రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూం ప్రారంభం
రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూం ప్రారంభం
Published Wed, Sep 7 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
వరంగల్ బిజినెస్ : ములుగురోడ్డు సమీపంలో ఎస్‌వీ మోటార్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూంను సోమవారం ప్రారంభించారు. వాణిజ్య పన్నుల శాఖ డిప్యూ టీ కమిషనర్ హరిత ముఖ్యఅతిథిగా హాజరై షోరూంను ప్రారంభించి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని, ట్రాఫి క్ రూల్స్‌ను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. ఎస్‌వీ మోటార్స్ అధినేత వెంకట్ ఆదిత్య మాట్లాడుతూ 350 నుంచి 535 సీసీ వరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నా రు. కస్టమర్లకు సేవలందించేందుకే షోరూంలను కంపెనీ వారు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కేయూ మాజీ వీసీ గోపాల్ రెడ్డి, ఎస్‌వీ డైరెక్టర్ సుజిత్‌రెడ్డి, లయన్ పురుషోత్తంరెడ్డి, మనోహర్‌రావు, తెలంగాణ కాటన్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు బినాయ్, రవి కిశోర్, నర్సింహరావు, ప్రవీణ్ రావు, సేల్స్ మేనేజర్ అహ్మద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement