భారీ అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie)కి అంతటా మిక్స్‌డ్ టాక్ లభిస్తోంది. రామ్‌చరణ్ (Ram Charan) నటన బాగున్నప్పటికీ పాత కథే అవడంతో జనాలు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. పైగా ట్రైలర్‌లో చెప్పినట్లుగా అన్‌ప్రిడిక్టబుల్‌గా ఏదైనా ఉందా? అని చూస్తే ఒకటీ రెండు ట్విస్టులు మినహా కథ మొత్తం ఊహించినట్లే సాగుతోంది. దీంతో జనాలు గేమ్ ఛేంజర్‌పై పెదవి విరుస్తున్నారు.
బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
అభిమానులు మాత్రం రామ్ చరణ్ నటన బాగుందని సంబరపడుతున్నారు. ఇండియన్ 2 డిజాస్టర్‌తో చతికిలపడ్డ శంకర్ ఈ చిత్రంతోనైనా కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే అది అయ్యే పనిలా కనిపించడం లేదు. దాదాపు రూ.400 -450 కోట్లు గుమ్మరించి తెరకెక్కించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీ వివరాలు
ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్‌నర్ షిప్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. థియేటర్‌లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది. అయితే నెగెటివ్ టాక్ ఇలాగే కొనసాగితే మాత్రం ఓటీటీలో నెల రోజుల్లోనే రిలీజ్ కావడం ఖాయం!
గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గేమ్ ఛేంజర్ సినిమా..
రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహించగా అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. 2.45 గంటల నిడివితో జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజైంది. దిల్‌రాజు బ్యానర్‌లో నిర్మితమైన 50వ సినిమా ఇది. అందుకే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.
పాటల కోసమే కోట్లు ఖర్చు
కేవలం పాటలకే కోట్లు ఖర్చుపెట్టారు. ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఐదు పాటలకు రూ.75 కోట్లు ఖర్చయ్యాయి. కొన్ని విదేశాల్లో షూట్ చేశాం. ఒక్కో పాట పది రోజులకుపైగా చిత్రీకరించారు అని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 29న విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో రామ్‌చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ కటౌట్ దేశంలోనే అతి పెద్దదిగా చరిత్రకెక్కింది.
పొరపాటు చేసిన చిత్రయూనిట్
ప్రీరిలీజ్, ప్రమోషన్స్ అన్నీ పెద్ద ఎత్తున చేశారు కానీ రిలీజ్ రోజే చిన్న పొరపాటు చేశారు. సినిమాకు హైప్ ఇచ్చిన నానా హైరానా సాంగ్‌ను థియేటర్లలో ప్రదర్శించలేదు. సాంకేతిక సమస్యల కారణంగా పాటను యాడ్ చేయలేని మరో నాలుగు రోజుల్లో నానా హైరానా థియేటర్‌లో వేస్తామని చిత్రయూనిట్ వివరణ ఇచ్చింది. కానీ నాలుగురోజుల్లో సినిమా ఫలితం తేలిపోతుందని, ఆ తర్వాత పాటను యాడ్ చేస్తే ఉపయోగమేముంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment