![Viral Video For Elephant Climbs Iron Has Gone Viral In Social Media - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/18/Ele.jpg.webp?itok=cottAZto)
జంతువుల్లో ఏనుగును మేధావిగా భావిస్తారు. అవి చాలా వరకు సాధు జీవిలానే ఉంటాయి. కాకపోతే ఒక్కొసారి ఆ ఏనుగులు తమ జోలికి వస్తే మాత్రం అంత తేలికగా వదిలిపెట్టవు. పైగా అవి వాటికి ఏదైనా సమస్య వస్తే భలే చక్కగా ఒకదానికొకటి సహకరించుకుంటాయి. అంతేకాదు మనుషుల వలే కొన్ని పనులను భలే చాకచక్యంగా చేసేస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక ఏనుగు నేను మీ లా దూకేయగలనంటూ అడ్డుగా ఉన్న ఇనుప కంచెను ఎలా దాటిందో ఈ వీడియోలో చూడండి.
(చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ)
పైగా ఆ ఏనుగు ఎంతో నైపుణ్యంగా ఆ ఇనుప కంచెను దాటడానికి ప్రయత్నించింది. అంతేకాదు ఆ ఏనుగు ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించింది. ఈ మేరకు ఈ వీడియోని తమిళనాడు ఎన్విరాన్‌మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్లు ఈ ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటూ జౌరా! అంటే మరికొంత మంది అలాంటి కంచెలను దాటడానికి ప్రయత్నించి మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు అందువల్ల దయచేసి వాటిని తొలగించండి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ)
Comments
Please login to add a commentAdd a comment