
అమెజాన్ ప్రైమ్‌లా బెస్ట్ వెబ్ సిరీస్‌లో లిస్ట్‌లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్‌న్యూస్ వినిపించారు. ఓటీటీలోకి ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందా..? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్‌లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.

అభిషేక్ త్రిపాఠి అనే యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉంటాడు. అతనికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాదు. కానీ, కొన్ని కారణాల వల్ల స్నేహితుల సలహా మేరకు పంచాయతీ సెక్రటరీలో ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ రత్యా ఉత్తర ప్రదేశ్‌లోని ఫులేరా అనే గ్రామంలో అభిషేక్ అడుగుపెడుతాడు. భిన్న మనస్తత్వాలు కలిగిన గ్రామస్తుల మధ్య ఆయనకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అభిషేక్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? ఈ క్రమంలో దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా కామెడీని పండించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ కామెడీ డ్రామా సిరీస్‌లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్‌తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.
you moved the laukis, we unlocked your reward! #PanchayatOnPrime S3, May 28@TheViralFever @ArunabhKumar @StephenPoppins #ChandanKumar @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @chandanroy77 @malikfeb @Sanvikka #PankajJha pic.twitter.com/ouN5ON5hGp
— prime video IN (@PrimeVideoIN) May 2, 2024