400 గ్రాముల బంగారం, రూ.15 లక్షలు అపహరణ
హైదరాబాద్: కూకట్‌పల్లి చందనబ్రదర్స్‌లో నగలు, నగదు దోచుకెళ్లారు. పక్కా పథకం ప్రకారమే ఈ దోపిడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 400 గ్రాముల బంగారం, రూ.15 లక్షల నగదు అపహరించుకుపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పక్క భవనం నుంచి నిచ్చెన సాయంతో టైపైకి చేరి అక్కడి నుంచి షాపింగ్‌మాల్‌లోకి వెళ్లే ఇనుపడోర్‌ను తొలగించి లోనికి ప్రవేశించారు. సైబరాబాద్ క్రైం అడిషనల్ డీసీపీ జానకీషర్మిల, కూకట్‌పల్లి ఏసీపీ సాయిమనోహర్ లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజు మాదిరిగానే గురువారం సిబ్బంది షాపింగ్‌మాల్‌ను తెరిచి లాకర్ రూంలోకి వెళ్లి చూడగా ఆ రూంలో 400 గ్రాముల నగలు ఉన్న బాక్స్‌తో పాటు 15 లక్షల నగదు కన్పించలేదు. దీంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ దొంగతనంపై ప్రధానంగా ఉద్యోగులపైనే అనుమానాలు వస్తుండడంతో పోలీసులు ..వేలిముద్రల నిపుణులను రప్పించి ఆధారాలను ఫోరెనెక్స్ ల్యాబ్‌కు పంపించారు. షాపింగ్‌మాల్‌లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. షార్ట్ సర్య్కూట్ అవుతుందనే భయంతో రాత్రి కెమెరాలను ఆఫ్ చేస్తామని యజమానులు తెలిపారు. దీంతో దొంగలను గుర్తించడానికి ఆనవాలు లేకుండా పోయాయి. సీసీ కెమెరాలను ఆఫ్ చేస్తారన్న విషయాన్ని తెలుసుకుని పథకం ప్రకారం షాపింగ్‌మాల్‌లోని ఉద్యోగుల సహకారంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చందన బ్రదర్స్‌లో నగల చోరీ
Published Fri, Aug 8 2014 3:41 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM
Advertisement
Advertisement