హైదరాబాద్ : చిట్టీల పేరుతో దాదాపు కోటి రూపాయల మేర కుచ్చు టోపీ పెట్టిన ఘటన హైదరాబాద్ లో మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోటేశ్వర్‌రావు చిట్టీల పేరుతో దాదాపు కోటి రూపాయల మేర వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోటేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని, కేసును దర్యాప్తు చేస్తున్నారు.