
స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత తన సినిమా ప్రాజక్ట్‌లతో బిజీగా మారింది. ప్రస్తుతం తనకు మరో వెబ్ సరీస్‌లో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన లుక్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతుంది సమంత. అయితే ఈ తాజా వెబ్ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. గతంలో 'ఫ‍్యామిలీ మ్యాన్ 2'లో ఓ ముఖ్యమైన పాత్రను సమంత పోషించిన విషయం తెలిసిందే.
మరోవైపు సమంతకు బాలివుడ్‌లో పలు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. 'ఫ‍్యామిలీ మ్యాన్ 2'తో సమంతకు అక్కడ మంచి గుర్తింపు రావడంతో తనకు మూడు సినిమా ఆఫర్స్ వచ్చినట్టు సమాచారం. ప్రముక నిర్మాణ సంస్ధ యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర‍్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో సమంతకు భారీ రెమ్యునరేషన్‌నే ఆ సంస్ధ ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment