బెంగళూరు: మైసూర్ ప్యాలెస్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి అక్కడ.
రెండు ఏనుగులు ధనంజయ, కంజన్‌లు ఒకదానితో ఒకటి కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో ఒక ఏనుగు మరొకదాన్ని తరమడంతో.. జయమార్తాండ గేట్ గుండా బయట ఉన్న ఎగ్జిబిషన్ రోడ్‌కు వచ్చేశాయి.
వెనకాల ఏనుగుపై మావటివాడు ఉన్నప్పటికీ.. ఏనుగు నియంత్రణ కాలేకపోయింది. దీంతో రోడ్లపై ఉన్న జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే కాసేపటికే మావటిలు, అధికారులు ఏనుగులు నియంత్రించి వెనక్కి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.
మైసూర్ దసరా ఉత్సవాల్లో భాగంగా.. రాజమార్గంలో ఆనవాయితీగా జరిగే ఉరేగింపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లక్షల మంది హాజరయ్యే ఈ ఉరేగింపునకు అలంకరణతో కూడిన గజరాజులే ప్రత్యేక ఆకర్షణ. అయితే గత రెండు దశాబ్దాల్లో.. ఉరేగింపులోగానీ, శిక్షణలోగానీ ఏనుగులు పోట్లాడుకునే ఘటనలు జరగలేదని అధికారులు అంటున్నారు.
AnxietyGrips as 2DasaraElephants fight,run out of Palacepremises;Elephants pacified,BroughtBack toPalace;Noharm/damage@DeccanHerald pic.twitter.com/TZ8O4bmhoT
— Shilpa P. (@shilpapdcmysuru) September 21, 2024
Comments
Please login to add a commentAdd a comment