
దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగం పుంజుకుంది. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఆధునిక వసతులతో బ్రహ్మాండంగా నిర్మించడానికి చాలా కాలం ముందే ప్రణాళికలను సిద్ధం చేశారు. భవన నిర్మాణ పనులు కొంతమేరకు జరిగాయి కూడా. అయితే నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి.
రూ.1 కోటి విరాళం
తాజాగా సంఘం నిర్వాహకులు నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసే పనికి పూనుకున్నారు. అందుకు కావలసిన నిధులను సమకూర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ముందుగా హీరో కమలహాసన్ రూ. కోటి విరాళంగా అందించారు. ఆ తరువాత నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, హీరో విజయ్ తలా కోటి రూపా యలను విరాళంగా అందించారు.
ధనుష్ సైతం
అలాగే హీరో శివకార్తికేయన్ రూ. 50 లక్షలను విరాళం ఇచ్చారు. తాజాగా హీరో ధనుష్ కోటి రూపాయలు ఇచ్చారు. దీంతో నడిగర్ సంఘం నిర్వాహకులు ధనుష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా నూతన భవనాన్ని పూర్తి చేయనున్నట్లు విశాల్ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్న విషయం తెలిసిందే.
చదవండి: అందుకే విడిపోతున్నాం.. వివాహ బంధానికి ముగింపు ప్రకటన చేసిన జీవీ ప్రకాష్-సైంధవి
Comments
Please login to add a commentAdd a comment