ముగిసిన ప్రిన్స్ వివాహ వేడుకలు | Mysore royal wedding celebration ended | Sakshi
Sakshi News home page

ముగిసిన ప్రిన్స్ వివాహ వేడుకలు

Published Thu, Jun 30 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

ముగిసిన ప్రిన్స్ వివాహ వేడుకలు

ముగిసిన ప్రిన్స్ వివాహ వేడుకలు

 మైసూరు:   మైసూరు మహారాజు యదువీర్, డుంగాపుర  వంశవ యువరాణి త్రిషికాల వివాహ సందర్భంగా ఈనెల 24న ప్రారంభమైన వివాహ కార్యక్రమాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా యదువంశం కొత్త కోడలుగా త్రిషికా సింగ్ కుమారి శాస్త్రోత్తంగా మైసూరు ప్యాలెస్‌లో అడుగుపెట్టారు.
 
  వివాహ కార్యక్రమాల్లో ఆఖరిరోజైన బుధవారం వధూవరులు ప్యాలెస్‌లో ఉదయం 11.30గంటల నుంచి 12.15గంటల మధ్య నాగవల్లి శాస్త్రంలో మైసూరు రాజవంశస్థుల ఆచారం ప్రకారం యదువీర్, త్రిషికా సింగ్‌కు రెండవ సారి తాళి కట్టారు.
 
 అనంతరం దాక్షాయణి పూజ, హిరణ్య గర్భ, ఆరతిశ్రీ గణపతి పూజ, తొట్టిలు శాష్ర్త, సంతాన గోపాల పూజ, ఉత్తరపూజ, ఫలపూజ తదితర పూజా కైంకర్య కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.అనంతరం ప్రజల దర్శనార్థం ప్యాలస్ ఆవరణలో వధూవరులు యదువీర్,త్రిశికాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement