రిలయన్స్ జ్యుయలరీ ..డైమండ్, బంగారు నగల అద్భుత డిజైన‍్లను ప్రదిర్శిస్తోంది. ఈ సందర్భంగా వినియెగాదారులకు మునుపెన్నడూ లేని డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఫిబ్రవరి 25 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లకు వందశాతం తృప్తి కలిగేలా జీరో వేస్టేజ్‌పై నగలను విక్రయిస్తున్నామనీ రిలయన్స్ జ్యుయలరీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తమ ఆభరణాలు శాశ్వతమైన క్లాసిక్, టైంలెస్ ఆభరణాల ఎంపిక.. ఏ సీజన్లోనైనా ఎవరికైనా ప్రియమైనవారి కోసం పరిపూర్ణ బహుమతి అందించేలా పోటీ ధరలలో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. అలాగే కస్టమర్ల సౌలభ్యంకోసం ప్రతీ షోరూంలోనూ క్వాలిటీ చెకింగ్ మెషీన్లు అందుబాటులో ఉంచామంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రాం, లక్నో , వారణాసి, కాన్పూర్, అహ్మదాబాద్ లాంటి ఎనిమిది నగరాల్లో ఫిబ్రవరి 25దాకా ఈ యూనిక్ ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తాము ఉపయోగించిన ప్రతీ డైమండ్ ఇండిపెండెంట్ సర్టిఫికేషన్ లాబొరేటరీస్ అంతర్జాతీయ సర్టిఫికేట్ పొందిందని కంపెనీ చెబుతోంది.
ఈ సందర్భంగా రిలయన్స్ జ్యుయలర్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ ప్రతీ రోజు ప్రేమపూర్వకమైనదే. అది సార్వత్రిమైంది. దీన్ని ఒక రోజుకు లేదా జంటలకు పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డారు. రిలయన్స్ అందిస్తున్న ఆకర్షణీయమైన నగలతో ప్రతిరోజూ వాలెంటైన్స్ డే అని చెప్పారు. అంతేకాదు ప్రియమైనవారి కోసం పరిపూర్ణ బహుమతి అందించేలా విస్తారమైన సాలిటైర్కు , ప్లాటినం లవ్ బ్యాండ్లను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. తమ షోరూంలలో నెక్లెస్, చెవిపోగులు, గాజులు, రింగులు .. ఇలా ప్రతీదీ ఎలిగెంట్‌గా , అద్భుతంగా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 25 వరకు ఉత్తేజకరమైన ఆఫర్లు అందుబాటులోఉన్నాయని చెప్పారు. కాగా రిలయన్స్ జ్యుయలర్స్ 44 నగరాల్లో 65 షోరూంలను కలిగి ఉంది. వీటిని మరింతగా విస్తృతంగా విస్తరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment