Nadigar Association
-
నవంబర్ 1 నుంచి తమిళ్ సినిమా షూటింగ్స్ బంద్
తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి కోలీవుడ్‌లో ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంపై తాము గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని నిర్మాతల మండలి తాజాగా పేర్కొంది. తమిళ చిత్ర పరిశ్రమను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు.తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 'నిర్మాతల సంఘం తరపున ఇప్పటికే పలు సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్‌తో పాటు నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నిర్మాతల మండలి పేర్కొంది. దీనిని నియంత్రించి, కొన్ని రకాల పరిమితులు తీసుకురావాలని వారు తెలిపారు. నిర్మాతల సమస్యలకు పరిష్కారం కనుగొనే వరకు నవంబర్ 1 నుంచి షూటింగ్‌లు, సినిమాలకు సంబంధిత ఇతర కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు వారు నిర్ణయించాం. అయితే, ఈ నిర్ణయం పూర్తి చట్టవిరుద్ధమైన నిర్ణయమని నడిఘర్ సంఘం పేర్కొంది. ఇలాంటి చర్యలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ఎప్పటికీ మద్దతివ్వదని తెలిపింది.తమిళ నిర్మాతల ప్రధాన డిమాండ్స్అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి.ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి.అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరక్క నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి.నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరగాలి. -
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
కోలీవుడ్ హీరో ధనుశ్ తన మంచి మనసును చాటుకున్నారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన భవనానికి రూ. కోటి విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్‌ను నటుడు నాజర్‌కు అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ వెల్లడించింది.కాగా.. ప్రస్తుతం నటుడు నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తి కోశాధికారిగా నడిగర్ సంఘంలో పని చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు భవనం కోసం విరాళాలు అందచేశారు. కమల్ హాసన్, విజయ్‌లు గతంలోనే రూ.కోటి సాయమందించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికి నిర్మాణం పూర్తి చేయనున్నారు. కాగా.. ధనుశ్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నారు. అంతేకాకుండా స్వీయ దర్శకత్వంలో రాయన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. -
రూ.1 కోటి విరాళమిచ్చిన హీరో ధనుష్
దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగం పుంజుకుంది. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఆధునిక వసతులతో బ్రహ్మాండంగా నిర్మించడానికి చాలా కాలం ముందే ప్రణాళికలను సిద్ధం చేశారు. భవన నిర్మాణ పనులు కొంతమేరకు జరిగాయి కూడా. అయితే నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి. రూ.1 కోటి విరాళంతాజాగా సంఘం నిర్వాహకులు నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసే పనికి పూనుకున్నారు. అందుకు కావలసిన నిధులను సమకూర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ముందుగా హీరో కమలహాసన్ రూ. కోటి విరాళంగా అందించారు. ఆ తరువాత నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, హీరో విజయ్ తలా కోటి రూపా యలను విరాళంగా అందించారు. ధనుష్ సైతంఅలాగే హీరో శివకార్తికేయన్ రూ. 50 లక్షలను విరాళం ఇచ్చారు. తాజాగా హీరో ధనుష్ కోటి రూపాయలు ఇచ్చారు. దీంతో నడిగర్ సంఘం నిర్వాహకులు ధనుష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా నూతన భవనాన్ని పూర్తి చేయనున్నట్లు విశాల్ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్న విషయం తెలిసిందే.చదవండి: అందుకే విడిపోతున్నాం.. వివాహ బంధానికి ముగింపు ప్రకటన చేసిన జీవీ ప్రకాష్-సైంధవి -
రూ.కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ప్రముఖ నటుడు
దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. అయితే నిధుల కొరత కారణంగా భవన నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే దీన్ని పూర్తి చేయడానికి ప్రస్తుత కార్యవర్గం నడుం బిగించింది. భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రూ.40 కోట్ల వరకూ అవసరం అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అందుకోసం నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుంటున్నట్లు సంఘం కార్యదర్శి విశాల్ ఇటీవల తెలిపారు. కాగా సంఘం నూతన భవన నిర్మాణం కోసం సినీ ప్రముఖులు పలువురు పెద్ద మొత్తంలో నిధిని విరాళంగా అందిస్తున్నారు. నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధిస్టాలిన్ ఇటీవల కోటి రూపాయలను విరాళంగా అందించారు. అదే విధంగా నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, నటుడు విజయ్ కూడా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. కాగా ఇటీవల నటుడు శివకార్తికేయన్ రూ. 50 లక్షలు విరాళం అందించారు. కాగా తాజాగా ప్రముఖ నటుడు నెపోలియన్ రూ.కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈయన 2000 నుంచి 2006 వరకూ నడిగర్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారన్నది గమనార్హం. ఇప్పుడు కోటి రూపాయలను నూతన భవన నిర్మాణానికి విరాళంగా అందించడంతో ఆయనకు సంఘ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా ఇటీవలే నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. రాజకీయ జీవితంనెపోలియన్ తన మామ, డిఎంకె నాయకుడు కెఎన్ నెహ్రూకి సహాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2001లో విల్లివాకం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో మైలాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా గెలిచారు. 2009 నుంచి 2013 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. నెపోలియన్ 2014లో డీఎంకే పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. -
స్టార్ హీరో కోటి రూపాయల విరాళం.. ఎందుకంటే?
గతేడాది లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో దళపతి విజయ్. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీ స్టార్ హీరోయిన్ త్రిష నటించింది. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన సడన్ షాకిచ్చారు. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా హీరో విజయ్ కోటి రూపాయల విరాళం అందించి తన ఉదారతన చాటుకున్నారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని హీరో విశాల్ తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. ఇటీవలే స్టార్ హీరో కమల్ హాసన్ సైతం తన కోటి రూపాయల చెక్‌ను అందించారు. కాగా.. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. దాదాపు రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ భవనం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డిగర్ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. @actorvijay Thank u means just two words but means a lot to a person wen he does it from his heart. Well, am talking about my favourite actor our very own #ThalapathiVijay brother for DONATING ONE CRORE towards our #SIAA #NadigarSangam building work. God bless u. Yes we always… pic.twitter.com/EzJtoJaahu — Vishal (@VishalKOfficial) March 12, 2024 -
కమల్‌కు అండగా ఉంటాం: విశాల్
పెరంబూర్ : కమలహాసన్‌కు నడిగర్‌సంఘం అండగా ఉంటుందని ఆ సంఘ కార్యదర్శి విశాల్ వ్యాఖ్యానించారు. విశ్వనటుడు కమలహాసన్ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కమల్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలాన్ని రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా అగ్నిపరిక్ష పేరుతో ఒక ప్రముఖ తమిళ చానల్‌కు కమలహాసన్ ఇచ్చిన భేటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఆగ్రహం కలిగించింది. తమిళనాడులో వెంటనే ఎన్నికలు జరగాలన్న కమల్‌పై ముఖ్యమంత్రి తీవ్రంగానే స్పందించారు. కమలహాసన్‌కు 65 ఏళ్ల తరువాత జ్ఞానోదయం అయ్యిందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే తమిళనిర్మాతల మండలి అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ అందుకు నిర్మాతల మద్దతు కోరే పనిలో భాగంగా తన బృందంతో కలిసి బుధవారం సేలం వెళ్లారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమలహాసన్‌కు రాజకీయ పరంగా సమస్యలు తలెత్తితే ఆయనకు అండగా నడిగర్‌సంఘం నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కమలహాసన్ హిందూ మతాన్ని కించపరచే విధంగా మాట్లాడారంటూ హిందూ మక్కల్ కట్చి నిర్వాహకులు చెన్నై పోలీస్‌కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. మహాభారతంలోని పాత్ర గురించి కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు ఖండించదగ్గవని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రన్ ఆరోపించారు. -
నడిగర్ సంఘం సమావేశం తథ్యం
మారిన వేదిక తమిళసినిమా: వ్యతిరేకవర్గం ఆరోపణ లు, కేసులు, కోర్టులు లాంటి పలు వివాదాల మధ్య ఎట్టకేలకు దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం) సర్వసభ్య సమావేశం ముందుగా నిర్ణరుుంచిన ప్రకారమే ఆదివారం జరగనుంది. అరుుతే వేదికే మారింది. ముం దుగా ఈ సర్వసభ్య సమావేశం స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాల లో జరపనున్నట్లు కార్యవర్గం వెల్లడిం చింది. అరుుతే అక్కడ నిర్వహించడానికి పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. భ ద్రతా దష్ట్యా పోలీసులు కూడా లయో లా కళాశాలలో సమావేశానికి అనుమతించకపోవడంతో స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంఘ కార్యదర్శి విశాల్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎంజీఆర్ శతజయంతి వేడుక: ఈ సర్వసభ్య ఈ సర్వసభ్య సమావేశంలో తమిళసినిమా నూరేళ్ల వేడుక, ఎంజీఆర్ శత జయంతి వేడుకలతో పాటు వందేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ కళాకారుల పేర్లతో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరుగుతుందని సంఘ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా సంఘ కార్యక్రమాల తీర్మానాలు, ఆదాయ, వ్యయాల సభ్యుల ఆమోదం వంటి కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. పోస్టర్లు వద్దు ఇకపోతే పోలీసు శాఖ అనుమతి లేనందువల్ల సంఘ సర్వసభ్యసమావేశానికి సంబంధంచిన ఎలాంటి పోస్టర్లను గోడలపై అంటించడం లాంటి ప్రచారాలు చేయరాదని సభ్యలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గుర్తింపు కార్డులున్న సభ్యులకే సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఉంటుందని తెలియజేశారు.ఆదివారం జరగనున్న ఈ సమావేశానికి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. -
నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు
తమిళసినిమా: నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు వస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు నాజర్, మనోబాలా, పొన్వన్నన్, శరవణన్ తదితరులు సోమవారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ టీకే.రాజేందర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. వారాహి అనే న డిగర్ సంఘం సభ్యుడు గత 27వ తేదీన సంఘ నిర్వాహకులు అవినీతికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన 50 మంది సహాయ నటీనటులతో కలిసి సంఘం ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలాన్నే సృష్టించింది. అయితే వారాహి ఆరోపణలకు స్పంధించిన సంఘం కార్యద ర్శి విశాల్, కోశాధికారి కార్తీ ఉద్దేశపూర్వకంగానే వారాహి సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం సంఘం అధ్యక్షుడు నాజర్, మనోబాలా, పొన్వన్నన్, శరవణన్ తదితరులు నగర పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం విలేకులతో నాజర్ మాట్లాడుతూ సంఘానికి సంబంధించిన విషయాలను ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా వివరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారాహి అనే వ్యక్తి దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే సంఘంపై ఎలాంటి మరక పడకుండా చేయడానికి ప్రాణాలైనా ఒడ్డుతామన్నారు. తాము ప్రస్తుతం సంఘం సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అందుకు సభ్యులతో పాటు, ఇతరులను కలుపుకుని పోతున్నామని తెలిపారు. సంఘ భవన నిర్మాణాన్ని 6 వేల చదరపు అడుగులలో కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అందుకు ఇంకా అనుమతి పొందాల్సి ఉందని అన్నారు. 27వ తారీకున సంఘం ఆవరణలో ఆందోళనకు దిగిన వారు సంఘం ఉద్యోగి ఫోన్ లాక్కుని విసిరేశారనీ తెలిపారు. హత్యా బెదిరింపులు చేశారనీ అన్నారు. బెదిరింపులకు పాల్పడిన చెంగయ్య, రాజు, ఉషా, కోవైలక్ష్మి, అఖిల, రాణి, దేవి తదితరులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. సంఘ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నట్లు నాజర్ తెలిపారు. వారాహి కూడా పోలీస్ కార్యాలయంలో నడిగర్ సంఘం సభ్యులకు వ్యతిరేకంగా ఫిర్యాదు లేఖను అందించారన్నది గమనార్హం.