
చెన్నై: ది ఫ్యామిలీ మెన్–2 వెబ్ సిరీస్ తమిళుల మనోభావాలను కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్ సిరీస్‌ను వెంటనే నిలిపివేయాలని నామ్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్ అమెజాన్ సంస్థకు ఆదివారం లేఖ రాశారు. ప్రసారం నిలిపివేయకుంటే తమిళులంతా అమెజాన్ సంస్థ సర్వీసులన్నింటినీ బాయ్‌కాట్ చేస్తారని హెచ్చరించారు. సీమాన్‌తో పాటు డీఎంకే, ఎండీఎంకే అధినేత వైగో వంటి రాజకీయ నాయకులు ఈ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ది ప్యామిలీ మెన్–2 వెబ్‌సిరీస్‌పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వెబ్‌సిరీస్ ఈ నెల 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment