Iron Fence
-
ఆర్ఆర్ఆర్ సినిమా భయం.. థియేటర్లో ఇనుప కంచెలు
సాక్షి, శ్రీకాకుళం: థియేటర్లకు ఆర్ఆర్ఆర్ సినిమా భయం పట్టుకుంది. అభిమానులను అదుపు చేసేందుకు యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదకరమైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసి ప్రేక్షకులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్లో తెర ముందు ఇనుప కంచెను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. లో క్లాస్ టిక్కెట్ల సీట్లు ఉండే చోట ఇనుప కంచె ఏర్పాటు చేయడంతో ప్రమాదాలకు ఆస్కారం ముంది. ఈ విషయాన్ని స్థానిక డీఎస్పీ ఎం.మహేంద్ర దృష్టికి అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను, ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు తీసుకెళ్లారు. దీంతో డీఎస్సీ ఆదేశాల మేరకు సీఐ అంబేడ్కర్ చర్యలకు ఉపక్రమించారు. సినిమా విడుదల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అభిమాన సంఘ నాయకులు చొరవ తీసుకోవాలని ప్రతినిధులకు సీఐ సూచించారు. డీఎస్పీ, సీఐని కలిసిన వారిలో లింగాల హరీష్, షేక్ మదీనా, నాని చరనిజం, చరణ్‌తేజ, సాయి మోహన్, శివ చెర్ర, పుక్కల నవీన్ ఉన్నారు. -
హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?
జంతువుల్లో ఏనుగును మేధావిగా భావిస్తారు. అవి చాలా వరకు సాధు జీవిలానే ఉంటాయి. కాకపోతే ఒక్కొసారి ఆ ఏనుగులు తమ జోలికి వస్తే మాత్రం అంత తేలికగా వదిలిపెట్టవు. పైగా అవి వాటికి ఏదైనా సమస్య వస్తే భలే చక్కగా ఒకదానికొకటి సహకరించుకుంటాయి. అంతేకాదు మనుషుల వలే కొన్ని పనులను భలే చాకచక్యంగా చేసేస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక ఏనుగు నేను మీ లా దూకేయగలనంటూ అడ్డుగా ఉన్న ఇనుప కంచెను ఎలా దాటిందో ఈ వీడియోలో చూడండి. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) పైగా ఆ ఏనుగు ఎంతో నైపుణ్యంగా ఆ ఇనుప కంచెను దాటడానికి ప్రయత్నించింది. అంతేకాదు ఆ ఏనుగు ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించింది. ఈ మేరకు ఈ వీడియోని తమిళనాడు ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్లు ఈ ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటూ జౌరా! అంటే మరికొంత మంది అలాంటి కంచెలను దాటడానికి ప్రయత్నించి మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు అందువల్ల దయచేసి వాటిని తొలగించండి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ) -
హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!
కాబూల్: తాలిబన్ల కబంధ హస్తాల నుంచి తమ కంటి పాపల్ని కాపాడాలంటూ ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని విసిరేసిన హృదయ విదారక సన్నివేశాలు గుర్తున్నాయి కదా..! ఆ దృశ్యాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పిల్లలు ఏమయ్యారోనంటూ తలచుకొని కుమిలిపోతూనే ఉన్నాం. కాబూల్ విమానాశ్రయంలో ఇనుప కంచెల మీదుగా అమెరికా నావికాదళ అధికారి ఒకరు అత్యంత సాహసంతో ఒంటి చేత్తో ఒక పసికందుని తీసుకున్న దృశ్యం అందరి మనసుల్ని కలిచి వేసింది. తల్లి నుంచి వేరుబడ్డ రెండు నెలల చిన్నారిని లాలిస్తున్న టర్కీ సైనికురాలు ఒమర్ హైదరి అనే మానవ హక్కుల కార్యకర్త తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఆ పాప కింద పడితే పరిస్థితి ఏంటని వీడియో చూసిన వారందరికీ గుండె గుభిలుముంటుంది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ క్షేమంగా తిరిగి తండ్రి దగ్గరకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసిపాపకి అనుకోని అనారోగ్యం రావడంతో ఆ పాపని స్వయంగా తండ్రే వైద్య చికిత్స కోసం సైనిక అధికారులకు అప్పగించారు. పసిపాపలను సముదాయిస్తున్న అమెరికా మహిళా సైనికులు అఫ్గానిస్తాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లే దిక్కు లేక ఆ తల్లిదండ్రులు సతమతమయ్యారు. చివరికి ఆ చిన్నారి తండ్రి గుండె రాయి చేసుకొని అన్నింటికి తెగించి కాబూల్ విమానాశ్రయంలో ఉన్న అమెరికా నావికాదళ అధికారులకి తమ బిడ్డను అప్పగించారు. విమానాశ్రయంలో ఉన్న నార్వే ఫీల్డ్ ఆస్పత్రిలో ఆ పసిపాపకి చికిత్స నిర్వహించిన అనంతరం చిన్నారిని తిరిగి భద్రంగా ఆ తండ్రికి సైనికాధికారి అప్పగించారు. ‘ఆ వీడియోలో ఉన్న పసిపాపని వైద్య చికిత్స కోసం విమానాశ్రయంలో భద్రతా అధికారికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప పూర్తి ఆరోగ్యంతో తిరిగి తండ్రి దగ్గరకి చేరుకుంది’ అని మేజర్ జిమ్ స్టెంజర్ సీబీఎస్ న్యూస్‌కి తెలిపారు. నావికాదళ అధికారుల సత్తా ఏమిటో ఇలాంటి సంఘటనలతోనే బయట ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత త్వరగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచడం నావికాదళ అధికారులకే సాధ్యపడుతుందని ఆ మేజర్ కొనియాడారు. ఈ విషయాన్ని అమెరికాలోని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కూడా ధ్రువీకరించారు.‘ఆ పసిపాప తిరిగి తండ్రి దగ్గరకి వెళ్లిపోయింది. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలీదు. కానీ పసిపిల్లల్ని వారి తల్లిదండ్రుల దగ్గరకి చేర్చడం అమెరికా సైన్యం తమ బాధ్యతగా భావిస్తుంది. ఈ విషయంలో అత్యుత్తమమైన పనితీరు కనబరుస్తుంది’ అని కిర్బీ కితాబునిచ్చారు. చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న దృశ్యం ఆలనాపాలనా చూస్తున్న సైనికులు వివిధ దేశాల ప్రజల తరలింపు ప్రక్రియ నడుస్తున్న సమయంలో కాబూల్ విమానాశ్రయం అంతా గందరగోళంగా మారింది. ఆ జనం మధ్య కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఏడుస్తూ కనిపిస్తున్నారు. అలాంటి పిల్లల్ని విమానాశ్రయంలో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తిరిగి వారి కుటుంబాల వద్దకు చేరుస్తున్నారు. తల్లిదండ్రులు కనిపించే లోపు ఆ పిల్లల అవసరాలన్నీ వారే తీరుస్తున్నారు. పిల్లలకి జోల పాటలు పాడుతూ వారిని పడుకోబెట్టడం, పిల్లలకి మంచినీళ్లు ఇవ్వడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలు చూసిన వాళ్లు ఇంకా మానవత్వం బతికే ఉందని గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నారు. కంచె మీదుగా పాపను ఒంటిచేత్తో పట్టుకున్న అమెరికా సైనికుడు (ఫైల్) హెరాత్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్‌ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
మా కంటి పాపలనైనా కాపాడండి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాల నుంచి తమ పిల్లలనైనా రక్షించాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దేశం వీడి వెళ్లిపోవడానికి వేలాదిగా కాబూల్ విమానాశ్రయానికి తరలి వస్తూ ఉండడంతో తాలిబన్లు ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డంగా ఇనుప కంచెలు వేశారు. దీంతో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లలేని వారంతా కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ విమానాశ్రయం లోపల ఉన్న యూకే, అమెరికా దళాలకి మొరపెట్టుకుంటున్నారు. కొందరైతే ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని లోపలికి విసిరేస్తున్నట్టుగా స్కై న్యూస్ ఒక కథనంలో వెల్లడించింది. ‘‘కనీసం మా కంటి పాపలనైనా కాపాడండి. మీ వెంట బ్రిటన్ తీసుకువెళ్లిపోండి’’ అంటూ వారు ఆర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అలా ఇనుప కంచెల మీదుగా విసిరేసే క్రమంలో కొందరు పిల్లలు వాటికి చిక్కుకొని గాయపడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటే భరించలేనంత ఏడుపు వస్తోందని బ్రిటన్‌కు చెందిన ఒక సైనిక అధికారి చెప్పారు. విమానాశ్రయం లోపల ఉన్నప్పటికీ బయట నుంచి కాల్పుల మోతలు, అఫ్గాన్ల నిస్సహాయమైన ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని దీంతో కంటి మీద కునుకు కూడా రావడం లేదని ఆ అధికారి తెలిపారు. తమ దేశ సిబ్బందిని, పౌరుల్ని తరలించడానికి గత కొద్ది రోజులుగా బ్రిటన్, అమెరికా సైనికులు కాబూల్ విమానాశ్రయంలోనే మకాం వేశారు. ‘‘కొందరు మహిళలు తమ పిల్లల్ని కంచెల మీదుగా విసిరేస్తున్నారు. విమానాశ్రయం లోపల ఉన్న అధికారులకు వారిని తీసుకువెళ్లాల్సిందిగా చెబుతున్నారు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది’’ అని ఆయన అన్నారు. అఫ్గాన్‌ను ఆక్రమించుకోగానే తాలిబన్లు తమ నిజస్వరూపం బయట పెట్టడంతో పాటు దేశం విడిచి వెళ్లాలనుకునే వారిని దారుణంగా చితక్కొడుతున్నారు. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళనతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకునే కుటుంబాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
చిరస్మరణీయులారా! వందనాలు!!
దళితుల పట్ల హిందూ సమాజం శత్రు, విద్వేష పూరిత వైఖరిని ప్రద ర్శిస్తున్నా... అంటరాని కులాల అభ్యున్నతికి ఎంతో కొంత మేలు చేసినవారు, ఎనలేని కృషి చేసినవారు కూడా అదే సమాజం నుంచి ఆవిర్భవించారు. ఆధిపత్య భావజాలాన్ని వదిలిపెట్టి, సాంఘిక సమానత్వం, దిశగా వేసిన తొలి అడుగులుగా నేను వారి కృషిని భావిస్తాను. వర్ణ సమాజపు ‘‘ఇనుప కంచె’’ను అంగుళమైనా కద ల్చడానికి వారి కృషి తోడ్పడిందని నమ్ముతాను. అటువంటి వారినందరినీ గుర్తు చేసుకోవాల్సిన ఒక సందర్భం అవసరం. అలాంటి సందర్భమే జూలై 20. ‘‘అంటరాని కులాలకు, వర్ణ సమాజానికీ మధ్య ఇనుప కంచె ఉంది. అది తొలగించరానంత బలమైనది’’ అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేర్కొన్నారు. భారత సామాజిక నిర్మాణంలో వర్ణం, అవర్ణం అనే రెండు విభాగాలున్నాయి. వర్ణంలో ద్విజులు, ద్విజులు కానివారు అనే తేడాలున్నాయి. ద్విజులలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, ద్విజులుకాని వారిలో శూద్రులు ఉన్నారు. ద్విజులలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల మధ్య కూడా వ్యత్యాసం, వైరుధ్యాలున్నాయి. వారి మధ్య ఘర్ష ణలు జరిగినట్టు సైతం చారిత్రక ఆధారాలున్నాయి. అయితే అవసరమైనప్పుడు కలసిపోయే స్వభావం కూడా వారికి ఉన్నది. కానీ వర్ణ సమాజానికీ, అవర్ణులకు మధ్య ఉన్నది అగాధం. అవర్ణులను ఆదిమ తెగలు, మైదాన తెగలు, అంటరాని కులా లుగా వర్గీకరించారు అని ఆయన ఆ అంశాన్ని వివరించారు. ‘‘అయితే ఆదిమ తెగలు, మైదాన తెగలతో వర్ణ సమాజానికి తీవ్ర విభేదం ఉన్నది. కానీ శత్రు వైఖరి లేదు. అయితే అంటరాని కులాలకు, వర్ణ సమాజా నికీ మధ్య ఇనుప కంచె ఉంది’ అంటూ అంబేడ్కర్ మొత్తంగా వర్ణ వ్యవస్థ స్వరూప, స్వభావాలను ఆవిష్కరించారు.‘‘జపాన్ను సందర్శించిన ప్రతి అమెరికా అధ్యక్షుడు హిరోషిమా, నాగసాకీలకు వెళ్లి, రెండవ ప్రపంచ యుద్ధం నాటి తమ అణు మారణహోమం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తారు. అలాగే, అమృత్సర్ వెళ్లిన ప్రతి భారత ప్రధాని ‘బ్లూస్టార్ ఆపరేషన్ ’ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తారు. కానీ రెండు వేల ఏళ్లకు పైగా అంటరాని కులాల మీద అకారణంగా జరుగుతున్న మారణకాండ, అమానుషాల పట్ల హిందూ సమా జం కానీ, సంస్థలు కానీ కనీసం పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. ఇది పూర్తిగా అమానవీయ ప్రవర్తన’’ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్ ఇటీవల అన్నారు. ‘‘ఇనుప కంచె’’ను కదిల్చిన వారెందరో ఈ రెండు వ్యాఖ్యలు హిందూ సమాజం అంటరాని కులాలుగా చూస్తున్న దళి తుల పట్ల అనుసరిస్తున్న శత్రు, విద్వేష పూరిత వైఖరికి అద్దం పడుతున్నాయి. అయితే అంటరాని కులాల అభ్యున్నతికి ఎంతో కొంత మేలు చేసినవారు, ఎనలేని కృషి చేసినవారు కూడా హిందూ సమాజంలోనే ఉన్నారు. హిందూ సమాజ ఆధిపత్య భావజాలాన్ని వదిలిపెట్టి, సమాజ శ్రేయస్సు కోసం వేసిన తొలి అడుగులుగా నేను వారి కృషిని భావిస్తాను. వర్ణ సమాజపు‘‘ఇనుప కంచె’’ను అంగుళమైనా కదిలించే దిశగా వారు ప్రయత్నం చేశారని నమ్ము తాను. అటువంటి వారినందరినీ గుర్తుచేసుకోవాల్సిన ఒక సందర్భం అవస రం. అలాంటి సముచిత సందర్భమే జూలై 20. అది భారత చరిత్ర కొత్త మలుపు తిరిగిన సమయం. 1913, జూలై 20న భీమ్రావు రామ్‌జీ అంబేడ్కర్ అనే 24 ఏళ్ల దళిత యువకుడు, మొట్టమొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. బరోడా సంస్థానాధీశుడు శాయా జీరావు గైక్వాడ్ అందజేసిన ఉపకారవేతనం వల్లనే ఆయనకు ఈ అవకాశం లభించింది. ఆ తదుపరి కొల్లాపూర్ సంస్థానాధీశుడు సాహూ మహారాజ్ సహాయంతో లండన్‌లో న్యాయ, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం, పరిశోధన చేశారు. ఒక పరిణతి చెందిన మేధావిగా, కార్యశీలిగా ఆ తర్వాత ఆయన అంటరాని కులాల కోసం సాగించిన నిరంతర పోరు, అధ్యయనం, సాధిం చిన విజయాలు అందరికీ తెలిసినవే. అందుకే జూలై 20వ తేదీ దళిత శ్రేయోభి లాషులకు అంకితం ఇవ్వాల్సిన సరైన సందర్భం. వారిరువురే కాదు, తమ తమ స్థాయిల్లో దళితుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేసిన దళితేతరు లందరి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం. వారు తమ చుట్టూ ఉన్న వర్ణ సమాజాన్ని ధిక్కరించి నిలబడటం తేలికేం కాదు. అం దుకే అటువంటి వారందరికీ దళితజాతి యావత్తూ అభినందనలను తెల పడం అవసరం. దళిత సమున్నతి కోసం జరిగిన ఈ కృషి చరిత్రలో నేనెరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను మీ ముందుంచుతాను. చాపకూటి నుంచి దళిత విద్య వరకు చాపకూడుతో పలనాట కుల విభేదాలకు స్వస్తి పలకాలని చూసిన బ్రహ్మనా యుడు, మాల కన్నమదాసును తన సైన్యానికి అధిపతిని చేయడం చిరస్మరణీ యం. ఆ కారణంగా వర్ణ ధర్మాన్ని మంటకలిపిన భ్రష్టునిగా ఆయన ముద్ర వేయించుకోవడమే కాదు, తాను నమ్మిన దాని కోసం కన్న కొడుకులను సైతం యుద్ధంలో కోల్పోయాడు. ఇక ఆధునిక చరిత్రలో అంబేడ్కర్ తన గురువుగా ప్రకటించుకొన్న మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు, ఆయన సహచరి సావిత్రిబాయి ఫూలేలను సంస్మరించాల్సి ఉంటుంది. దాదాపు 150 ఏళ్ల క్రితమే అంటరాని కులాల బాలికల కోసం పాఠశాలను నడిపి, హిందూ సమాజం విద్వేషంతో విసిరిన రాళ్ల దెబ్బలను వారు చవిచూశారు. అలాగే 1880లో తెలుగు నేలపై కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకట రత్నం నాయుడు లాంటి వారు ఆనాటి పిఠాపురం రాజా మహిపతి సూర్యా రావు సాయంతో దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలను నడిపారు. సుప్రసి ద్ధులైన ఎందరో దళిత మేధావులు, నాయకులు ఈ పాఠశాలల్లో చదివిన వారే. శ్రీకాకుళం జిల్లాలో గరిమెళ్ల సీతారాం కూడా ఇలాగే ప్రత్యేక పాఠశాల లను నిర్వహించారు. మచిలీపట్నంలో వేమూరి రాంజీరావు పంతులు తన ఆస్తినంతా తెగనమ్మి దళిత విద్యార్థుల కోసం కళాశాలను, హాస్టల్‌ను నిర్వ హించారు. ఆయన సహకారంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన కాకి మాధవరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రామక్రిష్ణయ్య, నిరం జన్రావులు కాలేజీ చదువులు చదవగలిగారు. కొనసాగించగలిగారు. నెల్లూరు జిల్లాలో ఏనుగు పట్టాభిరాంరెడ్డి, నేదురుమల్లి బాలక్రిష్ణారెడ్డి, గుం టూరు జిల్లాలో నల్లపాటి హనుమంతరావు, గూడూరు రామచంద్రుడు లాంటి వారు తమ సొంత డబ్బులతో దళిత కులాల విద్యార్థుల కోసం పాఠశాలలను, హాస్టల్స్‌ను నిర్వహించారు. దొడ్ల రామచంద్రారెడ్డి (డీఆర్) చొరవతో ఏర్పరచిన కావలిలోని జవ హర్ భారతి కళాశాలకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే విశిష్టమైన స్థానం ఉంది. నేటికీ నడుస్తున్న ఆ కళాశాల వేలాదిగా దళిత విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా తీర్చిదిద్దింది. జవహర్ భారతిలోనే చదివి, ఆ హాస్టల్ అన్నమే తిని, అక్కడే లెక్చరర్‌గా పని చేస్తున్న పోతురాజు నేడు అదే కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఎదిగారంటే అది డీఆర్ కృషి ఫలితమే. పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మాల్యాద్రి కూడా అదే కళాశాల విద్యార్థి. మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణిం చిన పి. సుబ్రహ్మణ్యం అదే పీజీ కళాశాల విద్యార్థి. హైదరాబాద్ సంస్థానంలో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి బాల ముకుందరాయ్ ఆర్థిక సహాయంతో భాగ్యరెడ్డి వర్మ అంట రాని కులాల పిల్లల కోసం పలు పాఠశాలలను స్థాపించారు. మర ణానంతరం తన అంత్యక్రియలను సైతం ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ మాత్రమే నిర్వహించాలని వీలునామా రాసిన విశిష్ట చరితుడాయన. తెలంగాణ కమ్యూనిస్టు యోధుడు రావి నారా యణరెడ్డి, స్వాతంత్య్రోద్యమ నాయకురాలు సంగం లక్ష్మీబాయి లాంటి వారు దళితుల కోసం ప్రత్యేక హాస్టల్స్ నిర్వహించారు. దళితులు, పేదల పట్ల నిబద్ధులైన అధికారులు ఇక స్వాతంత్య్రానంతర కాలంలో ప్రభుత్వాధికారులుగా పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, పి.ఎస్. కృష్ణన్, కె.ఆర్. వేణుగోపాల్ లాంటి వారు, తమ సామా జిక గుర్తింపును, కులాన్ని పక్కన పెట్టి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. శంకరన్ గారిది దళిత అభ్యున్నతి చరిత్రలోనే విశిష్ట పాత్ర. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఆయన దేశానికే మార్గ నిర్దేశన చేసిన వారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా, 1976లో హైదరాబాద్‌లో జరిగిన ‘హరిజన కాన్ఫరెన్స్’ ఆమోదించిన సిఫారసులకు అనుగుణంగా ఒకే ఏడాది దాదాపు 120 జీవోలను విడుదల చేసి ఐఏఎస్ అధికారిగా రికార్డు సృష్టించారు. దళితులు, ఆదివాసులకు విద్య అందాలంటే హాస్టల్స్ అవసరమని నొక్కి చెప్పి, ఆయన తన హయాంలోనే ఆ వ్యవస్థను పటిష్టపరచడం కోసం అధికారులను పరు గులు తీయించారు. నిబద్ధతకు, కార్యశీలతకు నిర్వచనం శంకరన్. నేడు ప్రముఖంగా వినవచ్చే ‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్’ రూపకర్తల్లో ముఖ్యులు పి.ఎస్.కృష్ణన్. రిటైర్మెంట్ తరువాత నేటికీ ఆయన తన మేధను, శ క్తియుక్తు లను ఎస్సీ, ఎస్టీలు, బీసీల అభివృద్ధికే వెచ్చిస్తుండటం ఎంతైనా అభినంద నీయం. అదేవిధంగా కె.ఆర్. వేణుగోపాల్ కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేస్తుం డగా దళితులకు, పెత్తందార్లకు మధ్య తలెత్తిన భూ వివాదంలో దళితుల పక్షాన నిలిచి పోరాడిన వ్యక్తి. కోర్టు కేసులను సైతం ఎదుర్కొన్న అరుదైన అధికారి. పేద పిల్లల కడుపునింపడం కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న ఏకైక ప్రభుత్వ కార్యక్రమం ఐసీడీఎస్ రూపశిల్పి కూడా ఆయనే. దళిత సమా జ ఉన్నతికి ఆయన చూపిన చొరవ మరువలేనిది. దళిత, ఆదివాసీ బాల బాలికలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, ఐఐటీలో ప్రవేశం కల్పించిన విద్యావేత్త, సామాజికవేత్త చుక్కా రామయ్యను ఈ సందర్భంగా ప్రస్తావించకుండా ఉండలేం. సామాజిక బాధ్యతతో దళితులు, పేదల పక్షాన నిలిచిన వ్యక్తులు చరిత్ర పొడవునా ఎందరో ఉన్నారు. వారి నిబద్ధతను, కార్యశీలతను దళితులే కాదు, సామాజిక సమానత్వానికి కట్టుబడిన వారెవరూ ఎన్నటికీ మరిచిపోరు. జూలై 20న దళిత శ్రేయోభిలాషులందరినీ మనస్ఫూర్తిగా అభినందిద్దాం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య