హైదరాబాద్: రాజధాని నగరంలో మరో చిట్టీల మోసం బయటపడింది. మియాపూర్ మదీనాగూడ ప్రాంతానికి చెందిన మాధవి, వెంకటేశ్వర్లు దంపతులు ఖాతాదారులకు రూ. 12 కోట్లకు శఠగోపం పెట్టారు. ఇరుగు పొరుగుతో ఊరికి వెళ్లివస్తానని చెప్పి ఉడాయించారు. ఎన్నిరోజులైనా వీరు తిరిగిరాకపోవడంతో ఖాతాదారులు లబోదబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
రూపాయి రూపాయి కూడబెట్టి మాధవి దగ్గర చిట్టీలు కట్టామని బాధితులు వాపోయారు. రూ.10 వడ్డీ ఇస్తామని తమకు ఆశపెట్టారని వెల్లడించారు. మాధవి, వెంకటేశ్వర్లు ఐదేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు వీరి దగ్గర పెద్ద ఎత్తున చిట్టీలు వేసి మోసపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు కోరుతున్నారు.
రూ.12 కోట్లతో చిట్టీల మాధవి ఉడాయింపు
Published Wed, Jul 8 2015 4:18 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement