సమంతతో డేటింగ్‌ రూమర్స్‌.. అసలు ఎవరీ రాజ్‌? | Who Is Director Raj Nidimoru Rumoured To Be Dating Samantha | Sakshi
Sakshi News home page

Raj Nidimoru: సమంతతో డేటింగ్‌ రూమర్స్‌.. రాజ్‌ గురించి నెటిజన్స్ ఆరా!

Published Thu, Aug 15 2024 10:32 AM | Last Updated on Thu, Aug 15 2024 1:11 PM

Who Is Director Raj Nidimoru Rumoured To Be Dating Samantha

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడనున్నారు. అయితే చైతూ నిశ్చితార్థం తర్వాత అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపై పడింది. ఇంతకీ ఆమె రియాక్ట్ అవుతుందా? లేదా అని ఫ్యాన్స్‌ వేచిచూశారు. కానీ చైతూ ఎంగేజ్‌మెంట్‌ గురించి సోషల్ మీడియాలో ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే సమంతపై డేటింగ్‌ రూమర్స్ మొదలయ్యాయి.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. దీంతో అసలు సమంతకు రాజ్‌ ఎలా పరిచయం? అసలు అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? అంటూ నెటిజన్స్‌  తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతని పూర్తి వివరాలేంటో ఓ లుక్కేద్దాం.

రాజ్ నిడిమోరు ప్రస్థానమిదే

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించిన రాజ్ నిడిమోరు జన్మించారు. ఇంజనీరింగ్ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్‌ ఫిల్స్మ్‌ అనే బ్యానర్‌ను స్థాపించారు. మొదట వీరిద్దరు షాదీ అనే షార్ట్‌ ఫిలింను తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరు సిటాడెల్‌ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ నుంచి రాజ్‌, సమంతకు పరిచయం ఉండడం వల్లే తాజాగా డేటింగ్‌ రూమర్స్‌ వస్తున్నాయి. అయితే రాజ్‌ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement