![The Family Man Season 2 Release Date Will Be Announced Tomorrow - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/18/family-man.gif.webp?itok=wwDiKPdX)
'ద ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్' కోసం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అంటూ ఫిబ్రవరి నుంచి ఊరిస్తూ వచ్చిన యూనిట్ ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెర దించనున్నట్లు కనిపిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కానుంది. దీనితో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే ప్లాన్‌లో ఉన్నారట. అయితే వారు అధికారికంగా ప్రకటించేకన్నా ఒకరోజు ముందే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. జూన్ 4 నుంచి ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది రేపు తేలిపోనుంది.
కాగా ఇటీవల 'మీర్జాపూర్', 'తాండవ్' వెబ్‌సిరీస్‌ల వల్ల అమెజాన్ ప్రైమ్ మీద విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో అమెజాన్ ప్రైమ్.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ను వాయిదా వేస్తూ వచ్చినట్లు టాక్ వినిపించింది. మనోజ్ భాజ్‌పాయ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకులుగా వ్యవహరిస్తుండగా ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మొత్తానికి అభిమానుల ఎదురుచూపులకు పుల్‌స్టాప్ పెడుతూ రేపు ట్రైలర్ విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆ ట్రైలర్ వచ్చాక వీళ్లు ఇంకే రేంజ్‌లో రచ్చ చేస్తారో చూడాలి!
చదవండి: The Family Man 2: టెర్రరిస్టు లుక్‌లో సమంత.. ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment