'నేను గోషామహల్ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా..'
హైదరాబాద్ : ఎమ్మెల్యే పేరుతో నగల వ్యాపారిని రూ.లక్ష డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ సి.అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం...సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన ముండ్రాయి కృష్ణ(42) జల్సాలకు అలవాటుపడ్డాడు. సులభంగా డబ్బు సంపాదిం చేందుకు అక్రమమార్గం బాట పట్టాడు. ఈ క్రమంలోనే సిద్దిఅంబర్‌బజార్‌లోని రాము జ్యువెలర్స్ యజమాని రామచంద్రయ్య అలియాస్ రాముకు గురువారం రాత్రి 8.45కి ముండ్రాయి కృష్ణ ఫోన్ చేసి.. ‘‘నేను గోషామహల్ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా.. పబ్లిక్ మీటింగ్ నిర్వహించాల్సి ఉంది. మీటింగ్ ఖర్చు కోసం లక్ష రూపాయలు కావాలి’...అని డిమాండ్ చేశాడు.
కొద్ది నిమిషాలకే మళ్లీ జ్యువెలరీ యజమానికి ఫోన్ చేసి.. ‘నేను ఎమ్మెల్యే పీఏని మాట్లాడుతున్నా.. మీటింగ్ కోసం శుక్రవారంలోగా రూ. లక్ష ఇవ్వాలి. లేకపోతే ఎమ్మెల్యే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది’ అని బెదిరించాడు. ఎమ్మెల్యేది అని చెప్పి 8686183811 ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఫోన్ చేసిన వ్యక్తిపై అనుమానం కలిగిన జ్యువెలర్స్ యజమాని శుక్రవారం ఉ దయం అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీ సులు ఫోన్ నెంబర్ ఆధారంగా నింది తుడు ముండ్రాయి కృష్ణను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై గతంలో మొగల్‌పుర, షాయినాయత్‌గంజ్, ముషీరాబాద్, నాంపల్లి పోలీస్‌స్టేషన్లలో డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడిన కేసులు నమోదైనట్టు ఇన్‌స్పెక్టర్ అంజయ్య తెలిపారు.