Raj Nidimoru and Krishna D.K.
-
'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్‌తో మరోసారి సమంత
స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత తన సినిమా ప్రాజక్ట్లతో బిజీగా మారింది. ప్రస్తుతం తనకు మరో వెబ్ సరీస్‌లో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన లుక్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతుంది సమంత. అయితే ఈ తాజా వెబ్ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. గతంలో 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో ఓ ముఖ్యమైన పాత్రను సమంత పోషించిన విషయం తెలిసిందే. మరోవైపు సమంతకు బాలివుడ్లో పలు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2'తో సమంతకు అక్కడ మంచి గుర్తింపు రావడంతో తనకు మూడు సినిమా ఆఫర్స్ వచ్చినట్టు సమాచారం. ప్రముక నిర్మాణ సంస్ధ యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో సమంతకు భారీ రెమ్యునరేషన్‌నే ఆ సంస్ధ ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
The Family Man 2: రిలీజయ్యేది అప్పుడేనా!
'ద ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్' కోసం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అంటూ ఫిబ్రవరి నుంచి ఊరిస్తూ వచ్చిన యూనిట్ ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెర దించనున్నట్లు కనిపిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కానుంది. దీనితో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే ప్లాన్‌లో ఉన్నారట. అయితే వారు అధికారికంగా ప్రకటించేకన్నా ఒకరోజు ముందే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. జూన్ 4 నుంచి ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది రేపు తేలిపోనుంది. కాగా ఇటీవల 'మీర్జాపూర్', 'తాండవ్' వెబ్‌సిరీస్‌ల వల్ల అమెజాన్ ప్రైమ్ మీద విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో అమెజాన్ ప్రైమ్.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ను వాయిదా వేస్తూ వచ్చినట్లు టాక్ వినిపించింది. మనోజ్ భాజ్‌పాయ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకులుగా వ్యవహరిస్తుండగా ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మొత్తానికి అభిమానుల ఎదురుచూపులకు పుల్‌స్టాప్ పెడుతూ రేపు ట్రైలర్ విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆ ట్రైలర్ వచ్చాక వీళ్లు ఇంకే రేంజ్లో రచ్చ చేస్తారో చూడాలి! View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) చదవండి: The Family Man 2: టెర్రరిస్టు లుక్‌లో సమంత.. ఫోటో వైరల్ -
ఇక్కడ మా కథలు నచ్చవని హిందీకి వెళ్లాం
‘‘మా ప్రాజెక్ట్స్ అన్నీ రిస్క్‌తో కూడు కున్నవే... కమర్షియల్స్ కాదు... అందుకే కంటెంట్‌ని నమ్మి సినిమా బండి’ విషయంలో మరోసారి రిస్క్ తీసుకున్నాం. మా నమ్మకం మంచి ఫలితాన్ని ఇచ్చింది’’ అన్నారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. వికాస్ వశిష్ఠ, సందీప్, రాగ్ మయూర్, ఉమ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సినిమా బండి’. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రాజ్ అండ్ డీకే చెప్పిన విశేషాలు. ► ప్రవీణ్ మా దగ్గర వర్క్ చేయలేదు. కానీ ‘సినిమా బండి’ కంటెంట్, ప్రవీణ్ నైపుణ్యం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. కొత్తవాళ్ల ప్రతిభను నమ్మి, మా డబ్బులతోనే చిన్న సినిమాలను ప్రోత్సహించాలనుకున్నాం. వేరే స్టూడియోస్కి వెళితే వాళ్ల జోక్యం ఉంటుంది. అలా అయితే క్రియేటివ్ పరంగా ఇబ్బందులు వస్తాయనుకుని ‘డీటుఆర్ ఇండీ’ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాం. ‘సినిమా బండి’ నిర్మించాం. ఈ సినిమాకి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ► మా సినిమా కెరీర్ హైదరాబాద్ నుంచే మొదలైంది. సినిమాలపై ప్రేమతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏడాది పాటు ఇక్కడే ఉన్నాం. తెలుగు సినిమాలు తీయా లని ప్రయత్నించాం. సమయం గడుస్తోంది కానీ సినిమాలు కుదర్లేదు. సరే.. మా కథలు ఇక్కడ నచ్చవేమో అనుకుని హిందీకి వెళ్లాం. అయితే తెలుగు సినిమాకు కనెక్ట్ అయ్యే ఉన్నాం. హీరోలు మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ... ఇలా మరికొంత మంది హీరోలతో మాకు మంచి అనుబంధం ఉంది. మంచి కథ కుదిరితే మా దర్శకత్వంలో తెలుగులో సినిమా ఉంటుంది. ► ఆ రకం సినిమాలు చేయండి, ఈ రకం సినిమాలు తీయండి, రీమేక్ సినిమాలు చేయండి.. అని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ మేం మా ఆలోచనాధోరణికి తగ్గ సినిమాలే చేస్తున్నాం. మా నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తోంది. దర్శక–నిర్మాతలుగా మేం చేసిన ‘ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో నిర్మించిన ‘స్త్రీ’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్. ఇప్పుడు నిర్మించిన ‘సినిమా బండి’ చిన్న సినిమా అయినా మంచి స్పందన లభిస్తోంది. మా ఇద్దరి మధ్య వాదనలు జరగవని కాదు. కానీ మా గొడవ అంతా మంచి అవుట్‌పుట్ కోసమే. ► భవిష్యత్‌లో ఓటీటీల హవా ఉంటుందని మేం ఐదేళ్ల క్రితమే ఊహించాం. 2016లో ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ కోసం అమెజాన్‌తో సైన్ చేశాం. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పుడు ఉన్నంత పాపులారిటీ అప్పుడు లేదు. టెక్నాలజీ, కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వంటి కారణాల వల్ల ఓటీటీలు ప్రేక్షకులకు వేగంగా దగ్గరయ్యాయి. ఇక 2016లోనే మేం ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్‌సిరీస్ సైన్ చేసినా.. ఇతర కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని షూటింగ్ మొదలు పెట్టడానికి రెండేళ్లు పట్టింది. ► సినిమా కావొచ్చు, వెబ్ సిరీస్ కావొచ్చు.. ఇది చిన్న పిల్లల కంటెంట్, ఇందులో హింస ఎక్కువగా ఉంది, ఇది పెద్దల సినిమా అంటూ.. ఆ ప్రాజెక్ట్ కంటెంట్‌కు ఒక గుర్తింపు ఉంటే మంచిదే. ఇక సెన్సార్షిప్ విషయానికి వస్తే.. మా వరకు మేం ఒక సెల్ఫ్ సెన్సార్‌ను ఫాలో అవుతాం. చైల్డ్ అబ్యూజ్, మితిమీరిన హింస వంటి అంశాలకు సంబంధించి అందరి ఫిల్మ్ మేకర్స్‌కు నియమనిబంధనలు ఉండటం మంచిదే. ఓటీటీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తే, అవి వ్యూయర్స్‌కు మేలు చేయాలని మేం కూడా కోరుకుంటాం. ► షారుక్ ఖాన్‌కి ఓ కథ చెప్పాం. ఆయనకు నచ్చింది. కానీ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్‌కు కాస్త టైమ్ పడుతుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్లోని వెబ్ సిరీస్ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగింది. మరొక మూడు ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నాం. ఆ ట్రైలర్లో సమంత పాత్ర గురించి మరింత తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంతను తీసుకోవడానికి కారణం ఉంది. ఆమె క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్... సమంతది విలన్ పాత్ర అని చెప్పలేం కానీ మనోజ్ బాజ్‌పాయ్‌కి అపోజిట్ క్యారెక్టర్. జూన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నాం. రాజ్, డీకేతో సమంత -
బాలీవుడ్లో జెండా పాతిన మన తిరుపతి వాసులు
-
సినిమా రివ్యూ: డి ఫర్ దోపిడి
చిత్రం: ఢి ఫర్ దోపిడి తారాగణం: వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేశ్, మెలానీ కన్నోకాడా, తనికెళ్ల భరణి, దేవా కట్టా మ్యూజిక్: మహేశ్ శంకర్ సినిమాట్రోగ్రఫి: లుకాస్ ఎడిటింగ్: ధర్నేంద్ర నిర్మాతలు: రాజ్ నిడిమోరు & కృష్ణ డి కె, నానీ దర్శకుడు సిరాజ్ కల్లా నలుగురు కుర్రాళ్లు తమ వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడటానికి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. పలు రకాలుగా ఈజీ మనీ కోసం ప్లాన్ వేసి విఫలమవుతారు. చివరికి బ్యాంక్ దోపిడికి ప్లాన్ వేస్తారు. దోపిడి చేయాడానికి వెళ్లిన నలుగురు కురాళ్లు అనుకోకుండా బ్యాంక్ లోనే ఇరుక్కుపోతారు. దోపిడి జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ ను చుట్టుముడుతారు. బ్యాంకులో చిక్కుకుపోయినా నలుగురు కుర్రాళ్లు పోలీసుల బారి నుంచి ఎలా బయటపడ్డారు? బ్యాంక్ దోపిడి సంఘటనలో నలుగురు కుర్రాళ్లు ఎలాంటి పరిస్తితిని ఎదుర్కొన్నారు? బ్యాంక్ ను దోపిడి చేయడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు డి ఫర్ దోపిడి తెరపై చూడాల్సిందే. అమ్మాయిల కోసం డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలైన విక్కీ కారెక్టర్ లో వరుణ్ సందేశ్, సినీ నటుడిగా మారాలని ఫిలింనగర్ చేరుకున్న రాజు పాత్రలో సందీప్ కిషన్ తోపాటు మామను ఒప్పించి మరదల్ని పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా ఉండే హరీష్(నవీన్), నచ్చిన అమ్మాయిని ప్రేమించడానికి సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించే బన్ను(రాకేశ్) పాత్రలు డి ఫర్ దోపిడి చిత్రంలో ప్రధానమైనవి. అల్లరి చిల్లరిగా తిరుగుతూ, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ.. అప్పులను తీర్చలేక తప్పించుకు తిరిగే యువకులుగా నలుగురు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనింపించారు. హీరోయిన్ గా మెలానీ కన్నోకాడా గురించి చెప్పుకోవాల్సినంతగా ఏమి లేదు. నలుగురి కుర్రాళ్ల కథలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన మరో గ్యాంగ్ కు బాస్ గా తనికెళ్ల భరణి గుర్తుండి పోయే పాత్రలో కనిపించారు. తనికెళ్ల భరణి ఫ్లాష్ బ్యాక్ కొంత వినోదాన్ని పండించింది. పోలీస్ ఆఫీసర్ కారెక్టర్ లో దర్శకుడు దేవా కట్టా ఆకట్టుకున్నాడు. చెవులపిల్లి పాత్రలో రిషి మువ్వ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినా.. కథనంతో సినిమాను రెండు గంటలపాటు ఓకే అనే విధంగా నడిపించాడు. సెకాంఢాఫ్ లో పూర్తిగా బ్యాంక్ లోనే కథంతా నడిపించడం కొంత విసుగు కలిగిస్తుంది. అయితే తనికెళ్ల భరణి ఫ్లాష్ బ్యాక్ తో కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు.ఇక దోపిడి గురైన బ్యాంక్ ముందు మీడియా చేసే హడావిడిని దర్శకుడు చక్కగా చిత్రీకరించారు. ప్రస్తుత మీడియాలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ ఇతర విభాగాలు చిత్ర కథ పరిధి మేరకు పర్వాలేదనింపించారు. ఎలాంటి లాజిక్స్ లేకుండా.. సెలవుల్లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఆశించే రెగ్యులర్ ఆడియెన్స్ కు ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది. ప్రత్యేకంగా థియేటర్ కెళ్లి చూసే చిత్రంగా ఢి ఫర్ దోపిడిని మలచడంలో దర్శకుడు సిరాజ్ కల్లా కొంత తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్తగా ప్రజెంట్ చేయడానికి ఢి ఫర్ దోపిడిని నిర్మించిన రాజ్ నిడిమోరు & కృష్ణ డి కె నానీ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. చివర్లో నానీపై చేసిన షూట్ చేసిన సాంగ్, వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలిచింది.