ఆ అకౌంట్‌ నా భార్యది కాదు: యదువీర్‌ | Yaduveer wadiyar clarification to his wife trishka face instagram account | Sakshi
Sakshi News home page

ఆ అకౌంట్‌ నా భార్యది కాదు: యదువీర్‌

Published Thu, May 4 2017 6:38 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

ఆ అకౌంట్‌ నా భార్యది కాదు: యదువీర్‌

ఆ అకౌంట్‌ నా భార్యది కాదు: యదువీర్‌

బెంగళూరు:  మైసూర్‌ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్‌ కుటుంబం కూడా ఫేక్‌ అకౌంట్‌ల బారిన పడింది. తన భార్య త్రిషికా ఒడియార్‌ పేరులో ఫేక్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాను ఎవరో  క్రియేట్ చేశారని ఆయన గురువారమిక్కడ తెలిపారు. ఆ ఖాతా తన భార్యది కాదని యదువీర్‌ స్పష్టం చేశారు. కాగా త్రిషికా ఒడియార్‌ పేరుతో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో త్రిషికా ఒడియార్‌ 246 అనే పేరుతో ఓ ఖాతాను తెరవడంతో పాటుగా త్రిషికా ఫోటోను కూడా పెట్టడం జరిగింది.

దీనిపై యదువీర్‌ మాట్లాడుతూ త్రిషికా ఒడియార్‌ 246 అనే పేరుతో తాను కానీ, తన భార్యా కానీ అకౌంట్‌ను ఓపెన్‌ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా ఆ ఖాతాలో పెట్టిన ఫోటోలతో కానీ, వ్యాఖ్యలతో కానీ తమకు సంబంధం లేదని తెలిపారు. ఆ నకిలీ ఖాతాను ఎవరు, ఎందుకు క్రియోట్‌ చేశారో తెలియదని, తక్షణమే ఆ ఫోటోను తొలగించాలని యదువీర్‌ కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement