స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే యాక్షన్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించగా, ఇండియన్ వెర్షన్‌లో వరున్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు.
చదవండి: పూజా హెగ్డేతో డేట్‌కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని
ప్రస్తుతం ముంబైలో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతుంది. సిటాడెల్ సిరీస్ కోసం బాగానే కష్టపడుతుంది సమంత. ఇటీవలే షూటింగ్‌లో భాగంగా రెండు చేతులకు గాయమైన ఫోటోలను పోస్ట్ చేసిన సమంత తాజాగా మరో ఓ ఫోటోను షేర్ చేస్తూ 'ఇట్స్ టార్చర్ టైమ్' అని రాసుకొచ్చారు.
ఇందులో ఐస్ బాత్ టబ్‌లో కూర్చున్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ కావడంతో ఐస్‌బాత్‌తో ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది. చదవండి: జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు
Comments
Please login to add a commentAdd a comment