chit fraud
-
రూ.12 కోట్లతో చిట్టీల మాధవి ఉడాయింపు
హైదరాబాద్: రాజధాని నగరంలో మరో చిట్టీల మోసం బయటపడింది. మియాపూర్ మదీనాగూడ ప్రాంతానికి చెందిన మాధవి, వెంకటేశ్వర్లు దంపతులు ఖాతాదారులకు రూ. 12 కోట్లకు శఠగోపం పెట్టారు. ఇరుగు పొరుగుతో ఊరికి వెళ్లివస్తానని చెప్పి ఉడాయించారు. ఎన్నిరోజులైనా వీరు తిరిగిరాకపోవడంతో ఖాతాదారులు లబోదబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. రూపాయి రూపాయి కూడబెట్టి మాధవి దగ్గర చిట్టీలు కట్టామని బాధితులు వాపోయారు. రూ.10 వడ్డీ ఇస్తామని తమకు ఆశపెట్టారని వెల్లడించారు. మాధవి, వెంకటేశ్వర్లు ఐదేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు వీరి దగ్గర పెద్ద ఎత్తున చిట్టీలు వేసి మోసపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు కోరుతున్నారు. -
చిట్టీల పేరుతో కోటి రూపాయలు టోపీ
హైదరాబాద్ : చిట్టీల పేరుతో దాదాపు కోటి రూపాయల మేర కుచ్చు టోపీ పెట్టిన ఘటన హైదరాబాద్ లో మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోటేశ్వర్రావు చిట్టీల పేరుతో దాదాపు కోటి రూపాయల మేర వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోటేశ్వర్రావును అదుపులోకి తీసుకుని, కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల వ్యాపారి చీటింగ్ ప్లాన్
-
చిట్టీల పేరుతో ఘరానా మోసం
హైదరాబాద్: నగరంలో మరో చిట్టీల మోసం గురువారం వెలుగుచూసింది. కొండాపూర్ లో ఉండే దంపతులు చిట్టీల పేరుతో ఖాతాదారులను నిలువునా ముంచారు. వివరాలు...ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఆయన భార్య ఉష రూ. కోటి తో జనం నెత్తిన టోపీ పెట్టి పరారయ్యారు. మోసం బయటపడటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి
-
10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి
హైదరాబాద్ : చిట్టీల పేరుతో ఓ బుల్లితెర నటి ఘరానా మోసానికి పాల్పడింది. టీవీ ఆర్టిస్ట్ విజయరాణి...జూనియర్ ఆర్టిస్టుల వద్ద సుమారు 10కోట్ల రూపాయాల వరకూ వసూలు చేసి ఉడాయించింది. గత కొంతకాలంగా విజయరాణి ఎంతో నమ్మకంగా స్థానికంగా చిట్టీలు నిర్వహించేది. సమయానికి చిట్టీ డబ్బులు ఇచ్చివేసేది. నమ్మకం కుదరటంతో పలువురు జూనియర్ ఆర్టిస్ట్లు ఆమె వద్ద చిట్టీలు వేశారు. పెద్ద మొత్తంలో చిట్టీలు వేసిన ఆమె...అదును చూసుకుని పరారైంది. దాంతో ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న విజయరాణి కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.