Reliance Jewels
-
రిలయన్స్ వాలెంటైన్స్ డే స్పెషల్ కాన్సెప్టు ఇదే
న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవం (వేలంటైన్స్ డే) సందర్భంగా రిలయన్స్ జ్యుయల్స్ ‘ఫ్లోరియో’ పేరుతో ప్రత్యేక శ్రేణి వజ్రాభరణాలను విడుదల చేసింది. ‘ప్రేమ పరిమళిస్తుంది, కాలం గడించే కొద్దీ బలంగా మారుతుంది’ అన్న కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఆభరణాలను డిజైన్ చేసింది. రోజురోజుకూ పెరుగుతూ వెళ్లే మొక్కలు, పువ్వులను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసినట్టు సంస్థ తెలిపింది. రూ.12,000 నుంచి వీటి ధరలు మొదలు కానున్నాయి. ఈ నెల 28 వరకు కొనుగోళ్లపై 25 శాతం తగ్గింపును సంస్థ ఆఫర్ చేస్తోంది. -
మహిళల కోసం అద్భుతమైన డైమండ్ నెక్లెస్ విడుదల చేసిన రిలయన్స్
భారతదేశ అగ్రగామి, విశ్వసనీయ జ్యుయలరీ బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్ ఇప్పుడు సరికొత్త డైమండ్ కలెక్షన్లు, ఆఫర్లతో మన ముందుకొచ్చింది. ట్రెండీ వజ్రాభరణాలను తీసుకొచ్చింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను మరింత కలర్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు కేవలం రూ.49,999 నుంచి ప్రారంభమయ్యే, నమ్మశక్యం కాని ధరలో డైమండ్ నెక్లెస్ సెట్ల ఆకర్షణీయమైన పరిమిత ఎడిషన్ “డైమండ్ డిలైట్స్” వజ్రాభరణాలను విడుదల చేసింది. అందమైన డైమండ్ డిలైట్స్ కలెక్షన్ ఆకర్షణీయమైన ధరలకు తీసుకొని వచ్చినట్లు తెలిపింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ డైమండ్ ఆభరణాలు భారతదేశవ్యాప్తంగా రిలయన్స్ జ్యువెల్స్ లలో లభ్యమవుతాయి. ప్రతీ సందర్భానికి, కాలానికి తగిన ఇందులో వజ్రాలున్నాయని రిలయన్స్ జ్యూయల్స్ తెలిపింది. వజ్రాభరణాలను సొంతం చేసుకోవడంపై, వాటిని ధరించడంపై మహిళలకు మక్కువ పెరిగింది. రిలయన్స్ జ్యువల్స్ ఈ నూతన డైమండ్ శ్రేణిని రూపొందించేందుకు అది కూడా ఓ ప్రధాన కారణం. ఈ అభరణాలు రంగు, స్వచ్ఛత, క్యారెట్, కట్ విషయలలో అన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. సమకాలీన వినియోగదారుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ డిజైన్లు రూపుదిద్దుకున్నాయి. పార్టీలు, వివాహాలకు సరైన ఎంపికగా ఇవీ నిలుస్తాయి. మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇవి గొప్ప ఎంపిక. ఇది పరిమిత ఎడిషన్ వజ్రాభరణాలు, స్టాక్‌లు ఉండే వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులోని అన్ని డైమండ్ సెట్లు ఐజీఐ సర్టిఫికేట్ పొందాయి. రిలయన్స్ జ్యువెల్స్ తన కస్టమర్లకు చాలా తక్కువ ధరలకు అద్భుతమైన వజ్రాలు గల డైమండ్ డిలైట్స్ వజ్రాభరణాలను ఎంచుకునే అవకాశాన్ని అందిస్తోంది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బంపర్ ఆఫర్..!) -
క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ డిజైన్లను ప్రారంభించిన రిలయన్స్ జ్యువెల్స్..!
భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన జ్యువెలరీ బ్రాండ్‌గా పేరొందిన రిలయన్స్ జ్యువెల్స్ సరికొత్త క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ డిజైన్లను విడుదల చేసింది.వీటిలో హ్యాండ్‌క్రాఫ్టెడ్, హెరిటేజ్ గోల్డ్, డైమండ్ ఆభరణాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కలెక్షన్ వివాహ వేడుకలకు మాత్రమే కాకుండా నిశ్చితార్ధం, సంగీత్, మెహెందీ, రిసెప్షన్ లాంటి అనేక ఇతర వేడుకలకు సరిపోతాయని రిలయన్స్ జ్యువెల్స్ పేర్కొంది. #SampannVivah థీమ్‌తో వెడ్డింగ్ సీజన్స్‌కు రిలయన్స్ జ్యువెల్స్ సన్నాహమైంది. ఈ నూతన ఆభరణాల శ్రేణితో కాబోయే నవవధువుల జీవితాల్లో సౌభాగ్యం, సంతోషాలు లభించాలని రిలయన్స్ జ్యువెల్స్ కోరుకుంటుంది. భారతీయత ఉట్టిపడేలా వివాహ కలెక్షన్లను రిలయన్స్ జ్యువెల్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేక వివాహ ఆఫర్‌ను డిసెంబర్ 23 వరకు అందించనుంది. ఈ ఆఫర్లో భాగంగా బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలు, వజ్రాభరణాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు సౌకర్యాన్ని అందించనుంది. ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ...క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్‌తో ప్రతి ఒక్క వధువు వైవాహిక జీవితం సంతోషంగా, వైభవంగా సాగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. భారత వారసత్వ, కళారూపాలు ఉట్టిపడేలా సమకాలీన హ్యండ్క్రాఫ్డ్ డిజైన్స్ ఆకట్టుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ అద్భుతమైన కలెక్షన్లను దేశవ్యాప్తంగా విస్తరించిన అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్స్‌తో పాటుగా, కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చునని రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త! -
‘ఆభార్’ కలెక్షన్‌ను లాంఛ్ చేసిన రిలయన్స్ జువెల్స్
ముంబై: రిలయన్స్ జువెల్స్ 14 వ వార్షికోత్సవ సందర్బంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న జువెలరీ కలెక్షన్‌కు ‘ఆభార్’ ను ఎక్స్‌టెన్షన్‌గా లాంచ్ చేసింది. ఈ కలెక్షన్ లాంచ్‌తో కస్టమర్లకు, ఉద్యోగులకు, కళాకారులకు రిష్తోన్కాధాగా అనే థీమ్‌తో కంపెనీ కృతజ్ఞతలను ప్రకటించింది. ఆభార్ కలెక్షన్లో భాగంగా సరికొత్త జువెలరీ కలెక్షన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఈ కలెక్షన్లో అద్బుతమైన బంగారం, వజ్రాల ఇయర్ రింగ్స్ కొత్త డిజైన్లు కస్టమర్లకు లభించనున్నాయి. రిలయన్స్ జువెల్స్ జూలై 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 20 శాతం మేర స్పెషల్ యానివర్సరీ తగ్గింపును ప్రకటించింది. #RishtonKaDhaga అనే మల్టీ మీడియా క్యాంపెన్తో రిలయన్స్ జువెల్స్ తమ కస్టమర్లకు, ఉద్యోగులకు సందేశాన్ని ఇచ్చింది. ఈ సందర్బంగా రిలయన్స్ జువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ జువెల్స్ను ఆదరిస్తోన్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆభార్ కలెక్షన్‌తో రిలయన్స్ జువెల్స్‌కు, కస్టమర్లకు ఉన్న బంధం మరింత బలపడుతుందనీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
రిలయన్స్ ఆభర్ కలెక్షన్స్
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ సంస్థ రిలయన్స్ జ్యువెల్స్ వార్షికోత్సవ కానుగా అద్భుతమైన కలెక్షన్స్‌ను లాంచ్ చేసింది. ‘‘ఆభర్’’ పేరుతో వినూత్న డిజైన్లతో బంగారం, వెండి, వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా తమ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జ్యువెల్స్ తెలిపింది. ఒక దశాబ్దానికి పైగా తమ బ్రాండ్‌కు అండగా నిలిచిన వినియోగదారులందరికీ కృతజ్ఞతగా వి వోయూ (మేము మీకు రుణపడి ఉన్నాము ) థీమ్‌తో ఒక ప్రమోషన్ వీడియోను విడుదల చేసింది. కస్టమర్లకు కృతజ్ఞతను చాటేలా ఈ ప్రమోషన్ క్యాంపైన్‌ను స్కేర్క్రో ఎం అండ్ సీ సాట్చి డిజైన్ చేయడం విశేషం. 3-15 గ్రాములతో 54 ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్ అందుబాటులో ఉంచింది. బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జెస్ పై 24 శాతం, డైమండ్ జువెలరీ పై 30 శాతం తగ్గింపుతో ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఆస్టు 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అలాగే కోవిడ్-19కు సంబంధించిన భౌతిక దూరం లాంటి అన్ని మార్గదర్శకాలతో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. ఆధునిక మహిళల అభిరుచులకు తోడుగా, ఆశ, వెలుగులు నింపేలా లాంతర్ల స్ఫూర్తితో డిజైన్లను రూపొందించినట్టు తెలిపింది. కఠినమైన సమయాల్లో వారి మద్దతు ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
రిలయన్స్ నెక్లెస్‌లు, బ్రాస్లెట్స్, స్పెషల్ ఆఫర్ కూడా
సాక్షి, హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్ నూతన సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొచ్చిన వినూత్న ఆభరణాల ఆఫర్‌ను హాలిడే కలెక్షన్స్ పేరుతో కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కలెక్షన్‌ను తీసుకొచ్చింది. అత్యధ్బుతమైన హస్తకళా నైపుణ్యాన్ని జోడించి ‘బెల్లా ది హాలిడే కలెక్షన్’ పేరుతో సరికొత్త, సమకాలీన స్టైలిష్ ఆభరణాలను ప్రారంభించింది. రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్, డైమండ్ కేటగిరీల్లో స్పెషల్ నెక్లెస్‌లను, బ్రాస్లెట్లను లాంచ్ చేసింది. అధునాతన డిజైన్, స్టయిల్‌తో తమ బెల్లా కలెక్షన్ ఆకట్టుకుంటుందని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. తమ బెల్లా ఆభరణాలకు వినియోగదారులనుంచి మంచి ఆదరణ లభిస్తుందనే విశ్వాసాన్ని రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. రూ. 5 వేల నుంచి ఇవి లభ్యమని చెప్పారు. అలాగే అందమైన డైమండ్ లైన్ బ్రాస్లెట్స్ రూ .69,999 నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక ధరలో లభిస్తాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది. బంగారు ఆభరణాలపై 20 శాతం, డైమండ్ ఆభరణాలపై 20 శాతం మేకింగ్ చార్జీలపై డిస్కైంట్ లభ్యం. ఈ ఆఫర్ 16 వ తేదీ ఫిబ్రవరి 2020 వరకు చెల్లుతుంది. వందకు పైగా నగరాల్లో 200 పైగా స్టోర్లతో సేవలను అందిస్తున్న రిలయన్స్ జ్యువెల్స్ త్వరితగతిన విస్తరిస్తోంది. రిలయన్స్ జ్యువెల్స్ బ్రాండ్ 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ ఆభరణాలను మాత్రమే అందిస్తోంది. -
మదీనాగూడలో రిలయన్స్ జూవల్స్ షోరూం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : బంగారంలో విశ్వసనీయతకు మారు పేరైన రిలయన్స్ జూవల్స్ హైదరాబాద్‌లో తన నాలుగో షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని మదీనాగూడలోని జిఎస్ఎమ్ మాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. దీపావళి సీజన్‌ను పురస్కరించుకొని 'ఆతుల్య కలెక్షన్' పేరిట వివిధ రకాల డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాల సెట్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో 18, 22 క్యారెట్లతో వివిధ డిజైన్లలో రూపొందిన బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్‌లు ఉన్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని మదీనాగూడలో ఏర్పాటు చేసిన షోరూమ్‌కు వచ్చే మొదటి వంద మంది కస్టమర్లకు బంగారు ఆభరణాలపై 25 శాతం, 25 శాతం డైమెండ్ జువెల్లరీతో పాటు ఒక బంగారు నాణేన్ని ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ జువెల్లరీస్ పేర్కొంది. అంతేగాక ఈ అక్టోబర్ 31 వరకు షోరూమ్‌కు వచ్చే కస్టమర్స్‌కు హెడీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ మీద 10 శాతం క్యాష్‌బ్యాక్ వెసులుబాటు కలిగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 96 నగరాల్లో 203 షోరూమ్స్ ఏర్పాటు చేసి రిలయన్స్ జూవెల్స్ తమ సేవలను అందిస్తుంది. -
రిలయన్స్ ‘అపూర్వం’ కలెక్షన్ : అక్షయ తృతీయ ఆఫర్
సాక్షి, హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ మరోసారి అద్భుతమైన కలెక్షన్స్‌ను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఇచ్చే రిలయన్స్ తాజాగా హస్తకళలు, ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు ప్రేరణగా జ్యుయల్లరీ రూపొందించింది. రానున్న అక్షయ తృతీయ సందర్భంగా ‘అపూర్వం’ పేరుతో టెంపుల్ జ్యుయల్లరీని ఆవిష్కరించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన హంపితో పాటు దక్షిణ, పశ్చిమ భారతదేశంలో ముఖ్యమైన, ప్రముఖ స్మారక చిహ్నాలు, వివిధ కట్టణాల సున్నితమైన వంపులు, శిల్పాలు ప్రేరణగా విభిన్నమైన కళాకృతులతో ఆభరణాలను రూపొందించింది. అక్షయ తృతీయ ఆఫర్ అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది రిలయన్స్ జువెల్స్. 2019 మే 7 వ తేదీ వరకు బంగారు ఆభరణాల మేకింగ్ చార్జీపై 25శాతం, వజ్రాల ఆభరణాలపై 25 శాతం తగ్గింపును అందిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హంపితోపాటు బేలూరులోని చెన్నకేశవ ఆలయం, ప్రసిద్ధ భువనేశ్వరి ఆలయం గోపురం, ఏనుగులు, గుర్రాలు, కమలం, ఆలయ ద్వారం వద్ద చెక్కిన దశావతారం ఇతర అనేక నృత్య రూపాల స్ఫూర్తిగా అతి క్లిష్టమైన డిజైన్లతో ఆభరణాలను తమ వినియోగదారులకోసం సిద్ధం చేశామని రిలయన్స్ జువెల్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
వాలెంటైన్స్ డే స్పెషల్ : ‘బీలవ్డ్’ జ్యుయలరీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ రిలయన్స్ జ్యువెల్లస్ ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కలెక్షన్‌ను విడుదల చేసింది. ప్రేమికుల ప్రేమానురాగాలకు, భావోద్వేగానికి చిహ్నంగా ‘బీ లవ్డ్’ పేరుతో ప్రత్యేకంగా బంగారు నగలను , ముఖ్యంగా డైమండ్ ఆభరణాలను ఆవిష్కరించామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘తేనెటీగ’ స్ఫూర్తిగా తీర్చిదిద్దిన కలెక్షన్లను జీవితంలో ప్రతీక్షణాన్ని అత్భుదమైన శక్తి, సామర్థ్యాలతో సమతుల్యంగా నిర్వహిస్తున్న నేటి మహిళలకు అంకితం చేస్తున్నామని రిలయన్స్ జ్యువెల్లస్ సీఈవో సునీల్ నాయక్ వెల్లడించారు. ముఖ్యంగా హనీ బీ మేళవింపుతో వాలెంటైన్స్ డే సందర్భంగా డైమండ్ పెండెట్స్, చెవి రింగులు, ఉంగరాలను రూ.10వేలనుంచి ప్రారంభయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 24 దాకా అన్ని రకాల శోభాయమైన డైమండ్ నగలు, వెడ్డింగ్ కలెక్షన్స్‌పై 20శాతం దాకా డిస్కౌంట్ అందిస్తున్నామని ప్రకటించారు. -
రిలయన్స్ జువెల్స్ సరికొత్త కలెక్షన్
సాక్షి, హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ తన 11వ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్ వారి ముందుకు తీసుకొచ్చింది. "ఆభార్’’ అనే పేరుతో ఈ కలెక్షన్‌ను విడుదల చేసింది. భారత్‌లో అత్యంత ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో రిలయన్స్ జువెల్స్ కూడా ఒకటి. సహజత్యం ఉట్టిపడేలా పచ్చని చెట్లు, పూలు, ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తూ రిలయన్స్ జువెల్స్ ఈ ఆభరణాలను రూపొందించింది. అలాగే ఈ 11వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు గుర్తుండేలా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జువెల్స్ తెలిపింది. ఈ సందర్భంగా రిలయన్స్ జుయల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. గత 11 ఏళ్లుగా మాకు మద్దతుగా నిలుస్తున్న వినియోగదారులందరికీ అభినందనలు. వినియోగదారుల నమ్మకాన్ని మరింత చూరగొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటామని ఆయన తెలిపారు. -
రిలయన్స్ జువెల్స్ ‘బ్యాంగిల్ మేళా’
హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ ‘బ్యాంగిల్ మేళా’ నిర్వహిస్తోంది. జూన్ 22 నుంచి ప్రారంభమైన ఈ మేళా, జూలై 8 వరకు కొనసాగనుంది. ఈ మేళలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట, కూకట్పల్లి షోరూంలలో బంగారపు గాజులను(గోల్డ్ బ్యాంగిల్స్‌ను) ప్రదర్శనకు ఉంచింది. మొత్తం 200 కిపైగా డిజైన్లతో కళకళలాడుతున్న ఈ మేళలో, రోజువారీ, ఫంక్షన్లకు వేసుకెళ్లే గాజులు ఉన్నాయి. తాము బ్యాంగిల్ మేళ నిర్వహించడాన్ని ఎంతో సంతోషిస్తున్నామని, తమ ప్రదర్శనలో ఇదీ ఒకటని రిలయన్స్ జువెల్స్ సీఈవో సునిల్ నాయక్ చెప్పారు. ప్రతి ఒక్క సందర్భాన్ని వేసుకెళ్లే గాజులను అందుబాటులో ఉంచామన్నారు. భారతీయ మహిళల సంస్కృతి, సంప్రదాయాల్లో గాజులు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. నగరంలోని గాజుల అభిమానులందరికీ ఈ బ్యాంగిల్ మేళ ఎంతో ఉత్తేజకరమైన అవకాశమని పేర్కొన్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ గాజులను ఎంపిక చేసుకోవచ్చని నాయక్ చెప్పారు. రిలయన్స్ జువెల్స్ ప్రస్తుతం గోల్డ్, డైమాండ్స్‌ను ఆఫర్ చేస్తోంది. మొత్తం 47 నగరాల్లో ఈ కంపెనీ 77 షోరూంలను కలిగి ఉంది. ప్రతి ఒక్క ప్రత్యేక సందర్భంలో అద్భుతమైన డిజైన్లను కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ గోల్డ్‌ను మాత్రమే రిలయన్స్ జువెల్స్ విక్రయిస్తోంది. -
రిలయన్స్ జ్యూయెల్స్ అక్షయ తృతీయ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : అక్షయ తృతీయ పర్వదినాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా... రిలయన్స్ జ్యూయెల్స్ సరికొత్త బంగారు, వజ్ర ఆభరణాలను మార్కెట్లోకి విడుదల చేసింది. బంగారం కొనుగోళ్లకు అత్యంత శుభప్రదంగా భావించే అక్షయ తృతీయను పురష్కరించుకుని, సరికొత్త వజ్రాభరణాలతో పాటు ఈనెల 22 వరకు పలు రకాల ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నామని రిలయన్స్ జ్యూయెల్స్ సీఈఓ సునీల్ నాయక్ వెల్లడించారు. ఈ ఆఫర్ల కింద బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 40 శాతం రాయితీ ఇస్తునట్లు చెప్పారు. అదే విధంగా 10 గ్రాములకు మించి బంగారు నాణేలు, 50 గ్రాములకు మించి వెండి నాణేల కొనుగోలు చేస్తే.. వాటి తయారీ ఛార్జీలపై 50 శాతం రాయితీ అందిస్తునట్లు వివరించారు. వజ్రాభరణాల తయారీ చార్జీలపై 75 శాతం, ప్లాటినం రింగ్ లపై 15 శాతం రాయితీ ఉంటుందన్నారు. అలాగే పాత బంగారం మార్పిడితో ఆభరణాల కొనుగోలుపై 0 శాతం తరుగు ఆఫర్‌ను ఇస్తున్నట్లు సునీల్ నాయక్ చెప్పారు. -
ప్రతీరోజు లవ్ డే..అద్భుతమైన ఆఫర్లు
రిలయన్స్ జ్యుయలరీ ..డైమండ్, బంగారు నగల అద్భుత డిజైన్లను ప్రదిర్శిస్తోంది. ఈ సందర్భంగా వినియెగాదారులకు మునుపెన్నడూ లేని డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఫిబ్రవరి 25 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లకు వందశాతం తృప్తి కలిగేలా జీరో వేస్టేజ్‌పై నగలను విక్రయిస్తున్నామనీ రిలయన్స్ జ్యుయలరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఆభరణాలు శాశ్వతమైన క్లాసిక్, టైంలెస్ ఆభరణాల ఎంపిక.. ఏ సీజన్లోనైనా ఎవరికైనా ప్రియమైనవారి కోసం పరిపూర్ణ బహుమతి అందించేలా పోటీ ధరలలో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. అలాగే కస్టమర్ల సౌలభ్యంకోసం ప్రతీ షోరూంలోనూ క్వాలిటీ చెకింగ్ మెషీన్లు అందుబాటులో ఉంచామంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రాం, లక్నో , వారణాసి, కాన్పూర్, అహ్మదాబాద్ లాంటి ఎనిమిది నగరాల్లో ఫిబ్రవరి 25దాకా ఈ యూనిక్ ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తాము ఉపయోగించిన ప్రతీ డైమండ్ ఇండిపెండెంట్ సర్టిఫికేషన్ లాబొరేటరీస్ అంతర్జాతీయ సర్టిఫికేట్ పొందిందని కంపెనీ చెబుతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ జ్యుయలర్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ ప్రతీ రోజు ప్రేమపూర్వకమైనదే. అది సార్వత్రిమైంది. దీన్ని ఒక రోజుకు లేదా జంటలకు పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డారు. రిలయన్స్ అందిస్తున్న ఆకర్షణీయమైన నగలతో ప్రతిరోజూ వాలెంటైన్స్ డే అని చెప్పారు. అంతేకాదు ప్రియమైనవారి కోసం పరిపూర్ణ బహుమతి అందించేలా విస్తారమైన సాలిటైర్కు , ప్లాటినం లవ్ బ్యాండ్లను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. తమ షోరూంలలో నెక్లెస్, చెవిపోగులు, గాజులు, రింగులు .. ఇలా ప్రతీదీ ఎలిగెంట్‌గా , అద్భుతంగా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 25 వరకు ఉత్తేజకరమైన ఆఫర్లు అందుబాటులోఉన్నాయని చెప్పారు. కాగా రిలయన్స్ జ్యుయలర్స్ 44 నగరాల్లో 65 షోరూంలను కలిగి ఉంది. వీటిని మరింతగా విస్తృతంగా విస్తరిస్తోంది. -
రిలయన్స్ డిజైనర్ జ్యుయల్లరీ అదరహో...
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ జ్యుయల్స్ సరికొత్త డిజైనర్ బంగారు ఆభరణాలను విడుదల చేసింది. 'ఆశ్య-ఐ యామ్ దట్' పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన జ్యుయల్లరీని లాంచ్ చేసింది. తమ 10 ఏళ్ల వేడుకలకు పొడిగింపుగా ప్రఖ్యాత డిజైనర్ గరిమా మహేశ్వరి రిలయన్స్ కోసం ప్రత్యేకంగా వీటిని డిజైన చేసినట్టు రిలయన్స్ జ్యుయల్స్ ప్రకటించింది. సమకాలీన డిజైన్లలో సంప్రదాయ భారతీయ హస్తకళా నైపుణ్యంతో పలు డిజైన్లను మహిళలకోసం అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ఏ సందర్భానికైనా, తమ ప్రతీ డిజైన్ ఆధునిక మహిళ మనసు దోచుకుంటుందని పేర్కొంది. ఆధునిక భారతీయ మహిళల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని తమ ఆభరణాలను రూపొందించామని రిలయన్స్ జ్యుయల్స్ సిఈఓ సునీల్ నాయక్ ప్రకటించారు. సమకాలీన రూపకల్పనలతో సాంప్రదాయిక చిహ్నాల మేళవింపులతో అలరిస్తున్న తమ ఆభరణాలు నేటి డైనమిక్ భారతీయ మహిళలకు తప్పక నచ్చుతాయని విశ్వసిస్తున్నామని తెలిపారు. దేశ్యావ్యాప్తంగా గా ప్రత్యేకంగా రిలయన్స్ జ్యువెల్లస్ షోరూంలలో ఇవి లభిస్తాయని చెప్పారు. అందమైన హంసకు దగ్గరగా పోలిక ఉండేలా 'ఆశ్య’ పేరుతో ఈ అద్భుతమైన కలెక్షన్‌ను అందిస్తోంది. అందమైన, స్వతంత్రమైన, ధీరరాలైన ఆధునిక మహిళకు ప్రతిబింబంగా హంసను భావిస్తారు. -
‘ఇరిస్సా కలెక్షన్’ను ఆవిష్కరించిన రిలయన్స్ జువెల్స్
ముంబై: రిలయన్స్ జువెల్స్ తాజాగా తన వినియోగదారుల కోసం కాలాతీత, సున్నితమైన డిజైన్లతో కూడిన ‘ఇరిస్సా కలెక్షన్’ను ఆవిష్కరించింది. హస్తకళా నైపుణ్యంతో కూడిన అందమైన పెండెంట్, నెక్లెస్ సెట్స్ ఇందులో ఉన్నాయి. తాను ప్రత్యేకంగా ఉండాలనుకునే ప్రతి మహిళ కోరికను దృష్టిలో ఉంచుకొని ఈ విస్తృత శ్రేణి కలెక్షన్‌ను తీర్చిదిద్దామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పాత బంగారం మార్పిడిపై జీరో డిడక్షన్ (అక్టోబర్ 1 నుంచి 10 వరకు)ను అందిస్తున్నామని పేర్కొంది. అలాగే బంగారు, డైమండ్ ఆభరణాలు సహా 10 గ్రాములు ఆపై బరువైన 24 క్యారెట్ల బంగారు నాణేల తయారీ చార్జీలపై వరుసగా 30 శాతం, 25 శాతం, 50 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులకు తాజా ఆఫర్లు ఈ నెల 19 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.