సోషల్‌ మీడియాలో యువజంట వీడియో హల్‌చల్‌! | Couple in trouble for pre-wedding shoot in Mysore Palace | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో యువజంట వీడియో హల్‌చల్‌!

Published Sun, Jun 19 2016 3:47 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

సోషల్‌ మీడియాలో యువజంట వీడియో హల్‌చల్‌! - Sakshi

సోషల్‌ మీడియాలో యువజంట వీడియో హల్‌చల్‌!

మరోసారి బయటపడ్డ భద్రతాలోపం
మండ్య: మైసూరు ప్యాలెస్‌లో ఓ యువజంట తీసుకున్న ప్రీవెడ్డింగ్‌ ఫొటోషూట్‌ ప్రకపంపనలు మరువకముందే మరో యువజంట కేఆర్‌ఎస్‌ (కష్ణరాజసాగర)డ్యాంపై తీసుకున్న ఫొటోషూట్‌ వీడియో చర్చనీయాంశమైంది. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న కేఆర్‌ఎస్‌ డ్యాంపై అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరాల సహాయంతో ఆ యువజంట తీసుకున్న వీడియోలు వాట్సాప్,ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై డ్యాం భద్రతా సిబ్బంది స్పందిస్తూ తమకు తెలియకుండా ఫొటోషూట్‌కు ఎలా పాల్పడ్డారనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కాగా వీడియోలోనున్న జంట మైసూరుకు చెందినవారయి ఉంటారని భద్రతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement