Showroom Launch
-
హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు
న్యూఢిల్లీ: వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఈ ఏడాది దీపావళి నాటికి పది నగరాలకు కార్యకలాపాలను విస్తరించనుంది. గురువారం తమ అయిదో స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణియం ఈ విషయం తెలిపారు.ఇటీవలే 1,000 వాహనాల డెలివరీలను పూర్తి చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 4,000 బైక్‌ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ఎఫ్77 మాక్ 2 మోడల్ ధర రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.99 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉందని, ఒకసారి చార్జి చేస్తే 323 పైచిలుకు కిలోమీటర్ల రేంజి, గంటకు 165 కి.మీ. గరిష్ట వేగం ఉంటుందని నారాయణ్ వివరించారు. బ్యాటరీపై అత్యధికంగా 8,00,000 కి.మీ. వారంటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.వచ్చే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ బైక్‌ల సెగ్మెంట్‌కి సంబంధించి 4 విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయంగా జర్మనీ తదితర దేశాల్లో 50 పైచిలుకు సెంటర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు నారాయణ్ చెప్పారు. టీవీఎస్ మోటర్స్, శ్రీధర్ వెంబు (జోహో) తదితర ఇన్వెస్టర్లు సంస్థలో 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 400 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. సుమారు 3,500 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టోర్‌లో సేల్స్, సర్వీస్, స్పేర్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. -
కూకట్‌పల్లిలో కృతిశెట్టి సందడి
-
మదీనాగూడలో రిలయన్స్ జూవల్స్ షోరూం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : బంగారంలో విశ్వసనీయతకు మారు పేరైన రిలయన్స్ జూవల్స్ హైదరాబాద్‌లో తన నాలుగో షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని మదీనాగూడలోని జిఎస్ఎమ్ మాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. దీపావళి సీజన్‌ను పురస్కరించుకొని 'ఆతుల్య కలెక్షన్' పేరిట వివిధ రకాల డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాల సెట్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో 18, 22 క్యారెట్లతో వివిధ డిజైన్లలో రూపొందిన బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్‌లు ఉన్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని మదీనాగూడలో ఏర్పాటు చేసిన షోరూమ్‌కు వచ్చే మొదటి వంద మంది కస్టమర్లకు బంగారు ఆభరణాలపై 25 శాతం, 25 శాతం డైమెండ్ జువెల్లరీతో పాటు ఒక బంగారు నాణేన్ని ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ జువెల్లరీస్ పేర్కొంది. అంతేగాక ఈ అక్టోబర్ 31 వరకు షోరూమ్‌కు వచ్చే కస్టమర్స్‌కు హెడీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ మీద 10 శాతం క్యాష్‌బ్యాక్ వెసులుబాటు కలిగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 96 నగరాల్లో 203 షోరూమ్స్ ఏర్పాటు చేసి రిలయన్స్ జూవెల్స్ తమ సేవలను అందిస్తుంది. -
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసింది. సినీతారలు అఖిల్ అక్కినేని, సమంత ఈ స్టోర్‌ను గురువారం ప్రారంభించారు. ఇప్పటికే సంస్థ హైదరాబాద్‌లో కొత్తపేట్, ప్యాట్నీ సెంటర్, కూకట్పల్లి, అమీర్‌పేట్, గచ్చిబౌలి, అత్తాపూర్‌తోపాటు విజయవాడ, గుంటూరులోనూ ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఒకట్రెండు నెలల్లో సికింద్రాబాద్ పార్క్లేన్తోపాటు వైజాగ్‌లో సెంటర్లను ప్రారంభించనున్నట్టు సంస్థ డెరైక్టర్ సురేష్ సీర్న తెలిపారు. డెరైక్టర్లు స్పందన, అభినయ్, రాకేష్, కేషవ్తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆరేళ్లలోనే నంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్గా ఎదిగామని వివరించారు. మరిన్ని నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం ప్రారంభం
వరంగల్ బిజినెస్ : ములుగురోడ్డు సమీపంలో ఎస్వీ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంను సోమవారం ప్రారంభించారు. వాణిజ్య పన్నుల శాఖ డిప్యూ టీ కమిషనర్ హరిత ముఖ్యఅతిథిగా హాజరై షోరూంను ప్రారంభించి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని, ట్రాఫి క్ రూల్స్‌ను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. ఎస్వీ మోటార్స్ అధినేత వెంకట్ ఆదిత్య మాట్లాడుతూ 350 నుంచి 535 సీసీ వరకు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నా రు. కస్టమర్లకు సేవలందించేందుకే షోరూంలను కంపెనీ వారు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కేయూ మాజీ వీసీ గోపాల్ రెడ్డి, ఎస్వీ డైరెక్టర్ సుజిత్‌రెడ్డి, లయన్ పురుషోత్తంరెడ్డి, మనోహర్‌రావు, తెలంగాణ కాటన్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు బినాయ్, రవి కిశోర్, నర్సింహరావు, ప్రవీణ్ రావు, సేల్స్ మేనేజర్ అహ్మద్ పాల్గొన్నారు.