కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించిన ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అందులో భాగంగానే ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించారు. విల్లుపురంలో నిర్వహించిన సభలో తమిళనాడు రాజకీయాలపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు. ఈ సందర్భంగా టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు.
ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని విజయ్ ప్రకటించారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సైతం విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తనను ఆర్టిస్ట్ అంటూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తొలి బహిరంగ సభలోనే తన స్పీచ్‌తో అదరగొట్టారు హీరో, టీవీకే అధినేత విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సభ వేదికగా విజయ్ ప్రకటించారు.
Tamil Nadu | Actor and TVK President Vijay says "In terms of ideology, we are not going to separate Dravidian Nationalism and Tamil Nationalism. They are two eyes of this soil. We shouldn't shrink ourselves to any specific identity. Secular Social Justice ideologies are our… pic.twitter.com/tclhef2BUk
— ANI (@ANI) October 27, 2024
Comments
Please login to add a commentAdd a comment