
సాక్షి, హైదరాబాద్ : బంగారంలో విశ్వసనీయతకు మారు పేరైన రిలయన్స్ జూవల్స్ హైదరాబాద్‌లో తన నాలుగో షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని మదీనాగూడలోని జిఎస్‌ఎమ్ మాల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. దీపావళి సీజన్‌ను పురస్కరించుకొని 'ఆతుల్య కలెక‌్షన్' పేరిట వివిధ రకాల డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాల సెట్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో 18, 22 క్యారెట్లతో వివిధ డిజైన్లలో రూపొందిన బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్‌లు ఉన్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని మదీనాగూడలో ఏర్పాటు చేసిన షోరూమ్‌కు వచ్చే మొదటి వంద మంది కస్టమర్లకు బంగారు ఆభరణాలపై 25 శాతం, 25 శాతం డైమెండ్ జువెల్లరీతో పాటు ఒక బంగారు నాణేన్ని ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ జువెల్లరీస్ పేర్కొంది. అంతేగాక ఈ అక్టోబర్ 31 వరకు షోరూమ్‌కు వచ్చే కస్టమర్స్‌కు హెడీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ మీద 10 శాతం క్యాష్‌బ్యాక్ వెసులుబాటు కలిగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 96 నగరాల్లో 203 షోరూమ్స్ ఏర్పాటు చేసి రిలయన్స్ జూవెల్స్ తమ సేవలను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment