దళపతి సరసన మరోసారి ఛాన్స్‌ కొట్టేసిన బుట్టబొమ్మ..! | Pooja Hegde will join with Thalapathy Vijay for the second time after Beast | Sakshi
Sakshi News home page

Pooja Hegde: దళపతి సరసన పూజా హెగ్డే.. విలన్‌గా ఎవరంటే?

Published Wed, Oct 2 2024 3:24 PM | Last Updated on Wed, Oct 2 2024 4:09 PM

Pooja Hegde will join with Thalapathy Vijay for the second time after Beast

దళపతి విజయ్ ఇటీవలే ది గోట్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.  సెప్టెంబర్‌ 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ నెల 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే విజయ్ మరో చిత్రానికి రెడీ అయ్యారు. హెచ్‌ వినోత్‌ డైరెక్షన్‌లో ఆయన నటించనున్నారు. అయితే ఈ మూవీలో దళపతి సరసన బుట్టబొమ్మ ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ హౌస్ పూజా హెగ్డేకి స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకుముందు పూజా హెగ్డే బీస్ట్‌ చిత్రంలో విజయ్ సరసన నటించింది. ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ నటిస్తున్నారు. రాజకీయాల్లో పోటీకి ముందు ఈ సినిమానే విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా నిలవనుంది.

(ఇది చదవండి: ఓటీటీలో విజయ్‌ 'ది గోట్‌' సినిమా.. అధికారిక ప్రకటన)

దళపతి 69 పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్ టార్చ్ పట్టుకుని కనిపించారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 5న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement