స్టార్ హీరో కోటి రూపాయల విరాళం.. ఎందుకంటే? | Star Hero Vijay one crore Rupees Donation Vishal Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Vijay: దళపతి కోటి రూపాయల విరాళం.. ఎందుకో తెలుసా?

Published Tue, Mar 12 2024 6:44 PM | Last Updated on Tue, Mar 12 2024 7:12 PM

Star Hero Vijay one crore Rupees Donation Vishal Tweet Goes Viral - Sakshi

గతేడాది లియో మూవీతో సూపర్ హిట్‌ కొట్టిన హీరో దళపతి విజయ్. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీ స్టార్ హీరోయిన్ త్రిష నటించింది. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన సడన్ షాకిచ్చారు. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు.

తాజాగా హీరో విజయ్ కోటి రూపాయల విరాళం అందించి తన ఉదారతన చాటుకున్నారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని హీరో విశాల్ తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. ఇటీవలే స్టార్ హీరో కమల్ హాసన్ సైతం తన కోటి రూపాయల చెక్‌ను అందించారు.

కాగా.. ప్రస్తుతం నడిగర్​ సంఘం అధ్యక్షుడిగా నాజర్​, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్​, జనరల్​ సెక్రటరీగా విశాల్​, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు.  దాదాపు రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ భవనం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డిగర్‌ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్‌ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్‌ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement