
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చెన్నైలో జరిగిన బిహెండ్‌వుడ్స్ హాల్ ఆప్ ఫేమ్ అవార్డుల వేడుకకలో మెరిసింది. ఈ వేదికపై సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటనకు అవార్డ్ కూడా అందుకుంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేకమైన అవార్డ్‌తో సమంతను సత్కరించారు. అయితే ఈ వేడుకల్లో సిటాడెల్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు సైతం సందడి చేశారు. సమంతతో కలిసి వేదికపై కనిపించారు.
అయితే గత కొన్ని నెలలుగా సమంత- రాజ్ నిడిమోరుపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే పికిల్ బాల్ టోర్నమెంట్‌లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలోనూ సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. తాజాగా మరోసారి సామ్- రాజ్ నిడిమోరు ఓ పార్టీలో మెరిశారు. తన స్నేహితురాలు, డిజైనర్ క్రేషా బజాజ్ పుట్టినరోజు వేడుకలకు సమంత, నిడిమోరు హాజరయ్యారు. దీంతో మరోసారి వీరిద్దరిపై నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోపే రెండోసారి జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి.
తాజాగా వీరిద్దరు కలిసి బర్త్ డే పార్టీలో దిగిన ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్చలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అయితే తమపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై ఇప్పటి వరకు సామ్ కానీ, రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు.
ఇక సినిమాల విషయానికొస్తే సమంత గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించింది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం సమంత తెలుగులో ఓ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment