Mysore Palace
-
మైసూర్ ప్యాలెస్‌లో మొదలైన దసరా ఉత్సవాలు..(ఫొటోలు)
-
జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్ గజరాజులు
బెంగళూరు: మైసూర్ ప్యాలెస్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి అక్కడ.రెండు ఏనుగులు ధనంజయ, కంజన్‌లు ఒకదానితో ఒకటి కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో ఒక ఏనుగు మరొకదాన్ని తరమడంతో.. జయమార్తాండ గేట్ గుండా బయట ఉన్న ఎగ్జిబిషన్ రోడ్‌కు వచ్చేశాయి.వెనకాల ఏనుగుపై మావటివాడు ఉన్నప్పటికీ.. ఏనుగు నియంత్రణ కాలేకపోయింది. దీంతో రోడ్లపై ఉన్న జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే కాసేపటికే మావటిలు, అధికారులు ఏనుగులు నియంత్రించి వెనక్కి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.మైసూర్ దసరా ఉత్సవాల్లో భాగంగా.. రాజమార్గంలో ఆనవాయితీగా జరిగే ఉరేగింపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లక్షల మంది హాజరయ్యే ఈ ఉరేగింపునకు అలంకరణతో కూడిన గజరాజులే ప్రత్యేక ఆకర్షణ. అయితే గత రెండు దశాబ్దాల్లో.. ఉరేగింపులోగానీ, శిక్షణలోగానీ ఏనుగులు పోట్లాడుకునే ఘటనలు జరగలేదని అధికారులు అంటున్నారు. AnxietyGrips as 2DasaraElephants fight,run out of Palacepremises;Elephants pacified,BroughtBack toPalace;Noharm/damage@DeccanHerald pic.twitter.com/TZ8O4bmhoT— Shilpa P. (@shilpapdcmysuru) September 21, 2024 -
అంగరంగ వైభవంగా మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు.. (ఫొటోలు)
-
మైసూర్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు
బెంగళూరు: ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక.. యోగా. ఇవాళ(జూన్ 21) అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మంగళవారం వేకువజామున మైసూర్ ప్యాలెస్(కర్ణాటక) గ్రౌండ్లో నిర్వహించిన యోగా డే వేడుకలకు నేతృత్వం వహించి.. ప్రసంగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి సోనోవాల్ తదితర ప్రముఖులతో పాటు సుమారు పదిహేను వేల మందికిపైగా ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగా ప్రస్తావన ఉంది. యోగా ఫర్ హ్యూమానిటీ థీమ్‌తో ఈసారి వేడుకలను, గార్డియర్‌రింగ్ పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. మైసూర్ అధ్యాత్మికానికి కేంద్రం. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసేవాళ్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారు అని పేర్కొన్నారు. ..ఈ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోంది. యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. అంతర్గత శాంతితో కోట్ల మంది ప్రజలు ప్రపంచ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆ విధంగా యోగా ప్రజలను, దేశాలను కలుపుతుంది. ఇలా.. యోగా మనందరికీ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు. విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యం.. ఇదే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశం. మనసు, శరీరం అదుపు చేసే శక్తి యోగాకు ఉంది సూర్యుడి కదలికలను అనుసరిస్తూ యోగాసనాలు వేయాలి. ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది.. ఈ దఫా వేడుకల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. Karnataka | Prime Minister Narendra Modi arrives at Mysuru Palace Ground where he will perform Yoga, along with others, on #InternationalDayOfYoga Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6 — ANI (@ANI) June 21, 2022 Prime Minister Narendra Modi leads the #InternationalDayOfYoga celebrations from Karnataka's Mysuru pic.twitter.com/DDumTiIYVf — ANI (@ANI) June 21, 2022 -
వైరల్: ఊహు! నేను వెళ్లను, ప్యాలెస్‌లోనే ఉంటా ప్లీజ్..
మైసూరు: మైసూరు మహానగర సౌందర్యం పండిత పామరులనే కాదు మూగజీవాలను కూడా ముగ్ధుల్ని చేస్తుందేమో. దసరా వేడుకలకు విచ్చేసిన గజరాజు అశ్వత్థామ అడవికి తిరిగి వెళ్లడానికి ససేమిరా అనడంతో అందరూ ఔరా అనుకున్నారు. దసరా కోసం వచ్చిన ఏనుగులను ఆదివారం ప్యాలెస్ నుంచి ఆయా అటవీ శిబిరాలకు తరలించారు. అశ్వత్థామ అనే ఏనుగు తాను లారీలోకి ఎక్కనని, మొండికేసింది. మావటీలు ఎంత యత్నించినా లారీలోకి ఎక్కలేదు. దీంతో వారు ప్రధాన గజరాజు అభిమన్యును ఆశ్రయించారు. అశ్వత్థామను అభిమన్యు ఒక్క తోపు తోయడంతో లారీకి ఎక్కడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. గజరాజులకు వీడ్కోలు దసరా ఉత్సవాలు ఘనంగా ముగియడంతో గజరాజులు తిరిగి అడవి బాట పట్టాయి. ఆదివారం ఉదయం ప్యాలెస్‌లో గజరాజులకు సంప్రదాయ పూజలు చేసి వీడ్కోలు పలికారు. అంతకు ముందు మావటీలు, కాపలాదారులు ఏనుగులకు స్నానాలు చేయించి ఆహారం అందించారు. అనంతరం కెపె్టన్ అభిమన్యు నేతృత్వంలోని ఏనుగులను ప్రత్యేక లారీలలో అటవీ శిబిరాలకు తరలించారు. -
వివాదాస్పదమైన నటి ఫొటోషూట్
శాండల్‌వుడ్ హీరోయిన్ నిధి సుబ్బయ్య వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె మైసూరు అరమనె (మైసూరు ప్యాలెస్)లోని దర్బార్ హాల్లో ఫొటో షూట్ చేయటంపై వివాదం నెలకొంది. గత కొంత కాలంగా ప్యాలెస్ పరిసరాల్లో ఫొటోషూట్ చేయటంపై అధికారులు నిషేదం విధించారు. అయితే నిషేదిత ప్రాంతంలోని హాల్లో దిగిన ఫొటోనూ నిధి తనసోషల్‌మీడియా పేజ్‌లో పోస్ట్ చేయటంతో వివాదం మొదలైంది. దీంతో నటి నిధి సుబ్బయ్య కు ప్యాలెస్ అధికారులు ఎలా అనుమతిచారంటూ సామాజిక మాధ్యమాలలో ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఒక జంట నిషేధించిన ప్రాంతంలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేయటం పెద్ద వివాదమైంది. అయితే ఫొటోలు తీయటం నిషేధించలేదని, నవరాత్రి సమయంలో బంగారు సింహాసనం, అంబారి ఉన్నప్పుడు మాత్రమే నిషేధం అమలులో ఉంటుందని ప్యాలెస్ భద్రత ఏసీపీ శైలేంద్ర వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై నిది స్పందించారు. నేను ప్యాలెస్‌లో ఎలాంటి ఫొటోషూట్ చేయలేదు. కేవలం ఒక టూరిస్ట్ లా ప్యాలెస్ చూడటానికి వెళ్లా.. అందరు టూరిస్ట్‌లాగే నేను ఫొటో తీసుకున్నా’ అని తెలిపారు. -
ఆ అకౌంట్ నా భార్యది కాదు: యదువీర్
బెంగళూరు: మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ కుటుంబం కూడా ఫేక్ అకౌంట్ల బారిన పడింది. తన భార్య త్రిషికా ఒడియార్ పేరులో ఫేక్ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను ఎవరో క్రియేట్ చేశారని ఆయన గురువారమిక్కడ తెలిపారు. ఆ ఖాతా తన భార్యది కాదని యదువీర్ స్పష్టం చేశారు. కాగా త్రిషికా ఒడియార్ పేరుతో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో త్రిషికా ఒడియార్ 246 అనే పేరుతో ఓ ఖాతాను తెరవడంతో పాటుగా త్రిషికా ఫోటోను కూడా పెట్టడం జరిగింది. దీనిపై యదువీర్ మాట్లాడుతూ త్రిషికా ఒడియార్ 246 అనే పేరుతో తాను కానీ, తన భార్యా కానీ అకౌంట్‌ను ఓపెన్ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా ఆ ఖాతాలో పెట్టిన ఫోటోలతో కానీ, వ్యాఖ్యలతో కానీ తమకు సంబంధం లేదని తెలిపారు. ఆ నకిలీ ఖాతాను ఎవరు, ఎందుకు క్రియోట్ చేశారో తెలియదని, తక్షణమే ఆ ఫోటోను తొలగించాలని యదువీర్ కోరారు. -
ఆడ ఏనుగు విరహంతో ఏం చేసిందంటే..
మైసూరు ప్యాలెస్‌లో బీభత్సం సృష్టించిన ఆడ ఏనుగు మైసూరు: మైసూరు ప్యాలెస్‌కు చెందిన రాజీ అనే 20 సంవత్సరాల ఆడ ఏనుగు మంగళవారం ప్యాలెస్ ఆవరణలో బీభత్సం సృష్టించింది. వివరాలు.. మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా జంబూ సవారీలో పాల్గొనడానికి వచ్చిన అర్జున ఏనుగుతో రాజీ సాన్నిహిత్యం పెంచుకుంది. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత అర్జున అడవికి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి విరహ వేదనతో ఉన్న రాజీ రెండు రోజులుగా ఆహారం కూడా ముట్టలేదు. ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. ఈ క్రమంలో మంగళవారం ప్యాలెస్ ఆవరణలో పరుగులు పెట్టింది. నియంత్రించడానికి వచ్చిన సొంత మావటి పాషాపై కూడా దాడికి యత్నించింది. అతను చాకచక్యంగా దాని బారి నుంచి తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రెండు గంటల పాటు శ్రమించిన మావటీలు రాజీని అదుపులోకి తీసుకువచ్చారు. -
రాజదర్బారులో దసరాకు ఎంతపని చేశారు!?
దేశంలోనై మైసూర్ అత్యంత పరిశుభ్రమైన నగరం.. ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు స్వచ్ఛ భారత్‌లో భాగంగా మొదటి ర్యాంకు ఈ నగరానికి వచ్చింది. ఇక్కడి మైసూర్ రాజభవనంలో జరిగే దసరా వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఉంది. కానీ ఈసారి ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలు మాత్రం మరో చేదు వాస్తవాన్ని బయటపెట్టాయి. నగర వాసులకు పరిశ్రుభత మీద పెద్దగా శ్రద్ధలేదనే విషయాన్ని చాటాయి. ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలకు సంబంధించి మైసూర్ రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన ఫొటోను పెట్టారు. దర్బార్ హాల్లో దసరా వేడుకలు ముగిసిన తర్వాత.. ఎంత దారుణంగా పరిసరాలు మారిపోయాయో ఈ ఫొటో చాటుతున్నది. దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, టీ కప్పులు యథేచ్ఛగా విసిరేసి వెళ్లిపోయారు. దీంతో రాజదర్బార్ చెత్తకుండీలా మారిపోయింది. "అత్యంత పరిశుభ్రమైన నగరం అన్న కీర్తిని మనం సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. పరిశుభ్రతకు మారుపేరైన మన నగరంలో పరిస్థితి ఇలా ఉంది. రాజ దర్బారు అనేది థియేటర్ కాదు.. అక్కడ తినకూడదు.. థియేటర్ మాదిరిగా అక్కడ చెత్త వేయకూడదన్న విషయం ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది. (థియేటర్లో కూడా ఇలా చుట్టూ చెత్త వేసుకోకూడదు). మన సంప్రదాయ పండుగ, మన గొప్ప నగరం ప్రత్యేకతలను నిలబెట్టుకుందాం. పవిత్రమైన భవనాన్ని ఇలా కించపరచడం ఇకముందు జరగకుండా చూసుకుందాం' అని పేర్కొంటూ.. చెత్తచెదారంతో మురికిగా మారిన రాజదర్బార్ ఫొటోను ఆయన పోస్టుచేశారు. -
ముగిసిన ప్రిన్స్ వివాహ వేడుకలు
మైసూరు: మైసూరు మహారాజు యదువీర్, డుంగాపుర వంశవ యువరాణి త్రిషికాల వివాహ సందర్భంగా ఈనెల 24న ప్రారంభమైన వివాహ కార్యక్రమాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా యదువంశం కొత్త కోడలుగా త్రిషికా సింగ్ కుమారి శాస్త్రోత్తంగా మైసూరు ప్యాలెస్‌లో అడుగుపెట్టారు. వివాహ కార్యక్రమాల్లో ఆఖరిరోజైన బుధవారం వధూవరులు ప్యాలెస్‌లో ఉదయం 11.30గంటల నుంచి 12.15గంటల మధ్య నాగవల్లి శాస్త్రంలో మైసూరు రాజవంశస్థుల ఆచారం ప్రకారం యదువీర్, త్రిషికా సింగ్‌కు రెండవ సారి తాళి కట్టారు. అనంతరం దాక్షాయణి పూజ, హిరణ్య గర్భ, ఆరతిశ్రీ గణపతి పూజ, తొట్టిలు శాష్ర్త, సంతాన గోపాల పూజ, ఉత్తరపూజ, ఫలపూజ తదితర పూజా కైంకర్య కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.అనంతరం ప్రజల దర్శనార్థం ప్యాలస్ ఆవరణలో వధూవరులు యదువీర్,త్రిశికాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. -
వైభవంగా మైసూర్ యువరాజు వివాహం
మైసూర్: మైసూర్ యువరాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్‌కు రాజస్థాన్‌లోని దుంగర్పూర్ రాజ కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌తో సోమవారం ఉదయం వివాహం జరిగింది. అతిరథ మహారథులు, ఆత్మీయుల మధ్య ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30 గంటల మధ్య కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఉరుతనె ఉయ్యాల, నాగవల్లి శాస్త్రాలు జరుగనున్నాయి. ఒడయార్ వంశస్థుల ఆచారం ప్రకారం వధువుకు వరుడు వివాహ ముహూర్తంలో తాళి కట్టిన అనంతరం సాయంత్రం నిర్వహించే నాగవల్లి శాస్త్రంలో రెండవ సారి తాళి కట్టనున్నారు. ఇది మైసూరు రాజకుటుంబానికే పరిమితమైన ప్రత్యేక ఆచారం కావడం గమనార్హం. జూన్ 28న ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 29న సామాన్య ప్రజలకు రిసెప్షన్‌తో పాటు నూతన వధూవరులు తమ కారులో ప్రజలకు దర్శనమివ్వడానికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్‌లో అతిథులకు మరో విందు ఇవ్వనున్నారు. -
ప్యాలెస్‌లో పెళ్లి సందడి
మైసూరు రాజుల ఇంట ‘పెళ్లిబాజా’.... పెళ్లిపీటలు ఎక్కనున్న యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ ప్రారంభమైన యువరాజు వివాహ కార్యక్రమాలు ప్రత్యేక అలంకరణలతో సిద్ధమవుతున్న మైసూరు ప్యాలెస్ మైసూరు: మైసూరు రాజవంశీయుల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌ని, మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహమాడనున్నారు. రాజవంశంలో 40 సంవత్సరాల అనంతరం జరుగుతున్న వివాహం కావడంతో వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగి నిర్వహించేందుకు రాజవంశీయులు సన్నాహాలు చేస్తున్నారు. మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహ మహోత్సవ పనులు శుక్రవారం నుంచి లాంఛనంగా ప్రారంభమవనున్నాయి. వివాహ ఏర్పాట్లను రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివాహ మహోత్సవ వేడుకల ప్రారంభం...... ఈనెల 24న(శుక్రవారం) ధార్మిక విధివిధానాలు, హోమ కార్యక్రమాలతో వివాహ మహోత్సవ వేడుకలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. జూన్25న ప్యాలెస్ ముందుభాగంలో పెళ్లి మంటపం, వరుడుకి మంగళ స్నాన కార్యక్రమాలు, అనంతరం వరుడికి కల్యాణ కంకణం కట్టి ప్యాలెస్‌లోని కల్యాణ మంటపంలో హోమాలు నిర్వహించనున్నారు. జూన్ 26న మైసూరులోని చాముండి బెట్టపై కొలువైన చాముండేశ్వరీ దేవి ఆలయంతో పాటు మేలుకోటె, ఉత్తనహళ్లి, నంజనగూడు, శ్రీరంగపట్టణ, శృంగేరి, మహదేశ్వరబెట్ట ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి తీర్థప్రసాదాలు ప్యాలెస్‌కు చేరుకుంటాయి. వాటిని వరుడు స్వీకరించి మూడవ రోజు ధారా ముహూర్తానికి సిద్ధమవుతారు. జూన్27న ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30గంటల వరకు కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరుగనుంది. అదేరోజు సాయంత్రం ఉరుతనె ఉయ్యాల, నాగవల్లి శాస్త్రాలు జరుగనున్నాయి. ఒడయార్ వంశస్థుల ఆచారం ప్రకారం వధువుకు వరుడు వివాహ ముహూర్తంలో తాళి కట్టిన అనంతరం సాయంత్రం నిర్వహించే నాగవల్లి శాస్త్రంలో రెండవ సారి తాళి కట్టనున్నారు. ఇది మైసూరు రాజకుటుంబానికే పరిమితమైన ప్రత్యేక ఆచారం కావడం గమనార్హం. జూన్ 28న ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్29న సామాన్య ప్రజలకు రిసెప్షన్‌తో పాటు నూతన వధూవరులు తమ కారులో ప్రజలకు దర్శనమివ్వడానికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్‌లో మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే వివాహ కార్యక్రమాలలో యదువీర్ ధరించే లాంగ్కోటులను స్వతహాగా ఫ్యాషన్ డిజైనరైన రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ పర్యవేక్షణలో డిజైన్ చేస్తుండడం విశేషం. వివాహానికి అతిరథ మహారథులు మైసూరు రాజకుటుంబంలో జరగనున్న ఈ వివాహానికి ఇరు రాజవంశీయులతో పాటు అతిరథ మహారథులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖలు హాజరు కానున్నట్లు సమాచారం. వివాహానికి సుమారు 2,000 మంది అతిథులు పాల్గొనే అవకాశముంది. ఇంకా చాలా మందిని పిలవాల్సి ఉన్నా ప్యాలెస్‌లో స్థలాభావం కారణంగా అతిథుల సంఖ్యను రెండు వేలకు పరిమితం చేసినట్లు సమాచారం. కాగా, వివాహానికి హాజరైన ప్రముఖులకు ప్రత్యేక భోజన వసతిని కల్పించనున్నారు. దక్షిణాది సాంప్రదాయ వంటకాలతో కూడిన మెనును వివాహ కార్యక్రమం కోసం రూపొందించినట్లు సమాచారం. -
సోషల్ మీడియాలో యువజంట వీడియో హల్చల్!
మరోసారి బయటపడ్డ భద్రతాలోపం మండ్య: మైసూరు ప్యాలెస్‌లో ఓ యువజంట తీసుకున్న ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ ప్రకపంపనలు మరువకముందే మరో యువజంట కేఆర్ఎస్ (కష్ణరాజసాగర)డ్యాంపై తీసుకున్న ఫొటోషూట్ వీడియో చర్చనీయాంశమైంది. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న కేఆర్ఎస్ డ్యాంపై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ యువజంట తీసుకున్న వీడియోలు వాట్సాప్,ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై డ్యాం భద్రతా సిబ్బంది స్పందిస్తూ తమకు తెలియకుండా ఫొటోషూట్‌కు ఎలా పాల్పడ్డారనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కాగా వీడియోలోనున్న జంట మైసూరుకు చెందినవారయి ఉంటారని భద్రతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అనుమతి లేకుండా మైసూర్ ప్యాలెస్‌లోకి!
మైసూరు: హైదరాబాద్‌లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్న ఓ జంట కర్ణాటకలోని ప్రఖ్యాతిగాంచిన మైసూరు ప్యాలెస్‌లో తీసిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లుకొడుతోంది. రత్న ఖచిత, బంగారు ఆభరణాలుండే ప్యాలెస్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ వీరెలా లోపలికొచ్చారనేది ప్యాలెస్ పాలక మండలితోపాటు అధికారులకు అంతుచిక్కట్లేదు. ఈ ఘటనపై రాజమాత ప్రమోదా దేవి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్యాలెస్‌లో ఎటువంటి ఫొటోషూట్ జరగలేదని నగర పోలీస్ కమిషనర్ దయానంద్ చెప్పారు. -
రాజకీయాల్లోకి వస్తా..
బెంగళూరు(బనశంకరి) : తనకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఉందని యదువంశ ఉత్తరాధికారి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ తెలిపారు. మైసూరులోని కళామందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాజీవితంలోకి వచ్చి మరిన్ని ప్రజాసేవకార్యక్రమాలు చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయ రంగంలో ప్రవేశించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై రాజమాత రాణి ప్రమోదదేవి సూచనలు పాటించనున్నట్లు తెలిపారు. ఈసారి నాడహబ్బ దసరాలో ప్రైవేట్ దర్బార్‌లో తన తండ్రి స్థానంలో నిలుచుని సంప్రదాయబద్ధంగా అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. మైసూరు ప్యాలెస్‌లో దసరా సంప్రదాయాలు గురించి నేర్చుకోవడం చాలాకష్టమని వాటిన్నింటిని నేర్చుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే దసరాకు తమ ప్యాలెస్‌లో నిర్వహించే దసరాకు చాలా వ్యత్యాసముంటుందన్నారు. -
వైభవంగా మైసూర్ యువరాజు పట్టాభిషేకం
-
పట్టాభిషేకం ప్రారంభం
మైసూరు ఉత్తరాధికారిగా యదువీర్ పట్టాభిషేక మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో మైసూరులోని ప్యాలెస్ కొత్త కాంతులతో తళుకులీనుతోంది. ఇక పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే మైసూరు ప్యాలెస్‌లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాక్షి, బెంగళూరు: యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్‌కు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో మంగళస్నానం చేయించారు. దీంతో ప్యాలెస్‌లో ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం రాజ లాంఛనాలతో ఊరేగింపుగా బయల్దేరిన యదువీర్ ప్యాలెస్ ఆవరణలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్యాలెస్‌లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత ప్యాలెస్‌లో గణపతి పూజతోపాటు ఇతర ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇక యదువీర్ పట్టాభిషేకం గురువారం ఉదయం 9.30 గంటలకు శుభ కర్కాటక లగ్నంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు మైసూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస ప్రసాద్ తదితరులు హాజరు కానున్నారు. -
మైసూరు రాజుగా యదువీర్
ఈ నెల 23న దత్తత స్వీకారం ప్రమోదాదేవి ఒడయార్ మైసూరు: మైసూరు మహారాజుల వంశాకురం ఎవరు అన్న విషయానికి తెరపడింది. మైసూరు ప్యాలెస్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ సోదరీమణులతో కలిసి ఆయన సతీమణి రాణి ప్రమోదాదేవి మాట్లాడారు. మైసూరు రాజ వంశీకుడిగా ఒడయార్ సోదరి గాయత్రీ దేవి మనవడు యదువీర్ గోపాలరాజ అరసును ఎంపిక చేసినట్లు రాణి ప్రకటించారు. రాజ వంశస్తుల సంప్రదాయ ప్రకారం ఈ నిర్ణయాన్ని సమష్టిగా తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 23న ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మైసూరు ప్యాలెస్‌లో సంప్రదాయ ప్రకారం దత్తత స్వీకారం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అమెరికాలోని బాస్టన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని యదువీర్ అభ్యసిస్తున్నారని, దత్తత స్వీకారానంతరం వారం రోజుల పాటు మైసూరులో ఉండి, మళ్లీ విద్యాభ్యాసం కోసం వెళ్లిపోతారని వివరించారు. సమావేశంలో యదువీర్ తల్లి త్రిపురాసుందరి దేవి, తండ్రి స్వరూపానంద గోపాలరాజ అరసు తదితరులు పాల్గొన్నారు. -
దసరా ఉత్సవాల్లో... ఖాళీగా బంగారు సింహాసనం
మైసూర్ ప్యాలెస్ అనగానే కళ్లు చెదిరే ఆ కట్టడ నిర్మాణం, అలంకరణ మదిలో మెదులుతుంది. ఇక దసరా ఉత్సవాల్లో అయితే ఆ అలంకరణ మాటల్లో చెప్పలేం. అందులోనూ ప్యాలెస్‌లో ఉండే బంగారు సింహాసనం దసరా సంబరాల్లో అంతర్భాగమై వస్తోంది. దసరా ఉత్సవాల ఆరంభంలో మైసూర్ మహారాజు ఆ సింహాసనం మీద కూర్చుని దర్బార్ నిర్వహిస్తారు. రాచరిక వ్యవస్థ రద్దు అయిన తర్వాత కూడా ఈ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఈ బంగారు సింహాసనాన్ని కిందటేడాది వరకు శ్రీకాంతదత్త నరసింహరాజ వడయార్ రాజు అధిష్ఠించారు. ఆయన కిందటేడాది డిసెంబర్లో మరణించడం, ఆయనకు వారసులెవరూ లేకపోవడంతో ఈ సింహాసనం ఖాళీగా ఉంది. ప్యాలెస్ సంరక్షణదారుడైన నరసింహ ఖాళీ సింహాసనం పై రాజు కత్తిని పెట్టి, పూజారులచే పూజలు జరిపించారు. వేదమంత్రాలు పఠించి, సింహాసనం పైన పవిత్ర జలాన్ని చల్లారు. విలువైన జాతి రత్నాలను పొదిగిన బంగారు గొడుగును పట్టారు. ‘రాజు ఆసీనుడై ఉన్నట్టుగానే భావించి, అన్ని కార్యక్రమాలను చేశామని’ నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా బంగారు సింహాసం మైసూర్ మహారాజుల వంశాచారంగా ఎలా వచ్చిందో తెలిపారు. ఒక కథనం ప్రకారం ఈ సింహాసనం పాండవుల కాలం నాటిదని తెలుస్తోంది. మరొక కథనంలో 14 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహర బుక్కరాయల నుంచి ఈ సింహాసనం శ్రీరంగ పట్టణ సంస్థానాధీశుడైన శ్రీరంగరాయకు చేరిందని తెలుస్తోంది. మరొక కథనం ప్రకారం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1700 కాలంలో చిక్కదేవరాజ వడయార్‌కు ఈ సింహాసనాన్ని బహుమానంగా ఇచ్చారని చెబుతారు. ఈ సింహాసనాన్ని దసరా ఉత్సవాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.