ఓటీటీలోకి రానున్న వ్యూహం.. స్ట్రీమింగ్‌ అప్పుడే! | Vyooham Will Premiere On This OTT Platform From December 14 | Sakshi
Sakshi News home page

Vyooham: ఓటీటీలో వ్యూహం.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌!

Published Mon, Dec 11 2023 5:57 PM | Last Updated on Mon, Dec 11 2023 6:10 PM

Vyooham will Premiere on This OTT Platform from December 14 - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ కానుంది. సాయి సుశాంత్‌ రెడ్డి, చైతన్యకృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్‌, శశాంక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ వ్యూహం.

సాయి సుశాంత్‌ పోలీసాఫీసర్‌గా నటించాడు. శశికాంత్‌ శ్రీవైష్ణవ్‌ పీసపాటి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న వ్యూహం డిసెంబర్‌ 14న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఒక పోలీసాఫీసర్‌ తనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరించాడన్నదే కథ.

చదవండి: దుర్గమ్మను దర్శించుకుని బాబాయ్‌ హోటల్‌లో టిఫిన్‌ చేసిన వెంకీ మామ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement