madinaguda
-
హైదరాబాద్‌లో.. సినీనటి 'పాయల్ రాజ్‌పుత్' సందడి!
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట్ డివిజన్ మదీనాగూడలో సినీనటి పాయల్ రాజ్‌పుత్ శుక్రవారం సందడి చేసింది. హైదరాబాద్‌లో జోస్ అలుక్కాస్ 4వ నూతన షోరూంను ఆమె సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోస్ అలుక్కాస్‌లో ఆభరణాలన్నీ నాణ్యతో కూడి అందంగా ఉన్నాయన్నారు. శుభమాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్, ఫెస్టివల్ ఎడిషన్, పరంపర కలెక్షన్స్, ఐవీ కలెక్షన్స్ లాంటివి జోస్ ఆలుక్కాస్ ప్రత్యేక బ్రాండ్స్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
మదీనాగూడలో రిలయన్స్ జూవల్స్ షోరూం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : బంగారంలో విశ్వసనీయతకు మారు పేరైన రిలయన్స్ జూవల్స్ హైదరాబాద్‌లో తన నాలుగో షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని మదీనాగూడలోని జిఎస్ఎమ్ మాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. దీపావళి సీజన్‌ను పురస్కరించుకొని 'ఆతుల్య కలెక్షన్' పేరిట వివిధ రకాల డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాల సెట్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో 18, 22 క్యారెట్లతో వివిధ డిజైన్లలో రూపొందిన బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్‌లు ఉన్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని మదీనాగూడలో ఏర్పాటు చేసిన షోరూమ్‌కు వచ్చే మొదటి వంద మంది కస్టమర్లకు బంగారు ఆభరణాలపై 25 శాతం, 25 శాతం డైమెండ్ జువెల్లరీతో పాటు ఒక బంగారు నాణేన్ని ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ జువెల్లరీస్ పేర్కొంది. అంతేగాక ఈ అక్టోబర్ 31 వరకు షోరూమ్‌కు వచ్చే కస్టమర్స్‌కు హెడీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ మీద 10 శాతం క్యాష్‌బ్యాక్ వెసులుబాటు కలిగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 96 నగరాల్లో 203 షోరూమ్స్ ఏర్పాటు చేసి రిలయన్స్ జూవెల్స్ తమ సేవలను అందిస్తుంది. -
నగరంలో కుండపోత
జల దిగ్బంధంలోనే అపార్ట్మెంట్లు సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఆదివారం గ్రేటర్ పరిధిలో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పొద్దు పోయే వరకు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, మియాపూర్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, వెస్ట్ మారేడ్‌పల్లి, కాప్రా, తిరుమలగిరి, అల్వాల్, ఈసీఐఎల్, చర్లపల్లిలో భారీగా వర్షం కురిసింది. సికిం ద్రాబాద్ పరిధిలోని ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, పద్మారావునగర్, పార్శీగుట్ట, వారాసిగూడ, చిలకలగూడ, సీతాఫల్మండి, మారేడ్‌పల్లి, మోండా మార్కెట్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై నడుము లోతు వరద నీరు పోటెత్తింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతా ల్లోని బస్తీల్లో ఇళ్లలోకి చేరిన నీటిని తొల గించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. కాగా, దీప్తీశ్రీనగర్ పరిసర ప్రాంతాలు ముంపునకు గురి కావడంతో కాలనీలు, నాలాలు, అపార్ట్మెంట్లను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం పరిశీలించారు. ఇంకా తేరుకోని మదీనాగూడ.. వర్ష బీభత్సంతో అతలాకుతలమైన మదీనా గూడ, దీప్తీశ్రీనగర్ ప్రాంతాలు ఇంకా తేరు కోలేదు. మదీనాగూడలోని ఉషోదయ అపా ర్ట్మెంట్, పొట్లపల్లి పవిత్ర అపార్ట్మెంట్, సాయితేజ ఫ్రైడ్స్, తులసీరాం కాంప్లెక్స్‌తో పాటు మరో 2 అపార్ట్మెంట్ సెల్లార్లూ వర్షపు నీటిలోనే ఉన్నాయి. నీటిని ఇంజిన్లతో తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. చేపల వేట మదీనాగూడలోని ఖాళీ స్థలంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద నాలాల ద్వారా గంగారం చెరువులోకి చేరుతుంది. చెరువులోని చేపలు ఖాళీ స్థలంలోని నీటిలోకి వస్తున్నాయి. యువత వలలు వేసి చేపలను పట్టుకోవడం సందడిగా మారింది. నేడు, రేపు భారీ వర్షాలు ఓవైపు ఉత్తర భారతం నుంచి ఒరిస్సా వరకు రుతుపవన ద్రోణి, మరోవైపు ఉపరితల ఆవర్తనం రెండూ కలవడంతో రుతుపవనాలు ఊపందు కున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. దీంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. తర్వాత రెండు రోజులు సాధారణ వర్షపాతం నమోదవొచ్చన్నారు. ఉపరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారే అవకాశముందని, అదే జరిగితే మరిన్ని రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో కుండపోత వర్షాలు కురిశాయని, దీంతో లోటు వర్షపాతం కాస్తా అధిక వర్షపాతానికి చేరుకుందని, కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండక పోవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెలాఖరు వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందని, ఒక్కోసారి అక్టోబర్ 15 వరకూ విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు. ఆ తర్వాతే ఈశాన్య రుతుపవ నాలు మొదలవుతాయన్నారు. కాగా, గత 24 గంటల్లో భూపాలపల్లిలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొత్తగూడెంలో 6, దోమలో 5, మక్లూరు, అలంపూర్‌లలో 4, లింగంపేట, గట్టు, చెన్నూరు, ములుగు, వర్ని, కొల్హాపూర్‌లలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తో వరి నాట్లు ఊపందుకున్నాయని, 4 రోజుల క్రితం 66 శాతమున్న నాట్లు ఈ నెలాఖరుకు 80 శాతానికిపైగా పెరగొచ్చని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అక్కడక్కడ పెసర పంట దెబ్బతినొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మదీనగూడలో లారీ బీభత్సం
హైదరాబాద్: రోడ్డుపక్క మొక్కలు విక్రయించేవారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. సోమవారం ఉదయం మదీనగూడలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతి చెందిన ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లికి చెందిన చీకట్లశ్రీనివాస్, ఆదిబాబులుగా గుర్తించారు. -
మదీనాగూడ వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని మదీనాగూడ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ ట్యాంకర్, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... డ్రైవర్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్, ఆయిల్ ట్యాంకర్లను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. -
రూ.12 కోట్లతో చిట్టీల మాధవి ఉడాయింపు
హైదరాబాద్: రాజధాని నగరంలో మరో చిట్టీల మోసం బయటపడింది. మియాపూర్ మదీనాగూడ ప్రాంతానికి చెందిన మాధవి, వెంకటేశ్వర్లు దంపతులు ఖాతాదారులకు రూ. 12 కోట్లకు శఠగోపం పెట్టారు. ఇరుగు పొరుగుతో ఊరికి వెళ్లివస్తానని చెప్పి ఉడాయించారు. ఎన్నిరోజులైనా వీరు తిరిగిరాకపోవడంతో ఖాతాదారులు లబోదబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. రూపాయి రూపాయి కూడబెట్టి మాధవి దగ్గర చిట్టీలు కట్టామని బాధితులు వాపోయారు. రూ.10 వడ్డీ ఇస్తామని తమకు ఆశపెట్టారని వెల్లడించారు. మాధవి, వెంకటేశ్వర్లు ఐదేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు వీరి దగ్గర పెద్ద ఎత్తున చిట్టీలు వేసి మోసపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు కోరుతున్నారు.