారు. ఇంతలో పూలకు డబ్బులు ఇచ్చేందుకు పర్సు చూసుకోగా పర్సు కనిపించక పోవడంతో వెంటనే అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టించిన సీసీ కెమెరా మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించగా అందులో ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించి సిద్దవటం రోడ్డులోని మరికొన్ని సీసీ కెమెరాల ద్వారా వారి కదలికలను పరిశీలించారు. వారు పోరుమామిళ్ల వైపు వెళ్ళినట్లు నిర్ధారించుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు.ఈ సమయంలో పోరుమామిళ్లలోని కొమరోలు–మైదుకూరు ప్రధాన రహదారి పై ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్బన్ ఎస్ఐ చలపతిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ హేమాద్రి, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
చిక్కారు..
కాకినాడ రూరల్: హత్యలు, దొంగతనాలతో సంబంధం ఉన్న ఇద్దరు యువకులను కాకినాడ క్రైం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ క్రైం డీఎస్పీ ఎ పల్లపురాజు బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చోరీ చేసిన 330 గ్రాముల బంగారం వస్తువులు, 1150 గ్రాముల వెండి వస్తువులు, రూ.15వేలు నగదు సొత్తును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్టు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, మోటిపల్లివారి వీధి, తూర్పువీధికి చెందిన గొల్లపల్లి నాగమల్లేశ్వరరావు, ఏలూరు చాట్రపర్రు వాటర్‌ట్యాంక్ రోడ్డు, సరస్వతి స్కూల్ పక్కవీధికి చెందిన గోన్నాబత్తుల కార్తీక్‌కుమార్‌లు వివిధ నేరాలతో సంబంధం ఉందన్నారు. వీరు కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జ్యోతుల మార్కెట్ ఎదురుగా ఉన్న సంగీత లాడ్జీలో 107 నంబర్‌గల రూమ్‌లో ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు సీసీఎస్ ఎస్సై ఎం.పాపరాజు, సుధాకర్ల ఆధ్వర్యంలో క్రైమ్‌పార్టీ సిబ్బంది మంగళవారం రాత్రి దాడి చేసి అరెస్టు చేసినట్టు పల్లపురాజు వివరించారు. గొల్లపల్లి మల్లేశ్వరరావు పాత నేరస్తుడని, ఇతడికి ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉందన్నారు. వైజాగ్‌లో మూడు మర్డర్ ఫర్ గెయిన్స్ కేసులు, ఏలూరు, భీమడోలు, ఉండ్రాజవరంల్లో సుమారు 17 ఇళ్ల నేరాల కేసులు ఉన్నాయన్నారు. గొల్లపల్లి నాగమలేశ్వరరావు, గొన్నాబత్తుల కార్తీక్‌కుమార్‌లు రాత్రిసమయాల్లో ఇళ్ల తాళాలు బద్దలుగొట్టి దొంగతనాలు చేస్తారన్నారు. నాగమల్లేశ్వరరావు 2016 డిసెంబర్లో తణుకు సబ్‌జైల్ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి, 2016–18 మధ్య కాలంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కాకినాడ, ఏలూరు టౌన్, రూరల్, కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు ఏరియాలో రాత్రి వేళల్లో ఇంటి తాళాలు బద్దలు గొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు దొంగిలించారని డీఎస్పీ ఎ పల్లపురాజు వివరించారు. కాకినాడలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 96 గ్రాముల బంగారు వస్తువు దొంగిలించారన్నారు. బంగారం, వెండి, నగదుతో పాటు ఎల్సీడీ టీవీ, 80 సర్జికల్ బ్లేడ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఈ దాడుల్లో పాల్గొని ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సైలు పాపరాజు, సుధాకర్, హెచ్‌సీ గోవిందు, పీసీలు చిన్న, శ్రీరాం, వర్మ, అజయ్, బాబులను డీఎస్పీ పల్లపురాజు అభినందించారు. -
నగ ధగలు... నయా వగలు
నగల.. వగలు మారుతున్నాయి. కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సిటీలో జ్యువెలరీ ప్రియులు ఇప్పుడు ‘లైట్’ ఆభరణాలను ఇష్టపడుతున్నారు. ఒంటి నిండా దిగేసుకునే నగలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్‌గా ఉండే జ్యువెలరీ ట్రెండ్‌గా మారింది. గ్రాండ్‌గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని ఆభరణాలను ఎక్కువ మంది యువతులు కోరుకుంటున్నారు. వీరిఅభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. వేళ్లకు పెట్టుకునే ఉంగరాల నుంచి చెవి రింగులు, బుట్టాలు, మణికట్టు గొలుసులు, ముక్కు పుడకలు, వివిధ రకాలు హారాలు, వడ్డాణాలు కూడా ఇప్పుడు కొత్త రీతిలో తయారవుతున్నాయి. వేసవితోపాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిటీలో లైట్ జ్యువెలరీకి ఆదరణ బాగా పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌తో పాటు సమ్మర్ కూడా కలిసొచ్చింది. దీంతో వేడుకలు జరుపుకునే వారితో పాటు వాటికి హాజరయ్యే ఆభరణాల ప్రియులు సీజనల్ జ్యువెలరీ గురించిఅన్వేషిస్తున్నారు. గ్రాండ్‌గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని, హెవీగాఅనిపించని ఆభరణాలను కోరుకుంటున్నారు. వీరి అభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. భారీ ఆభరణాలకు బదులుగా రూపుదిద్దుకుంటున్న ఇవి... ఒకనాటి చిన్న సైజ్ ఆభరణాలను భారీగా మార్చేయడం విశేషం. సాక్షి, సిటీబ్యూరో: అందాన్ని మెరిపించేందుకు కావొచ్చు.. హుందాగా కనిపించేందుకు కావొచ్చు.. స్టేటస్ సింబల్ కావొచ్చు... విభిన్న రకాలుగా ఆభరణాన్ని తమ ఆహార్యంలో భాగం చేసుకోవడం సిటీజనులకు సర్వసాధారణంగా మారింది. ఇక వెడ్డింగ్ సీజన్లో ఈ సరదా శిఖరాలను తాకుతోందని చెప్పడానికి ప్రస్తుతం జ్యువెలరీ షోరూమ్స్ దగ్గర కనపడే రద్దీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇదే సమయంలో ఒంటి నిండా దిగేసుకునే ఆభరణాలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్‌గా ఉండే జ్యువెలరీ ఇప్పుడు సిటీలో ట్రెండ్‌గా మారింది. మాంగ్ టీకా.. బంగారు పూల జడల గురించి మర్చిపోండి. ఇప్పుడు తలపై భాగంలో పెట్టుకునే మాంగ్ టీకా అనే ఆభరణం దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. గోల్డ్, డైమండ్ ఫ్లాట్, డైమండ్ కుందన్... ఇది రూ.30వేల నుంచి రూ.2లక్షల దాకా ఉంటుంది. ఫ్యాన్సీగా కూడా వాడతారు. హెవీ నుంచి లైట్‌కి.. కొన్ని ఆభరణాలు భారీగా ఉండాల్సినవి నాజుకుగా మారుతున్నాయి. ఒకప్పుడు మెడ అంటే భారీగా ఉండే బంగారు గొలుసులకు కేరాఫ్. అయితే ఇప్పుడు మెడలో ధరించేందుకు బీడ్స్‌తో రూపొందుతున్న నెక్లెస్‌లు వచ్చాయి. పచ్చలు, కెంపులు, పగడాలు, ముత్యాలతో సైడ్ పెండెంట్స్, మిడిల్ పెండెంట్స్ పెట్టి త్రీలైన్, ఫోర్‌లైన్ బీడ్స్‌తో డిజైన్ చేస్తున్నారు. చూడడానికి పెద్దగా కనపడతాయి.. కానీ ధరిస్తే హెవీగా అనిపించవు. ఇన్స్టాంట్ రిచ్ లుక్ అందించే ఇవి రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. సైజ్ జీరో... ఒకప్పుడు వడ్డాణం ధరిస్తే.. దాని నుంచి ఇంకో ఆభరణం మీదకి దృష్టి మళ్లడానికి చాలా టైమ్ పట్టేది. అంత భారీగా ఉండేవి. అయితే ఇప్పుడు లైట్ వెయిట్ వడ్డాణం వచ్చేసింది. దీనిలో కండోలి స్టైల్ వడ్డాణం అనేదైతే.. ఒకవైపు మాత్రమే ఉంటుంది. అలాగే మెడలోకి, నడుముకి రెండు రకాలుగానూ ఉపయోగించుకునేంత నాజూకైన నెక్లెస్ కమ్ వడ్డాణం కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇది రూ.4లక్షల నుంచి ప్రారంభమై ఆపైన ఉంటుంది. మణికట్టు మెరిసె..మోచేయి మురిసె.. సన్నగా ఉన్నామా? లేమా అన్నట్టు ఉండే గాజులు, మణికట్టు గొలుసులు కూడా ఇప్పుడు హెవీగా మారిపోయాయి. వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చిన బ్రాడ్ బ్రాస్లెట్ లేదా బ్రాడ్ బ్యాంగిల్.. చేతులకు సరికొత్త మెరుపుల్ని అందిస్తున్నాయి. మణికట్టు దగ్గర మొదలై మోచేయి దాకా వ్యాపిస్తూ అటు బ్రాస్లెట్ ఇటు గాజులు రెండింటిలాగా అమరిపోయే ఇవి రూ.లక్ష ఆపై ధరల్లో లభిస్తున్నాయి. వేళ్లకు వెలుగు... వేళ్లకు పెట్టుకునే రింగ్ అంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో చక్కగా అమరిపోయేది అనుకుంటున్నారేమో... అయితే ఇవి కాక్టెయిల్ రోజులు. రూపాయి కాయిన్ కన్నా కాస్త పెద్దగా పెండెంట్ సైజ్‌లో ఉండే కాక్టెయిల్ రింగ్ ఇప్పుడు ట్రెండ్. ఈవెనింగ్ పార్టీస్‌కి, రిసెప్షన్స్... తదితర వేడుకులకు వెళ్లేటప్పుడు ధరిస్తారు. కాబట్టి.. దీనిని కాక్టెయిల్ రింగ్ అని పిలుస్తారు. ఇవి డైమండ్, కుందన్ గోల్డ్‌తో తయారవుతాయి. గోల్డ్ అయితే రూ.50వేల నుంచి డైమండ్ అయితే రూ.లక్ష నుంచి అందుబాటులో ఉన్నాయి. ‘చెవులూరించే’..చెవులూగించే.. ఒకప్పుడు చెవి రింగులు అంటే ఎంత ఉండేవో తెలియంది కాదు. అంగుళం, అరంగుళం సైజ్‌కు మించేవి కావు. అయితే అదే ప్లేస్‌లో చెవులకు పెద్ద సైజ్‌లో వేలాడుతుండే షాండ్లియర్స్... ఇప్పుడు అమ్మాయిల హాట్ ఫేవరేట్. చెవి రింగుల స్వరూపాన్ని అమాంతం మార్చేసింది షాండ్లియర్స్ ట్రెండ్. చెవికి ఆభరణం ధరించామా? లేకపోతే ఆభరణానికి చెవిని ధరించారా! అన్నట్టు అనిపిస్తుంది. వేసవిలో చికాకు కలిగించే హెవీ జ్యువెలరీకి బదులుగా ఇవి బాగా ఆదరణ పొందుతున్నాయి. కలర్ స్టోన్స్ రూబీ, ఎమరాల్డ్, కుందన్లతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ముఖం మొత్తానికి అందాన్ని అందించే ఈ షాండ్లియర్స్లో బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. కనీసం ఒక షాండ్లియర్ జత రూ.లక్ష నుంచి రూ.6 లక్షల దాకా అందుబాటులో ఉన్నాయి. ఇవి 30ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే నప్పుతాయి. కాబట్టి యువతులే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మధ్య వయస్కుల కోసం రూపాయి కాయిన్ సైజ్‌లో ఉండే పెద్ద స్టడ్స్ అందుబాటులో ఉన్నాయి. నట్ ఫర్ నోస్.. నాసిక ఎంత నాజూగ్గా ఉంటుందో ముక్కుకు పెట్టుకునే నోస్పిక్ లేదా ముక్కెర కూడా అంతకన్నా నాజూగ్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఉంగరం తరహాలో ఉండే నట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిల్లో విపరీతమైన ట్రెండీ ఆభరణం ఈ నట్. విభిన్న రకాల స్టోన్స్‌తో ముక్కును మెరిపించే ఈ నట్ రూ.10వేల నుంచి అందుబాటులో ఉంది. సౌకర్యమే ప్రధానం.. నగలు ధరించాలని కోరుకుంటూనే అదే సమయంలో సౌకర్యానికి కూడా సిటీజనులు ప్రాధాన్యమిస్తున్నారు. కొత్త కొత్త అభిరుచుల క్రమంలో డిజైనర్ల సత్తాకు నిత్యం పరీక్షలు ఎదురవుతున్నాయి. దీంతో ఆభరణాలు రకరకాల మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఫంక్షన్లకు వెళ్లే సమయంలో హెవీగా కనిపిస్తూనే ఒంటికి మాత్రం లైట్‌గా అనిపించే ఆభరణాలను ధరించడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. – శ్వేతారెడ్డి,జ్యువెలరీ డిజైనర్ -
స్నేహితుడిగా నటిస్తూ సొత్తు చోరీ
గుంటూరు ఈస్ట్: స్నేహితుడిగా నటిస్తూ సొత్తు చోరీ చేసిన వ్యక్తిని సంఘటన జరిగిన 48 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, లాలాపేట ఎస్‌హెచ్‌వో మురళీకృష్ణ ఆదివారం లాలాపేట పోలీస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాత గుంటూరు రెడ్ల బజారుకు చెందిన షేక్ రకీబుర్ రెహ్మాన్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ విభాగంలో కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తుంటాడు. అడ్డదారిలో సంపాదించాలని పథకం వేశాడు . లాలాపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఉద్యోగి అయిన పీసపాటి శ్రీనివాసాచార్యులుని బైక్ మెకానిక్ షాపులో పరిచయం చేసుకున్నాడు. స్నేహంగా మెలుగుతూ ఆయన ఇంటికి వెళ్లేవాడు. ఇటీవల శ్రీనివాసాచార్యులు భార్య మృతి చెందినప్పుడు ఆత్మీయుడిలా అన్ని పనుల్లో అండగా నిలబడ్డాడు. ఈనెల 6న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో యాత్రలకు వెళ్లాడు. ఈ సమయంలో రెహ్మాన్ తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ. 30వేలు, బీరువాలోని 3.5 సవర్ల బంగారు నాంతాడు చోరీ చేశాడు. శ్రీనివాసాచార్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీ జరిగిన రోజు శ్రీనివాసాచార్యులు ఇంటి సమీపంలో తిరుగాడిన విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ జరిగిన 48 గంటల్లో అరెస్టు చేసి నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేసవిలో ప్రత్యేక నిఘా వేసవి ప్రారంభమైన నేపథ్యంలో చోరీలు నివారించేందుకు ప్రత్యేక నిఘా పెడుతున్నామని డీఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. ఊరు వెళ్లే సమయంలో నగలు, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టుకుని వెళ్లాలని సూచించారు. ఇంటికి ఆధునికమైన, బలమైన తాళాలు, గెడలు ఉపయోగించాలని తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను వినియోగించుకోవాలని కోరారు. -
కేటుగాడు ఎక్కడ?
ఫైవ్ స్టార్ హోటళ్లలో దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్న ‘సూటు..బూటు’ దొంగ జయేష్ రావ్జీ భాయ్ సేజ్‌పాల్ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 6న అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లోని ఓ రూమ్‌లోకి ప్రవేశించి చాకచక్యంగా రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించారు. ముంబైతోపాటు ఇతర నగరాలకు ప్రత్యేక బృందాలను పంపించి ఆరా తీస్తున్నారు. బంజారాహిల్స్: అయిదు నక్షత్రాల హోటళ్లలో బస చేసే అతిథుల గదులను లక్ష్యంగా చేసుకొని వారు లేని సమయంలో దర్జాగా సూటు, బూటు వేసుకొని హోటల్లోకి ప్రవేశిస్తూ ఆభరణాలతో ఉడాయిస్తున్న జయేష్ రావ్జీ భాయ్ సేజ్‌పాల్(43) ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. ఈ నెల 6న అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో హిమాయత్‌నగర్‌కు చెందిన వెంకట్ కోనారావు, రిషిక దంపతులు బస చేసిన రూమ్ నంబర్ 312లో వారు డిన్నర్‌కు వెళ్లిన సమయంలో నిందితుడు హోటల్ సిబ్బందిని మాటల్లోకి దింపి, లిఫ్ట్‌బాయ్ దృష్టిమరల్చి దర్జాగా గదిలోకి వెళ్లి రూ.12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో అంతే దర్జాగా ఉడాయించి పోలీసులకు సవాల్ విసిరాడు. బంజారాíßల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. నవదంపతులే టార్గెట్ ముంబయిలోని అంధేరి ప్రాంతంలో నివసించే జయేష్ ఎంత దర్జాగా వస్తాడో అంతే దర్జాగా నగలతో ఉడాయిస్తూ కేవలం సీసీ కెమెరాల్లో మాత్రమే కనిపిస్తుంటాడు. పార్క్‌హయత్ హోటల్లో దొంగతనం చేసిన అనంతరం ఆకుపచ్చ రంగు ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఇక్కడి నుంచి నేరుగా మాసబ్‌ట్యాంక్ వద్ద గోల్కొండ హోటల్‌వైపు ఆటో వెళ్లే విషయం స్పష్టమైంది. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఒక చిన్నహోటల్లో బస చేస్తూ బోగస్ ధృవపత్రాలు సమర్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాను దొంగతనం చేసే హోటల్‌కు బ్రేక్‌ఫాస్ట్ సమయంలో వచ్చి కస్టమర్ల కదలికలను గుర్తిస్తుంటాడని కొత్తగా పెళ్లైన వారిని లక్ష్యంగా చేసుకుంటాడని విచారణలో తేలింది. రోజంతా వారి కదలికలపై నిఘా వేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని ఆ తర్వాతే హోటల్లోకి ప్రవేశిస్తారని కూడా పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడి జాడ కోసం పోలీసులు జల్లెడపడుతున్నా చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఎస్ఆర్నగర్ డిఐ కిషోర్, జూబ్లీహిల్స్ డీఎస్ఐ శ్రీను రెండు రోజులుగా ముంబయిని జల్లెడపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇక మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలు న్యూఢిల్లీ, చండీఘడ్, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో గాలింపు చేపట్టాయి. నిందితుడి ఆచూకీ కోసం మొత్తం 42 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ♦ 2016 డిసెంబర్ 6వ తేదీన అమీర్‌పేట్‌లోని మ్యారీగోల్డ్ హోటల్లోకి కూడా ఇదే తరహాలో ప్రవేశించి రూ. 15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. స్పూన్‌తో ఇక్కడ గదిని తెరిచినట్లు వెల్లడైంది. ♦ 2014లో ఆబిడ్స్‌లోని మెర్క్యూరీ హోటల్లో ప్రముఖ వ్యాపారి నారాయణదాస్ మారు నిర్మలాదేవి బస చేసిన గదిలోకి ప్రవేశించి రూ. 7 లక్షల విలువచేసే ఆభరణాలు తస్కరించగా ఆబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ♦ హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో రెండుసార్లు ప్రవేశించి ఆభరణాలతో ఉడాయించగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ♦ 2003లో ముంబయిలోని తాజ్హోటల్లో కూడా ఇదే తరహా దొంగతనానికి పాల్పడ్డాడు. ♦ 2017 అక్టోబర్‌లో విశాఖపట్నం వరుణ్ బీచ్ హోటల్లో ఆభరణాలు తస్కరించాడు. ♦ 2003లో కోలాబ తాజ్హోటల్లో జరిగిన చోరీ ఘటనలో జయేష్‌ను అక్కడి ´లలీసులు పోలీసులు అరెస్ట్ చేయగా అయిదు రోజుల జైలు శిక్ష కూడా పడింది. ♦ 2013లో ఛండీగడ్‌లోని హోటల్లో కూడా దొంగతనం చేశాడు. -
స్నేహితురాలే కాజేసింది...
గుడివాడటౌన్: ఇంట్లోని బంగారు ఆభరణాలు స్నేహితురాలే కాజేసిన సంఘటన పట్టణంలో జరిగింది. స్థానిక బేతవోలుకు చెందిన సమ్మెట మాధవరావు ఇంట్లో గత నెల 11వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి బంగారు నగలు అపహరించుకుపోయిన విషయం విదితమే. మాయమైన నగలు మాధవరావు భార్య నాగ లీలావతి స్నేహితురాలు బండి నాగ త్రివేణి అపహరించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. స్థానిక వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమక్షంలో నిందితురాలిని చూపారు. ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ నాగ త్రివేణి, నాగ లీలావతికి మంచి స్నేహితురాలు. దూరపు బంధువు కూడా. త్రివేణి భర్త నాగరాజుతో కలసి హైదరాబాద్ చింతల్లో నివాసం ఉంటుంది. గత నెల 10వ తేదీన నాగ లీలావతిని పరామర్శించేందుకు బేతవోలులోని ఆమె ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తాను కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు త్రివేణికి చూపింది. అక్కడే ఉన్న ఇంటి తాళాలను స్నేహితురాలికి అనుమానం రాకుండా తీసి బయటకు వెళ్లి అలాంటిదే మరో తాళం చేయించుకుని తిరిగి వాటిని యథాస్థితిలో పెట్టేసింది. 11వ తేదీ మాధవరావు దంపతులు విజయవాడలో చదువుచున్న తన కుమారుని వద్దకు వెళుతున్నట్లు చెప్పారు. మాధవరావు కుటుంబసభ్యులు విజయవాడ వెళ్లారని నిర్ధారించుకుని గత నెల 11వ తేదీన దొంగ తాళంతో ఇంట్లోకి వెళ్లి బీరువా తెరచి అందులోని రూ 20లక్షలు విలువగల 24 రకాల ఆభరణాలను అపహరించింది. అనంతరం కుటుంబ అవసరాల నిమిత్తం బంగారం కుదువపెట్టేందుకు మాధవరావు బీరువా తెరువగా అందులో నగలు కనిపించలేదు. దీనిపై మాధవరావు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ సీఐ డీవీ రమణ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈనెల 8వ తేదీ సాయంత్రం గుడివాడలోని ఓ బంగారు నగల దుకాణంలో దొంగిలించిన వస్తువులు అమ్మడానికి త్రివేణి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్వాధీనపర్చుకున్నారు. మొత్తం బంగారం 448.88 గ్రాములుగా గుర్తించినట్లు ఎస్పీ త్రిపాఠి వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, స్టేషన్ ఆఫీసర్ డి.వి.రమణ, ఏఎస్సై స్వామిదాసు, సిబ్బంది శ్రీనివాసరావు, షణ్ముఖబాబు, నాయక్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పార్క్ హయత్’లో హైటెక్ చోరీ
హైదరాబాద్: నగరంలోని ఓ ప్రతిష్టాత్మక స్టార్ హోటల్లో హైటెక్ చోరీ జరిగింది. సూటుబూటు వేసుకొని వచ్చిన ఓ దొంగ దర్జాగా హోటల్లోకి ప్రవేశించి రూ.12 లక్షల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యా లు పొదిగిన ఆభరణాలను తస్కరించాడు. హిమ యత్నగర్కు చెందిన యువ వ్యాపారి వెంకట్ పెళ్లి ఈ నెల 4న జరిగింది. హనీమూన్ కోసం 5వ తేదీన దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని పార్క్‌హయత్ హోటల్‌కు వచ్చి 312వ గదిలో బస చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్ సందర్శన, తాజ్హోటల్లో డిన్నర్ కోసమని మరునాడు రాత్రి 7 గంటల ప్రాంతంలో దంపతులు బయటకు వెళ్లారు. కాసేపటికి సూటుబూటు వేసుకొన్న ఓ వ్యక్తి ఆటోలో పార్క్‌హయత్ హోటల్‌కు వచ్చాడు. తాను 312లో బస చేసిన వ్యక్తి తాలూకూ బంధువునని, రూమ్‌లో కార్డు మర్చిపోయానని, దానిని తీసుకోవడానికి వచ్చానని చెప్పడంతో హోటల్ సిబ్బంది యాక్సిస్ కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఉంటేనే లిఫ్ట్ తెరుచుకుంటుంది. లిఫ్టులోంచి గది వద్దకు వెళ్లిన ఆగంతకుడు పాస్వర్డ్ మర్చిపోయానని రిసెప్షన్‌కు ఫోన్ చేశాడు. కంప్యూటర్లో నాలుగు డిజిట్లను సిబ్బంది నొక్కడంతో యాక్సెస్ కార్డు సహాయంతో గది తెరుచుకుంది. లోనికి వెళ్లిన ఆగంతకుడు సూట్‌కేస్‌లోని డైమండ్స్ పొదిగిన చెవి రింగు, నెక్లెస్, పాపిటబిళ్ల, బంగారు కాళ్ల పట్టీలు, జత గాజులు, రూ. 6 వేల నగదును బ్యాగులో సర్దుకొని ఉడాయించాడు. డిన్నర్ ముగించుకొని బుధవారం రాత్రి వెంకట్ దంపతులు హోటల్లోని తమ గదికి వచ్చారు. సూట్‌కేస్‌లోని ఆభరణాలు కనిపించలేదు. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే హోటల్ సిబ్బందికి, బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీలు పోలీసులు పరిశీలించగా ఓ ఆగంతకుడు గదిలోనికి వెళ్లి, బయటకు వచ్చిన దృశ్యాలు నమోదయ్యాయి. చోరీకి పాల్పడిన వ్యక్తి చండీగఢ్‌కు చెందిన జయేష్ రావ్జీ భాయ్ సేజ్‌పాల్(48)గా గుర్తించారు. స్టార్ హోటళ్లే లక్ష్యంగా అతడు ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరువంటి నగరాల్లో ఈ తరహా దొంగతనాలు 8 వరకు చేసినట్లు తేల్చారు. నిందితుని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నగరంలోని అన్ని మార్గా ల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్క్‌హయత్ లాంటి స్టార్ హోటల్లో దొంగతనం చోటు చేసుకోవడం గమనార్హం. -
మత్తు మందు ఇచ్చి నగల అపహరణ
వేనాడు(తడ): రైలులో ప్రయాణిస్తున్న మహిళలను మాయ మాటల్లో దించి, వారితో కలసి ప్రయాణించి అదనుచూసి చాకచక్యంగా నగలను దోచుకెళ్లిన ఘటన గురువారం రాత్రి వేనాడులో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం మేరకు తడ మండలం ఇరకం గ్రామానికి చెందిన నైనా విజయమ్మ, నైనా ధనలక్ష్మి, నైనా సెల్వి కుటుంబాలు చాలా కాలం క్రితం తమిళనాడులోని పొన్నేరికి కాపురం వెళ్లిపోయారు. అమావాస్య సందర్భంగా వేనాడులో ఉన్న షేక్ దావూద్ షావలీ అల్లా దర్గాను దర్శించుకుని రాత్రికి అక్కడ నిద్ర చేసేందుకు ముగ్గురూ గురువారం వేనాడు గ్రామానికి రైలులో వచ్చారు. వీరికి పొన్నేరి వద్ద బురకా వేసుకున్న మహిళ రైలులో కలిసి మాటలు కలిపింది. ఆమె మాటలకు వీరు ముగ్గురూ బాగా ఆకర్షితులయ్యారు. తన కుమారుడికి ఉద్యోగం రావడంతో దర్గా వద్ద అన్నదానం చేసి ముగ్గురు మహిళలకు చీరలు అందించాలని వెళుతున్నట్టు ఆమె వీరికి తెలిపారు. ఇంతలో సూళ్లూరుపేటకు చేరుకున్న మహిళలను మీరు నా కుటుంబ సభ్యుల్లా ఉన్నారంటూ మీకు చీరలు తీసిచ్చి మరో ఇద్దరు ఇతరులను చూసి మిగిలిన చీరలు ఇస్తానంటూ స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణానికి తీసుకువెళ్లి చీరలు కొనిచ్చింది. అనంతరం అందరూ వేనాడుకి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు తమతోపాటు తెచ్చుకున్న భోజనం తమకు పరిచయమైయ మహిళతో కలిసి తిన్నారు. అనంతరం ఆ మహిళ కూల్‌డ్రింక్ తెచ్చి వీరికి అందించింది. కూల్‌డ్రింక్ తాగిన కొంతసేపటికి వారు ముగ్గురూ నిద్రలోకి జారుకోగా విజయమ్మ మెడలోని తాళిబొట్టు, కాసులతోటు మరో బంగారు గొలుసు తీసుకుని పారిపోయింది. మిగిలిన ఇద్దరు మహిళలు తమ వస్తువులను దాచుకోవడంతో అవి భద్రంగా మిగిలాయి. ఉదయం లేచి చూసిన బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించి స్థానికులకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న తడ ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు గ్రామానికి చేరుకుని మత్తు ప్రభావం తొలగని మహిళలను సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతీరోజు లవ్ డే..అద్భుతమైన ఆఫర్లు
రిలయన్స్ జ్యుయలరీ ..డైమండ్, బంగారు నగల అద్భుత డిజైన్లను ప్రదిర్శిస్తోంది. ఈ సందర్భంగా వినియెగాదారులకు మునుపెన్నడూ లేని డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఫిబ్రవరి 25 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లకు వందశాతం తృప్తి కలిగేలా జీరో వేస్టేజ్‌పై నగలను విక్రయిస్తున్నామనీ రిలయన్స్ జ్యుయలరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఆభరణాలు శాశ్వతమైన క్లాసిక్, టైంలెస్ ఆభరణాల ఎంపిక.. ఏ సీజన్లోనైనా ఎవరికైనా ప్రియమైనవారి కోసం పరిపూర్ణ బహుమతి అందించేలా పోటీ ధరలలో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. అలాగే కస్టమర్ల సౌలభ్యంకోసం ప్రతీ షోరూంలోనూ క్వాలిటీ చెకింగ్ మెషీన్లు అందుబాటులో ఉంచామంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రాం, లక్నో , వారణాసి, కాన్పూర్, అహ్మదాబాద్ లాంటి ఎనిమిది నగరాల్లో ఫిబ్రవరి 25దాకా ఈ యూనిక్ ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తాము ఉపయోగించిన ప్రతీ డైమండ్ ఇండిపెండెంట్ సర్టిఫికేషన్ లాబొరేటరీస్ అంతర్జాతీయ సర్టిఫికేట్ పొందిందని కంపెనీ చెబుతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ జ్యుయలర్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ ప్రతీ రోజు ప్రేమపూర్వకమైనదే. అది సార్వత్రిమైంది. దీన్ని ఒక రోజుకు లేదా జంటలకు పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డారు. రిలయన్స్ అందిస్తున్న ఆకర్షణీయమైన నగలతో ప్రతిరోజూ వాలెంటైన్స్ డే అని చెప్పారు. అంతేకాదు ప్రియమైనవారి కోసం పరిపూర్ణ బహుమతి అందించేలా విస్తారమైన సాలిటైర్కు , ప్లాటినం లవ్ బ్యాండ్లను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. తమ షోరూంలలో నెక్లెస్, చెవిపోగులు, గాజులు, రింగులు .. ఇలా ప్రతీదీ ఎలిగెంట్‌గా , అద్భుతంగా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 25 వరకు ఉత్తేజకరమైన ఆఫర్లు అందుబాటులోఉన్నాయని చెప్పారు. కాగా రిలయన్స్ జ్యుయలర్స్ 44 నగరాల్లో 65 షోరూంలను కలిగి ఉంది. వీటిని మరింతగా విస్తృతంగా విస్తరిస్తోంది. -
నోట్లో యాసిడ్ పోసి.. చోరీకి యత్నం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): చోరీ కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడింది. వృద్ధురాలి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేయగా... బాధితురాలు గట్టిగా అరవడంతో నోటిలో యాసిడ్ పోసి నిందితురాలు పరారయింది. ఈ దుర్ఘటన రిటైర్డ్ జడ్జి ఇంటిలో చోటు చేసుకుంది. ఎంవీపీ జోన్ ఎస్ఐ గోవింద్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్ – 2లో రిటైర్డ్ జడ్జి రామారావు, సత్యవతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవా రం సాయంత్రం రామరావు వాకింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో వారి ఎదురింటిలో పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళ సత్యవతి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేసింది. సత్యవతి పెద్దగా అరవడంతో రమణమ్మ వెంటనే బాత్రూమ్లో ఉన్న యాసి డ్ తీసుకొచ్చి సత్యవతి నోటిలో పోసి పరారయింది. స్థానికులు సత్యవతిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె భర్త రిటైర్డ్ జడ్జి రామారావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగల కోసం మహిళపై యాసిడ్ దాడి
-
డైమండ్ కింగ్ మోదీకి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ని టాప్ డైమండ్ వ్యాపారి, అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జ్యుయర్ నిరావ్ మోదీకి సీబీఐ భారీ షాకిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును కోట్ల రూపాయల మేర మోసం చేసిన చేసిన కేసులో కేసు నమోదు చేసింది. నిరావ్ మోదీ అనుమాన్సాద లావాదేవీల కేసులో సీబీఐ విచారణ జరుగుతోందని పీఎన్బీ వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా ఆయనపై సీబీఐ అభియోగాలు మోపినట్టు అధికారులు సోమవారం తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్య చేపట్టింది. డైమండ్ ఆర్ యు, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ కంపెనీ భాగస్వాములైన మోదీ, ఆయన సోదరుడు నిషాల్, భార్య అమీ, మెహల్ చినూభాయ్ చోక్సి బ్యాంకు అధికారులతో కుట్ర పన్నారని పీఎన్బీ ఫిర్యాదు చేసింది. తద్వారా తమకు భారీ నష్టం వాటిల్లిందని బ్యాంకు ఆరోపించింది.కాగా బిలియనీర్ నిరావ్ మోదీ ఆస్తులపై దృష్టిపెట్టిన ఐటీ అధికారులు ఢిల్లీ, సూరత్, జయపూర్‌లోని ఆఫీసులపై జనవరి 31న దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. లండన్, న్యూయార్క్, లాస్ వెగాస్, హవాయి, సింగపూర్, బీజింగ్, మకావ్లోనూ, ఇండియాలో ముంబై , ఢిల్లీ నగరాల్లో సెలబ్రిటీ డైమండ్ జ్యుయలరీ స్టోర్స్ ఉన్నాయి. ఫైర్‌స్టార్ డైమండ్ స్థాపకుడు, డిజైనర్ నిరావ్ మోదీ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీ డైమండ్ డిజైన్లకు మంచి ప్రఖ్యాతి గాంచాడు. -
పెళ్లి పేరుతో మహిళ మోసం
చిత్తూరు,తిరుపతి కల్చరల్: పెళ్లి చేసుకొని ఇద్దురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసింది. మరో వ్యక్తిని మాయమాటలతో నమ్మించి ఇంట్లో చేరి నగలతో ఉడాయించింది. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధితులు ఇద్దరు ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల ఎదుట వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన గురుప్రసాద్ మాట్లాడుతూ 2005లో చంద్రకళ అనే మహిళతో తనకు వివాహమైందని తెలిపాడు. ఏడేళ్లు సాగిన కాపురంలో తమకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారని పేర్కొన్నాడు. తర్వాత ఒక కుమారున్ని తీసుకొని ఆమె తన నుంచి వెళ్లిపోయి మోసం చేసిందని ఆరోపించాడు. తిరుపతి శివజ్యోతినగర్‌లో కాపురమున్న గిరిబాబు భార్య నాగమణి మాట్లాడుతూ తాము మదనపల్లెలో అంగడి నడుపుకుంటూ జీవనం సాగించే వారమని తెలిపింది. చంద్రకళ అనే మహిళ తనకు ఎవరూ లేరని, బతుకు దెరువు చూపాలని తమను ఆశ్రయించిందని పేర్కొంది. ఇంటిలో పని చేసుకుంటూ బతకమని తమ ఇంటిలోనే ఒక గది ఆమెకు ఇచ్చామని తెలిపింది. ఈ క్రమంలో తన భర్తను వలలో వేసుకుందని, తాము ఇంటిలో లేని సమయంలో ఇంటిలోనున్న రూ.7 లక్షల నగదును తీసుకొని ఉడాయించిందని ఆరోపించింది. తమ బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని బంగారు నగలు తీసుకొని వెళ్లిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం మూడో వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవకోన ప్రాంతంలో ఉందని తెలిపింది. తమ బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని పేర్కొంది. పోలీసు అధికారులు స్పందించి సదరు చంద్రకళపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
వజ్రాలంటూ భారీ మోసం.. ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వజ్రాల వ్యాపారం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదపులోకి తీసుకున్నారు. మహ్మద్ సలామ్, మహ్మద్ సిద్దిఖీ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటితో వజ్రాలను పరీక్షించే పరికరాలు, కొన్ని బంగారు ఆభరణాలను వారి వద్ద ఉన్నట్లు గుర్తించారు. నకిలీ వజ్రాలను అసలైనవిగా నమ్మించి మార్కెట్లో కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఇద్దరు నిందితులు ఇటీవల కలిశారు. తమ వద్ద దాదాపు 4 కోట్ల విలువచేసే అతి ఖరీదైన వజ్రం ఉందని నమ్మించారు. అయితే తమకు అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో తక్కువ ధరకే విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బాధితుడు హాజీ రూ.1.15 కోట్లు చెల్లించి వజ్రాన్ని కొనుగోలు చేయగా అసలు విషయం బయటపడింది. నకిలీ వజ్రాన్ని తనకు అంటగట్టారంటూ హాజీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
సంతానం కలిగిస్తామని బురిడీ
వైఎస్ఆర్ జిల్లా, వేంపల్లె: సంతానం కలిగిస్తామని ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి బంగారు, నగదుతో ఉడాయించిన సంఘటన ఆదివారం వేంపల్లెలోని రాజారెడ్డినగర్‌లో చోటుచేసుకుంది. బాధితులు ఎస్ఐ చలపతికి చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజారెడ్డినగర్‌లో జల్లా శంకర్‌రెడ్డి, భార్య శివమ్మ, తల్లి శివమ్మలు నివాసం ఉంటున్నారు. శంకర్‌రెడ్డికి వేముల మండలం దుగ్గన్నగారిపల్లె గ్రామానికి చెందిన శివమ్మతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇంత వరకు వారికి సంతానం లేదు. ఆయన పులివెందుల రోడ్డులో తోపుడు బండిపై బజ్జీలు వేసుకొని జీవనం సాగించేవాడు. భోగి పండుగ కావడంతో అతను ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి మీకు ఆయుర్వేద మందు ద్వారా సంతానం కలిగిస్తామని నమ్మబలికారు. ఆ దంపతులు నమ్మడంతో ఆయుర్వేద మందు తయారు చేయాలంటే రెండు గ్రాముల స్వర్ణభస్మం కోసం రూ.20వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. శంకర్‌రెడ్డి వెంటనే వారికి రూ.20 వేలు అందజేశాడు. తర్వాత ఏదో ఒక కంప్యూటర్ మిషన్‌ను శంకర్‌రెడ్డి వీపు భాగంలో, భార్య శివమ్మకు పొట్టపైన పెట్టి పరీక్షించారు. శివమ్మకు కడుపులో గడ్డ ఉందని, తామిచ్చిన మందుతో గడ్డ కరిగి సంతానం కలుగుతుందని చెప్పారు. అలాగే శంకర్‌రెడ్డికి వేడి ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించేందుకు మందులు ఇస్తామని తెలిపారు. ఈ మందు తయారు చేసేందుకు శంకర్‌రెడ్డిని మునగ ఆకు తీసుకురమ్మని, భార్య శివమ్మను తలస్నానం చేసి రమ్మని పంపారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సోదా చేసి ఒక తులం బంగారు ఉంగరాన్ని తీసుకొని పారిపోయారు. -
ఫైవ్‌స్టార్ హోటల్లో రూ.38 కోట్ల నగలు దోపిడి
పారిస్ : ఐదుగురు ముసుగు దొంగలు బుధవారం పారిస్ నగరంలో కలకలం సృష్టించారు. సెంట్రల్ పారిస్‌లో గల రిడ్జ్ ఫైవ్ స్టార్ హోటల్లోకి చొరబడిన దుండగులు రూ. 38,66,69,250/- విలువజేసే వజ్రాభరణాలను దోచుకెళ్లారు. దోపిడీపై హోటల్ చట్టుపక్కల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సమాచారం అందుకుని ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కాగా, మిగిలిన ఇద్దరు దొంగలు నగలతో చాకచక్యంగా తప్పించుకున్నారు. పారిస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో దుండగులు హోటల్లోకి ప్రవేశించారు. కత్తులు, గొడ్డళ్లతో హోటల్ డిస్ప్లేలను పగులగొట్టి ఆభరణాలను దోచుకున్నారు. దోపిడి దొంగలు చొచ్చుకురావడంతో హోటల్లోని గెస్ట్స్ కిచెన్‌లో దాక్కున్నట్లు చెప్పారు. మరికొందరు వాళ్ల నుంచి తప్పించుకుని బయటకు వచ్చారని తెలిపారు. దీంతో దుండగులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. కాల్పుల్లో హోటల్ సిబ్బంది ఒకరు గాయపడ్డారని తెలిపారు. తప్పించుకు పారిపోయిన ఇద్దరు దుండగులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. -
'బంగారం'లాంటి చాన్స్..!
నరసాపురం : బంగారం ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. చాలారోజుల తరువాత బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు నెలల క్రితం రూ.30 వేలు మార్కు దాటిన బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండిదీ అదే దారి. క్రిస్మస్, సంక్రాంతి పండగళ వేళ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోళ్లకు ఇదే అనువుగా జనం భావిస్తున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు జ్యూయలరీ షాపులకు క్యూ కడుతున్నారు. బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. అయితే ధరలు ఇంకా తగ్గొచ్చనే అంచనాలతో కొందరిలో ఇప్పుడే బంగారం కొనాలా? మరికొన్ని రోజులు ఆగాలా ? అనే సందిగ్ధం కూడా నెలకొని ఉంది. మరీ భారీగా ధరలు తగ్గవని, బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయమని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రూ.30 వేల దిగువకు బంగారం ధరలు చేరుకున్నాయి. కాసు రూ.21,760 సోమవారం నరసాపురం గోల్డ్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.29,110గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.27,220గా నమోదైంది. అంటే ఆభరణాల బంగారం కాసు (8 గ్రాములు) ధర రూ.21,760గా ట్రేడవుతోంది. గత రెండు, మూడు నెలలుగా కాస్త అటు, ఇటుగా ఇవే ధరలు ట్రేడవుతున్నాయి. అయితే గతవారం రోజుల నుంచి కాసు బంగారం ధరలో దాదాపు రూ.950 తగ్గుదల కనిపిస్తోంది. దీంతో కొన్ని నెలలుగా బంగారం వైపు చూడటానికి జంకిన పేద, మధ్య తరగతి వారు పండగవేళలు కూడా కావడంతో జ్యూయలరీ షాపుల మెట్లెక్కుతున్నారు. వెండి ధరల్లో అయితే ఒకరకంగా భారీ తగ్గుదల కనిపిస్తోంది. కిలో వెండి ధర రూ.36–37 వేల మధ్య ట్రేడవుతోంది. కిలో వెండి ధర దాదాపు 3 వేల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు మరికాస్త తగ్గుతాయని భావిస్తున్నారు. ఒడిదుడుకుల నుంచి గాడిలోకి.. ఐదేళ్ల క్రితం వరకూ బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. 2013లో అయితే ఏకంగా 10 గ్రాముల బంగారం రూ. 34 వేలకు చేరి ఆల్‌టైమ్ హై నమోదు చేసుకుంది. బంగారం దిగుమతి సుంకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చైనా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను అమ్మకాలకు పెట్టడంతో అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గి ధరలు దిగి వచ్చాయి. ఈ దశలో గత రెండేళ్ల నుంచి బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో ధరలు విపరీతంగా తగ్గుతాయని అంచనా కట్టారు. కానీ అలా జరగలేదు. ధరలు పెరగడంతో బులియన్ వ్యాపారం ఒడిదుడుకుల్లో సాగింది. కొనుగోలుదారుల్లో కూడా అయోమయం. ఎక్కువ ధరల్లో బంగారం కొన్న జిల్లావాసులు దారుణంగా నష్టపోయారు. ఇప్పుడూ అదేరకమైన అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. ధరల హెచ్చుతగ్గుల్లో స్వల్పమార్పులే ఉంటాయని బులియన్ వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. భారీగా పెరిగిన అమ్మకాలు ధరలు తగ్గడంతో జిల్లాలో రోజుకు రూ.2 కోట్ల వరకూ అమ్మకాలు పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.3 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. జిల్లాలో ఇక్కడి నుంచి భారీగా హోల్‌సేల్ వ్యాపారం జరుగుతుంది. నరసాపురంతో పాటు ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్దెత్తున అమ్మకాలు జరుగుతాయి. ధరలు తగ్గడంతో జిల్లా మొత్తం మీద రోజుకు అదనంగా రూ.2 కోట్ల వరకు అమ్మకాలు పెరిగాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వరుస పండగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ముందు ఉండడంతో అమ్మకాలు మరింత పెరగవచ్చని అంచనా. మరోవైపు బంగారాన్ని అనువైన పెట్టుబడిగా భావించే ముదుపర్లు కూడా బిస్కెట్ కొనుగోళ్లపై దృష్టిపెడుతున్నట్టు నరసాపురం జ్యూయలరీ అసోసియేషన్ కార్యదర్శి వినోద్‌కుమార్‌జైన్ తెలిపారు. ఇప్పట్లో పెద్దగా ధరలు పెరగవు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితుల రీత్యా ధరలు పెరగవు. అలాగని ఇంకా భారీగా తగ్గే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం అమ్మకాలు బాగా పెరిగాయి. ధరలు ఇలాగే ఉంటే సంక్రాంతి నాటికి అమ్మకాలు మరింత పెరుగుతాయి. – అజిత్‌కుమార్ జైన్, జ్యూయలరీ వ్యాపారి -
చోర్ దోస్త్
మానుకోలేని విలాసాలు...వ్యాపారంలో నష్టాలు.. వెరసి ఆర్థిక సమస్యలు. చివరకు ఏమి చేయాలో పాలుపోక ఏకంగా స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. 51 తులాల బంగారం, రూ.50 వేల నగదు తస్కరించి.. సీసీ ఫుటేజీల్లో చిక్కి చివరకు కటకటాల పాలయ్యాడు. చిక్కడపల్లి పరిధిలో జరిగిన ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితున్ని పట్టుకున్నారు. ముషీరాబాద్: బాకారం ప్రాంతంలో గత 2న సినీఫక్కీలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు చేధించారు. చిన్ననాటి స్నేహితుడే అప్పుల బాధ భరించలేక స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసినట్లు గుర్తించారు. చిక్కడపల్లి ఏపీసీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాంచంద్రారెడ్డి, డిఐ సంతోష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. శ్రీనివాసాచారి, బాతుల విజయ్‌కుమార్ చిన్ననాటి స్నేహితులు. శ్రీనివాసాచారి బాకారం వెస్లీ చర్చి ఎదురుగా ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో బంగారు ఆభరణాలు తయారీ, పాన్‌బ్రోకర్ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి షాపు మూసిన తర్వాత బంగారం, నగదును ఇంట్లోనే ఉన్న బీరువాలో దాచి ఎన్ఎఫ్సి కాలనీలోని తన ఇంటికి వెళ్లేవాడు. అదే ప్రాంతంలో ఉండే విజయ్‌కుమార్ ఎలక్ట్రిషన్‌గా పని చేసేవాడు. తన ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో మౌలాలి ఆంధ్రాబ్యాంక్‌లో రూ. 15లక్షలు రుణం తీసుకుని పాల వ్యాపారం ప్రారంభించాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీటి నుంచి గట్టెక్కేందుకు బంగారం వ్యాపారం చేసి శ్రీనివాసచారిపై దృష్టి పెట్టాడు. తరచూ శ్రీనివాసచారి షాపునకు వెళ్లే అతను బంగారం, నగదు అధిక మొత్తంలో ఉండడాన్ని గుర్తించాడు. శ్రీనివాసచారి దుకాణం మూసిన తర్వాత బంగారు ఆభరణాలను ఎక్కడ పెట్టేది గమనించాడు. దీంతో ఇంటి గ్రిల్స్, ఇంటి డోర్‌కు డూప్లికేట్ తాళాలను తయారు చేయించాడు. ఈ నెల 4న శ్రీనివాసచారి వెళ్లిపోయిన తర్వాత డూప్లికేట్ కీలతో ఇంట్లోకి వెళ్లి బీరువా తాళం చెవులు తీసుకుని బంగారు ఆభరణాలు, నగదు తీసుకెళ్లాడు. అనుమానం రాకుండా కారంపొడి చల్లాడు. తీసుకెళ్లిన నగదుతో ఆంధ్రాబ్యాంకులో వాయిదాల రూ. 1.5 లక్షలు, బైక్ లోన్ రూ.6వేలు చెల్లించాడు. శ్రీనివాసచారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడు బాతుల విజయ్‌కుమార్‌ను గుర్తించారు. అతని అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించాడు. 31తులాలు పోయిందని ఫిర్యాదు..51తులాలు రికవరీ... మొదట బంగారం ఎంత దొంగతనానికి గురైనదనే దానిపై యజమానికి కూడా స్పష్టత లేదు. వినియోగదారుల రషీదులను పరిశీలించిన తర్వాత 31తులాలు చోరీకి గురైనట్లు ముషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత 51 తులాలుగా లెక్కతేలింది. కేసును చేధించిన డిఐ సంతోష్‌కుమార్, డిఎస్ఐ బాలరాజ్, క్రైం స్టాఫ్ జయరాజ్, విశ్వనాథ్, కృష్ణ, కళ్యాణ్, అవినాష్‌లకు రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. -
బాహుబలికి క్రేజ్ మరీ ఈ రేంజ్‌లోనా..?
బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సినిమాల పేర్లతో చీరలు, డ్రెస్‌లు రావడం కొత్తేమి కాదు. హీరోయిన్, హీరోల పేర్లతో వస్త్ర వ్యాపారులు మార్కెట్ క్యాచ్ చేసుకునే వాళ్లు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్‌ను జ్యూవెల్లరి వ్యాపారులు సైతం అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ సాధించిన బాహుబలి సినిమా పేరుతో ఆభరణాలను తయారు చేసి మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు. సినిమాలోని కీలక ఘట్టాలను తీసుకొని లాకెట్లు గా మార్చేస్తున్నారు. శివగామి, బాల బాహుబలిని చేతితో ఎత్తుకుని నీళ్లలో మునిగిపోతున్న సీన్, బాహుబలి 2లో అత్యంత పాపులర్ అయిన మహేంద్ర బాహుబలి ఏనుగును ఎక్కే సీన్. అలాగే సింహాసనంపై బాహుబలి కూర్చున్న దృశ్యాలను లాకెట్ లుగా మార్కెట్లో తీసుకొస్తున్నారు. టెంపుల్ జ్యూయలరీ అన్నది జ్యూయలరీలో ఓ డిజైనింగ్ కేటగిరీ. ఆ కేటగిరీ టైపులోనే కళాకారులు ఈ బాహుబలి డిజైన్లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. -
సారీ.. అసలు దొంగలు దొరికారు!
నెల్లూరు(క్రైమ్): నగల దొం గతనం కేసులో అనుమానంతో కారు డ్రైవర్‌ను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు నిర్భందించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. చివరకు అసలు నిందితులు దొరకడంతో సారీ చెప్పి వదిలి పెట్టారు. దీంతో బాధితుడు నడవలేని స్థితిలో జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి వివరాల మేరకు.. నగరంలోని కాపువీధికి చెందిన రాహుల్‌జైన్ బంగారు వ్యాపారి. ఆయన లైన్బిజినెస్ చేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలోని పలు జ్యుయలరీ దుకాణాలకు ఆర్డర్లపై బంగారు నగలు తయారీ చేసి సరఫరా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న రాహుల్‌జైన్ నెల్లూరు నుంచి కారులో కందుకూరు, సింగరాయకొండ, టంగుటూరుల్లోని బంగారు వ్యాపారస్తులకు ఆభరణాలు ఇచ్చి వారు గతంలో బాకీ ఉన్న నగదును వసూలు చేసుకుని ఒంగోలుకు వెళ్లాడు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ హోటల్ వద్ద కారును పార్క్ చేశారు. రాహుల్‌జైన్ అతని డ్రైవర్ వెంకటస్వామి భోజనం చేసేందుకు హోటల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలి యని దుండగులు కారును మారు తాళాలతో తెరచి అందులో ఉన్న రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించుకుని వెళ్లారు. ఘటనపై ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌కు చిత్రహింసలు? కోవూరు రాళ్లదిబ్బకు చెందిన పి.వెంకటస్వామి కారుడ్రైవర్. ఆదివారం అతని స్నేహితుడు అశోక్ ఫోన్‌చేసి రాహుల్జైన్ను తీసుకుని ఒంగోలు వెళ్లి రావాలని చెప్పాడు. దీంతో వెంకటస్వామి బంగారు వ్యాపారితో కలిసి ఒంగోలు వెళ్లాడు. ఈ క్రమంలో నగలు, నగదు చోరీకి గురవడంతో పోలీసులు తొలుత వెంకటస్వామిని అదుపులోకి తీసుకున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని వెంకటస్వామి చెబుతున్నప్పటికీ థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. మూడు రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. అసలు దొంగ పాతడ్రైవరేనని తేలడంతో పోలీసులు సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న డ్రైవర్ వెంకటస్వామికి సారీ చెప్పి మంగళవారం రాత్రి వదిలివేశారు. దీంతో బాధితుడు నెల్లూరు చేరుకుని బుధవారం చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చేరారు. ఈ విషయాలన్నింటిని బాధితుడు మీడియాకు వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. తాను నిర్దోషినని చెప్పినప్పటికీ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని వెంకటస్వామి భార్య వాపోయారు. 20 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం జొన్నవాడ (బుచ్చిరెడ్డిపాళెం) : ఒంగోలులో పట్టపగలు ఓ హోటల్ వద్ద జరిగిన బంగారు దొంగతనం కేసులో జొన్నవాడలో మరో 20 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు బంగారు నగల వ్యాపారి రాహుల్‌జైన్ కారులో చోరీ జరిగిన బంగారు నగల రికవరీలో భాగంగా ఒంగోలు వన్ టౌన్ ఎండీ షబ్బీర్ జొన్నవాడ సర్పంచ్ పిల్లెల్ల మురళీమోహన్ కృష్ణకు బుధవారం ఫోన్ చేశారు. వీడియో కాల్ ఆధారంగా నిందితులు ముసునూరు ఓంకార్, కందికట్టు రాజశేఖర్ బంగారు నగలు దాచి ఉంచిన ఇంటికి పంపారు. అక్కడ మట్టిలో దాచిన ఏడు ఆభరణాలు (దాదాపు 20 సవర్లు) వెలికి తీశారు. వాటిని నగల వ్యాపారి రాహుల్‌జైన్ స్వాధీనం చేసుకుని ఒంగోలుకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. -
పాత డ్రైవర్ పనే..!
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలో ఆదివారం మిట్ట మధ్యాహ్నం జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారి రాహుల్ జైన్ కారులో నుంచి ఒంగోలులో రెండు కేజీల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు అపహరణకు గురవడం సంచలనం సృష్టించింది. రాహుల్ జైన్ నెల్లూరు నుంచి కందుకూరు, సింగరాయకొండ, టంగుటూరు వ్యాపారులను కలిసి పాత బకాయిల వసూలుతో పాటు కొత్తగా ఇచ్చిన ఆర్డర్ల మేరకు బంగారాన్ని సరఫరా చేసేందుకు జిల్లాలో పలు ప్రాంతాలు తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఒంగోలుకు చేరుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అజంతా హోటల్లో భోజనానికి వెళ్లి వచ్చే సరికి కారులోని బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు, రూ.2 లక్షలు నగదు ఉన్న బ్యాగులు అపహరణకు గురయ్యాయి. దీంతో ఖంగుతిన్న వ్యాపారి ఒంగోలు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవటంతో పాటు బాధితుడు రాహుల్ జైన్‌ని, అతని తాత్కాలిక డ్రైవర్ వెంకట స్వామిని డీఎస్పీ విచారించారు. రిమోట్ లాక్ ఉన్నా చోరీ కారుకు రిమోట్ ఆటో మేటిక్ లాక్ ఉంది. అయినా కారు అద్దాలు పగులగొట్టకుండా డోర్ తీసి చోరీకి పాల్పడటంపై పోలీసులు కారు నడిపిన డ్రైవర్‌ను తొలుత అనుమానించారు. గుర్తు తెలియని వ్యక్తులు కారు డోర్ లాక్ తీసేపనైతే రిమోట్ ఉన్నందున కారు శబ్దం చేయాలి. అయితే అంతకు ముందే కారు రిమోట్ సెన్సార్లు పని చేయకుండా ఉన్నట్లు స్వయంగా ఎస్పీకి డ్రైవర్‌తో పాటు రాహుల్ జైన్ వివరించారు. దీంతో సోమవారం వరకు డ్రైవర్ వెంకటస్వామిని అనుమానించిన పోలీసులు గతంలో పని చేసిన డ్రైవర్లు ఎవరన్న దానిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇది పాత డ్రైవర్ పన్నాగంగా అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు పాత డ్రైవర్ పనేనని నిగ్గుతేలింది. అయితే రెండు నెలల క్రితం పాత డ్రైవర్‌గా రాహుల్‌జైన్ దగ్గర పని చేసిన వ్యక్తి కారుకు సంబంధించిన రెండో తాళాన్ని ముందుగానే తయారు చేయించుకొని అతని వద్ద ఉంచుకున్నాడు. ఈ రెండు నెలల కాలంలో పలు దఫాలుగా కారు డోర్ తీసి అపహరణకు ప్రయత్నించాడు. అయితే డోర్ రాకపోవడంతో ఆ తాళాన్ని మరింత పదునుగా తయారు చేయించి ఆదివారం ఒంగోలులో భారీ చోరీకి పాల్పడినట్లు తేలింది. దీంతో నెల్లూరులో ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం తెలిసింది. కారులో అపహరించిన బంగారు ఆభరణాలు, నగదును అతని పాత డ్రైవర్ బంధువుల ఇంట్లో పూడ్చిపెట్టాడు. దీంతో బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకొని చోరీకి పాల్పడిన పాత డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయానికల్లా సొత్తుతో సహా నిందితులను ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
105 కోట్ల రూపాయల కెంపుల సెట్
ధర వినగానే గుండె గుభిల్లుమనే ఉంటుంది. కళ్లు పెద్దవి చేసుకొని ఎందుకు ఇంత ధర అని వెతికే క్రమంలో పడే ఉంటారు. అంతర్జాతీయ మార్కెట్లో మన దేశఖ్యాతిని పెంచిన జాబితాలో తాజాగా ఈ కెంపుల సెట్ కూడా చేరింది. ఈ కెంపుల వెనుక కథేంటి, ఆ ఖరీదు విశేషమేంటో తెలుసుకుందామనే ఆసక్తీ మొదలైందంటే ఈ న్యూస్ మీ కోసమే! అంతర్జాతీయ వజ్రాభరణాల డిజైనర్‌గా పేరొందిన నీరవ్‌మోడి ఓ కెంపుల నెక్లెస్, చెవి పోగులు, బ్రేస్లెట్ రూపొందించాడు. వీటి ధర అక్షరాలా 105 కోట్ల రూపాయలు. ఈ సెట్లో మొత్తం 27 కెంపులు పొదిగారు. ఈ విలువైన కెంపులను మయన్మార్‌లోని మొగక్ మైన్స్ నుంచి సేకరించారట. కెంపుల చుట్టూ ఖరీదైన ఫైన్ కట్ వజ్రాలను పొదిగారు. ఈ సెట్లో వాడిన కెంపులను ఈ దశకు తీసుకు రావడానికి ఐదేళ్లు పట్టిందట. తర్వాత డిజైన్ గీసుకొని, ఆభరణంగా తయారు చేయడానికి ముంబైలోని మోడీ, అతని బృందానికి మరో రెండేళ్లు పట్టిందట. అన్ని కోట్ల విలువైన ఆభరణాన్ని చేజిక్కించుకునే అదృష్టం ఎవరికి దక్కనుందో! మూడేళ్ల క్రితం న్యూ ఢిల్లీలో సొంతంగా ఆభరణాల షాప్‌ను ప్రారంభించిన నీరవ్‌మోడీకి దేశవ్యాప్తంగా ఇప్పుడు 15 స్టోర్స్ ఉన్నాయి. మోడీ చేతిలో రూపుదిద్దుకున్న ప్రతీ ఒక్క ఆభరణం ఒక మోడల్ పీస్‌లా ఉంటుంది. ప్రారంభ ధర రెండు లక్షల రూపాయల నుంచి 105 కోట్లు పెట్టి కొనుగోలు చేసే ఆభరణాలూ ఇతని స్టోర్‌లో ఉన్నాయన్నమాట. -
వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసు?
బంజారాహిల్స్: వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసంటూ చోరీ కేసులో నిందితురాలు పోలీసులకు సమాధానం చెబుతుంటే అర్థంకాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ నివాసంలో బంగారు ఆభరణాలు చోరీ అయిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు పనిమనిషి సుజాతను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు ఆమె స్వగ్రామానికి వెళ్లి చోరీ చేసిన ఆభరణాల గురించి వాకబు చేయగా ఆమె పోలీసులకు సహకరించకుండా గంటకోమాట మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజులుగా ఆమెను విచారిస్తుండగా చోరీ చేసిన ఆభరణాలు ఎక్కడ దాచిన విషయం సరిగ్గా చెప్పడం లేదు. రోజుకొక మాట మాట్లాడుతూ పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నట్లు సమాచారం. లక్ష్మినారాయణ నివాసంలో కేవలం నెల రోజులు మాత్రమే పనిచే నగలబాక్స్ను మాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దోచిన నగలను కొంత మందికి విక్రయించినట్లు తెలియగా వారి వద్దకు వెళ్తే తాము కొనుగోలు చేయలేదంటూ ఎదురు తిరుగుతున్నారు. ఒక వైపు నిందితురాలు సహకరించకపోగా మరోవైపు నగలు కొనుగోలు చేసిన వారుకూడా తలోమాట మాట్లాడుతుండటంతో ఈ కేసు ముందుకు సాగడం లేదు. దొంగను పట్టుకున్నామన్న ఆనందం పోలీసులకు లేకుండా పోయింది. -
ప్రియుడే కాలయముడు
తిరుత్తణి: ఆరు సవర్ల నగల కోసం మహిళను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెలుగుచూసింది. తిరుత్తణి తాలూకా తిరువాలాంగాడు లక్ష్మీవిలాసపురం గ్రామం సమీపంలో తల నరికిన స్థితిలో మహిళ మొండెంను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అనంతరం గాలింపు చేపట్టి అదే ప్రాంతంలోని చెరువు కట్ట వద్ద తలను గుర్తించారు. కేసును ఛేదించేందుకు తిరుత్తణి డీఎస్పీ బాలచంద్రన్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహిళ చెన్నై అంబత్తూరు సమీపం పట్రవాక్కంకు చెందిన రేవతి(42)గా తెలిసింది. ఈమె పదేళ్ల కిందట భర్త రామచంద్రన్ విడిపోయి తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఇలాఉండగా తిరువళ్లూరు సమీపం వేపంపట్టుకు చెందిన మారియప్పన్(37) పట్రవాక్కంలో రేవతి ఇంటికి ఎదురుగా కిరాణా దుకాణం నడిపేవాడు. ఈ క్రమంలో రేవతి, మారియప్పన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 10న రేవతి, మారి బైక్‌పై వాలాజాలోని ధన్వంతరి ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తా ను వ్యాపారంలో నష్టపోయానని ఆదుకోవాలని మారి రేవతిని కోరాడు. అతనికి సహాయపడేందుకు రేవతి సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహించిన మారి కత్తితో ఆమె తల నరికి మెడలో ఉన్న ఆరుసవర్ల నగలు తీసుకుని తలను అక్కడి సమీపంలోని చెరువుకట్ట ప్రాంతంలో వేసి పరారయ్యాడు. నగల కోసం హత్య చేసినట్టు మారి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. -
టాప్ జ్యుయల్లరీ షాపు ఘరానా మోసం...భారీ టోకరా
సాక్షి, చెన్నై: తమిళనాడు చెన్నైలోని ప్రముఖ బంగారునగల దుకాణం వినియోగదారులకు భారీ టోకరా ఇచ్చింది. వివిధ స్కీంలలో పెట్టుబడుల పేరుతో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించి కోట్లాది రూపాయలను దండుకుంది. ఇటీవలి దీపావళి ఆఫర్ చెల్లించడంలో విఫలం కావడంతో అసలు గుట్టు రట్టయింది. షాపుల మూతకుదారితీసింది. మరోవైపు వేలాదిమందిని కోట్లాది రూపాయల మేర చీటింగ్ చేసినట్టు స్వయంగా దుకాణ యజమానే అంగీకరించారు. వివరాల్లోకి వెళితే చెన్నైలోని నాతెల్లా సాంపత్తు చెట్టి( ఎన్ఎస్సీ)ఈ ఘరానా మోసానికి పాల్పడింది. స్కీముల పేరుతో 21వేలమంది కస్టమర్లకు రూ.75కోట్లకు కుచ్చు టోపీ పట్టింది. వివిధ నెలవారీ పథకాలలో డబ్బులు చెల్లించిన దాదాపు వెయ్యి మంది పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జ్యుయల్లరీ షాపు బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపై ఆర్థిక నేరాల వింగ్ ( ఈఓడబ్ల్యు) అధికారులు కేసు నమోదు చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రంగనాథ గుప్తా సహా, ఐదుగురు డైరెక్టర్లు(కుమారులు ప్రభన్నకుమార్, ప్రసన్న కుమార్, గుప్తా బంధువు కోటా సురేష్) ఇందులో ఉన్నారు. ఈ సందర్భంగా పలు తనిఖీలు నిర్వహించిన ఈఓడబ్ల్యు అధికారులు విలువైన ఆస్తి పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సంస్థకు చెందిన నగరంలో మెయిన్ సెంటర్లో షో రూంలు, రెండు ఇళ్లు, అంబత్తూర్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో కట్టించిన స్కూలు తదితర విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు దర్యాప్తు సంస్థ సిద్ధమవుతోంది. ఈ ఆస్తులను చట్ట ప్రకారం విక్రయించి.. ఇన్వెస్టర్లకు డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. -
హైదరబాద్ పోలీసులకు చేదు అనుభవం
అనంతపురం సెంట్రల్: హైదరాబాద్ సైబర్ పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ దొంగ చోరీ చేసిన బంగారును కొనుగోలు చేశారనే అభియోగంతో రికవరీ చేయడానికి గురువారం హైదరాబాద్ సైబర్ పోలీసులు జిల్లాకు వచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా వస్తారని స్వర్ణకారులంతా వారిని ప్రశ్నించారు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను కూడా ముట్టడించారు. పలువురు స్వర్ణకారులు తెలిపిన వివరాల మేరకు... హైదరబాద్ సైబర్ పోలీసులు ఓ దొంగను వెంట పెట్టుకొని గురువారం జిల్లాకు వచ్చారు. నేరుగా పాతూరులో బంగారుగేరిలో వీరభద్ర జ్యువెలర్స్ షాపులోకి వెళ్ళారు. సదరు దొంగ నుంచి 28 తులాల బంగారు నగలు కొనుగోలు చేశారని అభియోగం మోపారు. దొంగ కూ డా సదరు వ్యక్తులకు విక్రయించి నట్లు తెలిపారు. దీనిని స్వర్ణకారులంతా వ్యతిరేకించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ చెప్పినట్లుగా తమపై అభియోగాలు మోపడం ఏంటని ప్రశ్నించారు. తాము దొంగల నుంచి ఎలాంటి బంగారు కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణా పోలీసులు వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో స్వర్ణకారులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనంతరం వన్‌టౌన్ సీఐ సాయిప్రసాద్ స్వర్ణకారుల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించుకోవాలని, ఆందోళనలు చేయడం సరికాదన్నారు. దీంతో వెనక్కు తగ్గిన స్వర్ణకారులు ఆందోళన విరమించారు. పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గురువారం రాత్రి బంగారుగేరిలో సమావేశమయ్యారు. మరోవైపు హైదరాబాద్ సైబర్ పోలీసులు మాత్రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. దొంగ నుంచి కొనుగోలు చేసిన బంగారును రికవరీ చేసుకొని వెళ్తామని స్పష్టం చేశారు. -
‘పసిడి లావాదేవీలకు నూతన పరిమితి’
సాక్షి,న్యూఢిల్లీ: బంగారం ఇతర ఖరీదైన మెటల్స్‌లో లావాదేవీలపై పరిమితులకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నూతన ఉత్తర్వులను జారీ చేయనుంది. బులియన్లో బ్లాక్‌మనీ పేరుకుపోవడాన్ని నియంత్రించే నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేస్తుందని రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అథియా వెల్లడించారు. రూ 50వేలకు మించిన బంగారం కొనుగోళ్లపై పాన్ కార్డు తప్పనిసరి కాదని ఇటీవల ప్రభుత్వం పేర్కొన్న క్రమంలో నూతన నిబంధనలపై రెవెన్యూ శాఖ వివరణ ఇచ్చింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనలను జ్యూవెలరీ కొనుగోళ్లకూ వర్తింపచేస్తూ ఈ ఏడాది ఆగస్ట్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతికూల సెంటిమెంట్‌ను వ్యాపింపచేస్తుడటంతో వాటిని నిలిపివేసినట్టు హస్ముక్ అథియా చెప్పారు. అయితే జ్యూవెలర్లు బంగారు ఆభరణాల కొనుగోలు వివరాలను ఎంత విలువ దాటితే అధికారులకు వెల్లడించాలనే దానిపై లోతుగా చర్చించిన మీదట నూతన పరిమితిని ప్రభుత్వం వెల్లడిస్తుందని తెలిపారు. -
దొంగలకే చుక్కలు చూపించిదెవరంటే...
పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగలకు అక్కడున్న గ్లాస్ కౌంటర్ చుక్కలు చూపించిన వైనం కెమెరాకు చిక్కింది. చోరాగ్రేసరుల రకరకాల చోళకళ గురించి మనం చాలానే విన్నాం. అయినా ఎక్కడో ఒక చోట ఒక చిన్న క్లూతో దొరికిపోవడం మామూలే. ముఖ్యంగా సీసీ టీవీలు వచ్చిన తరువాత పోలీసులకు ఈ పని మరింత సులువైంది. అయితే మలేసియాలోని ఓ జ్యుయలరీ షాపులో దొంగతనానికి వచ్చిన దొంగలకు అనుకోని చుక్కెదురైంది. ఎంత చోమటోడ్చినా ఫలితం దక్కకపోవడంతో తోకముడవక తప్పలేదు. ఈ దోపిడీ ప్రయత్నంచేసిన దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు దొంగల ముఠా సెక్యూరిటీని గన్‌తో బెదిరించి మరీ మలేషియాలోని ఒక ఆభరణాల దుకాణంలోకి ఎంటర్ అయింది. ముఖాలకు హెల్మెట్లు, సుత్తులు లాంటి సరుకు సరంజామాతో పనిలోకి దిగారు. తమ వెంట తెచ్చుకున్న సుత్తెలతో జ్యూయెలరీ షోరూమ్లోవున్న డిస్ ప్లే కౌంటర్ గ్లాసులను పగల కొట్టడానికి ట్రై చేశారు. ఒకరి తరువాత ఒకరు ఇద్దరు దొంగలు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అది చాలా మందంగా వుండడంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసినవికావడంతో ఆ గ్లాస్ పగల్లేదు. ఇక చేసేదేమీలేక అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కెడై ఇమాస్ శ్రీ ఆలం జ్యుయల్లరీ షోరూం లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్ లో దాదాపు 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, వేలాది షేర్లను సొంతం చేసుకుంది. -
రికవరీ : బంగారం ధరలు జంప్ చేశాయి
న్యూఢిల్లీ : బంగారం ధరలు రికవరీ అయ్యాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 300 రూపాయల మేర పెరిగి, 29,550గా నమోదైంది. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలు, స్థానిక జువెల్లర్స్ భారీగా కొనుగోళ్లు చేపడటంతో బంగారం ధరలు 300 రూపాయల మేర పెరిగాయని తెలిసింది. ఇటు వెండికీ పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ తో దీని ధరలు కూడా కేజీకి రూ.1,170 పెరిగి రూ.40,470గా నమోమైంది. అమెరికా జాబ్స్ డేటా పేలవంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికవరీ అయ్యాయి. జాబ్స్ డేటా పేలవంగా రావడంతో ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీరేట్ల పెంపును క్రమవిధానంలో పెంచాలని చూస్తోంది. అంతేకాక దేశీయ స్పాట్ మార్కెట్లో స్థానిక జువెల్లర్స్ ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. దీంతో విలువైన ఈ మెటల్స్ ధరలు పెరిగాయని బులియన్ విశ్లేషకులు చెప్పారు. గ్లోబల్ గా గోల్డ్ ధర 1.04 శాతం పెరిగి ఒక ఔన్సు 1,278 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ కూడా 1.48 శాతం లాభపడి ఔన్స్ కు 17.53డాలర్లుగా ఉంది. దేశీయ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధరలు 300 రూపాయల చొప్పున పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధరలు రూ.29,550, రూ.29,400 రూపాయలుగా ఉన్నాయి. నిన్నటి మార్కెట్లో ఇవి 100 రూపాయల మేర పడిపోయాయి. -
పట్టపగలే హత్యలు.. సీఎం సీరియస్
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పట్టపగలే కొందరు సాయుధ దుండగులు ఒక నగల దుకాణంలోకి దూసుకెళ్లి అక్కడి వ్యాపారులను కాల్చి చంపారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన వెంటనే రాష్ట్ర డీజీపీని ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ఈ కేసులో ఇంతవరకు ఎందుకు అరెస్టులు జరగలేదో చూడాలన్నారు. యూపీ అసెంబ్లీలో కూడా ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర మంత్రి, మథుర ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పూర్తిగా అదుపులోపకి తెస్తామని, రాష్ట్రంలో నేరగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ అన్నది లభించదని ముఖ్యమంత్రి సభలో అన్నారు. ముఖాలకు ముసుగులు, హెల్మెట్లు ధరించిన వ్యక్తులు నగలదుకాణంలోకి ప్రవేశించి, ముందుగా సిబ్బందితో గొడవపడ్డారు. షాపులోకి వాళ్లు రాకుండా అడ్డుకోవడంతో సిబ్బందిలో ముగ్గురిని కాల్చి... వాళ్ల మీదుగా లోపలకు ప్రవేశించారు. ఆ సిబ్బందిలో ఇద్దరు మరణించారు. మొత్తం ఆరుగురు సాయుధులు బైకుల మీద దోపిడీకి వచ్చారని, దాదాపు రూ. 4కోట్ల విలువైన బంగారంతో పారిపోయారని పోలీసులు చెప్పారు. జిల్లా సరిహద్దులన్నింటినీ మూసేసి దొంగల కోసం గాలింపు మొదలుపెట్టారు. -
టైర్ మారుస్తుండగా...రూ.కోటి నగలు మాయం
వ్యాపారి దృష్టి మరల్చి అపహరణ హైదరాబాద్: ఓ నగల వ్యాపారి దృష్టి మరల్చి 3.5 కిలోల బంగారు ఆభరణాల బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పురుషోత్తం సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బషీర్‌బాగ్‌లో నివాసం ఉండే అభిషేక్ అగర్వాల్.. యషశ్రీ జువెల్లరీ పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వివిధ రకాల మోడళ్లను తయారు చేసి మలబార్ గోల్డ్ షోరూంలకు సరఫరా చేస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం స్కొడా కారులో రూ.కోటి విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని బయలుదేరి.. అమీర్‌పేట, కూకట్పల్లి, చందానగర్‌లోని మలబార్ గోల్డ్ షోరూంలలో నమూనాలను చూపించారు. తిరిగి వస్తుండగా కూకట్‌పల్లిలోని ఏఎస్‌రాజు నగర్ కమాన్ దాటిన తరువాత కారు వెనుక టైర్ పంక్చర్ అయింది. అభిషేక్, అతని వద్ద పనిచేసే ఆశిష్ టైర్‌ను మార్చి వచ్చి చూడగా.. నగల బ్యాగు కనిపించలేదు. దీంతో అభిషేక్ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభిషేక్ టైర్ మారుస్తున్న సమయంలో కారు వద్ద ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. చందానగర్ నుంచి కారు వెంబడి ద్విచక్రవాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు అనుసరించినట్లు నగల వ్యాపారి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
విజిలెన్స్ అధికారులమంటూ నగలు చోరీ
లబోదిబోమన్న బాధితురాలు నాయుడుపేటటౌన్ (సూళ్లూరుపేట): విజిలెన్స్ అధికారులమని, బంగారు నగలకు ఖచ్చితంగా బిల్లులు ఉండాలని చెప్పి భయబ్రాంతులకు గురి చేసి ఓ మహిళ వద్ద నుంచి 38 గ్రాముల బంగారు నగలను తస్కరించారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం నాయుడుపేట పట్టణంలో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు పట్టణంలోని అమరాగార్డెన్ వీధిలో నివాసముంటున్న చేని దాసరి మస్తానమ్మ ఓ టిఫిన్ అంగట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దుకాణం నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో మోటార్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను రోడ్డుపై నిలిపారు. మేము విజిలెన్స్ అధికారులమని మోదీ కొత్తగా విడుదల చేసిన జీఓ ప్రకారం బంగారు నగలకు రసీదులు ఉండాలన్నారు. మహిళ వేసుకున్న బంగారు నగలకు రసీదులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. దీంతో ఆమె కంగారుపడిపోయింది. అప్పుడే ఓ యువకుడు బ్యాగ్‌తో వస్తుండడంతో ఆతనిని కూడా ఆ ఇద్దరు వ్యక్తులు పిలిచారు. ఆ యువకుడు మెడలో వేసుకున్న చైన్, ఉంగరాలను చూసి వీటికి రశీదులు ఉన్నాయంటూ నిలదీశారు. దీంతో ఆ యువకుడు కొంత నగదు ముట్టచెప్పడంతో బంగారు నగలను తీసి భద్ర పరుచుకోవాలని ఓ కాగితంలో చుట్టు యువకుడికి ఇచ్చేశారు. ఆ మహిళ మెడలో ఉన్న మంగళసూత్రంతోపాటు బంగారు చైన్‌ను తీసి ఇచ్చింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఓ కాగితంలో చుట్టి ఆమెకు ఇచ్చారు. కొద్ది దూరం వెళ్లి చూసుకునే సరికి అందులో చిన్నపాటి రాళ్లు ఉండడంతో గగ్గోలు పెట్టింది. అయితే అప్పటికే ఆ ఇద్దరు వ్యక్తులు బ్యాగ్‌తో వచ్చిన యువకుడితో కలిసి మోటార్‌బైక్‌పై ఉడాయించారు. మహిళ ఈ సంఘటనతో అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాధితురాలికి వైద్యశాలలో చికిత్సలు చేయించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నారు. -
జోయాలుక్కాస్ భారీ విస్తరణ
సెప్టెంబరుకల్లా కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంకల్లో షోరూమ్‌లు హైదరాబాద్: దేశంతో పాటు విదేశాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న ఆభరణాల రిటైల్ చైన్ జోయాలుక్కాస్... ఈ ఏడాది సెప్టెంబరు నాటికి కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంకల్లో కూడా ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ‘‘దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికల్లా ఇవి పూర్తవుతాయి’’ అని గ్రూప్ సీఎండీ జోయాలుక్కాస్ చెప్పారు.1987లో యూఏఈలో షోరూమ్‌తో తమ ప్రస్థానాన్ని ప్రారంభించామని, 30 ఏళ్లలో 130 షోరూమ్‌లు ఏర్పాటు చేయగలిగామని చెప్పారాయన. ప్రస్తుతం సంస్థకు యూఏఈ, ఇండియా, యూకే, సింగపూర్, ఖతర్, అమెరికా, సౌదీ ఆరేబియా, బహ్రెయిన్ వంటి 14 దేశాల్లో కోటి మందికిపైగా కస్టమర్లున్నారు. ‘‘అత్యుత్తమ సేవలందించటమనే లక్ష్యమే మమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది’’ అని ఆయన వివరించారు. -
నగలు కొట్టేద్దామని స్కెచ్‌వేసి..
హైదరాబాద్: ఓ నగల వ్యాపారికి తన దగ్గర పనిచేసే గుమాస్తా టోకరా వేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కు చెందిన రాజేందర్ జైన్ అనే నగల వ్యాపారి తన కస్టమర్ రూ. 17 లక్షల విలువ చేసే నగలు డెలివరీ చేయాల్సి ఉంది. దీంతో తన దగ్గర పనిచేసే గుమాస్తా చంద్రమౌళికి ఈ పని అప్పగించాడు. ఇదే మంచి సమయం అనుకుని భావించిన చంద్రమౌళి చాకచక్యంగా నగలు కొట్టేసేందుకు ప్లాన్ వేశాడు. నగలు తీసుకుని హైదరాబాద్ వచ్చిన గుమస్తా చంద్రమౌళి నగలు పోయాయని యజమానికి ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు..గుమస్తా చంద్రమౌళి నే నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 17 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మందుల పెట్టెల మాటున..
చత్తీస్‌గఢ్: పాతనోట్ల కట్టల పాములు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. చత్తీస్గడ్ లో ఒక మెడికల్ షాపులో భారీ ఎత్తున పాత నోట్లను, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెమెతారలోని శ్రీరామ మెడికల్ స్టోర్ పై బుధవారం ఆదాయ పన్ను అధికారులు దాడిచేశారు. మందుల పెట్టెల్లో దాచిన రూ.70 లక్షలకుపైగా విలువైన పాతనోట్లను, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.. తాజా సమాచారం ప్రకారం అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా నవంబర్ 8న రద్దు చేసిన రూ.500, 1000 నోటలకు డిపాజిట్లకు గడువు దగ్గరపడుతోంది. మరోవైపు నల్లధనానికి చెక్ పెట్టే క్రమంలో కేంద్ర బుధవారం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దీని ప్రకారం 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉంటే నేరం. ఇలాంటి వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే మార్చి 31 తరువాత పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్ 30 మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి చేసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. -
నాలుగు గంటల్లో.. వందకోట్ల బంగారం!
పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటించారు. సరిగ్గా అదేరోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు.. అంటే కేవలం నాలుగంటే నాలుగే గంటల్లో ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి ఏకంగా 100 కోట్ల రూపాయల బంగారం అమ్మారట! ఈ విషయాన్ని ఆయన తన లెక్కల్లో చూపించారు. అంత అమ్మకాలు ఎలా సాధ్యమయ్యాయని ఈడీ అధికారులు అతడిని ప్రశ్నించారు. నోయిడా సెక్టార్ 51 లోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలో జరిగిన అక్రమాలు, నకిలీ అకౌంట్ల బాగోతంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఢిల్లీ, ముంబైకి చెందిన ఇద్దరు నగల వ్యాపారుల లావాదేవీలపైనే స్పష్టత రాలేదు. దాంతో వారిని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిలో ఒక వ్యాపారి ఏకంగా 800 కోట్ల మేర లావాదేవీలు చేశారు. వాటిలో 200 కోట్లు కొనుగోళ్లు కాగా, మరో 600 కోట్లు బంగారం అమ్మకాలు. కొనుగోలు చేసిన బంగారానికి, జరిగిన అమ్మకాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదని ఈడీ వర్గాలు కనుగొన్నాయి. తాను 5 వేల మందికి బంగారం అమ్మానని ఓ నగల వ్యాపారి చూపించినా, వాటిలో ఏ ఒక్క లావాదేవీ మాత్రం 2 లక్షలు దాటలేదు. అంటే ఒక్కో కస్టమర్‌కు కేవలం 15 సెకండ్లలోనే బంగారం అమ్మేసినట్లవుతుంది. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే, అతడి వద్ద సమాధానం లేదు. దాంతో ఈ నగల వ్యాపారులు ఇద్దరూ నల్లధనాన్ని తెల్లగా చేసుకోడానికి అంతకుముందు జరిగిన అమ్మకాలను కూడా ఇప్పుడే జరిగినట్లు చూపిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి. -
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
-
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
సూరత్: డిమానిటైజేషన్ తరువాత సూరత్ లో వడ్డీ వ్యాపారి , మనీ లాండరింగ్ కింగ్ కిషోర్ భాజీవాలా ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులే షాకయ్యారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన అవినీతి తిమింగలం కూడబెట్టిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు చేరింది. వడ్డీవ్యాపారిగా అవతరించిన టీ బజ్జీలు అమ్ముకునే వ్యక్తి ఆదాయం ఇంత భారీగా ఉండడం ఆదాయ పన్ను అధికారులను సైతం విస్మయ పరిచింది. ఆదాయ పన్ను అధికారులు తాజాగా ఆయన ఇంటిపై చేసిన సోదాల్లో మరో రూ. 150 కోట్ల విలువైన ఆస్తులు పట్టుబడ్డాయి. సుమారు రూ. 1.33 కోట్లను నగదును రికవరీ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఇందులో రూ.95 లక్షల విలువైన కొత్త రెండు వేల నోట్లు ఉన్నాయి. దీంతోపాటుగా రూ.7 కోట్ల విలువగల బంగారు ఆభరణాలు, రూ.72 లక్షల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నారు. (5కేజీల బంగారం బిస్కట్లు, 8 కేజీల బంగారు ఆభరణాలు, కేజీ డైమండ్ నగలు) రూ. 4.50 లక్షల కిసాన్ వికాస పత్రాలు, బంగ్లా, ఫ్లాట్స్, ఇళ్లు, షాపు లు సహా వ్యవసాయ భూమి సుమారు 70 ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ సుమారు నాలుగువందల కోట్లని అధికారులు అంచనావేశారు. పెద్దనోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు సూరత్ లోని ఉధానా బ్యాంకుకు భారీ సంచులతో రావడం సీసీటీవీలో రికార్డు అయింది. దీనిపై విచారణ సందర్భంగా సదరు వ్యక్తి సమాధానం చెప్పడంలో విఫలం కావడం ఐటి అధికారులు ఆయన ఇంటిపై సోదారు నిర్వహించారు. సూరత్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్, బరోడా, హెచ్ డీఎఫ్ సీ తదితర బ్యాంకుల్లో 30కి పైగా బ్యాంకు అకౌంట్లు, 16 లాకర్లు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సేర్లతో ఈ నకిలీ ఖాతాలు, లాకర్లను ఆపరేట్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం అక్రమ ఖాతాలను సీజ్ చేసినట్టు చెప్పారు. మరోవైపు రాష్ట్ర మంత్రి,బీజేపీ నేత పురుషోత్తం రూపాలను అభినందిస్తున్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఐటీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం 31 సం.రాల క్రితం సౌరాష్ట్ర నుంచి ఉద్నాగాంకి వలస వచ్చిన కిషోర్ భాజియావాలా ఓ చిన్న, టీస్టాల్ ద్వారా జీవనం మొదలు పెట్టారు. ఆతరువాత బజ్జీల అమ్మడం మొదలు పెట్టాడు. అలా మెల్లిగా వడ్డీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. స్థానిక రాజకీయనాయకులు, పో్లీసు అధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఈయన రుణం తిరిగి చెల్లించనివారిపై బెదరింపులకు పాల్పడేవారిని తెలిపారు. ఈ క్రమంలోరుణాలు చెల్లించలేని వారిదగ్గరనుండి ఆస్తులను లాక్కొనేవాడు. ఈక్రమంలోబ ఇతని నెలవారీ ఆదాయం 7.5కోట్లని విచారణలో తెలిపింది. వీటికితోడు 4.5 కోట్లు వడ్డీ రూపంలో వస్తుండగా, వివిధ ఆస్తుల మీద అ ద్దెరూపంలో మరో 3కోట్లు ఆదాయం. 150 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలతో కలిపి మొత్తం అక్రమ సంపద నాలుగువందల కోట్లకుచేరింది. మరోవైపు తమ సంవత్సర ఆదాయాన్నిరూ.1.5కోట్లుగా ఐటీ రికార్డులో చూపించడం విశేషం. డిసెంబర్ 13న మొదలైన ఈ ఐడీ దాడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
అప్పటి వరకు అమ్మ నగలు అక్కడే..
బెంగళూరు: జయలలిత వీలునామా రాయకపోవడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. చెన్నైలో పాటు హైదరాబాద్‌లో జయలలితకు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇళ్లు, తోటలు ఉన్నాయి. ఈ విషయం అటుంచితే జయలలితకు చెంది బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కర్ణాటక ట్రెజరీలో ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు జయలలితపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. 1996లో చెన్నైలోని జయలలిత నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, 10 వేల చీరలు, 91 వాచీలు, 44 ఎయిర్ కండీషనర్లు, 750 జతల చెప్పులు ఉన్నాయి. ఈ వస్తువుల విలువ 6 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా. ఆదాయపన్ను శాఖ అధికారులు అప్పట్లో ఈ వస్తువులను కర్ణాటక ట్రెజరీలో భద్రపరిచారు. ప్రస్తుతం అక్కడే ఉన్నాయి. జయలలితపై నమోదైన కేసును కర్ణాటకలో విచారించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కింది కోర్టు జయలలితను దోషిగా తీర్పు చెప్పగా, బెంగళూరు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు కారణంగా ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. హైకోర్టులో విముక్తి లభించడంతో మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే వరకు జయలలిత నగలు కర్ణాటక ట్రెజరీలోనే ఉంటాయి. -
బంగారం పై కన్ను!
-
బంగారం వర్తకులకు కేంద్రం షాక్!
-
బంగారం వర్తకులకు కేంద్రం షాక్!
పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీకి భారీగా సహకరిస్తున్న ఆభరణ వర్తకులకు కేంద్రం షాకిచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జువెల్లర్స్ రూ.500, రూ.1000 పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే తుది గడువుగా నవంబర్ 15ను నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బ్లాక్‌మనీ వ్యాపారాలను నిర్మూలించేందుకు బంగారం వర్తకులకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు సిద్దమైనట్టు సమాచారం. బంగారం, జువెల్లరీ మార్గాలలో బ్లాక్‌మనీని మార్చుకుంటున్నారని, ఈ నేపథ్యంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగి కొన్ని ఆభరణ దుకాణాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.50వేలకు పలికినట్టు తెలిసింది. సాధారణంగా రూ.30వేలు ఉండాల్సిన ఈ ధర రూ.50వేలకు ఎగియడంపై, ఆభరణ వర్తకులపై ప్రభుత్వం సీరియస్ అయింది.బ్లాక్‌మనీ నిరోధానికి ఆభరణ వర్తకులు సహకరిస్తున్నట్టు తెలుసుకున్న ప్రభుత్వం, కఠిన ఆదేశాలు జారీచేసింది. ప్యాన్ నెంబర్ లేనిది, ఆభరణాలు విక్రయించవద్దని, కొనుగోలుదారుల అన్ని వివరాలను తమకు సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించింది. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన కొన్ని గంటల్లోనే ముంబాయి సిటీలో 250 కేజీల బంగారం అమ్ముడుపోయినట్టు తెలిసింది. పాత నోట్లతో ఈ విలువైన ఆభరణాలను కొనడానికి కొనుగోలుదారులు 20 నుంచి 65 శాతం ఎక్కువకైనా చెల్లించడానికి మొగ్గుచూపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రద్దుచేసిన నోట్ల తరలింపును గుర్తించడానికి, జువెల్లర్స్, హవాలా ఆపరేటర్లకు చెక్ పెట్టడానికి ఇంటిలిజెన్స్ ఏజెన్సీలందరూ కలిసి పనిచేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇంటిలిజెన్స్ ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాయి. 2017 మార్చి వరకు బంగారం దిగుమతులను కూడా నిషేధించినట్టు మార్కెట్లో రూమర్ వస్తోంది. డిసెంబర్ వరకు కొన్ని ఆంక్షలను ప్రభుత్వం విధిస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు. -
బ్లాక్‌మనీ యుద్ధం..జ్యువెలర్స్‌కు షాక్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ బ్లాక్ మనీ’ నల్లధనం కుబేరులగుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటనతో తమ నిధులను బంగారం కొనుగోళ్లపై మళ్ళిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్నివైపుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నవంబరు 8 రాత్రి 8 గం.టల నుంచి సీసీటీవీ ఫుటేజీ సమర్పించాలంటూ జ్యువెల్లరీ షాపు యజమానులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ (నవంబరు 8) ప్రకటన రోజు రాత్రి రాజధాని నగరంలోని మూరుమూల షాపులతో సహా అన్ని ప్రముఖ నగల దుకాణాలన్నీ ఎక్కువసేపు తెరిచే వున్నాయనీ, పెద్ద మొత్తంలో బంగారు కొనుగోళ్లు జరిగాయన్నవార్తలో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. ఒకే రోజు వివిధ నగల షాపులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు షాపింగ్ చేశాడు. లేదా ఒకే కుటుంబంలోని పలువురు.. వివిధ నగల దుకాణాల్లో చేసిన షాపింగ్ తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని నగల వ్యాపారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. నల్లధనంతో బంగారం కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో, ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీబీడీటీ ఆదేశాలపై ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోల్ బాగ్, దారిబా కలాన్, చాందినీ చౌక్, ముంబై జవేరీ బజార్ సహా మూడు ప్రముఖ వ్యాపార కేంద్రాలలో ఈ దాడులు నిర్వహించారు. చండీగఢ్, లుధియానా, అమృత్సర్, జలంధర్, కోలకతా, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కూడా తనిఖీ చేశారు. ఈ దాడులు ఇంకా కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ నగదు లావాదేవీలపై కఠిన చర్యలకు తమకు స్పష్టమైన ఆదేశాలందాయని స్పష్టం చేశారు. కాగా అక్రమ పసిడి అమ్మకాల్లో బుధవారం పది గ్రా. పుత్తడి ధర రూ..35 వేల నుంచి మొదలై రూ.49 వేల దగ్గర ముగిసింది. ఇది గురువారం నాటికి మరింత ఎగిసి రూ.40 వేల దగ్గర ప్రారంభమై సుమారు 55 వేల రూపాయలు పలకడం కలకలం రేపింది. మరోవైపు బంగారు కొనుగోళ్లపై కచ్చితంగా ప్యాన్ కార్డు నమోదును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
నగల మాయంపై మరో కోణం!
విచారణకు రమ్మంటూ ఆలయ సిబ్బందికి పిలుపు అవుట్ సోర్సింగ్ అర్చకుల నుంచి వివరాలు సేకరణ హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలున్నట్లు ప్రచారం భద్రాచలం: రామాలయంలో నగల మాయంపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. నివేదిక సిద్ధమవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఆలయ సిబ్బందిని కూడా విచారణకు పిలవటంతో ఇది ఇప్పట్లో తేలేలాలేదని భక్తులు అంటున్నారు. ఆలయంలో పనిచేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ అర్చకులను తన చాంబర్లో విచారించారు. నగల మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకూ అసలేం జరిగిందనే దానిపై అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇద్దరు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు తెలిపిన వివరాలను రికార్డు చేయటంతో పాటు, వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు, మరో ఇద్దరు ఉద్యోగులు రామారావు, సాయిబాబాలను కూడా విచారణకు హాజరు కావాలని విచారణాధికారి రవీందర్ వారికి నోటీసులు అందజేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు ప్రధానార్చకులతో పాటు, 11 మంది అర్చకుల నుంచి వివరాలను సేకరించిన డీఈ రవీందర్ వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నేడో, రేపో నివేదికను ఈవో రమేష్‌బాబుకు అందజేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ మరికొంత మంది ఉద్యోగులను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించటంతో ఇది మరికొంతకాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగదీతలో ఆంతర్యమేమిటో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నగల మాయంలో దోషులెవరో తెలుసుకునేందుకు భక్తులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సీతమ్మ వారి పుస్తెలతాడును మాయం చేసి పది రోజుల తరువాత అక్కడ పెట్టినప్పటికీ, అది వాస్తవమైనది కాదనే ప్రచారం ఉంది. మాయమైన రెండు బంగారు నగలు అమెరికాకు తరలించి వాటి స్థానంలో కొత్తవి చేయించి పెట్టారని అర్చకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీసీతారాముల ఉత్సవమూర్తులను బేరం పెట్టింది మొదలు, నగల మాయం వరకూ జరిగిన మొత్తం ఎపిసోడ్లో ’ప్రధాన’ భూమిక పోషించిన అర్చకుడికి, హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీనిని ఏదో రీతిన మరుగనపరిచి, నగల మాయం వ్యవహారాన్ని భక్తులు మరిచిపోయేలా చేసేందుకే విచారణను సాగదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్దఎత్తున దుమారం రేపిన నగల మాయంలో వాస్తవాలు బయటకు వచ్చేలా విచారణను ఏదో ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించకుండా, ఆలయంలో పనిచేసే అధికారితో మమ అనిపించేలా ఉన్నతాధికారులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భక్తులు అంటున్నారు. -
నగల కోసం మహిళ దారుణహత్య
నెల్లూరు : ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న ఐదు సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరులోని ఏసీ నగర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కె. విజయరత్నం(70) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు కోసి దారుణంగా హతమర్చి ఆమె ఒంటిపై ఉన్న ఐదు సవర్ల బంగారంతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
37.31 కోట్ల బీమాకు టీవీ స్టార్ దరఖాస్తు
లాస్ ఏంజెలిస్: అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ 37.31 కోట్ల రూపాయల బీమా చెల్లించాలని కోరుతూ దరఖాస్తు చేసింది. ఇటీవల ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కిమ్ బస చేసిన హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. కిమ్ ఈ నగలకు ఇన్సూరెన్స్ చేయించింది. కిమ్ వద్ద నుంచి దొంగలు దోచుకెళ్లిన నగల విలువ మొత్తం దాదాపు 70 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని మొదట్లో వార్తలు వచ్చాయి. కాగా వీటి విలువ 37.31 కోట్ల రూపాయలుగా కిమ్ వెల్లడించింది. దొంగలు కిమ్ నుంచి ఎంగేజ్మెంట్ రింగ్‌ను దోచుకెళ్లారు. ఈ డైమండ్ రింగ్‌ను కిమ్ భర్త ఆమెకు కానుకగా ఇచ్చాడు. దీని విలువ దాదాపు 24 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. -
హోటల్లో రేప్ చేస్తారని భయపడ్డా: టీవీ స్టార్
పారిస్‌లో తాను బస చేసిన హోటల్లోకి దుండుగులు చొరబడినపుడు భయంతో వణికిపోయానని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ చెప్పింది. ఓ దుండగుడు తనను లాక్కెళ్లి బాత్‌టబ్‌లో బంధించాడని పోలీసులకు తెలిపింది. దీంతో దుండగులు తనపై లైంగికదాడి చేస్తారని బెదిరిపోయానని చెప్పింది. తనకు పిల్లలు ఉన్నారని, చంపవద్దని వారిని ప్రాధేయపడ్డానని, మీకు కావాల్సిన వస్తువులు తీసుకెళ్లి తనన వదిలేయమని వేడుకున్నానని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దుండగులు ఇంగ్లీష్‌లో మాట్లాడలేదని, ఫ్రెంచి భాషలో మాత్రమే మాట్లాడుకున్నారని కిమ్ తెలిపింది. తన భర్త ఇటీవల కానుకగా ఇచ్చిన ఉంగరం ఇవ్వాలని బెదిరించారని, తాను గట్టిగా ఏడ్చేసరికి నోటికి టేప్ అతికించారని చెప్పింది. ఆరు నిమిషాల్లో దొంగలు నగలు, డబ్బు దోచుకుని పారిపోయారని తెలిపింది. ఆ సమయంలో తన ఫ్రెండ్ సిమోనె కింది అంతస్తులో నిద్రిస్తోందని చెప్పింది. దొంగలు వెళ్లాక కేకలు వేయడంతో రెండు నిమిషాల తర్వాత తన అంగరక్షుడు వచ్చాడని వెల్లడించింది. కాగా దొంగలు తనకు ఎలాంటి హానీ చేయలేదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె పారిస్ నుంచి వెళ్లిపోయింది. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. -
45 కోట్ల నగల దోపిడీ
-
45 కోట్ల నగల దోపిడీ
పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌కు పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఐదుగురు దుండగులు కిమ్‌ను తుపాకీతో బెదిరించి సుమారు రూ.45 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో (స్థానిక కాలమానం) కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి పోలీసు దుస్తుల్లో ఐదుగురు వ్యక్తులు చొరబడ్డారు. మొహానికి ముసుగులేసుకున్న ఆ దుండగులు.. కిమ్‌ను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల (6.7 మిలియన్ డాలర్లు) విలువైన నగలతో ఉడాయించారు. ఘటనలో కిమ్‌కు ఎలాంటి హాని జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కిమ్ భర్త కాన్యే.. విషయం తెలియగానే పారిస్‌కు బయలుదేరారు. -
నగల షాపులో చోరీకి యత్నం
తనను చూశాడని గుమిస్తాపై దొంగ దాడి మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని సూర్య థియేటర్ సమీపంలో ఉన్న దివ్య జ్యుఝెల్లరీ షాపులో మంగళవారం రాత్రి ఓ దొంగ చోరీకి యత్నించాడు. షాపు యజమాని అప్రమత్తం కావడం తో అతడు పారిపోయాడు. షాపు యజ మాని కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన పమ్మి ధనుంజయచారి పట్టణంలోని సూర్య థియేటర్ సమీపంలో తన నివాస గృహంలోనే దివ్య జ్యుఝెల్లరీ షాపును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ దొంగ షాపునకు సంబంధించిన ప్రహరీ గోడ దూకి ఆ షాపు ఆవరణలోకి అడుగుపెట్టాడు. షాపు తాళం పగులగొట్టేందుకు యత్నించాడు. అదే సమయంలో ఆ షాపు వర్కర్ పరమేశ్వర్ నిద్ర లేచి మూత్రవిసర్జ నకు బయటికి రాగా దొంగ కనిపిం చాడు. అతడు నిద్ర మత్త నుంచి తేరుకునేలోపే అతడిపై దొంగ కర్ర తో దాడి చేశాడు. పరమేశ్వర్ అరుపులు, కేకలకు షాపు యజమాని ధనుంజయచారి లేవడంతో దొంగ పారిపోయాడు. షాపు యజమాని ఇచ్చిన సమాచారంతో టౌ¯న్ ఎస్సై తిరుపతి చేరుకుని దొంగ కోసం వెదికారు. గతంలోనూ ధనుంజయచారి షాపులో దొంగలు రెండుసార్లు చోరీకి పాల్పడ్డారు. -
పసందైన పూసలు
ఒకే రకమైన జ్యూవెలరీని వేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్‌గా భావిస్తోంది నేటి యువత. ఒక డ్రెస్ వేసుకుంటే.. దానికి తగ్గ జ్యూవెలరీని వేసుకోవడానికే మొగ్గు చూపుతోంది. అంతేకాదు, ఒకేరకమైన మేకింగ్... అంటే జ్యూవెలరీ తయారీకి కావలసిన వాటిలోనూ వెరైటీ కోరుకుంటోంది. అందుకే ఎంతో ఫ్యాషన్‌గా.. అందంగా కనిపించే జ్యూవెలరీని ‘పూస’లతో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వారం చూద్దాం.. కావలసినవి: రంగురంగుల పూసలు (చిన్నవి, పెద్దవి), ముత్యాలు, తీగలు, దారాలు, ఇయర్ రింగ్ హుక్స్, బ్రేస్లెట్ హుక్స్, చిన్న సైజు కటింగ్ ప్లయర్ తయారీ: ముందుగా ఏ రంగు జ్యూవెలరీ కావాలో.. ఆ రంగు పూసలను సిద్ధం చేసుకోవాలి. తర్వాత వాటితో ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, లెగ్ చెయిన్స్, నెక్లేస్ తయారు చేసుకోవాలి. ఎలా అంటే... గోల్డ్ లేదా సిల్వర్ కలర్ తీగకు పూసలు లేదా ముత్యాలను ఎక్కించి ఎలాంటి జ్యూవెలరీ కావాలంటే, దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తయారీకైతే... తీగకు పూసలను ఎక్కించి, చివరకు హుక్స్ను తగిలిస్తే సరిపోతుంది (తీగను మెలికలు తిప్పడానికి కటింగ్ ప్లయర్ను వాడాలి). గాజుల తయారీకి దళసరి తీగలను ఉపయోగించాలి. కొన్నింటికి తీగకు బదులుగా దారాన్ని ఉపయోగిస్తేనే, జ్యుయెలరీ అందంగా కనిపిస్తుంది. నెక్లేస్, చెయిన్ల కోసం దళసరి దారాన్ని వాడాలి. ఒకే వరుస కాకుండా రెండు-మూడు వరుసలుగా పూసలను ఎక్కించి.. చివర్లకు హుక్ తగిలించొచ్చు లేదా రిబ్బన్ వాడినా బాగుంటుంది. అయినా.. పక్కనున్న ఫొటోలను చూస్తే, మీకో ఐడియా వస్తుంది.