tamilnaadu
-
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరిట పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల ఆయన నిర్వహించిన తొలి రాజకీయ సభకు దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతన్ని రానివ్వండి.. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ కూడా ప్రయత్నించనివ్వండని అన్నారు.విజయ్ గెలుపు అసాధ్యంకానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం అంత సులభం కాదని సత్యనారాయణ రావు అన్నారు. విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ శతవిధాల ప్రయత్నించినా తమిళనాడులో గెలవలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. "ఆయనకు రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే ఈ రంగంలోకి దిగాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టం' అని అన్నారు. కాగా.. విజయ్ చివరిసారిగా ది గోట్ మూవీతో అభిమానులను అలరించాడు. త్వరలోనే మరో మూవీలో ఆయన నటించనున్నారు. -
సినిమా వేరు.. రాజకీయం వేరు.. అయినా తగ్గేదేలే: విజయ్ పవర్ఫుల్ స్పీచ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించిన ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అందులో భాగంగానే ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించారు. విల్లుపురంలో నిర్వహించిన సభలో తమిళనాడు రాజకీయాలపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు. ఈ సందర్భంగా టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు.ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని విజయ్ ప్రకటించారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సైతం విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తనను ఆర్టిస్ట్ అంటూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తొలి బహిరంగ సభలోనే తన స్పీచ్‌తో అదరగొట్టారు హీరో, టీవీకే అధినేత విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సభ వేదికగా విజయ్ ప్రకటించారు. Tamil Nadu | Actor and TVK President Vijay says "In terms of ideology, we are not going to separate Dravidian Nationalism and Tamil Nationalism. They are two eyes of this soil. We shouldn't shrink ourselves to any specific identity. Secular Social Justice ideologies are our… pic.twitter.com/tclhef2BUk— ANI (@ANI) October 27, 2024 -
టీచర్ ఇంటికెళ్లిన స్టార్ హీరో.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న గోట్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే రాఘవ.. సమాజ సేవలోనూ ముందున్నారు. మాత్రం ఫౌండేషన్ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించి తన గొప్పమనసును చాటుకున్నారు.తాజాగా హీరో రాఘవ లారెన్స్ ఓ ఉపాధ్యాయున్ని కలిశారు. ఆయన ప్రతిభను గుర్తించిన హీరో ఇంటికెళ్లి మరి సన్మానించారు. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా మనలూరుపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్‌ను రాఘవ అభినందించారు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్స్ చూసి ముగ్ధుడైనట్లు వెల్లడించారు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ తెలిపారు. ఈరోజు అతన్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతని బహుమతి నా మనస్సుకు హత్తుకుందని రాఘవ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.Hi friends and fans, He’s Selvam, a drawing teacher from Manalurpet Kallakurichi district. I saw his wonderful drawing skills shared on social media by all of you. I wanted to meet him in person and appreciate his talent. Today, I’m happy to meet him and so touched by his gift!… pic.twitter.com/Zai28jVALZ— Raghava Lawrence (@offl_Lawrence) July 14, 2024 -
ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్.. ఎక్కడ నుంచంటే?
ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ ప్రకటించిన లిస్ట్‌లో నటి రాధిక స్థానం దక్కించుకుంది. తమిళనాడులోని విరుధునగర్ నుంచి ఆమె పోటీ చేయనుంది. తాజాగా ప్రకటించిన జాబితాలో తమిళనాడులో 14 స్థానాలతో సహా పుదుచ్చేరి సీటుకు కూడా అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. కాగా.. ఇటీవల ఆమె భర్త శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని (AISMK) బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన హీరోయిన్గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో మెప్పించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. -
పావులూర్‌లో స్థలం కొనుగోలు చేసిన సూపర్ స్టార్
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న రజనీకాంత్ పావులూర్‌లో స్థలం కొనుగోలు చేశారు. సినీనటుడు రజనీకాంత్ కూడ బెట్టిన ఆస్తులు చాలానే ఉన్నాయి. ఒక్కో చిత్రానికి ఆయన రూ.100 కోట్లకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే స్థిర, చరస్తులు కలిగి ఉన్న రజనీకాంత్ తాజాగా చైన్నె నావలూర్ గ్రామం సమీపంలోని తాళంపూర్ రోడ్డులో ఒక గ్రానైట్ సంస్థకు చెందిన స్థలాన్ని కొనుగోలు చేశారు. దాని రిజిస్ట్రేషన్ కోసం తాజాగా తిరుపోరూర్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆ స్థలాన్ని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఆయన బయటికి రావడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆయన్ని చుట్టుముట్టారు. రజినీకాంత్ ఓపిగ్గా ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి వెళ్లారు. కాగా అక్కడ రజనీకాంత్‌కు భారీ పోలీస్ భద్రతను కల్పించారు. -
కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్
శతాధిక స్వాంతంత్య్ర సమరయోఢుడు, తమళనాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య(102) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లే ముందు అభిమానుల సందర్శనార్థం సీపీఎం కార్యాలయానికి తరలించనున్నారు. ఎన్. శంకరయ్య కన్నుమూత గురించి తెలియజేస్తూ తమిళనాడు సీపీఎం సోషల్ మీడియా ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. కామ్రేడ్ శంకరయ్య భౌతికంగా మనకు దూరమైనా చరిత్ర ఉన్నంత వరకూ ఆయన మనతోనే ఉంటారని పేర్కొంది. స్వాంతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర అత్యంత సీనియర్ నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడిగా పేరొందిన ఎన్.శంకరయ్య భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. 1995 నుంచి 2002 వరకు సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మధురై వెస్ట్, మధురై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. தோழர் என்.எஸ். மறைவு! #CPIM மாநிலச் செயலாளர் தோழர் கே.பாலகிருஷ்ணன், தமிழ்நாடு முதல்வர் மு.க.ஸ்டாலின் ஆகியோர் நேரில் அஞ்சலி செலுத்தினர். #ComradeNS #NSankaraiah #FreedomFighter #CommunistLeader #CPIMLeader More: https://t.co/46hnp062DE pic.twitter.com/h8lPadt4Pp — CPIM Tamilnadu (@tncpim) November 15, 2023 -
ఇంట్లోకి చొరబడిన చిరుత.. దాడిలో ఆరుగురికి గాయాలు
తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో విధుల్లో ఉన్న జర్నలిస్ట్ ఒకరు ఉన్నారు. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన చిరుత కూనూరు సమీపంలోని గ్రామంలో ఓ వీధి కుక్కను వెంబడిస్తూ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. చిరుత చొరబడిన ఇంట్లో ఓ వ్యక్తి ఉండటంతో అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన ఆరుగురిపై చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వీరిలో విధుల్లో ఉన్న ఓ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. వీరందరినీ కూనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత ఇంకా ఇంట్లోనే ఉందని, దాన్ని బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
మరో ఘటన.. ఫార్మసీ ఉద్యోగి అకౌంట్లో రూ.753 కోట్లు.. ఏం చేశాడంటే..
సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో వందలాది కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు పొరపాటున సమాన్యుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నాయి. ఆశ్చర్యానికి లోనైన ఖాతాదారులు తేరుకునే లోపు పొరపాట్లను తెలుసుకుని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఓ ఫార్మసీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమయ్యాయి. మహమ్మద్ ఇద్రీస్ తన కోటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra bank) ఖాతా నుంచి శుక్రవారం (అక్టోబర్ 6) రూ.2000 లను స్నేహితుడికి బదిలీ చేశారు. ఈ లావాదేవీ తర్వాత, తన అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోగా రూ. 753 కోట్ల బ్యాలెన్స్ కనిపించింది. బ్యాంక్ అకౌంట్లో అంత పెద్ద మొత్తం కనిపించేసరికి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైన ఇద్రిస్ వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. దీంతో బ్యాంకు అధికారులు వెంటనే ఆయన అకౌంట్‌ను స్తంభింపజేశారు. ఈ పెద్ద మొత్తం కనిపించిన దురాశకు పోకుండా బ్యాంకు అధికారులకు తెలియజేసిన ఇద్రిస్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్లో ఖాతాలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రూ.9,000 కోట్లు డిపాజిట్ చేసింది. పొరపాటును గుర్తించిన బ్యాంకు ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. అంతకు ముందు తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలోనూ రూ. 756 కోట్లు జమయ్యాయి. -
MS Swaminathan: ఎమ్.ఎస్ స్వామినాథన్ కన్నుమూత
ఢిల్లీ: భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలతో స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహనతో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేశారు స్వామినాథన్. దీంతో ఎంతో మంది తక్కువ ఆదాయ రైతులు దేశాభివృద్ధికి గణనీయంగా తోడ్పాటునిచ్చారు. స్వామినాథన్ చేసిన సేవలకు గాను 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్నారు. ఆ డబ్బుతో ఆయన చెన్నైలో ఎమ్.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 1971లో స్వామినాథన్‌కు రామన్‌మెగసెసే అవార్డు, 1986లో అల్బర్ట్ ఐన్‌స్టీన్ సైన్స్ అవార్డ్‌లతో సత్కరించారు. పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. బాల్యంలోనే నిర్ణయం.. 1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్ జన్మించారు. డా.ఎం.కె. సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. ఆయన 11 యేట తండ్రి మరణంచగా.. ఆయన మామయ్య సంరక్షణలో చదువు కొనసాగించారు. కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1943 నాటి బెంగాల్ కరువు పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన.. ఆ దుర్భర పరిస్థితులను దేశం నుంచి పారదోలాలని నిర్ణయించుకున్నారు. మొదట జంతుశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మద్రాసు వ్యవసాయ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్రవేత్తగా ఎదిగారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో స్వామినాథన్‌కు పరిచయమైన మీనాతో ఆయన వివాహం అయింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. Father of India's Green Revolution, MS Swaminathan passes away in Chennai, Tamil Nadu. (Pic: MS Swaminathan Research Foundation) pic.twitter.com/KS4KIFtaP2 — ANI (@ANI) September 28, 2023 ఎన్నో బాధ్యతలు.. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్‌గా స్వామినాథన్ పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు భారత వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు కూడా ఆయన తన సేవలను అందించారు. 2014 వరకు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. #WATCH | Dr Soumya Swaminathan, former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, says, "...He was not keeping well for the last few days... His end came very peacefully this morning... Till the end, he was committed to the… https://t.co/n8B313Q2et pic.twitter.com/0BKDqqXbse — ANI (@ANI) September 28, 2023 భారత్‌లో చేసిన సేవల కంటే స్వామినాథన్ ప్రపంచ వేదికపై ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు ఆయన మేధస్సును అందించారు. టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో ఒకరిగా ఆయనకు స్థానం దక్కింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం -
అవళ్ అప్పడిదాన్–2
ఈగో క్లాష్ ప్రధానాంశంగా తమిళ సినిమా: భార్యభర్తల మధ్య అహం ఇతి వృత్తంతో 1978లో విడుదలైన చిత్రం అవళ్ అప్పడిదాన్. ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ రుద్రయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా అలాంటి కాన్సెప్ట్‌తో తాజాగా రూపొందిన చిత్రం అవళ్ అప్పడిదాన్ –2. అబుదాహీర్, స్నేహా పార్తీపరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో రాజేశ్వరి, సుమిత్ర, అనితాశ్రీ,సుధాకర్, వెంకట్రామన్, ధనపాల్, బేబీ కార్తీక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్ఎం.చిదంబరం కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని యున్ ఫ్లిక్స్ పతాకంపై సెయ్యదు అబుదాహీర్ నిర్మించారు. అరవింద్ సిద్ధార్ సంగీతాన్ని, వేదా సెల్వం ఛాయాగ్రహణను అందించిన అవళ్ అప్పటిదాన్– 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్ర కథలో అన్నీ పాజిటీవ్ పాత్రలే. అందరూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ప్రాధాన్యతనిచ్చేవాళ్లే. విద్యావేత్తలైన భార్యాభర్తలు. వీరి భావాలు ఒకటి కాకపోయినా, ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా సీ్త్ర స్వేచ్ఛను గౌరవించే వ్యక్తిత్వం కలిగిన భర్త. ఆయన భార్య ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. అలాంటిది ఆమె ఒక రోజు పాఠశాలకు వెళ్లి అర్ధరాత్రి అయినా ఇంటికి తిరిగి రాదు. దీంతో భర్త ఆమె కోసం రాత్రి అంతా వీధుల్లో వెతుకుతాడు. మరుసటి రోజు ఉదయం భార్య ఇంటికి తిరిగొస్తుంది. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావని ప్రశ్నంచిన భర్తకు భార్య బదులు చెప్పదు. అందుకు కారణం ఏమిటి? అసలు ఆమె ఆ రాత్రి ఎక్కడుంది? భర్తతో పాటు, ఇంట్లోవాళ్లు పలుమార్లు ప్రశ్నించినా ఆమె బదులు ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన అవళ్ అప్పడిదాన్– 2 కచ్చితంగా అన్ని వర్గాలనూ అలరిస్తుందని దర్శకుడు తెలిపాడు. Today's newspaper posters #DinaThanthi 6/10Aval Appadiththaan 2ஜூலை 21 முதல்#AvalAppadiththaan2 #அவள்_அப்படித்தான்2 #YunFlicks #RaMuChidambaram pic.twitter.com/eDEKlDQ4OS— TamilCinemaInfo (@TamilCinemaInf1) July 16, 2023 -
చెన్నెలో ‘పాప్’ సాంస్కృతిక వేడుక
సాక్షి, చైన్నె : విదేశాలలోని పాప్ కల్చర్‌ను చైన్నెలో పరిచయం చేసే విధంగా సాంస్కృతిక వేడుకకు సన్నాహాలు చేపట్టామని కామిక్ కాన్ఇండియా వ్యవస్థాపకుడు జతిన్ వర్మ తెలిపారు. పాప్ కల్చర్ ఔత్సాహికులతో చైన్నెలో మొదటి ఎడిషన్‌కు ఆహ్వానం పలికే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. #ProjectK India first comic con 🔥#kirti_somya #DeepikaPadukone #hukum #Rajnikanth #Prabhas #chennai #tamil #hindi #Prabhas #trending2023 #TrendingNow pic.twitter.com/V6zAdhXLE1 — aayush09 (@TitoriaAyush) July 17, 2023 ఇందులో జతిన్ వర్మ మాట్లాడుతూ, పాప్ కల్చర్ మ్యాజిక్‌ను ఈ సారి చైన్నె నగరానికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యామని వివరించారు. భారతీయ కామిక్ సృష్టికర్తలు, ప్రఖ్యాత కళాకారులు ఈ వేడుకకు తరలి రాబోతున్నారన్నారు. కళలు, వినోదం, స్మజనాత్మకత, మరుపురాని అనుభవాన్ని చైన్నె వాసులకు కలిగించే విధంగా ఈ వేడుక 2024 ఫిబ్రవరి 17,18 తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. #Chennai! Get ready to experience the #BestWeekendOfTheYear 😁 Save the date! 17th - 18th February 2024 at Chennai Trade Centre Be the first to receive the latest updates of Chennai Comic Con 2024 by signing up here - https://t.co/5VbgjJSt6g pic.twitter.com/OHev4bGevG — Comic Con India (@ComicConIndia) July 17, 2023 -
మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్
సింగర్ చిన్మయి పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలో పలువురిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తమిళ పాటల రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలతో ఆమెను కోలీవుడ్ నుంచి నిషేధానికి కుడా గురైంది. అయితే తాజాగా గురువారం వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచింది. ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) సింగర్ చిన్మయి చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ వ్యక్తిగతంగా కలిసి.. ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సింగర్ చిన్మయికి ఆగ్రహం తెప్పించింది. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడితే సిగ్గేస్తోందని ఘాటుగా విమర్శించింది. రాజకీయ నాయకుల అండతోనే వారు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించింది. ట్వీట్లో చిన్మయి రాస్తూ.. 'తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అతని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడం. నేను ఒక మహిళగా అతనిపై మీటూ ఉద్యమంలో ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి తమిళ ఇండస్ట్రీలో బ్యాన్ విధించారు. రాజకీయ అండతో ఒక రచయిత ఏ స్త్రీపైనా చేయి వేయగలడని ఫిక్స్ అయిపోయాడు. రాజకీయ నాయకులతో అతనికి ఉన్న సాన్నిహిత్యంతో మౌనంగా ఉండమని ఓ మహిళను బెదిరించాడు. అందుకే పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఈ మనిషికి ఉన్న శక్తి ఇది. నన్ను చాలా మంది మహిళలు ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. తమిళనాడులో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లో మహిళల భద్రత కోసం మాట్లాడడం తలుచుకుంటే సిగ్గేస్తోంది. ఎందుకంటే వైరముత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వారంతా మౌనంగా ఉంటారు. ఈ భూమి అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం మహిళలను వేధించేవారి పుట్టినరోజు జరుపుకుంటారు. కానీ వీటిపై మాట్లాడిన మహిళలను వేధిస్తారు. మనకు సున్నితత్వం, సానుభూతి, విద్యపైనా అవగాహన మాత్రం శూన్యం. బ్రిజ్ భూషణ్ నుంచి వైరముత్తు వరకు ఎల్లప్పుడు రాజకీయ నాయకులు వీరిని కాపాడతారు. ఈ భూమిలో ప్రాథమికంగా దొరకని న్యాయం కోసం ఎదురుచూడటం బాధాకరమైన విషయం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్) The Chief Minister of Tamilnadu personally visits the home of a man accused by several women of sexual harassment to wish him on his birthday; I, as a multiple award winning singer and voice over artiste, face a work ban by the Tamil Film Industry since 2018, for naming this poet… https://t.co/8RpQ120swZ — Chinmayi Sripaada (@Chinmayi) July 13, 2023 -
బీజేపీకి పతనం తప్పదు! : తమిళనాడు సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రానున్న ఎన్నికల్లో గెలవచ్చన్న ధీమాతో ఉన్న బీజేపీకి జాతీయ స్థాయిలో పతనం తప్పదని సీఎం స్టాలిన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో ప్రజలు పెద్ద గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. గురువారం డీఎంకే కార్యాలయం అన్నాఅరివాలయంలో పార్టీ నాయకుడు గుమ్మిడిపూండి వేణు ఇంటి శుభకార్య వేడుకలో సీఎం స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు. డీఎంకే అంటే ఓ కుటుంబం అన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. మహానాడులైనా సరే, పార్టీ కార్యక్రమాలైనా సరే కుటుంబ సమేతంగా నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చే ఒకే ఒక్క పార్టీ డీఎంకే అని గుర్తు చేశారు. డీఎంకేలో ఉన్న ప్రతి ఒక్కర్ని దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి తన కుటుంబంలోని వ్యక్తులుగానే భావిస్తారని పేర్కొన్నారు. డీఎంకేకు ఓటు వేస్తే అది కరుణానిధి కుటుంబ ప్రయోజనానికే ఉపయోగకరం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. డీఎంకే అంటే కుటుంబం, డీఎంకే అంటే తమిళనాడు, తమిళనాడు ప్రయోజనాలే డీఎంకేకు ముఖ్యం అన్న విషయాన్ని ఆయన బాగానే గ్రహించినట్టున్నారని హితవు పలికారు. ఓటమి తప్పదు.. గత 50 ఏళ్లుగా తమిళనాడు అనే కుటుంబం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా డీఎంకే శ్రమిస్తున్న విషయాన్ని మోదీ గుర్తెరగాలని సూచించారు. ఆధునిక తమిళనాడు రూపకర్త దివంగత నేత కరుణానిధి అని, ఆయన అడుగుజాడల్లో ద్రావిడ మోడల్ పాలన తమిళనాట సాగుతోందన్నారు. కలైంజ్ఞర్ శత జయంతి ఉత్సవాల వేళ గత రికార్డుల గురించి చెబుతూ పోతే సమయం చాలదని పేర్కొన్నారు. మీసా చట్టంలో తాను అరెస్టయిన సమయంలో జైల్లో ముందుగా తనను కాకుండా ఇతర నాయకులు, కార్యకర్తలను దివంగత నేత పరామర్శించారని గుర్తు చేశారు. ఆయనకు కుమారుడి కంటే డీఎంకే కుటుంబం ముఖ్యం అని గుర్తు చేస్తూ, ఇవన్నీ మోదీకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీలో భయం పెరిగిందన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల మధ్య మత చిచ్చులు పెట్టి, ఆ నీడలో 2024 ఎన్నికల్లో గెలవాలన్న వ్యూహ రచనలో ఉన్నారని ఆరోపించారు. ఆయన పాచికలు ఇక పారబోవని, ప్రజలు మోదీ గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ఓడించడం లక్ష్యంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మణిపూర్ ఘటనలను గుర్తు చేస్తూ, ఈ వ్యవహారంలో మోదీ అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. అల్లర్లు బయలుదేరిన నెలన్నర రోజుల తర్వాత హోంమంత్రి అమిత్‌షా ద్వారా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం శోచనీయమని విమర్శించారు. ఈసారి ఎన్ని కుట్రలు చేసినా మోదీకి ఓటమి తప్పదని, ప్రజలు ఆయనకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
చైన్నె వేదికగా ఎలక్ట్రిక్ వాహనాల ఫెయిర్
సాక్షి, చైన్నె : అంతర్జాతీయ స్థాయిలో చైన్నె వేదికగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వం, ఫ్యూచర్స్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఈవెంట్స్ నిర్ణయించాయి. చైన్నె నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో ఈనెల 26 నుంచి మూడు రోజల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. సోమవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఫ్యూచర్స్ ట్రేడ్ డైరెక్టర్ నమిత్ గుప్తా మాట్లాడుతూ, 2022లో 10 లక్షల యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు దేశంలో విక్రయాలు జరిగినట్టు వివరించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ పురోగతి, సామర్థ్యాన్ని చాటే విధంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. సమావేశంలో నిర్వాహకులు స్వామి ప్రేమ్ అవినాశ్, ఎం. ఇల్లాహి, సతీష్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ముఖేష్ పాల్గొన్నారు. వండలూరు జూకు మైసూరు ఎలుగుబంట్లు కొరుక్కుపేట: జంతుమార్పిడి కార్యక్రమంలో భాగంగా మైసూర్ నుంచి రెండు ఎలుగుబంట్లను వండలూరు జూపార్కుకు సోమవారం తీసుకొచ్చారు. రెండేళ్ల వయసున్న మగ ఎలుగుబంటి పేరు అప్పు అని, ఏడాదిన్నర వయసున్న ఆడ ఎలుగుబంటి పేరు పుష్ప అని అధికారులు తెలిపారు. వీటిని అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక పర్యాటకులకు అరుదైన ఎలుగుబంట్లను చూసి కొత్త అనుభూతిని పొందుతున్నారు. మలేషియా మురుగన్‌కు చైన్నె సారె కొరుక్కుపేట: ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని దేవాలయాలతో సామరస్యపూర్వక సంబంధాలను మెరుగుపరిచేందుకు తమిళనాడు దేవదాయ శాఖ కొత్త సంస్కృతికి నాందిపలికింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సూచనతో ఆయా రాష్ట్రాలు, దేశాలల్లోని దేవాలయాలకు ఇకపై నూతన వస్త్రాలతో కూడిన సారె అందించాలని నిర్ణయించింది. ఈక్రమంలో మలేషియాలోని మురుగన్, వినాయక ఆలయాలకు వస్త్ర, మాలలు అందించినట్టు హిందూ ధార్మిక దర్మాదాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఇప్పటి వరకు తమిళనాడులోని మదురైలోని వినాయగర్ ఆలయం, మీనాక్షి సుందరేశ్వరాలయం, అలఘర్ ఆలయం, పళని, దండాయుదపాణి స్వామి ఆలయం, చైన్నె లోని మైలాపూర్ కాపాలీశ్వదేవాలయం, తిరుత్తణి, శ్రీవిల్లిపుత్తూరు ఆలయాలకు రాష్ట్ర హిందూ ధర్మదాయ శాఖమంత్రి పీకే శేఖర్ బాబు సూచనల మేరకు గౌరవ వస్త్రాలు అందించామన్నారు. అదేక్రమంలో మలేషియాలో మురుగన్, వినాయక ఆలయం, కర్ణాటక, ఆంధ్రా తదితర రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సైతం సారె అందించనున్నట్లు పేర్కొన్నారు. 1.5 కిలోల బంగారం స్వాధీనం తిరువొత్తియూరు: మదురై ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1.5 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని సెంట్రల్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మదురై విమానాశ్రయం నుంచి దుబాయ్ నుంచి మదురైకి వచ్చే స్పైస్ జెట్ విమానంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు కేంద్ర కస్టమ్స్ శాఖకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి మదురై ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేశారు. రామనాథపురం జిల్లా కీల్‌కరై ప్రాంతానికి చెందిన నసీమ్ వీర పాండియన్ అనే ప్రయాణికుడి వద్ద 1.5 కేజీల బంగారం ఉండడడంతో సీజ్ చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. -
పన్నీర్ సెల్వానికి మరో షాక్.. ఇద్దరు కుమారులపైనా వేటు
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి(ఓపీఎస్) మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఓపీఎస్‌ను తొలగించిన కొద్ది రోజుల్లోనే ఆయన కుమారులు సహా మరో 16 మందిపై బహిష్కరణ వేటు వేశారు పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రెటరీ పళనిస్వామి(ఈపీఎస్). క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పన్నీరు సెల్వం వర్గంపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పన్నీరు సెల్వం కుమారులైన.. థేని లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు రవీంద్రనాథ్, జయప్రదీప్, మాజీ మంత్రి వెల్లమండి ఎన్ నటరాజన్‌లను బహిష్కరించినట్లు పార్టీ తెలిపింది. వారితో పాటు శాసనసభ మాజీ సభ్యులు, ఎంపీలు మొత్తం మరో 15 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పళనిస్వామి. మొత్తం 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందుకే వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేశారు. పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్)ను ఎన్నుకున్నారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యంత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇదీ చూడండి: AIADMK General Body Meet: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు -
దేవుడినైనా ఏమార్చవచ్చు.. కానీ ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేం: డైరెక్టర్
చెన్నై సినిమా: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాదంటే ఈ చిత్రం ఉండేది కాదని 'ఇరవిన్ నిళల్' (Iravin Nizhal) చిత్ర దర్శకుడు, కథానాయకుడు పార్తిపన్ (Parthiban) అన్నారు. ఈయన సింగిల్ షాట్లో తెరకెక్కించి గిన్నీస్ రికార్డు కెక్కిన ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను నిర్మాత కలైపులి ఎస్. ధాను పొంది ఈ నెల 24వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్తిపన్ ఆదివారం రాత్రి స్థానిక ఐఐటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పార్క్ ఆవరణలో వైవిధ్యభరితంగా నిర్వహించారు. సంగీత దర్శకుడిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. పార్తిపన్ మాట్లాడుతూ వైవిధ్యభరిత కథా చిత్రాన్ని చేయాలనుకున్నప్పుడు మంచి సపోర్ట్ అవసరం అయ్యిందని, ఆ సపోర్టే ఏఆర్ రెహమాన్ అని పేర్కొన్నారు. అయితే భగవంతుడినైనా అభిషేకంతో ఏమార్చవచ్చు గానీ మన ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేమని అభిప్రాయపడ్డారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం -
హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?
జంతువుల్లో ఏనుగును మేధావిగా భావిస్తారు. అవి చాలా వరకు సాధు జీవిలానే ఉంటాయి. కాకపోతే ఒక్కొసారి ఆ ఏనుగులు తమ జోలికి వస్తే మాత్రం అంత తేలికగా వదిలిపెట్టవు. పైగా అవి వాటికి ఏదైనా సమస్య వస్తే భలే చక్కగా ఒకదానికొకటి సహకరించుకుంటాయి. అంతేకాదు మనుషుల వలే కొన్ని పనులను భలే చాకచక్యంగా చేసేస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక ఏనుగు నేను మీ లా దూకేయగలనంటూ అడ్డుగా ఉన్న ఇనుప కంచెను ఎలా దాటిందో ఈ వీడియోలో చూడండి. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) పైగా ఆ ఏనుగు ఎంతో నైపుణ్యంగా ఆ ఇనుప కంచెను దాటడానికి ప్రయత్నించింది. అంతేకాదు ఆ ఏనుగు ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించింది. ఈ మేరకు ఈ వీడియోని తమిళనాడు ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్లు ఈ ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటూ జౌరా! అంటే మరికొంత మంది అలాంటి కంచెలను దాటడానికి ప్రయత్నించి మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు అందువల్ల దయచేసి వాటిని తొలగించండి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ) -
వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సొమ్మంతా వృధానేనా!
చెన్నై: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్ 16నలో డీ మానిటైజేషన్ ప్రవేశ పెట్టి రూ.500/-, రూ.1000/- నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగి అప్పుడే ఐదేళ్లు అయినా దీని గురించి కొంతమందికి ఇంకా తెలియదంటే ఆశ్చర్యంగా అనిపించక మానదు. ప్రస్తుతం ఈ విషయం గురించి తనకు ఏమి తెలియదంటున్నాడు తమిళనాడుకి చెందిన ఒక వృద్ధ బిచ్చగాడు. (చదవండి: తలపాగే ప్రాణాలను కాపాడింది) వివరాల్లోకెళ్లితే... తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన చిన్నక్కణ్ను అనే వృద్ధ బిచ్చగాడు తాను అడుక్కుంటూ జీవితాంతం పోదుపు చేసుకుంటూ కూడబెట్టిన సొమ్ము రూ.65,000 వృద్ధా అయిపోయిందంటూ ఆవేదన చెందాడు. తాను ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన డీమానిటైజేషన్ గురించి చెప్పులు కుట్టే కన్నయ్యన్ ద్వారా తెలుసుకున్నానని చెప్పాడు. దీంతో తాను దాచిని సోమ్మంతా పనికిరాదని అర్థమైందని, చివరిగా తన వద్ద మిగిలన డబ్బు కేవలం రూ 300/- మాత్రమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు చిన్నక్కణ్ను కలెక్టర్‌కు ఒక పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. అంతేకాదు జిల్లా రెవెన్యూ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు ఈ పిటిషన్‌ను పంపించడమే కాక రిజర్వ్ బ్యాంక్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం అని చిన్నక్కన్నకి హామీ కూడా ఇచ్చారు. అయితే నోట్ల మార్పిడి మార్చి 31, 2017తో ఆఖరు కాబట్టి కాబట్టి నోట్లు మారే అవకాశం ఉండదేమోనంటూ అదికారులు సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జిల్లా యంత్రంగం చిన్నక్కణ్నుని ఆదుకోవడానికి ముందకు రావడమే కాక వృద్ధాప్య పెన్షన్‌ని కూడా ఏర్పాటు చేసింది. (చదవండి: 'బీరు' బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు) -
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అధికారి..
సాక్షి, చెన్నై(తమిళనాడు): బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా అన్నామలైని నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. కరూరు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నామలై ఇంజినీరింగ్, ఎంబీఏ పట్టబధ్రుడు. కర్ణాటక ఐపీఎస్‌కు చెందిన ఆయన 2018–19 వరకు పోలీసు అధికారిగా పలు హోదాల్లో పనిచేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా నియమితులై గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచ్చి నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి ఇళంగో చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.మురుగన్ కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో అన్నామలైని నియమించారు. అన్నామలైకి బీజేపీ తమిళనాడు శాఖ జాతీయ కో–ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన హయాంలో పార్టీ మరింత బలోపేతమై తమిళనాడులో అధికారం చేపట్టగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. -
యూట్యూబర్ మదన్‌కు రిమాండ్
సాక్షి, చెన్నై: మహిళల గురించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన య్యూటూబర్ పబ్జి మదన్‌ను శుక్రవారం ధర్మపురిలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాత్రంతా అతడిని విచారణ చేశారు. శనివారం మధ్యాహ్నం సైదాపేట కోర్టులో హాజరుపరిచినానంతరం రిమాండ్‌కు తరలించారు. కాగా ఆన్లైన్ గేమ్స్, యూ ట్యూబ్ ద్వారా సేకరించిన విరాళాలతో మదన్ రెండు ఇళ్లు, మూడు లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. భార్య కృతిక పేరిట బ్యాంక్‌లో రూ.4 కోట్లు డిపాజిట్ చేసినట్టు విచారణలో తేలింది. ఇవన్నీ ఐటీ లెక్కల్లో లేని దృష్ట్యా ఆదాయ పన్నుశాఖ విచారణ మొదలెట్టింది. మరోవైపు మదన్ బాధితులు తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు కోరారు. చదవండి : అసభ్య వ్యాఖ్యలు.. ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ -
ది ఫ్యామిలీ మెన్–2పై వివాదం..అమెజాన్‌కు లేఖ
చెన్నై: ది ఫ్యామిలీ మెన్–2 వెబ్ సిరీస్ తమిళుల మనోభావాలను కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్ సిరీస్‌ను వెంటనే నిలిపివేయాలని నామ్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్ అమెజాన్ సంస్థకు ఆదివారం లేఖ రాశారు. ప్రసారం నిలిపివేయకుంటే తమిళులంతా అమెజాన్ సంస్థ సర్వీసులన్నింటినీ బాయ్‌కాట్ చేస్తారని హెచ్చరించారు. సీమాన్‌తో పాటు డీఎంకే, ఎండీఎంకే అధినేత వైగో వంటి రాజకీయ నాయకులు ఈ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ది ప్యామిలీ మెన్–2 వెబ్‌సిరీస్‌పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వెబ్‌సిరీస్ ఈ నెల 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. -
పెళ్లి.. మోసం: రచ్చకెక్కిన సినీ నటి
సాక్షి, చెన్నై: వర్ధమాన సినీ నటి రాధ రచ్చకెక్కారు. సబ్ ఇన్స్పెక్టర్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ విరుగంబాక్కం పోలీసు స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. సుందరం ట్రావెల్స్ చిత్రంలో కథానాయకీగా తమిళ సినీ రంగానికి రాధ(38) పరిచయం అయ్యారు. రాధ గురువారం విరుగ్గం బాక్కం పోలీసుస్టేషన్లో ఎస్ఐ వసంత్ రాజ్‌పై ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. పరిచయం..ప్రేమగా.... భర్తతో విడాకుల అనంతరం తల్లి, కుమారుడితో కలిసి శాలిగ్రామంలోని లోకయ్య వీధిలో రాధ నివాసం ఉంటున్నది. ఆర్కేపురం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న తిరువాన్మియూరు ఎస్ఐ వసంత్ రాజ్‌తో గతంలో ఓ సినిమా షూటింగ్ సందర్భంలో పరిచయం ఏర్పడింది. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా, వసంత్‌రాజ్ అధిక సమయం రాధకు కేటాయిస్తూ వచ్చాడు. ఈ వ్యవహారం పసిగట్టి తిరువాన్మీయూరు సీఐకు వసంత్ రాజ్ భార్య గతంలో ఫిర్యాదు కూడా చేశారు. వడపళనికి పోస్టింగ్ నిండా మునిగినోడికి చలి ఏమిటి అన్నట్టుగా ఇక పూర్తిగా రాధా మోజులో ఈ ఎస్ఐ పడ్డాడు. తర్వాత రాధ కోసం తిరువాన్మీయూరు నుంచి వడపళని పోలీసుస్టేషన్‌కు పోస్టింగ్ కూడా మార్చుకున్నాడు. ఈ సమయంలో రాధను రహస్యంగా పెళ్లి కూడా చేసుకుని జీవితాన్ని సాగిస్తూ వచ్చినట్టు సమాచారం అసలు కథ ఇక్కడే.. రాధ చేసిన ఓ చిన్న పొరబాటు వసంత్‌రాజ్‌ను అప్రమత్తం చేసింది. తనకు తెలియకుండా, తనతో సంప్రదించకుండా ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులో రాధా తన పేరును భర్తగా చూపించడం, ఆమె కుమారుడికి తండ్రిగా తన పేరు నమోదు చేసి ఉండడాన్ని వసంత్ రాజ్ గుర్తించాడు. దీంతో కథ బెడిసి కొట్టింది. . ఆమెకు దూరంగా ఉండాలని ఎన్నూరుకు పోస్టింగ్ మార్చుకున్నాడు. పోలీసుస్టేషన్ వద్దకే వెళ్లి గొడవ కూడా పడ్డట్టు సమాచారం. పోలీసు కావడంతో తన దైన స్టైల్లో బెదిరింపులు ఇవ్వడంతో ఆందోళనతో రాధా పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కింది. తీగ లాగితే మోసాలు కూడా వెలుగులోకి రావడం గమనార్హం. ఇప్పటికే ఇద్దరిపై ఫిర్యాదు.. విరుగ్గంబాక్కం పోలీసుల విచారణలో తనను మోసం చేశారంటూ రాధ ఇప్పటికే రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్టు వెలుగు చూసింది. చదవండి: దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు యూట్యూబ్‌లో పూజలు చూసి బిడ్డను బలిచ్చిన తల్లి -
మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు..
సాక్షి, చెన్నై: హోం శాఖలో మరో ఖా‘కీ’చకం చర్చకు దారి తీసింది. మహిళా ఐపీఎస్‌ను డీజీపీ హోదా అధికారి వేధింపులకు గురిచేయడం రాజకీయంగా సైతం దుమారాన్ని రేపింది. దీంతో విచారణకు కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీని ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని పోలీసు విభాగంపై ఇటీవల కాలంగా ఆరోపణలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఇందులో లైంగిక వేధింపులు ఎక్కువగానే ఉన్నాయి. కొంత మంది మహిళా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా, మరెందరో బయటకు చెప్పుకోలేక తమలో తాము కృంగిపోతున్నారు. ఫిర్యాదులు చేసుకున్నా ఫలితం శూన్యం. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఎస్పీ స్థాయి అధికారినికి ఐజీ స్థాయి అధికారి వేధింపులు ఇవ్వడం, విశాఖ కమిటీ రంగంలోకి దిగినా, చివరకు ఆ విచారణ తుంగలో తొక్కబడడమే. ఈ పరిస్థితుల్లో డీజీపీ హోదా కల్గిన అధికారి ఐపీఎస్ అధికారిని తన కారులో ఎక్కమని చెప్పి, కొంత దూరం వెళ్లినానంతరం డ్రైవర్‌ను కిందకు దించేసి మరీ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు, లైంగిక వేధింపులు ఇచ్చినట్టు రెండు రోజులుగా ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తూ వచ్చింది. ఐఏఎస్ నేతృత్వంలో రంగంలోకి.. ఈ సమాచారం బుధవారం రాజకీయవివాదంగా మారింది. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. ఆ మహిళా ఐపీఎస్ అధికారి ఇప్పటికే డీజీపీ త్రిపాఠికి ఫిర్యాదు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వేధింపులపై విచారణకు కమిటీని నియమిస్తూ హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి పోలీసు బాసుల నేతృత్వంలో కమిటీ రంగంలోకి దిగాల్సి ఉంది. వేధింపులు ఇచ్చిన అధికారి డీజీపీ స్థాయి వ్యక్తి కావడంతో ఐఏఎస్ అధికారి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురితో కూడిన కమిటీ రంగంలోకి దించారు. ఈ కమిటీలో అదనపు డీజీపీ సీమాఅగర్వాల్, ఐజీ అరుణ్, డీఐజీ చాముండేశ్వరి, ఐపీఎస్ రమేష్‌బాబు, మహిళా స్వచ్ఛంద సేవకురాలు లోరెటా జోనా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ స్థాయి అధికారిని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఘట్కేసర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్ మాయలేడి: ఇంత పనిచేసిందా? -
నేరం నాది కాదు.. లాక్డౌన్ది
సేలం (తమిళనాడు) : కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి అప్పుల పాలయ్యారు. లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయి కుటుంబాన్ని పోషించేందుకు చేసిన అప్పులు తీర్చేందుకు కన్నకొడుకునే అమ్ముకున్న దీనగాథ తమిళనాడులోని సేలంలో వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఆరు నెలల పసికందుని లక్ష రుపాయలకు అప్పుతీర్చడం కోసం అమ్ముకున్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని, అతడికి సహాయం చేసిన స్నేహితుడిని, పిల్లాడిని కొన్నవారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లాలోని లైన్‌మెడు ప్రాంతంలో నివసిస్తున్న షౌకత్ అలీ భార్య షర్మిలా బానో ఆరు నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. షర్మిల మామయ్య పిల్లాడిని చూడటానికి సోమవారం రాగా, వారితో అలీ వారం ముందే పిల్లాడు చనిపోయాడని చెప్పాడు. వారం రోజుల ముందే చిన్నారి చనిపోతే తమకు సమాచారం ఇవ్వకపోవడం, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఈ విషయం తెలియకపోవడంతో అనుమానం వచ్చి అతని మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. షౌకత్, షర్మిలాను పోలీసులు గట్టిగా అడిగే సరికి ఇద్దరూ తమ బిడ్డను లక్ష రూపాయలకు అమ్మారని అంగీకరించారు. లాక్డౌన్ సమయంలో తాను ఉద్యోగం కోల్పోవడంతో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా లక్ష రూపాయల వరకు అప్పు చేశానని, రుణం తిరిగి చెల్లించలేక బిడ్డను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. -
అతడు కాస్తా.. 'ఆమె'గా
మధురై (తమిళనాడు): సమాజంలో హిజ్రాల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ కొన్ని సార్లు మానవత్వం ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. ఎంత గౌరవమైన వృత్తిలో పనిచేస్తున్నా ట్రాన్స్‌జెండర్స్ బతుకులు బాగుపడటంలేదు. సరిగ్గా ఇక్కడ కూడా అలానే జరిగింది. పురఘడిగా ఉన్నంత వరకు సాఫీగా ఉన్న జీవితం లింగమార్పిడి చేసుకున్న తరువాత ఆమె జీవితం తలకిందులైంది. ఓ వ్యక్తి మధురైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఓ ఆసుపత్రిలో ఒక సంవత్సరం పాటు వైద్యుడిగా సేవలందించాడు. కొన్ని రోజుల తరువాత మహిళగా మారాలని అనుకున్నాడు. కానీ అటు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇటు సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయినా.. లింగమార్పిడి చేసుకున్నాడు. లింగమార్పిడి తరువాత అతడు కాస్త... ఆమెగా మారింది. అసలు కష్టం ఇక్కడే మొదలైంది. పనిచేస్తున్న ఆసుపత్రిలో ఆమె ఉద్యోగం పోయింది. కుటుంబ సభ్యుల దగ్గరకు వెలితే సరైన ఆదరణ దక్కలేదు. ఉద్యోగంలేక ఆదుకునేవారులేక ఇతర ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి యాచక యాచకవృత్తిని ఎంచుకుంది. అదే ప్రాంతంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కవిత అనే పోలీసు అధికారి ఆమె కష్టాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన యంత్రాంగం ఆమె వివరాలు తెలుసుకున్నారు. నిజంగానే ఆమె డాక్టర్ అని తెలియడంతో క్లినిక్ ఏర్పాటు చేయడానికి ఆమెకు సాయం చేశారు. ఇన్స్పెక్టర్ కవితకు అటు అధికారులు, ఇటు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (చదవండి : మొదటి ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌గా త్రినేత్ర)